For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ మనఃశ్శాంతిని ప్రశ్నించే విచిత్ర ఆలయాలు

By Deepti
|

గమనిక: ఈ వ్యాసం ఎవరి నమ్మకాలను బాధపెట్టడానికి ఉద్దేశించినది కాదు. ఈ ఆలోచనలన్నీ రచయిత నిత్యం ప్రశ్నించే మనసులోవి!

నమ్మకం అనేది మనలో మంచి, పాజిటివ్ శక్తిని పెంచేది. భారతదేశం, దేవునిపై రకరకాల నమ్మకాలకు పుట్ట. కొన్ని ఆలయాలైతే మన నమ్మకాన్ని, మనఃశ్శాంతిని ప్రశ్నించే విధంగా ఉంటాయి. ఈ ఆలయాలు నిజమా కాదా అనే ఆశ్చర్యం కూడా కలిగిస్తాయి.

హిందూ ఆలయాల వెనకున్న అద్భుతమైన శాస్త్రీయ రహస్యంహిందూ ఆలయాల వెనకున్న అద్భుతమైన శాస్త్రీయ రహస్యం

ఈ వ్యాసంలో, మీకు ఇలాంటి విచిత్రమైన ఆలయాల గురించి చెప్తాం. ఇవి ఎంతవరకు నిజమైనవో, అమాయకులు వీటిని ఎంత మనఃస్ఫూర్తిగా నమ్ముతున్నారో మీరే తెలుసుకుని నిర్ణయించుకోండి.

మీ మనసులో కూడా ఇవే ప్రశ్నలు ఉదయిస్తాయి.

బ్రహ్మ బాబా ఆలయం, జౌన్ పూర్

బ్రహ్మ బాబా ఆలయం, జౌన్ పూర్

ప్రజలు రావిచెట్టును పూజించే ప్రత్యేక ఆలయం ఇది. ఇక్కడ వారు రావిచెట్టుకు గడియారాలను కట్టి బ్రహ్మదేవుడు తమ ప్రార్థనలు, కోరికలు తీరుస్తాడని నమ్ముతారు.

ఈ ఆలయ చరిత్ర ప్రకారం, 30 ఏళ్ళ కిందట, ఒక ట్రక్ డ్రయివర్ డ్రయివింగ్ నేర్చుకోవాలనుకున్నాడు. అతను ఒక గడియారాన్ని చెట్టుకు వేలాడదీసాడు, అతను కోరిక తీరిపోయింది (అప్పటి నుంచి అదే నమ్మకం కొనసాగుతోంది).

Image Courtesy

విస్కీ దేవి, కాలభైరవ ఆలయం, ఉజ్జయిని

విస్కీ దేవి, కాలభైరవ ఆలయం, ఉజ్జయిని

భక్తులు వారి సమస్యలన్నింటికీ ఈ స్థానం ఒకటే పరిష్కారమని నమ్ముతారు. ఈ ఆలయం కాలభైరవునిది. ఆయన నగరానికి రక్షకుడిగా నమ్ముతారు. వందలాది మంది ఈ ఆలయానికి రోజూ వస్తారు. ఇక్కడ అమ్మవారికి విస్కీని నైవేద్యంగా పెడతారు.

Image Courtesy

కర్ణి మాత మందిర్, రాజస్థాన్

కర్ణి మాత మందిర్, రాజస్థాన్

ఈ ఆలయం ఎలుక ఆలయం అని కూడా అంటారు. ఇది డెష్నోక్ అనే చిన్న జిల్లాలో ఉంది. ఇక్కడ 20,000కి మించి ఎలుకలు ఉంటాయి. ఇది కర్ణి మాతకి సంబంధించిన ఆలయం. ఇక్కడ గుడిలో తెల్ల ఎలుక కన్పించటం చాలా పవిత్రమని భావిస్తారు. ఇక్కడ ఎలుకలకి పెద్ద గిన్నెలలో పాలను నైవేద్యంగా పెడతారు.

Image Courtesy

ఏరోప్లేన్ గురుద్వారా, జలంధర్

ఏరోప్లేన్ గురుద్వారా, జలంధర్

ఈ ప్రత్యేక ఆలయం షహీద్ బాబా నిహాల్ సింగ్ జ్ఞాపకార్థం కట్టించినది. ఇది జలంధర్ దగ్గర్లో తాలిహాన్ గ్రామంలో ఉన్నది. ఆలయపెద్దలకు ఈ ఆలయం ఎప్పుడు స్థాపించబడిందో తెలీదు కానీ వారు దాన్ని మూసివేసి భక్తులను బాధపెట్టాలనుకోవట్లేదు. గురుద్వారా దగ్గర్లోని దుకాణాల్లో వివిధ సైజుల్లో విమానాల బొమ్మలుంటాయి, అవి గురుద్వారాలో నివేదిస్తారు.

Image Courtesy

ఇండియన్ బిలీనియర్స్ కంటే ఎక్కువ ధనం ఉన్న ఆలయాలుఇండియన్ బిలీనియర్స్ కంటే ఎక్కువ ధనం ఉన్న ఆలయాలు

నరేంద్రమోడీ ఆలయం, గుజరాత్

నరేంద్రమోడీ ఆలయం, గుజరాత్

అహమ్మదాబాద్ కి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో నరేంద్రమోడీకి అంకితమిచ్చిన ఒక ప్రత్యేక గుడి ఉంది. ఈ ఆలయాన్ని మోడీజీ అభిమానులు ఇచ్చిన విరాళాలతో కట్టించినది !

నాగరాజ ఆలయం, మన్నారాసాల, కేరళ

నాగరాజ ఆలయం, మన్నారాసాల, కేరళ

ఇది అతిపెద్ద సర్పాలయాల్లో ఒకటి. ఇక్కడ పిల్లలు కావాలనుకునే స్త్రీలు అనేకమంది ఒకచోట చేరి ప్రార్థిస్తారు. వారి కోరికలు తీరగానే, తిరిగి ఇక్కడికే వచ్చి, పాముల బొమ్మలను నివేదిస్తారు. ప్రతిరోజూ 100కి పైగా బొమ్మలను ఇక్కడ సమర్పిస్తారు.

Image Courtesy

బాలాజీ ఆలయం, మెహెందీపూర్, రాజస్థాన్

బాలాజీ ఆలయం, మెహెందీపూర్, రాజస్థాన్

ఈ ఆలయం బలహీన మనస్కులకోసం కాదు. ఇక్కడ దుష్ట ఆత్మలు ఆవహించిన వారు, వారి సమస్యను పరిష్కరించుకోటానికి వస్తారు. భక్తులు తాళంకప్పలను నైవేద్యంగా తెస్తారు. దానివల్ల దుష్టశక్తులను తాళంకప్పలలో బంధించవచ్చు.

మీకు ఈ లిస్టులో చేర్చడానికి ఇంకేమన్నా విచిత్ర గుడులు, ఆలయాలు తెలుసా, అయితే కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి.

Image Courtesy

English summary

Strange Temples That Will Question Your Sanity

This is the list of the strangest temples in India. Check out the list, as it will question your sanity!
Desktop Bottom Promotion