For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఔరౌరా..ఇండియన్ వెడ్డింగ్స్ లో ఇన్ని మూఢ నమ్మకాలా?

By Gandiva Prasad Naraparaju
|

వివాహ సమయాన్ని చాలా గొప్ప జరుపుకుంటారు, ఈ పవిత్రమైన రోజును భారతదేశంలో ప్రజలు మతపరమైన పంచాంగం ప్రకారం అనుసరిస్తారు.

ఈ అన్ని విషయాల మధ్య, ప్రజలు నివారించలేని, వాటిని తొలగించడానికి భయపడే కొన్ని మూఢనమ్మకాలూ ఉన్నాయి. ప్రజలు నమ్మి, వివాహ సమయంలో ఎటువంటి ఆటంకం లేకుండా తప్పకుండా అనుసరించాలి అనుకునే మూఢనమ్మకాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది.

మెహెంది రంగు!

మెహెంది రంగు!

వధువు పెట్టుకునే హెన్నా రంగు ఎంత గొప్పగా, ఎర్రగా ఉంటుందో, ఆమె ప్రేమ, ఆ భాగస్వామితో ఆమె అనుబంధం అంత బలంగా ఉంటుందని నమ్ముతారు. వధువు చేతికి మెహంది ఎంత ఎక్కువసేపు ఉంటే, ఆమె అత్తమామల నుండి అంత ఎక్కువ ప్రేమను పొందుతుందని కూడా నమ్ముతారు.

వివాహం రోజు వర్షం!

వివాహం రోజు వర్షం!

పెళ్లిరోజు వర్షం పడితే సంతానోత్పత్తికి, సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఇది చాలా పవిత్రమైనదని కూడా భావిస్తారు.

పెళ్ళికి ముందు అబ్బాయి-అమ్మాయి ఒకరినొకరు చూసుకోకూడదు

పెళ్ళికి ముందు అబ్బాయి-అమ్మాయి ఒకరినొకరు చూసుకోకూడదు

ఇది ఏర్పాటు వివాహం సమయం నాటి మూఢనమ్మకం, పెళ్ళికి ముందే కాబోయే భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకుంటే, వారి మనసులు మారిపోతాయి అని ప్రజలు నమ్మేవారు. ఏది ఏమైనప్పటికీ పరిస్ధితులు మారాయి, ఇప్పటికీ ప్రజలు ఈ సంప్రదాయాలను అనుసరిస్తున్నారు.

పాలు దొర్లడం

పాలు దొర్లడం

ఒక ఇలాంటి శుభకార్యాలప్పుడు ఒక రోజు ముందు లేదా తరువాత పాలు దొర్లితే ఆ దురదృష్ట చిహ్నాలు ఆ జంటపై ప్రభావాన్ని చూపిస్తాయని నమ్ముతారు. కాబట్టి, ఆ ప్రత్యేకమైన రోజున పాలు దొర్లకుండా చూసుకోవాలి అనేది కుటుంబీకుల లక్ష్యం.

కేలేరెన్ ఫాల్

కేలేరెన్ ఫాల్

ఇది ఉత్తర భారతదేశంలో అనుసరిస్తున్న ఒక సంప్రదాయం. వధువులు చూడాను ధరిస్తారు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కలీరెన్ (ఎరుపు, బంగారపు ఆభరణాలు) కడతారు. ఆ వధువు పెళ్ళికాని అమ్మాయిల తలమీద నుండి తన చేతిని కదుపుతుంది. ఈ కలీరెన్ ఫాల్ అమ్మాయిల తలపై పడితే, వెంటనే వారికి వివాహం నిస్చయమవుతుందని నమ్మకం.

వధువు, వరుడి మీద బియ్యంగింజలు విసురుతారు

వధువు, వరుడి మీద బియ్యంగింజలు విసురుతారు

ప్రజలు వధువు, వరుడి మీద పచ్చి బియ్యం చల్లి వారి ఆశీర్వాదాలు తెలియచేస్తారు. ఇది సంతానోత్పత్తికి, సమృద్ధికి చిహ్నం. కొన్ని సంస్కృతులలో, ఈ సంప్రదాయం దుష్ట ఆత్మల నుండి కొత్తగా పెల్లిచేసుకునే వారిని రక్షిస్తుందని నమ్ముతారు.

పెళ్లిరోజు ఏడవడం

పెళ్లిరోజు ఏడవడం

వధువు పెళ్లిరోజు ఏడిస్తే, అదృష్టం అని భావిస్తారు, మూఢనమ్మకాల ప్రకారం, ఆమె ఇప్పుడు కన్నీటిని చిందిస్తే, పెళ్లి అయిన తరువాత ఎప్పుడూ ఏడవదు అని నమ్మకం.

ముందు కుడికాలు పెట్టడం

ముందు కుడికాలు పెట్టడం

పురాతన సంప్రదాయం ప్రకారం, వధువు మొదటగా ఎడమకాలు పెట్టి కొత్త ఇంట్లోకి వస్తే దురదృష్టంగా భావిస్తారు. కాబట్టి, కొత్తగా పెళ్ళైన వధువు తన కుడికాలు ముందుపెట్టి ఇంట్లోకి ప్రవేశించాలి.

ముసుగు ధరించడం

ముసుగు ధరించడం

రోమ్ ప్రజలు ఈ పద్ధతిని అనుసరిస్తారు, దుష్ట ఆత్మలు వధువు ఆనందాన్ని చూసి అసూయ చెందుతాయని ప్రజలు భయపడతారు, కాబట్టి, వధువు తననుతాను దాచి ఉంచుకోవడానికి ఈ ముసుగును ధరిస్తుంది.

గ్లాస్ పగల గొట్టడం

గ్లాస్ పగల గొట్టడం

ఇటలీలో, కొత్తగా పెళ్ళైన వధువు పూల కుండీని లేదా గ్లాసుని పగులగొడతారు. పురాతన సాంప్రదాయ౦ ప్రకారం, ఆ గ్లాసు ఎన్ని ముక్కలైందో ఆజంట అన్ని సంవత్సరాలు సుఖంగా ఉంటారని నమ్ముతారు.

గంటలు మోగించడం

గంటలు మోగించడం

ఐరిష్ వివాహాలలో సంప్రదాయంగా గంటలు మోగిస్తారు. దుష్ట ఆత్మలు దూరంగా వెళ్ళిపోయి, ఒక శ్రావ్యమైన కుటుంబ జీవితం ఏర్పడుతుందని నమ్మకం. కొత్తగా పెళ్ళైన వారికి గంటలు బహుమతిగా కూడా ఇస్తారు.

English summary

Superstitions That People Follow In Indian Weddings

Superstitions That People Follow In Indian Weddings,The almond knows ... that's the same. It is also available in the nutrients of the equivalent nutrients. Yes, it is true that you heard it. If we take at least two and three sarisanas per week in the form of some of the above, we have a lot of benefits.
Desktop Bottom Promotion