For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరుదైన సంఘటన ! సముద్రపు నీటిని అంతా పీల్చేసిన బహమాస్

By R Vishnu Vardhan Reddy
|

ప్రకృతి తనలోని కోపాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని భావిస్తే, దానిని ఆపడం ఏ మానవుడి వల్ల కాదు. అప్పుడు జరిగే నష్టాన్ని ఎవ్వరూ ఊహించలేరు, అడ్డుకోలేరు.

మన చుట్టూ ఉన్న వాతావరణం లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా ఎన్నో విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అనుకోకుండా సంభవించే ఊహించని వరదలు మరియు హరికేన్లు (సుడిగాలి తుఫాన్ ) ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి.

బ్రతికున్న పాములను తినే మొనగాడు !బ్రతికున్న పాములను తినే మొనగాడు !

వీటన్నిటి మధ్య హరికేన్ సంభవించిన సమయంలో సముద్రంలో ఉన్న నీరంతా ఎండిపోతుంది అని ఎప్పుడైనా ఊహించారా ? ఇలా జరుగుతుందని ఎప్పుడైనా అనుకున్నారా ?

కానీ జరిగింది. ఇర్మ హరికేన్ బహమాస్ ప్రాంతాన్ని తాకినప్పుడు ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.

అక్కడ జరిగిన సంఘటన గురించి ట్విట్టర్ లో వెలువడిన విషయాలు :

అక్కడ జరిగిన సంఘటన గురించి ట్విట్టర్ లో వెలువడిన విషయాలు :

బహమాస్ లో ఉన్న లాంగ్ దీవి లో నివసిస్తున్న ఒక ట్విట్టర్ ఖాతాదారురాలు , తన ట్విట్టర్ ఖాతాలో ఆమె చూసిన సంఘటనని ఇలా రాసుకొచ్చింది " నేను ఇప్పుడు నమ్మలేకపోతున్నాను...బహమాస్ లో ఉన్న లాంగ్ దీవి ఇది. ఇన్ని రోజులు ఇక్కడ కనిపించిన సముద్రపు నీరు ఇప్పుడు కనుచూపుమేరలో కనిపించడం లేదు. హరికేన్ ఇర్మ కారణంగా ఇది చోటు చేసుకున్నది. "

ఈ క్రింది వీడియోలో ఆమె, తాను చూసిన ఆ నమ్మలేని నిజాన్ని మరియు అక్కడ చోటుచేసుకున్న అరుదైన సంఘటనని ప్రపంచానికి చూపించాలని భావించింది. నీళ్లు పూర్తిగా ఇంకిపోయిన ప్రాంతానికి నడుచుకొని వెళ్ళింది, అంటే ఎండిపోయిన సముద్రపు నేల పై నడుచుకుంటూ వెళ్ళింది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గవ్వలు కనిపించాయి. సముద్రపు గట్టు సాధారణంగా ఉండే దగ్గర కాకుండా ఎక్కడో అవతల ఉన్నట్లు కనిపించింది. క్రింద సముద్రపు నేల స్పష్టంగా కనపడింది.

ఇంకో బీచ్ లో కూడా ఇలానే నీళ్లన్నీ ఇంకిపోయాయి :

ఇంకొక ట్విట్టర్ ఖాతాదారుడు బహమాస్ లో ఉండే మరొక బీచ్ లో అచ్చం ఇలాంటి సంఘటన చోటుచేసుకున్న విషయాన్ని తన కెమెరాలో బంధించి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అలా ఆ ప్రాంతంలో ఇంకిపోయిన నీరు 13 గంటల తర్వాత మరలా సాధారణ స్థితికి చేరుకుంది. ఈ ఆశ్చర్యకరమైన వీడియో లో మీరు బహమాస్ లో ఎండిపోయిన ఆ సముద్రాన్ని చూడవచ్చు.

" తంపా బే ప్రాంతం, ఇర్మ దాటికి కాకలావికలం అయ్యింది. ఈ తంపా నగరంలో సంభవించిన తుఫాను కారణంగా చోటుచేసుకున్న అరుదైన సంఘటనకు సంబందించిన ఫోటో ఇది " అని తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫోటో ని ఆ ఖాతాదారుడు పోస్ట్ చేసాడు.

ఇలాంటి ఎన్నో ట్వీట్ లు :

ఇలాంటి ఎన్నో ట్వీట్ లు :

మొదటి ట్వీట్ వైరల్ గా మారి సంచలనం సృష్టించింది. దీంతో ఇది గమనించిన ఆ ప్రాంతంలోని ప్రజలు వరస పెట్టి తమ అనుభవాలను, ఫోటోలను మరియు వీడియోలను విపరీతంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు.

వాతావరణ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే :

హరికేన్ మూల కేంద్రంలో సాధారణంగా ఒత్తిడి తక్కువగా ఉంటుంది మరియు ఈ హరికేన్ ఇర్మ అనేది చాలా శక్తివంతమైనది. అందుచేత ఇది సంభవించిన ప్రదేశంలోనే కాకుండా, దాని చుట్టు ప్రక్కల ఉన్న నీటిని అంతా తన వైపు లాక్కునింది. దీని ఫలితంగానే చాలా చోట్ల సముద్రపు నీరు తాత్కాలికంగా ఇంకిపోయినట్లు కనిపించింది. తుఫాను కేంద్రంగా తక్కువు ఒత్తిడి ఏర్పడినప్పుడు, సముద్రంలో ఉన్న నీటిని అంతా ఆ సుడిగాలి పీల్చుకోవడంతో ఆ ప్రాంతం అంతా ఎండిపోయిన సముద్రపు నేలలా కనపడిందని, మళ్ళీ దాని తీవ్రత తగ్గినా తర్వాత సాధారణ స్థితికి చేరిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

English summary

When The Ocean Decided To Go Missing!

Hurricane Irma, which hit the Bahamas, had changed the shape of the ocean for a short time.
Story first published:Wednesday, September 13, 2017, 17:07 [IST]
Desktop Bottom Promotion