జాగ్రత్త! ఈ సమయాల్లో మీరు అద్దం చూడటం వల్ల మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది!

Posted By:
Subscribe to Boldsky

అద్దాల ప్రాముఖ్యత: ఏ ఇంట్లోనైనా అద్దం కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది---ఎందుకంటే మనము ఎక్కడికైనావెళ్ళేటప్పుడు రెడీ అవడానికి ఒక అద్దం అవసరం. చాలా ఇళ్లకు, అద్దం రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే, వాస్తు ప్రకారం, మీ అద్దంలోకి ఎప్పుడు పడితే అప్పుడు తొంగిచూడకూడదు అని మీకు తెలుసా? మరింత తెలుసుకోవాలంటే చదవడం కంటిన్యూ చేయండి..

ఏ ఏ రాశుల వారు ఎలాంటి విషయాలను ఎక్కువగా అస్యహ్యించుకుంటారు..!

అద్దాలను ఇంటిలో అమర్చేటప్పుడు మీరు అనుసరించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. వాస్తు ప్రకారం, రాత్రి వేళ చాల సేపు అద్దంలోకి చూడకుండా ఉండేలా చూసుకోవాలి. అలా ఎక్కువసేపు అద్దంలో చూడటం వలన మీకు ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాత్రి మాత్రమే కాదు, మరికొన్ని సందర్భాల్లో కూడా అద్దంలోకి చూడకూడదు. మరి ఆ సందర్భాలేంటో, ఆ సమయాల్లో అద్దం చూస్తే ఏం జరగుతుందో మరి కొంచెం వివరంగా తెలుసుకుందాం..

బెడ్ రూమ్

బెడ్ రూమ్

మీ ఇంటి పడక గదిలో అద్దం పెట్టవద్దు. ఒకవేళ అలా అద్దం ఉండి మీరు తీసివేయలేకపోతే, మీరు ఉపయోగించిన తర్వాత దానిని కవర్ చేయాలి. మీరు రాత్రి సమయంలో నిద్రిస్తున్నప్పుడు కూడా దానిని కవర్ చేయాల్సి ఉంటుంది.

ఒకటి ఉండటం

ఒకటి ఉండటం

ఒకవేళ ఖచ్చితంగా మీబెడ్ రూమ్ లో అద్దం ఉండాలి అనుకుంటే,అది కచ్చితంగా మీ బెడ్ ని రిఫ్లెక్ట్ చేసేది లా ఉండకూడదు. అలా జరిగితే(రిఫ్లెక్ట్ అయితే)అది మీ మీద ప్రతికూల ప్రభావాన్నిచూపిస్తుంది.

ఇంటి ప్రవేశాలలో

ఇంటి ప్రవేశాలలో

ఒక ఇంటి ప్రవేశద్వారం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అలాంటి ప్రవేశద్వారాల వద్ద ఇల్లు లేదా కార్యాలయం ప్రతిబింబించేలా అద్దాలను కలిగి ఉండకూడదు.

మధ్య గోడ

మధ్య గోడ

బాత్రూంలో అద్దం అవసరమవుతుందని అనుకోము. ఒకవేళ అవసరం అనుకునే వారికి గోడల మధ్యలో అద్దంని ఉంచాలి. ఉంచడం మాత్రమే కాదు, అద్దంను రోజూ శుభ్రం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎలాంటి నీటి మరకలు, ఇతర దుమ్ము మరియు సబ్బుల మరకలు దానిపై ఉండనివ్వకూడదు.

నార్త్ ఈస్ట్

నార్త్ ఈస్ట్

సాధారణ ప్రయోజనాల కోసం, ఇంట్లో నార్త్ ఈస్ట్ దిశలో అద్దం ఉండటం మంచిది --- ఇలా చేయడం వలన మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో వారు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు . ఆర్థిక సమస్యలు ఉండవు. ఇంకా ఇది ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది.

లక్కీ వస్తువు

లక్కీ వస్తువు

మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలనుకుంటే లేదా మీ వ్యాపారంలో ఉత్తమ ఫలితాలను పొందాలనుకుంటే, మీరు ఒక లక్కీ వస్తువు యొక్క ప్రతిబింబం దానిలో చూడగలిగే విధంగా అద్దం ఉంచాలి. మీరు ఫెంగ్ షుయ్ మొక్కను, బుద్ధుని విగ్రహం మొదలైన వాటిని లక్కీ వస్తువులుగా ఎంచుకోవచ్చు.

పగిలిన అద్దాలు

పగిలిన అద్దాలు

ఇంట్లో ఎప్పుడూ విరిగిన లేదా పగిలిన అద్దాలను ఉంచకూడదు. అద్దం పగిలినట్లైతే, దానిని పడేయండి లేదా దాన్ని మరమ్మత్తు చేసుకోండి. అలా పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచుకోవడం వలన మిమల్ని మీ ఫ్యామిలీని ఆర్థిక ఇబ్బందులలోకి నెట్టి వేయవచ్చు.

మంచి ప్రదేశం

మంచి ప్రదేశం

మీ ఇంట్లో ఎక్కువ అద్దాలు అమర్చకుండా జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైన ప్రదేశాల్లో మాత్రం ఉంచుకోండి. అలాగే తోట లేదా బాల్కనీల వంటి ప్రదేశాల్లో అద్దాలను అమర్చకపోవడం మంచిది.

అద్దాల ప్రయోజనాలు

అద్దాల ప్రయోజనాలు

వాస్తు ప్రకారం సరైన ప్రదేశంలో అద్దాలు ఉంచడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీ నగదు లాకర్ ముందు అద్దం ఉంచినట్లయితే, మీ డబ్బు రెట్టింపు అవుతుంది. కాబట్టి అక్కడ ఒకదాన్ని ఉంచండి.

చెడ్డ శక్తులను బయట పెడతాయి

చెడ్డ శక్తులను బయట పెడతాయి

ఒక అద్దం, అది ఎక్కువ సూర్యకాంతిని ఆకర్షించేలా ఒక ప్రదేశంలో ఉంచినప్పుడు మీ జీవితంలో శాంతి, ప్రేమ మరియు సంపద తీసుకొస్తుంది. అంతే కాకుండా, ఇది అన్ని ప్రతికూల శక్తులను బయటకు పంపించి, మీ ఇంటిని ఒక ఆరోగ్యకరమైన, సంతోషకరమైన ప్రదేశంలా మార్చేస్తుంది.

ప్రతికూలత

ప్రతికూలత

సానుకూల శక్తులను ఆకర్షించి సానుకూల శక్తిని పొందే స్వభావం గల అద్దం, ప్రతికూల విషయాలు, ప్రతికూల శక్తులను కూడా ఆకర్షిస్తాయి. కాబట్టి చెత్త లేదా షూ రాక్ వంటి ప్రతికూల శక్తులన్న ప్రదేశాలలో అద్దం ఉంచకూడదు. ఇది మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

ఆకారం

ఆకారం

అద్దాల విషయానికి వచ్చినప్పుడు ఆకారాలు వున్న అద్దాల మీద ప్రయోగం చేయడం మానుకోండి. ఫాన్సీ ఆకారాల ను వదిలేసి చదరపు లేదా దీర్ఘచతురస్రాకార ఆకారపు అద్దాలను మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ డిజైన్ కలిగివున్న అద్దాలను ఉపయోగించడం మానుకోండి.

అక్వేరియం

అక్వేరియం

మీ ఇంట్లో చేపల ఆక్వేరియం ఉన్నట్లయితే, అద్దంలో భాగంగానే పరిగణించబడుతుంది, అప్పుడు మీ ఇంటి ఉత్తర లేదా తూర్పు దిశలో దానిని ఉంచండి. మీ చేపలన్నింటికీ ఆహారం ఇవ్వడం , ఆక్వేరియం శుభ్రంగా మరియు ఆకుపచ్చగా ఉండేలా చూసుకోండి.

English summary

Peeping into mirrors at these times could bring misfortune to you

Beware, peeping into mirrors at these times could bring misfortune to you.
Story first published: Monday, May 29, 2017, 20:30 [IST]
Subscribe Newsletter