For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీని అని చూడకుండా నన్ను ఏదేదో చేశాడు - My Story #11

ఇక ప్రసవ సమయం అప్పుడు అనస్తిసీయా నా విషయంలో చాలా క్రూరంగా ప్రవర్తించాడు. నేను మత్తులో ఉన్నాను. కానీ నాకు అక్కడ జరుగుతుంది తెలుస్తూనే ఉంది. అతను నా ఒళ్లంతా తాకాడు. నా రొమ్ములను టచ్ చేశాడు.

By Bharath
|

బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఒక తల్లి పడే ప్రసవ వేదన అంతా ఇంతా కాదు. ప్రసవ నొప్పులు తట్టుకోవడం కేవలం మహిళలకే మాత్రమే సాధ్యం. అందుకే మనం మన తల్లులకు చాలా గౌరవం ఇస్తారు.

ఒకపక్క బిడ్డపుట్టబోతున్నాడనే ఆనందం.. మరోపక్క హాస్పిటల్స్ లో, డయోగ్నోస్టిక్ సెంటర్స్ లో మగ సిబ్బంది ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే బాధ. ప్రతి గర్భిణీ ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉంది. అలాంటి కథే ఇది.

గర్భిణీ అయ్యాను

గర్భిణీ అయ్యాను

నేను పెళ్లయిన కొన్నాళ్లకు గర్భిణీ అయ్యాను. దాంతో మా ఇంట్లో వారికి ఎక్కడలేని ఆనందం కలిగింది. మా ఆయన ఆనందానికి అవధుల్లేవు. గర్భిణీని కావడంతో నన్ను ఇంట్లో వారంతా అల్లారు ముద్దుగా చూసుకునేవారు. నాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపాడుకునేవారు. మా ఆయన అయితే కనీసం నాతో ఒక్క పని కూడా చేయించేవాడు కాదు. మహరాణిలాగా చూసుకునే వారు.

తరుచుగా టెస్ట్ లు

తరుచుగా టెస్ట్ లు

ప్రెగ్నెంట్ అయ్యాక తరుచుగా డాక్టర్ దగ్గరకు టెస్ట్ లకు వెళ్లాల్సి వచ్చేది. నేను మొదటి సారి డాక్టర్ దగ్గరకు గర్భాధారణ నిర్ధారణ పరీక్షలకు వెళ్లాల్సి వచ్చింది. నాకు గర్భం వచ్చిందా లేదా అని కన్ ఫర్మ్ చేయడానికి గ్రావిందేక్స్ టెస్ట్ చేశారు. గ్రావిందేక్స్ టెస్ట్ ద్వారా నేను గర్భిణీ అని నిర్ధారణ అయ్యింది.

ప్రతి నెల డాక్టర్ వద్దకు

ప్రతి నెల డాక్టర్ వద్దకు

తర్వాత ప్రతి నెల డాక్టర్ని కలవాల్సి వచ్చేది. అక్కడ చాలా టెస్ట్ లు చేసేవారు. అలాగే నేను బరువు సరిగ్గా పెరుగుతున్నానా లేదా అని ప్రతి నెలా గమనించుకోవాలి. తొమ్మిది నెలల్లో నేను ఎనిమిది లేక తొమ్మిది కిలోల బరువు పెరగాలంటా. లేదంటే ఏదో సమస్య ఉన్నట్లేనంట. ఇలా ఒకటి కాదు వందరకాల సూచనలు జాగ్రత్తలు డాక్టర్లు చెప్పేవారు.

సున్నిత భాగాలను తాకడం

సున్నిత భాగాలను తాకడం

వైద్య పరీక్షల కోసం వెళ్తే వారు పక్కనే ఉన్న ల్యాబ్ కు పంపించారు. బాటిళ్ల కొద్ది నీళ్లు తాగించారు. అక్కడున్న మగ సిబ్బంది నా సున్నిత భాగాలను తాకారు. కానీ వైద్యపరీక్షల కోసం కాబట్టి అలాంటిది ఏమి ఉండదులే అనుకున్నాను. కానీ వారి మాత్రం వేరే దృష్టితో నన్ను తాకారు.

ఎలా అంటే ప్రవర్తిస్తారు

ఎలా అంటే ప్రవర్తిస్తారు

నేను డాక్టర్ల దగ్గరకు పరీక్షలకు వెళ్లినప్పుడు నా వెంట మా అమ్మ వచ్చేది. పాపం ఆమె ఏమి తెలిసేది కాదు. లోపల మగ సిబ్బంది చేసే అరాచకాలు చాలామంది గర్భిణీలు బయటపెట్టరు. మరొకటేమంటే వాళ్లు అదంతా వైద్య పరీక్షల్లో భాగంగానే చేస్తూన్నామంటారు. అందుకు మన వద్ద ఎలాంటి సమాధానం ఉండదు.

కొందరు సిబ్బంది మాత్రమే

కొందరు సిబ్బంది మాత్రమే

ప్రతి ఆసుపత్రిలోని, ల్యాబ్ లోని మగ సిబ్బందంతా ఇలాగే ఉంటారని నేను చెప్పను. కానీ చాలా ఆసుపత్రుల్లో ఇలాంటి వారు ఉన్నారు. వారి గురించి బయటకు చెప్పడానికి సరైన ఆధారాలు మన దగ్గర ఉండవు. వారు అలాంటి కోణంలో మనల్ని చూస్తున్నారనే విషయాన్ని కూడా బయటపడనివ్వరు. చాలా నమ్మకంగా ఉన్నట్లు నటిస్తారు. కానీ టెస్ట్ లకు వచ్చి గర్భిణీలకు సంబంధించిన చూడరాని పార్ట్స్ మొత్తం చూస్తారు.

అలాంటి దృష్టితో చూడకుంటే చాలు

అలాంటి దృష్టితో చూడకుంటే చాలు

మరి గర్భిణీలకు టెస్ట్ లు ఎలా చేయాలని మీరు ప్రశ్నించకండి. ఎందుకంటే అలాంటి దృష్టితో చూడకుండా టెస్ట్ లు, చికిత్స అందిస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ నన్ను మాత్రం చాలా మంది సిబ్బంది ఇబ్బంది పెట్టారు. ఇక గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అయితే ఏకంగా ఇష్టానుసారంగా తిట్టారు కూడా. కానీ ఏమి చేయలేని పరిస్థితి.

అనస్తిసీయా

అనస్తిసీయా

ఇక ప్రసవ సమయం అప్పుడు అనస్తిసీయా నా విషయంలో చాలా క్రూరంగా ప్రవర్తించాడు. నేను మత్తులో ఉన్నాను. కానీ నాకు అక్కడ జరుగుతుంది తెలుస్తూనే ఉంది. అతను నా ఒళ్లంతా తాకాడు. నాపై అసభ్యంగా ప్రవర్తించాడు. నా రొమ్ములను కూడా టచ్ చేశాడు. అలాంటి దారుణాన్ని భరించాల్సి వస్తుందని నేను జీవితంలో అనుకోలేదు.

వైద్యులు

వైద్యులు

తర్వాత నా చుట్టూ నర్సులు చేరారు. వారు నిముష నిముషానికి నన్ను పరిశీలించారు. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ధైర్యం ఇచ్చారు. ప్రసవ సమయంలో నేను ఎలాంటి ఆహారం తీసుకోలేదు. కేవలం పళ్ళ రసాలను మాత్రమే తీసుకున్నా. బాగా ఆకలిగా ఉన్నా అలా తీసుకోకూడదని డాక్టర్లు చెప్పడంతో తీసుకోలేదు.

చాలాసార్లు పుష్ చేశారు

చాలాసార్లు పుష్ చేశారు

నా ప్రసవానికి 3 నుంచి 4 గంటల దాకా సమయం పట్టింది. ప్రసవ సమయంలో పొట్ట భాగాన్ని చాలా సార్లు పుష్ చేశారు. అప్పుడు నేను పడ్డ బాధ, నొప్పి వర్ణనాతీతం. కానీ ఎంత ఇబ్బంది పడినా ఒక్కసారి నాకు పుట్టిన బిడ్డను చూసేసరికి ఆ ఆనందానికి అవధుల్లేవు.

గర్భిణీపై అత్యాచారం

గర్భిణీపై అత్యాచారం

నాలాగా చాలామంది గర్భిణీలు ఇబ్బందులుపడ్డ ఘటనలు నేను పేపర్లలో చాలా సార్లు చదివాను. రాత్రివేళ ఏడేళ్ల కూతురితో కలిసి వ్యాన్ ఎక్కిన ఏడు నెలల గర్భిణిపై డ్రైవర్, క్లీనర్ చేయి వేశారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. ఇది తెలంగాణలోని మెదక్ జిల్లా తూప్రాన్ మండలం రావెళ్లి శివారులో జరిగిన ఘటన.

గర్భిణిపై వైద్యుడి అత్యాచారయత్నం

గర్భిణిపై వైద్యుడి అత్యాచారయత్నం

ఇక నెల్లూరు జిల్లా పొదలకూరులో ఏడునెలల గర్భిణీని పరీక్షల పేరుతో ఒక డాక్టర్ తన గదిలోకి తీసుకెళ్లాడు. లోపల పిండం ఎదుగుదలని తెలుసుకోవాలంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంలో ఎవరితోనైనా చెబితే చంపేస్తాను అని బెదిరించాడు. ఈ విషయం కూడా నేను పేపర్లో చదివాను.

డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో

డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో

హైదరాబాద్ లోని మెహిదీపట్నానికి చెందిన గర్భిణీపై డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు వెళ్లింది. స్కానింగ్‌ కేంద్రంలోని మగ సిబ్బంది ఆమె విషయంలో ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఇక కోయంబత్తూర్‌ లో ఇంకో సంఘటన జరిగింది. రైల్వే స్టేషన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న గర్భిణీని ఒక పోలీస్‌ అధికారి కొట్టడంతో ఆమె గర్భం పోయింది.

ఈ క్రూరుల్ని శిక్షించాలి

ఈ క్రూరుల్ని శిక్షించాలి

ఎన్నో ఏళ్లుగా బిడ్డ కోసం వేచి చూసేవారు.. ఎప్పుడెప్పుడు పండంటి బిడ్డ పుడుతుందా అని ఎదురు చేసే గర్భిణీలపై ఈ క్రూరులు ప్రవర్తించే తీరు సిగ్గుచేటు. కామంతో ఎంతో కన్ను మిన్నూ కానకుండా వ్యవహరిస్తున్నారు.

అలాంటి వారికి ఈ సమాజం బుద్ధి చెప్పాలి.

English summary

real life incident about sexual abuse a labor room

Real life incident about sexual abuse in a labor room
Story first published:Wednesday, December 20, 2017, 15:58 [IST]
Desktop Bottom Promotion