For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశి వారికి సహనం నశిస్తే మాత్రం వారిని అదుపు చేయడం అంత తేలిక కాదు..!

|

రాశులలో రెండోది వృషభం. ఇది సరి రాశి, ముఖాన్ని సూచిస్తుంది. సౌమ్య స్వభావం, స్థిరరాశి, భూతత్వం, స్త్రీ రాశి, వైశ్యజాతి. దీని దిశ దక్షిణం. ఇందులో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం నాలుగు పాదాలూ, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. దీని అధిపతి శుక్రుడు.

వృషభ రాశిలో జన్మించిన వారు సహజంగా సహనవంతులు. సహనం నశిస్తే మాత్రం వారిని అదుపు చేయడం అంత తేలిక కాదు. కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది. గొప్ప శారీరక దారుఢ్యం ఉంటుంది. తేలికగా అలసట చెందరు. నిదానంగా పనిచేస్తున్నట్లే కనిపిస్తారు గానీ ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికే పనులు పూర్తి చేస్తారు. వృథా కాలక్షేపాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. లలిత కళలపై, వస్త్రాలంకరణలు, సుగంధ ద్రవ్యాలపై బాగా మక్కువ కలిగి ఉంటారు. అసాధారణమైన తెలివితేటలు, గొప్ప సంయమనం వీరి సొత్తు.

ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏ నెల ఎలా ఉండబోతోందో చైనీస్ ఆస్ర్టాలజీ అంచనా ప్రకారం ఏ నెలలో ఎలాంటి పనులకు అనుకూలం, ఏ నెల బిజినెస్ లో పెట్టుబడులకు అనుకూలిస్తుంది, ఏ నెలలో ఐశ్వర్యం సిద్ధిస్తుంది వంటి ఆసక్తికర అంశాలు రివీల్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే.. ఈ రాశి వారికి ఏ నెల ఎలాంటి అద్భుత ప్రయోజనాలు కలుగజేస్తుందో చూసేద్దాం..

జనవరి:

జనవరి:

మిక్కిలి అనుకూల స్థానం. సకలవిధ సౌభాగ్యసిద్ధి, గృహలాభము కలుగుతుంది, ఏ రంగంలోనున్న వారికైనా అభివృద్ధి, వృత్తి, వ్యాపారములలో ధనాదాయము, పలుకుబడి, బంధు మిత్ర సమాగమము, సినీ, నటీనటవర్గము, కళాకారులకు సన్మానములు, గాయకులకు, రచయితలకు గుర్తింపు, ప్రయాణముల రీత్యా ధనవ్యయం, నూతన వస్తు వస్రాభరణప్రాప్తి, భార్యాభర్తల మధ్య అవగాహన, సఖ్యత, ఆకస్మిక ప్రమాదములు, ప్రాణభయం.

ఫిబ్రవరి:

ఫిబ్రవరి:

కుటుంబంలో సౌఖ్యము పొందుతారు, అన్నివిధాల అభివృద్ధి కలుగుతుంది, ఆచార జీవనము జీవిస్తారు, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, బంధుమిత్ర సమాగమము, నూతన వ్యక్తుల వలన స్నేహలాభములు, గృహోపకరణములకు వస్తు సామాగ్రిని సమకూర్చుకొనుట, ధనాదాయం బాగుండుట, భార్య, పిల్లలతో ఆనందముగా గడుపుట, వృత్తి-వ్యాపారములలో కలిసివచ్చుట, ఉద్యోగప్రాప్తి, ఆరోగ్యము బాగుండుట.

మార్చి:

మార్చి:

అనుకున్న పనులు సాధిస్తారు, కొత్త వస్తువులు పొందుతారు, ధనలాభము కలుగుతుంది, అనుకున్న పనులు నెరవేరుట, చేయు కృషి వృద్దిగా వుండుట, ధనలాభం, కుటుంబసౌఖ్యం, శతృవులు మిత్రులగుట, అధికారానుగ్రహం, శుభవార్తలు వినుట, వ్యవహారములు కలిసివచ్చుట, సంతానాభివృద్ధి, ఉద్యోగప్రాప్తి, వ్యాపారలాభం, బాకీలు వసూలగుట, కొంత ఋణ విముక్తి, సమస్యలు పరిష్కారమునకు వచ్చుట, గౌరవాభిమానములు పెరుగుట, ఎత్తు నుండి జారిపడుట, ఆకస్మికముగా దెబ్బలు తగులును.

ఏప్రియల్:

ఏప్రియల్:

భోజనము చేస్తారు, స్త్రీ సౌఖ్యము పొందుతారు. ప్రారంభములో అన్నివిధములా కలిసివచ్చును. చేయు వృత్తి-వ్యాపారములలో లాభించుట, రాణించుట జరుగును. ఆరోగ్యము బాగుండును. ఏదో రకముగా సొమ్ము చేతికందుచుండును. ఆదాయము బాగుండును. ఏప్రియల్ 13 నుండి బంధు మిత్రులతో విరోధము, అనవసర ధనవ్యయం, అపనిందలు, ఎంత మంచిగా వున్నా పేచీలు, తలనొప్పి, శ్రమ, త్రిప్పట, అనారోగ్యం.

మే:

మే:

వ్యతిరేక ఫలస్థానం. ఎక్కువ శ్రమ చేస్తారు, రాజభయములేదా పై అధికారులచేత, ప్రభుత్వం చేత భయం పొందుతారు, ఉద్యోగస్తులకు పై అధికారుల వలన వత్తిడి, స్థానచలనములు, బంధుమిత్ర" విరోధములు, శిరస్సుకు, కంటికి సంబంధించిన వ్యాధులు, వేళకు సరిగా తిండి తినకపోవుట, అనారోగ్యం, పని వత్తిడి ఎక్కువగుట, జాయింటుదార్లతో మనస్పర్ధలు, మనస్థిమితము లేకపోవుట, విందు-వినోదములలో పాల్గొనుట, ధనము ఖర్చు చేయుట.

జూన్:

జూన్:

చేసే పనులలో ఆటంకములు కలుగుతాయి, గౌరవం తగ్గుతుంది, మనస్థాపము, ఎంత పని చేసినా మెప్పు పొందలేకపోవుట, కుటుంబములోను, చేయు వృత్తి వ్యాపారములలోను తగాదాలు, అనవసర గొడవలు, దుష్టసహవాసములు, వ్యసనములకు , ధనవ్యయం, శతృవులు మిత్రులగుట, సంగీత సాహిత్యములు, కళలు, శాస్త్ర సంబంధమైన చర్చలలో పాల్గొనుట, క్రయ విక్రయ లాభం.

జూలై:

జూలై:

కష్టతరమైన నష్టప్రదమైన ప్రయాణాలు చేస్తారు, అరిష్టము కలుగును, ధననష్టము జరుగుతుంది, చంచల మనస్సు, అన్నదమ్ములతోను, బంధువులతోను, సఖ్యత లేకపోవుట, శరీరమునందు నొప్పులు, జబ్బుపడుట, తలంచిన కార్యములలో జయము, భార్యాపుత్రుల వల్ల సుఖ సౌఖ్యములు చేకూరుట, సంఘములో గౌరవము, పలుకుబడి, తల్లిదండ్రులు, పూర్వీకుల ఆస్టి కలియుట, ధనలాభము, ఉత్సాహము, దైవ కార్యములలో పాల్గొనుట.

ఆగష్టు:

ఆగష్టు:

దేహకాంతి తగ్గుతుంది, దొంగల వల్ల భయము కలుగుతుంది, కష్టనష్టాలు కలుగుతాయి. తలంచిన కార్యములు నెరవేరుట, సుఖ సౌఖ్యములు, ధనధాన్యవృద్ధి, వ్యాపారాభివృద్ధి, ధనలాభం, నూతన వస్తు వస్త్రలాభం, సంగీత సాహిత్యములు, కళలయందు ఆసక్తి, సభలలో పాల్గొనుట, వివాహాది శుభకార్యములు నెరవేరుట, బంధుమిత్రులతో విందు వినోదములతో కాలక్షేపము చేయుట, ఉద్యోగస్తులకు పలుకుబడి.

 సెప్టెంబరు:

సెప్టెంబరు:

శని సంచరించు స్థానమున రోగమును, దేశాంతర ప్రయాణమును, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించుట, కుటుంబ కలహములు, ప్రయాణములు చేయునప్పుడు మార్గమధ్యములో ఆటంకములు ఏర్పడి తిరిగివచ్చుట, అధికారుల వలన మాటలు పడుట, రాబడికి మించిన ఖర్చులు, స్థిరాస్థి విషయంలో తగాదాలు, కుట్రలు, బంధువులలో ఆధిఖ్యత, మనశ్శాంతి లేకపోవుట, చోరభయం.

అక్టోబరు:

అక్టోబరు:

హృదయమునకు కష్టము, గొప్పభీతిని, ద్రవ్యనాశనమును, హృదయ తాపమును, సంఘములో గౌరవము, పలుకుబడి, క్రయ విక్రయముల వలన లాభించుట, చేయు కృషియందు అభివృద్ధి, తలంచిన పనులు నెరవేరుట, ధనలాభం, కుటుంబ సౌఖ్యము, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, బంధుమిత్రులలో ఏర్పడిన వైషమ్యములు పెద్దల యొక్క సహాయ సహకారములు, అధికారుల మన్ననలు.

నవంబరు:

నవంబరు:

అలసట, భార్యాబిడ్డలకు అనారోగ్యము, వేదన కల్పించును. తలంచిన కార్యములకు ఆటంకములు, అధికారుల వలన చికాకులు, కుటుంబములోని వారికి అనారోగ్యము, ఔషధ సేవలు చేయుట, భార్యతో మనస్పర్థలు, స్త్రీలతో విరోధము, ఎంత మంచిగా వ్యవహరించుకుందామనుకున్నా పేచీలు, వ్యాపారస్తులకు వడిదుడుకులు, మానసిక అశాంతి, శ్రమ, త్రిప్పట, అనవసర ధనవ్యయం.

డిశంబరు:

డిశంబరు:

ధనధాన్య అభివృద్ధి, బంధువులతో సంతోషము, ఆలస్యముగా పనులు నెరవేరుట, నమ్మిన వారి వలన దగాలు, మోసపోవుట, కుటుంబములోని వారితో తగాదాలు, స్థలమార్పులు, మాటపట్టింపులు, ఆరోగ్యం బాగుండకపోవుట, వేళకు సరిగా భోజనము చేయకపోవుట, ప్రారంభములో చికాకులు కలిగినా కష్టముతో పనులు నెరవేరుట, ఆలస్యముగా ధనము చేతికందుట, రహస్యాంగములకు సంబంధించిన వ్యాధులు.

 2017లో వృషభ రాశి వారికి

2017లో వృషభ రాశి వారికి

* ఈ సంవత్సరం అంతా కొంత అష్టమ శనిదోషం ఎదుర్కొన్నప్పటికిని నెమ్మదిగా సమసిపోగలవు. కృత్తికనక్షత్రం వారు 9 సార్లు నవగ్రహ ప్రదక్షిణ, రోహిణి నక్షత్రం వారు 10 సార్లు నవగ్రహ ప్రదక్షిణలు, మృగశిర నక్షత్రం వారు 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినట్లు శుభం కలుగుతుంది.

* ఈ రాశివారు ప్రతి మాసశివరాత్రికి ఈశ్వరుని అభిషేకం చేయించి, శ్రీమన్నారాయణుని ఆరాధించడం ద్వారా సర్వదోషాలు తొలగిపోతాయి. కృత్తికానక్షత్రం వారు స్టార్ రూబి, రోహిణి నక్షత్రం ముత్యం, మృగశిరనక్షత్రం వారు పగడం ధరించినట్లైతే శుభం కలుగుతుంది.

* కృత్తికానక్షత్రం వారు అత్తి చెట్టును, రోహిణి నక్షత్రం వారు నేరేడు, మృగశిర నక్షత్రం మారేడు దేవాలయాల్లో గానీ, విద్యా సంస్థల్లోగానీ, ఖాళీ ప్రదేశాల్లోగాని నాటిన మీకు అభివృద్ధి కానవస్తుంది.

English summary

Taurus Horoscope – yearly 2017

Year won’t be easy, but you will sail through, with some grit, self confidence, discipline and loads of calm. Love others and appreciate the love you receive, in return. What you don’t get was never yours! Try out our 2017 Finance Report which is our fully customized service wherein our expert astrologer will answer you precisely. You are sure to benefit from this. So don’t delay.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more