For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుక్కలు ఏడ్చినా..అరిచినా ..మరణిస్తారని సంకేతమా..?ఏదైనా కీడు జరుగుతున్నట్టు సంకేతమా ?

సైన్స్ మరియు టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలను నమ్మే వారు లేకపోలేదు. అసలు సరైన ఆధారాలు లేని వాటినే మూఢనమ్మకాలు అంటారు. అనేక సార్లు వీటిని కొట్టిపారేసినా ఏదో ఒక సందర్భంలో వీటిని నమ్

|

సైన్స్ మరియు టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలను నమ్మే వారు లేకపోలేదు. అసలు సరైన ఆధారాలు లేని వాటినే మూఢనమ్మకాలు అంటారు. అనేక సార్లు వీటిని కొట్టిపారేసినా ఏదో ఒక సందర్భంలో వీటిని నమ్మక తప్పదు. నల్ల పిల్లి ఎదురైతే మంచిది కాదు అని కొందరంటుంటారు. పిల్లి ఎదురైతే మంచి పనులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అలాగే తలమీద బల్లి పడితే మరణం సంభవిస్తుందని అంటారు. మరి ఆ మరణం మనకా లేక ఆ బల్లికా అనేది తెలియదు. అలాగే కుక్క అరిస్తే మరణం సంభవిస్తుంది అంటారు. కుక్కలకు యమధర్మ రాజు వస్తున్నట్లు తెలుస్తుంది అంటారు. ఈ మూఢనమ్మకంలో ఎంత నిజముందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

ఏవైనా ఆధ్యాత్మిక కారణాలు లేవు

ఏవైనా ఆధ్యాత్మిక కారణాలు లేవు

జంతువులలో అత్యంత విశ్వాసం కలిగినది కుక్క. అలాగే మనిషికి బెస్ట్ ఫ్రెండ్ అని కూడా అంటుంటారు. కుక్కలు అరిస్తే పెద్దగా పట్టించుకోమని మనుషులు ..అది ఏడిస్తే మాత్రం భయపడిపోతుంటారు. అది వీదిలో కుక్క అయినా, ఇంట్లో కుక్క అయినా భయపడటం మాత్రం ఖాయం. దీనికి ఏవైనా ఆధ్యాత్మిక కారణాలు, చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయా అంటే ..అవీలేవు. కానీ నమ్మకం మాత్రం బలంగా ముద్రపడిపోయింది. ఈ నమ్మకాన్ని పారద్రోలాలని చాలా మంది పరిశోధనలు చేశారు. కానీ ఫలితం అంతంత మాత్రమే..

కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం

కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం

అసలు ఈ మూఢనమ్మకం మన దేశంలో పుట్టినది కాదు. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది.

కుక్కలు దుష్టశక్తుల్ని కనిపెట్టగలవని

కుక్కలు దుష్టశక్తుల్ని కనిపెట్టగలవని

కుక్కలు దుష్టశక్తుల్ని కనిపెట్టగలవని, దెయ్యాలను చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట. కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని, ఎవరో చనిపోతారని అనుకోవడం కూడా వారి నుంచే మొదలైందని అంటారు. వాళ్లు దేని ఆధారంగా ఆ నమ్మకాన్ని పెంచుకున్నారో ఇప్పటివరకు తెలియరాలేదు. ఆధునికుల్లో కూడా కొందరు ఇలాంటి వాదనలను సమర్థించారు.

కుక్కకు దెయ్యాలు కనబడతాయని

కుక్కకు దెయ్యాలు కనబడతాయని

ఏడు గిట్టలు (Hooves) ఉన్న కుక్కకు దెయ్యాలు కనబడతాయని మాత్ గ్రోనింగ్ అనే అమెరికన్ రచయిత ఓ పుస్తకంలో రాశాడు. కుక్క ఏదైనా శూన్యంలోకి చూసి అరుస్తున్నా, ఏడుస్తున్నా కచ్చితంగా దెయ్యాన్ని చూసే అయివుంటుందని, అప్పుడు దాని రెండు చెవుల మధ్య నుంచి చూస్తే ఆ దెయ్యం మనక్కూడా కనిపిస్తుందని రాశాడాయన. చదువుతుంటే కాస్త భయమేస్తుంది కదా?

దెయ్యాల్ని సైతం చూడగలిగేంత శక్తి ఉన్న కుక్కలు, చావును పసిగట్టడంలో వింతేముంది

దెయ్యాల్ని సైతం చూడగలిగేంత శక్తి ఉన్న కుక్కలు, చావును పసిగట్టడంలో వింతేముంది

దీన్ని కొందరు కొట్టి పారేశారు కానీ ఎంతోమంది నమ్మారు. దెయ్యాల్ని సైతం చూడగలిగేంత శక్తి ఉన్న కుక్కలు, చావును పసిగట్టడంలో వింతేముంది అన్నారు వాళ్లు. అంటే కుక్కకు మనుషుల మరణం గురించి తెలియడం నిజమేనా?

సైన్స్ ఏం చెబుతుంది

సైన్స్ ఏం చెబుతుంది

ఎంతమాత్రం కాదనే అంటున్నారు శాస్త్రవేత్తలు. దెయ్యాల్ని చూడటం, మరణాన్ని పసిగట్టడం వంటివన్నీ మూఢనమ్మకాలే అంటారు వారు. కాకపోతే గాలిలో వచ్చే రసాయనిక మార్పులని బట్టి కుక్కలు చాలా తెలుసుకుంటాయట.

చావుకు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కల ఉంటే,

చావుకు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కల ఉంటే,

చావుకు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కల ఉంటే, మార్పులకు లోనవుతున్న వారి శరీరపు వాసన గాలి ద్వారా వీటిని చేరితే, దాన్నిబట్టి అవి పసిగట్టవచ్చు తప్ప... వాటికవి మరణాన్ని కనిపెట్టేయడమన్నది అసాధ్యమని అంటున్నారు. పైగా ఎవరో మనిషి చనిపోతే అతడితో ఎలాంటి సంబంధం లేని కుక్క ఏడుస్తుందనడం హాస్యాస్పదం అంటున్నారు. అది ఏడవడానికి అనారోగ్యమో, మరేదో కారణమై ఉండొచ్చు అనేది వారి వాదన.

నిజమే కదా!

నిజమే కదా!

నిజమే కదా! ఎవరైనా చనిపోతే వారికి సంబంధించినవాళ్లు ఏడుస్తారు కానీ, ఎక్కడో ఎవరో ఎందుకు ఏడుస్తారు? పెంపుడు కుక్కలు ఏడ్చాయంటే ఒక అర్థముంది కానీ, ఊళ్లో ఎవరో చనిపోతే ఊరి చివర ఉండే కుక్క ఎందుకు ఏడుస్తుంది? ఇలా కాస్త లాజికల్‌గా ఆలోచిస్తే మన నమ్మకం మూఢనమ్మకంగా మారేది కాదేమో!

English summary

Superstitions about Howling Dogs

Admit it, the melancholy sound of a howling dog sends chills up your spine, doesn’t it? If you’re not the superstitious type, then you may blame Hollywood for this association. We’ve all seen movies where the howling of a dog foreshadows something ominous, but do you know where the roots of this concept come from?
Story first published: Thursday, February 2, 2017, 16:49 [IST]
Desktop Bottom Promotion