ఈ మహానుభావుల ఐడియాలు చూశారా? చూస్తే మీ జన్మ ధన్యమే !

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

సోషల్ మీడియాలో కొన్ని ఫన్నీ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిని చూస్తే మనకు నవ్వు వస్తుంది. కానీ అందులోనూ ఎంతో పరమార్థం ఉండి ఉంటుంది. ఒక వస్తువును ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చా అని మనకు కూడా అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అవలంబిస్తుంటారు. డిఫరెంట్ స్టైల్స్ లో వెళ్తుంటారు. అరె.. ఏమి ఐడియారా భయ్ ఇది అన్నట్లు వీరి ఫొటోలుంటాయి. చూడడానికి ఫన్నీగా అనిపించినా వాటిని కాస్త పరిశీలిస్తే మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. మొత్తానికి ట్రెండ్ ఫాలో కావడం కాదు ట్రెండ్ సెట్ చేస్తామంటున్నారు ఈ సామాన్యులు. ఈ మహానుభావులను మనం అభినందించాల్సిందే. మరి ఆ ఐడియాస్ ఏమిటి.. ఆ ఫోటోలు ఏమిటో ఒక్కసారి చూద్దామా.

1. వాటర్ బాటిల్ తో పాలు

1. వాటర్ బాటిల్ తో పాలు

కుక్కపిల్లలకు మొత్తం దాని తల్లిలాగే పాలు పట్టాలంటే ఏం చేయాలని ఆలోచించినట్లు ఒక మహానుభావుడు. వెంటనే ఒక వాటర్ బాటిల్ కు ఇలా హోల్స్ పెట్టాడు. తర్వాత పాలు తాగేందుకు వీలుగా పాలపీకలు అమర్చాడు. ఇక బాటిల్ నిండా పాలు పోశాడు. ఇంకేముంది తమ తల్లి దగ్గర పాలు ఎలా తాగుతాయో అలా తాగుతున్నాయి ఈ బుజ్జి కుక్క పిల్లలు. వారెవ్వా.. ఏమి ఐడియా.. భలే ఉంది కదూ.

2. షవర్ కింద స్నానం చేయాలంటే ఇంతే మరి

2. షవర్ కింద స్నానం చేయాలంటే ఇంతే మరి

బాత్రూమ్ లో ట్యాప్ ఉంది. బకెట్ ఉంది. మగ్గు ఉంది. కానీ షవర్ లేనట్లుంది. షవర్ కిందే స్నానం చేయాలని తపన ఉన్నట్లుంది అతనికి. అందుకే ఇలా ట్యాప్ కు రంధ్రాలు చేసిన బాటిల్ ను అమర్చాడు. ఎంచక్కా ట్యాప్ నుంచి వచ్చే నీరు జల్లుల మాదిరిగా పడుతుంటే ఎంజాయ్ చేస్తూ స్నానం చేయోచ్చు. మరి మీ బాత్రూమ్ లో కూడా షవర్ లేకుంటే ఈ విధంగా ట్రై చేయండి బాస్.

3. ముగ్గురు వెళ్లాంటే ఇలా చేయాల్సిందే

3. ముగ్గురు వెళ్లాంటే ఇలా చేయాల్సిందే

ఆయనకు ఉండేది ఏదో పాత మోపెడు. దానిపై ఒక్కరు వెళ్లాలంటేనే కష్టం. మహా అంటే ఇద్దరు పడతారు. మరి ముగ్గురు వెళ్లాలంటే ఇలా చేయక తప్పదనుకున్నట్లున్నాడు. మోపెడుకు వెనకాల ఇలా కూర్చొవడానికి వీలుగా ఏర్పాటు చేశాడు. ఇక ముగ్గురేంటి నలుగురైమైనా సరే నా బండిపై వెళ్లొచ్చు అన్నట్లు దీమాగా బండినడుపుకుంటూ వెళ్తున్నాడు ఈ మహానుభావుడు.

4. జనరల్ బోగిలో వెళ్లాంటే ఇంతే మరి

4. జనరల్ బోగిలో వెళ్లాంటే ఇంతే మరి

చిన్నప్పుడు చాలామందిని వాళ్ల తల్లులు చీరతో చేసిన ఊయలలో పడుకోబెట్టిజోల పాడి ఉంటారు. ఇక పెద్దగయ్యాక మనకు ఆ అదృష్టం ఉండదు. కానీ ట్రైన్ లో జనరల్ బోగిలో వెళ్తే మాత్రం కచ్చితంగా మళ్లీ మీరు అప్పటి రోజులను గుర్తు తెచ్చుకోవొచ్చు అన్నట్లుంది ఈ ఫొటో. జనరల్ బోగిలో జనాలు చాలామంది ఉంటారు. కనీసం నిల్చొడానికి కూడా ప్లేస్ ఉండదు. కానీ ఇలా ఉయ్యాలలు కట్టుకుంటే మాత్రం ఇలా హ్యాపీగా పడుకోవొచ్చు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవొచ్చు. ట్రైన్ వెళ్తుంటే జోల పాడినట్లుంటుంది కాబట్టి జాలీగా గడుపుతున్నారు ఈ ఫోటోలోని యువకులు.

5. కూల్ గా ఉండాలంటే తప్పదు మరి

5. కూల్ గా ఉండాలంటే తప్పదు మరి

ఇంట్లో ఫ్రిడ్జ్ పని చేయడం లేదు. కానీ కూల్ డ్రింక్ మాత్రం కూల్ కావాలి. అందుకే ఆలోచించడాడు అతగాడు. బెడ్ రూమ్ లోని ఏసీ దగ్గర ఇలా వెరైటీ కూల్ డ్రింక్ బాటిల్ ను కూలింగ్ కోసం పెట్టాడు. ఇక బాటిల్ కు కరెక్ట్ ఏసీ హోల్స్ దగ్గరే పెట్టాలంటే ఏం చేయాలనుకున్నాడు. హ్యాంగర్స్ ను తీసి ఒకదానికొకటి వేలాడదీసి తాడుతో బాటిల్ ను వాటికి కట్టాడు. ఇంకేముంది పది నిముషాల్లో కూల్ డ్రింక్ మళ్లీ కూల్ అయినట్లుంది. గురుడి ఆలోచన భలే ఉంది కదూ. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఫ్రిడ్జ్ పాడైతే ఈ చిట్కా ఉపయోగించండి.

6. వారెవ్వా.. కూలర్ ను ఇట్ల కూడా వాడుకోవొచ్చా

6. వారెవ్వా.. కూలర్ ను ఇట్ల కూడా వాడుకోవొచ్చా

కూలర్ ను ఎవరైనా ఇలా ఉపయోగించేవాళ్లుంటారా? కానీ ఈ ఘనుడు ఎవరోగానీ చాలా వెరైటీ ఉపయోగించాడు దీన్ని. ఇంట్లో ఉన్న పాత ప్యాంట్ ను తీసుకుని కూలర్ నుంచి గాలి వచ్చే చోట కట్టాడు. ఇక ప్యాంట్ లోని రెండు కాళ్ల ద్వారా గాలి రెండు రూముల్లోకి వెళ్లేటట్లు చేశాడు. భలే ఉంది కదా ఐడియా. ఒక్కకూలర్ లతో రెండు రూములు కూలిపోతాయి ఇలా. రెండు రూమ్ లకు ఏసీ ఉన్నట్లే ఇక.

7. ఈ బుడ్డోడు చైర్ లేనిదే బయటకు రానుంటున్నట్లున్నాడు

7. ఈ బుడ్డోడు చైర్ లేనిదే బయటకు రానుంటున్నట్లున్నాడు

ఈ బుడ్డోడికి ఇంట్లో చైర్ పై కూర్చొని అలవాటైనట్లయింది. ఇక అమ్మతో బండిపై బయటకు వెళ్లాంలంటే కూడా చైర్ పైనే కూర్చొంటా అని మారాం చేసినట్లున్నాడు. అందుకే వాళ్ల అమ్మ కూడా ఎంచక్కా చైర్ వేసి కూర్చొబెట్టింది.

8. ఫోర్క్ బెల్ట్

8. ఫోర్క్ బెల్ట్

బెల్ట్ ఉంది కానీ దాన్ని పెట్టుకోవాలంటే పిన్ లేదు. మరి ఏం చేయాలని ఆలోచించినట్లున్నాడు ఈ హీరో. చికెన్ తినడం అయిపోగానే అదే ఫోర్క్ ను ఇలా ఉపయోగించాడు. ఇక మళ్లీ తినడానికి కూర్చొన్నప్పుడు అదే ఫోర్క్ ను ఉపయోగించేటట్లున్నాడు ఈ ఘనుడు.

9. హౌస్ ఫుల్.. అందుకే విండోస్ లో ఇలా

9. హౌస్ ఫుల్.. అందుకే విండోస్ లో ఇలా

మా ఊరు మీద పొయ్యేది గిదొక్కటే ట్రైన్. పొద్దుగాళ్లనే పక్క ఊరికి పొయి పాలు పోసిరావలే. మరి ఏం చేయాలి.. రోజు గిట్లనే కూర్చొని పోవాలి. బోగి నిండా మనుషులుంటారు. సైకిల్ వేసుకుందామంటే స్పేస్ ఉండదు. అందుకే కిటికీలకు ఇట్ల కట్టేస్తాం. వాటిపైన సప్పుడు కాకుండా మసంగా కూర్చొంటాం. మీరైతే ఏం చేస్తారో మాకు తెల్వదు.. నేనేతే గిట్లనే చేస్త భయ్ అన్నట్లు కూర్చొన్నాడు ఈ పెద్దమనిషి.

10. ఇది కొత్త ట్రెండ్ భయ్

10. ఇది కొత్త ట్రెండ్ భయ్

రూమ్ లో వంటవండాలంటే చిరాకు వేస్తది. అందుకే పాటలు వినుకుంటూ వంట చేస్తుంటా. మరి నీ దగ్గర సెల్ ఫోన్ లేదా అని మీకు డౌట్ రావొచ్చు. అది ఓల్డ్ స్టైల్. నేను మాత్రం ఇట్ల ల్యాప్ ట్యాప్ కు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినుకుంటూ వంట చేస్తుంటా. ఇందులో ఉండే కిక్కే వేరబ్బా. కావాలంటే మీరు ట్రై చేయండి బాసూ.

11. చెప్పుల్ని ఇలా వాడొచ్చు

11. చెప్పుల్ని ఇలా వాడొచ్చు

అరిపోయిన చెప్పుల్ని అలా తీసిపారేయకండి. ఇక్కడ చూడండి డోర్ తెరవడానికి మూయడానికి వీలుగా చెప్పులను ఇలా అమర్చారు. ఏదీ పనికిరాదు అనడానికి వీల్లేదు. చెప్పుల్ని కూడా ఇలా ఉపయోగించుకోవొచ్చు మరి.

12. ఇలా చేస్తే దోమలు అడుగుపెట్టలేవేమో

12. ఇలా చేస్తే దోమలు అడుగుపెట్టలేవేమో

ఇంట్లోకి వీరంగం సృష్టించాలనుకునే దోమలకు ఈ ఘనుడు ఎవరో ఇలా చెక్ పెట్టారు. సాధారణంగా మస్కిటో కాయిల్ కొనను వెలగిస్తాం. కానీ ఇతను మాత్రం దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బాటిల్స్ కు హోల్ పెట్టి ఇలా అమర్చాడు. ఇక దోమలు అటువైపు చూస్తే ఒట్టు మరి.

13. జుట్టు కాలినా ఫర్వాలేదు.. త్వరగా ఆరాలి

13. జుట్టు కాలినా ఫర్వాలేదు.. త్వరగా ఆరాలి

ఎవరైనా దుస్తుల్ని ఐరన్ చేస్తారు. కానీ ఈమె మాత్రం ఐరన్ బాక్స్ ను ఇలా కూడా వాడేస్తుంది. జుట్టు కాలి పోయినా ఫర్వాలేదు గానీ హెయిర్ మాత్రం త్వరాగా ఆరాలిఅనుకున్నట్లుంది ఈ అమ్మడు. అదే విషయాన్ని ఫ్రెండ్ కు చెప్పినట్లుంది. ఐరన్ బాక్స్ తో ఆమె ఇలా జుట్టును ఐరన్ చేస్తుంది. వామ్మో.. మీరు ఇలా చేసేరు.. జుట్టు కాలిపోతుంది. బోడి గుండు అవుతుంది. జాగ్రత్త.

14. నిజమైన ఆర్కిటెక్చర్ ఇతనే

14. నిజమైన ఆర్కిటెక్చర్ ఇతనే

ఒక అంగుళం స్పేస్ కూడా వేస్ట్ కాకూడదు అనుకున్నట్లున్నాడు ఈ ఘనుడు. బాత్రూమ్ డోర్ తీసి డోర్ మూసే స్పేస్ వేస్ట్ అయితే కూడా ఆయన సహించడలేదు. అవును మరి.. ప్లేస్ వ్యాల్య్ అలా ఉంది మరి. అందుకే టాయ్ లెట్ రూమ్ డోర్ ను ఇలా డిజైన్ చేశాడు. ఇంచు స్పేస్ కూడా వేస్టు కాకుండా చేసిన ఈ ఘనుడికి హ్యాట్సాఫ్.

15. ఇప్పుడు చెప్పండి.. ఎన్ని ఉల్లి గడ్డలు కోయమంటారో

15. ఇప్పుడు చెప్పండి.. ఎన్ని ఉల్లి గడ్డలు కోయమంటారో

ఆయనకు ఉల్లి గడ్డలు కోస్తే కంట్లో నీళ్లు ఆగేటట్లు లేవు. మరి వాళ్ల ఇంట్లో వాళ్ల ఆవిడ చెప్పే ఇదొక్కటే ఉన్నట్లుంది. ఉల్లిగడ్డలు కట్ చేయకుంటే ఆమె విశ్వరూపం చూడాల్సి వస్తుంది. ఏం చేయాలో అని ఆలోచించినట్లున్నాడు ఈ ఘనుడు. హెల్మెట్ ఇలా తలకు పెట్టుకుని ఎంచక్కా ఉల్లిపాయలు కోస్తున్నాడు. ఇక ఎన్ని కేజీలు కోయాలో చెప్పు అన్నట్లు కూర్చొన్నాడు ఈ మహానుభావుడు.

16. ఈజీగా స్కేటింగ్ చేయొచ్చు

16. ఈజీగా స్కేటింగ్ చేయొచ్చు

స్కేటింగ్ అంటే చాలా ఇష్టం ఉన్నట్లు ఉంది ఇతనికి. అలా అని స్కేటింగ్ చేద్దామంటే బయలుదేరిన ఆయనకు స్థానికులు బెస్ట్ ఆఫ్ లక్ తెలిపారు.

స్కేటింగ్ షూస్ లేవు. అందుకే తన పాత చెప్పులను ఇలా స్కేటింగ్ షూస్ మాదిరిగా మార్చుకున్నాడు. ఇక ఎంచక్కా ఎక్కడికి కావాలంటే అక్కడికి స్కేటింగ్ చేసుకుంటూ వెళ్లొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. వారెవ్వా ఏం ఐడియా గురూ.

17. అద్దం లేదు.. గడ్డం గీసుకునేదెలా ?

17. అద్దం లేదు.. గడ్డం గీసుకునేదెలా ?

ఈ బ్యాచిలర్ రూమ్ లో అద్దం లేనట్లుంది. అందుకే ల్యాప్ టాప్ ను ఇలా వాడేస్తున్నట్లున్నాడు. పొద్దునే ఇంటర్వ్యూ ఉన్నట్లుంది. అందుకే ఇలా ల్యాప్ టాప్ ముందుకు కూర్చొని షేవ్ చేసుకుంటున్నాడు. నాకు అద్దం అవసరం లేదు. ల్యాప్ టాప్ ఉంటే చాలన్నట్లున్నాడు ఈ కుర్రాడు.

18. సెలెన్సర్ సైలెంట్ గా ఉండాలంటే ఇలా చేయాల్సిందే

18. సెలెన్సర్ సైలెంట్ గా ఉండాలంటే ఇలా చేయాల్సిందే

సెలెన్సర్ రోడ్డుకు తాకుతూ వైలెంట్ చేస్తోంది. దాన్ని సైలెంట్ గా ఉంచేందుకు డ్రైవర్ ఇలా చేశాడు. హ్యాంగర్ తో ఇలా పెట్టేశాడు. డ్రైవర్ అన్నా నీకు సలాం అన్నా.

19. టైం బాలేనప్పుడు తప్పదు మరి

19. టైం బాలేనప్పుడు తప్పదు మరి

ఒక్కోసారి మనకు చాలా బ్యాడ్ నడుస్తుంటుంది. కనీసం ముక్కలైన టైంను కూడా మార్చే పరిస్థితి ఉండదు. అంత బ్యాడ్ టైమ్ ఉంటుంది. ఆ టైమ్ లో మన ఇంట్లోని టైమ్ నడవాలంటే ఇలా చేయక తప్పదు మరి. వాట్ ఏ ఐడియా సర్ జీ.

20. కాఫీ ఇలా కూడా చేయొచ్చు

20. కాఫీ ఇలా కూడా చేయొచ్చు

కాఫీని ఎవరైనా ఇలా చేస్తార అనే కదా మీ డౌట్. ఈమె చేసేది మామూలు కాఫీ కాదు... కాపుసినో చేస్తున్నారు. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఇలా రైస్ కుక్కర్ ను ఉపయోగించి దాన్ని తయారు చేస్తున్నారు. చాలా గ్రేట్ గురూ ఈమె.

English summary

photos that proves indians always khiladis

India is known for its cultural diversity and its religious sentiments. We have everything under one roof, from diverse languages to lip smacking dishes on the platter. We are also known for our developing tactics, our grim fights over the most inane issues, conventionalism, love for cleanliness and what not.We might not have solutions to the bigger problems of our nation but we are the ‘Baaps Of Jugaad’ when it comes to making life easy. And if you don’t believe us, here are 20 photos that would make you see the inner ‘Newton’ in all of us!
Story first published: Wednesday, November 15, 2017, 9:00 [IST]
Subscribe Newsletter