ఆశ్చర్యం అయిననూ, ఇది నిజం! కొందరిని లైంగిక భయాలు వెంటాడుతాయి!

By: sujeeth kumar
Subscribe to Boldsky

ఈ ఫోబియాల గురించి చ‌దివాక‌, శృంగారం అనేది భ‌యంక‌రంగా కూడా ఉండొచ్చు అని మీరే ఒప్పుకుంటారు! ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో శృంగారం అనేది స‌హ‌జంగా, ఉల్లాస‌వంతంగా ఉంటుంది.

మాద‌క ద్ర‌వ్యాల క‌న్నా ఎక్కువ మ‌త్తునివ్వ‌గ‌లిగిదే ఏదంటే శృంగార‌మ‌ని చెప్పొచ్చు. కాదంటారా?

ఎన్నో ర‌కాల ఫోబియాల‌తో జ‌నాలు స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. కొంత మంది ప‌డ‌క మీదికి చేర‌గానే కొన్ని ర‌కాల సెక్స్ ఫోబియాల‌తో వ‌ణికిపోతారు. ఇవి చాలా విచిత్రంగా, షాకింగ్‌గా, భ‌యాన‌కంగా ఉంటాయి.

అస‌లు ఇలాంటివి ఉంటాయా అని మీకు ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. కొన్ని విచిత్ర సెక్స్ ఫోబియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. వెజినిస్‌మ‌స్‌

1. వెజినిస్‌మ‌స్‌

ఈ ఫోబియా మ‌హిళ‌ల్లో అతి అరుదుగా క‌నిపిస్తుంటుంది. సాధార‌ణంగా ఇది క‌ద‌లిక‌లేని స‌మ‌స్య‌. ఈ ఫోబియా ఉన్న‌వారికి లైంగిక ప్రాప్తి చాలా క‌ష్టం. వెజినిస్‌మ‌స్‌తో బాధ‌ప‌డే మ‌హిళ‌ల యోని కండ‌రాలు సంకోచిస్తుంటాయి త‌ద్వారా పురుషాంగం లోప‌లికి వెళ్ల‌డానికి చాలా క‌ష్ట‌మ‌వుతుంది. వీరికి పాపం శృంగారం చాలా ఇబ్బందిగా మారుతుంది.

2. ఎర‌టోఫోబియా

2. ఎర‌టోఫోబియా

ఇది సాధార‌ణ‌మైన‌, ప్ర‌ముఖ‌మైన ఫోబియా. ఈ ఫోబియా ఉన్న‌వాళ్లు శృంగారం గురించి అంద‌రిలో మాట్లాడాలంటే చ‌చ్చేంత భ‌య‌ప‌డిపోతారు. సెక్స్ మాట ఎత్త‌గానే ఏదో ఘోర‌మైనది ప్ర‌స్తావించిన‌ట్టుగా, అస్స‌లు ఆ అంశ‌మే లేవ‌నెత్త‌ద్దు అన్నంత కోపంగా చూస్తారు. ఏదైనా మాట్లాడితే విప‌రీత‌మైన భావోద్వేగంతో తొంద‌ర‌గా ముగించాల‌ని చూస్తారు.

3. ఫాలో ఫోబియా

3. ఫాలో ఫోబియా

ఈ ఫోబియా అటు ఆడ‌వారిలోనూ, ఇటు మ‌గ‌వారిలోనూ చూడొచ్చు. ఈ ఫోబియా ఉన్న‌వారికి పురుషాంగంతో డీల్ చేయ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. పురుషులైతే సంభోగ స‌మ‌యంలో అంగం గ‌ట్టిప‌డే విష‌యంలో అస్స‌లు స‌హ‌క‌రిచ‌లేరు. ఇక ఆడ‌వాళ్ల‌యితే పురుషాంగాన్ని తాకాల‌న్నా, ఫీల్ అవ్వాల‌న్నా భ‌య‌ప‌డిపోతారు. కొంద‌రికి ఈ ఫోబియా విప‌రీత‌మైన స్థాయిలో ఉంటుంది. అలాంటి వారితో శృంగారాన్ని అస్స‌లు ఊహించ‌లేం.

4. యూరోటో ఫోబియా

4. యూరోటో ఫోబియా

ఇది ఫాలోఫోబియాకు పూర్తిగా వ్య‌తిరేకం! ఈ ఫోబియా కూడా ఆడ‌, మ‌గ ఇద్దిరికీ ఉంటుంది. యోనితో వ్య‌వ‌హ‌రించేట‌ప్పుడు ఈ ఫోబియా ప్ర‌స్తావ‌న ఉంటుంది. ఆడ‌వాళ్ల‌కు ఈ ఫోబియా ఉన్న‌ట్ల‌యితే త‌మ యోని ద‌గ్గ‌ర‌కు ఏది వ‌చ్చినా భ‌య‌ప‌డి దూరంగా పారిపోతారు. అదే మ‌గ‌వారైతే దాన్ని చూడాలంటేనే హ‌డ‌లిపోతారు. ఈ ఫోబియా సాధార‌ణంగా స్త్రీల‌లో క‌నిపిస్తుంటుంది.

5. మిడోమాల‌కో ఫోబియా

5. మిడోమాల‌కో ఫోబియా

ఇది సాధార‌ణంగా పురుషుల్లో క‌నిపిస్తుంటుంది. ఈ ఫోబియా ఉన్న పురుషులు త‌మ అంగం గురించి, సామ‌ర్థ్యం గురించి ఎక్కువ‌గా ఆందోళ‌న చెందుతుంటారు. అంగం గ‌ట్టి ప‌డ‌టాన్ని ఎక్కువ సేపు ఉంచ‌లేన‌నే భ‌యం ఆవ‌రిస్తూ ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రు మ‌గ‌వాళ్లు సెక్స్‌లో పాల్గొనేకంటే ఊరికే ఉండ‌టం న‌మ‌య‌ని భావిస్తారు.

6. జీనోఫోబియా

6. జీనోఫోబియా

ఇది ఆడ‌, మ‌గ ఇద్ద‌రిలో కనిపిస్తుంటుంది. వాస్త‌వానికి ఇలాంటి ఫోబియా ఉన్న‌వాళ్లు సంభోగం చేయాలంటే చాలా భ‌య‌ప‌డిపోతారు. ముద్దులు, కౌగిలింత‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతారే త‌ప్ప అంత‌కు మించి ముందుకెళ్లేందుకు జంకుతారు.

7. జిమ్‌నో ఫోబియా

7. జిమ్‌నో ఫోబియా

ఈ ఫోబియా ఉన్న‌వాళ్లు ఇత‌రుల ముందు న‌గ్నంగా అయ్యేందుకు బాగా సిగ్గుప‌డిపోతారు. అంత వ‌ర‌కు ఫ‌ర్వాలేదు. త‌మ భాగ‌స్వామిని కూడా న‌గ్నంగా చూడ‌లేరు. సాధార‌ణంగా ఎవ‌రి ముందు న‌గ్నంగా అవ్వ‌డానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. శ‌రీర సౌష్ట‌వం స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్ల వారు ఇలా చేస్తున్నారంటే పొర‌బ‌డిన‌ట్టే. స్లిమ్‌గా , బ‌రువైన వ‌క్షోజాలు క‌లిగి ఉండి ప‌ర్‌ఫెక్ట్ బాడీ షేప్ లో అమ్మాయి అయిన స‌రే ఈ ఫోబియా ఉంటే చాలు న‌గ్నంగా ఉండేందుకు భ‌య‌ప‌డ‌గ‌ల‌దు.

8. మోనో ఫోబియా

8. మోనో ఫోబియా

ఈ ఫోబియా ఉన్న ఆడ‌, మ‌గ మెన్స‌స్ గురించి ఎక్కువ‌గా ఆందోళ‌న చెందుతుంటారు. అమ్మాయి అయితే త‌న మెన్స్ ట్రుయేష‌న్ గురించి ఎక్కువ‌గా చింతిస్తుంటే, అబ్బాయి మాత్రం శృంగారం చేసేట‌ప్ప‌డు ర‌క్తాన్ని చూడ‌డానికి వ‌ణికిపోతాడు. ఈ ఫోబియా ఉన్న మ‌గ‌వాళ్లు తాము సెక్స్ చేసే ప్ర‌తి సారి అమ్మ‌యి మెన్స‌స్ స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంద‌ని భావిస్తుంటాడు.

9. ఒనైరోమో ఫోబియా

9. ఒనైరోమో ఫోబియా

ఏ అమ్మాయి, అబ్బాయి క‌ల‌లో శృంగార క‌ల‌లు వ‌స్తే భ‌య‌ప‌డరు. అయితే ఈ ఫోబియా ఉన్న‌వాళ్లు మాత్రం నిద్ర‌లో సెక్స్ క‌ల‌లు వ‌చ్చి శృంగార ర‌సాలు కారితే మాత్రం హ‌డ‌లిపోతారు. తామేదో త‌ప్పు చేశామ‌నే భావ‌న వీరిలో వెంటాడుతుంటుంది. కొన్ని ప‌రిశోధ‌న‌ల ఫ‌లితాలు ఈ ఫోబియా ఎక్కువ‌గా యుక్త వ‌య‌సులో వ‌స్తుంద‌ని, ఇది తాత్కాలిక‌మే అని తేల్చాయి.

English summary

Sexual Phobias That You Never Know Existed

It is written off in ancient scriptures that Lord Shiva can be simply appeased with a Dhatura fruit, Bael leaves, bhang, fresh cold cow milk, sandalwood paste, and bhasma. In Hindu religion, it is often understood that dutifully worshiping Lord Shiva, in return appeases all the Gods and Goddess in heaven.
Please Wait while comments are loading...
Subscribe Newsletter