అమ్మ చెప్పే మాటలివే

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

సృష్టిలో ఎంతో తియ్యనైనది తల్లి ప్రేమ. అమ్మ ప్రేమ ముందు ఏదీ సరితూగదు. ఈప్రేమను వర్ణించడానికి భాష సరిపోదు. అది ఓ తియ్యని వరం. అందుకేమో ఓ కవి ఇలా అన్నాడు "ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా తియ్యని కావ్యం.. ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్నా తియ్యని రాగం ". స్వార్ధం లేకుండా ఉండేది తల్లి ప్రేమ ఒక్కటే. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అమ్మ మనసు మంచు కన్నా చల్లనిది.

మల్లె కన్నా తెల్లనిది. దేవతతో సమానం ఆమె. సృష్టికి మూలం అవ్యాజమైన మాతృప్రేమ. మధుర పరిమళం లాంటిది. అనిర్వచనీయమైన ఆనందానుభూతిని ఇచ్చేదీ మాతృప్రేమ. ప్రేమకు నిలువెత్తు ప్రతిరూపం అమ్మ. అవధుల్లేని ప్రేమను పంచేది అమ్మ. అంతులేని త్యాగమూర్తి మాతృమూర్తి. భూదేవితో సమానమైన సహనం ఆమెకు ఉంటుంది. సాగరమంత దయ ఆమె సొంతం. బిడ్డల క్షేమాన్నీ, శ్రేయాన్నీ, అభ్యున్నతినీ కాంక్షించి, అనుక్షణం అమితంగా బాధ్యత తీసుకునే అమృతమూర్తి మాతృమూర్తి. ఇలా ప్రేమ, త్యాగం, సహనం, బాధ్యతలనే నాలుగు స్తంభాలతో నిర్మించిన దేవాలయమే అమ్మ చిరునామ.

అమ్మ చెప్పే ప్రతి మాటకు ఎంతో విలువ ఉంటుంది. బిడ్డల క్షేమం కోసం ఆమె ప్రతి క్షణం పరితపిస్తూనే ఉంటుంది. తల్లి మాత్రమే కన్నబిడ్డ చిన్నవాడైనా, పెద్దవాడైనా కంటికి రెప్పలా కాచుకుని, గుండెల్లో దాచుకుంటుంది. మరి అలాంటి అమ్మ తన కుమారులు, కూతర్లకు రోజూ వంద సూచనలిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యమైనవి, తల్లి నోట వెంట నిత్యం వచ్చే మాటలు ఏమిటో ఒకసారి చూద్దామా.

1. అలా బయటకు వెళ్లి ఆడుకో

1. అలా బయటకు వెళ్లి ఆడుకో

"కిత్నీ జ్యాదా పడాయి ఖర్తా హై మేరే బేటా.. బేటా బహర్ బి హో ఆ, ఫ్రెష్ హవా బీ జరూరి హై" అంటూ ప్రతి అమ్మతో కొడుకుతో చెబుతుంది. దీని అర్థం.. తన కుమారుడు చదివి చదివి అలసి పోయాడని కొద్ది సేపు అలా బయటకు వెళ్లి వస్తే ఆ అలసట తీరుతుందని తల్లి చెబుతుంది. ఎప్పుడూ చదువుతూనే ఉంటే తల్లి అలా సూచనలు ఇస్తుంది. అలాగే పిల్లలు బయటే ఆడుకుంటూ ఉంటారనుకో అప్పుడు ఆమె చెప్పే మాట ఏమిటో తెలుసా. "అబీ కిత్నా బహార్ జాయెగా? దిన్ భర్ ఘుమ్తా రెహతా హై, కబీ కబీ కితాబ్ బి కోల్ లియా కర్, నలాయక్ ". అంటూ సూచనలిస్తుంది. రోజంతా బయట తిరుగుతూనే ఉంటావా? కొద్దిసేపయినా పుస్తకం తెరిచి చదువుకో అంటూ సూచనలిస్తుంది.

2. ఫోన్ అంటే అస్సలుపడదు

2. ఫోన్ అంటే అస్సలుపడదు

చదువుకునే తన పిల్లల దగ్గర ఫోన్ ఉండడం తల్లులకు అస్సలు నచ్చదు. పిల్లల దగ్గర ఫోన్ ఉన్నట్లు మీ అమ్మకు తెలిసిందనుకో ఇంక అంతే సంగతులు. రోజంతా వాట్సాప్, ఫేస్ బుక్ అంటూ టైం వేస్ట్ చేస్తారు... అలా చేయొద్దండి అంటూ ఆమె పిల్లల్ని హెచ్చరిస్తుంది. ఫోన్ల వల్ల ఎక్కువ నష్టాలుంటాయి. కాబట్టి పిల్లలు వాటికి దూరంగా ఉండాలని తల్లి కోరుకుంటుంది.

3. కాస్త అనుమానంగా ప్రశ్నలు

3. కాస్త అనుమానంగా ప్రశ్నలు

కుమార్తె కాలేజీకి వెళ్లేందుకు రెడి అవుతుందనుకో తల్లి కాస్త ఆమెపై ఫోకస్ పెడుతుంది. ఇక కూతురు బాగా రెడీ అవుతుంటే.. ఓ ఈ రోజు వెళ్లేది కాలేజికేనా లేదంటే ఎక్కడికైనా బయటికి ప్లాన్ చేశావా అంటూ కాస్త అనుమానంగా అడుగుతుంది. ఎందుకంటే కూతురికి తల్లి నుంచి ఆ మాత్రం భయం లేకుంటే ఆమె హద్దులు మీరుతుందనేది తల్లి భయం.

4. రొట్టెలు చేయడం రాకుంటే ఎలా?

4. రొట్టెలు చేయడం రాకుంటే ఎలా?

ఇక పెళ్లీడుకొచ్చిన కూతురుని ఉద్దేశించి ప్రతి తల్లి కొన్ని మాటలు అంటూ ఉంటుంది. అందులో కూడా ఒక మర్మం ఉంటుంది. రొట్టెలు చేయడం ఇంకెప్పుడు నేర్చుకుంటావు. నువ్వు చేసే రొట్టొలే గుండ్రంగా లేకుంటే ఇక మంచి పెళ్లికొడుకు నీకు ఎలా దొరుకుతాడు. ఇక్కడ రొట్టెలకు, పెళ్లి కొడుకుకు సంబంధం ఏమిటనేది చాలామంది తెలియక తికమకపడుతుంటారు.

5. నిద్రకు సంబంధించి ఇలా అంటుంది

5. నిద్రకు సంబంధించి ఇలా అంటుంది

ఉదయాన మీరు అసలు లేవకుండా లేజీగా బాగా నిద్ర పోతున్నారనుకో.. నిద్రపో.. నిద్రపో జీవితాంతం ఇలా పడుకుంటేనే ఉండు.. లేచి పనులు మాత్రం చేయొద్దు అంటూ సున్నితంగా మందలిస్తుంది. అలాగే మీరు పొరపాటున ఒక రోజు పొద్దునే లేచి బ్రష్ చేస్తూ మీ మమ్మీకి కనపడ్డారనుకో. అప్పుడు వచ్చే డైలాగ్ ఏమిటో తెలుసా? ఓ ఈ రోజు ఏమో స్పెషల్ ఉన్నట్లుంది అందుకే పొద్దునే లేచాడు మా మహరాజ్ అంటూ జోక్ చేస్తుంది.

6. మీరాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంది

6. మీరాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంది

ఇక మీరు ఇంట్లోనే ఉంటూ ఖాళీగా ఉన్నారనుకో నా కొడుకుకు ఏదో ఒక జాబ్ వస్తే మేలు అని దేవున్ని కోరుకుంటుంది. అలాగే మీరు జాబ్ లో జాయినయ్యానుకో నా కొడుకు ఇంటికెప్పుడు వస్తాడో అంటూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక మీరు చాలా రోజుల తర్వాత ఇంటికొస్తే ఆమెకు పండుగే. రా నాయనా.. అంటూ ఆనందంగా ఆమె మీకు స్వాగతం పలుకుతుంది.

7. జాగ్రత్తలు చెబుతూనే ఉంటుంది

7. జాగ్రత్తలు చెబుతూనే ఉంటుంది

భారతదేశంలో 99.9% మంది తల్లులు తమ కూతుర్లు, కుమారులకు ప్రతి రోజు జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. మీరు ఇంటి నుంచి బయట అలా వాకింగ్ కు వెళ్లారనుకో.. నాయనా రోడ్డు దాటేటప్పుడు చూసుకో.. జాగ్రత్తగా పో నాయనా అంటూ జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. మీకన్నా ఎక్కువ ఆమె టెన్షన్ పడి పోతూ ఉంటుంది. ఇక మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారనుకో బయటకు ఎక్కడ తినకు నాయనా.. బ్యాగ్ లో నీకు కావాల్సినవి అన్నీ పెట్టా అంటుంది. పిల్లలపై ఇలా ఎనలేని ప్రేమ చూపేది తల్లి ఒక్కరే కదా మరి.

8. అడిగిందల్లా ఇచ్చే దయనీయురాలు

8. అడిగిందల్లా ఇచ్చే దయనీయురాలు

ఇక మీకు ఏం కావాలన్నా తన శక్తి మేరకు ఇచ్చే దయనీయురాలు తల్లి ఒక్కటే. మీకు ఏదైనా కావాలనకున్నప్పుడు ఆమెను అడిగితే చాలు. కొంతకాలం తర్వాత ఆమె అందుకుకావాల్సిన డబ్బును ఇస్తుంది. ఆ విషయంలో ఆమె బాగా ఆలోచిస్తుంది. మీకు మేలు చేసే వాటికైతైనే ఆమె ఓకే అంటుంది. వాటివల్ల ఏవైనా దుష్ప్రభావాలుంటే మాత్రం డబ్బు ఇవ్వదు.

9. మీపై ఓ కన్నేసి ఉంచుతుంది

9. మీపై ఓ కన్నేసి ఉంచుతుంది

మీరు ఒకవేళ ఇంట్లో ఉంటే మీకు ఎవరెవరు ఫోన్ చేస్తున్నారనే విషయంపై మీ అమ్మ ఓ కన్నేసి ఉంచుతుంది. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు. మాట్లాడే అంశాలేమిటనే వాటిపైనే ఆరా తీస్తుంది. అలాగే మీకు మంచి కలగాలని ప్రతి క్షణం ఆలోచించే కరుణామూర్తి తల్లి ఒక్కరే.

10. ఇదొక్కటి అయిపోతే చాలు

10. ఇదొక్కటి అయిపోతే చాలు

ఇక మీరు చినప్పటి నుంచి మీ అమ్మ ద్వారా ఒక మాట వింటూ ఉంటారు. ఇదొక్క ఏడాదే.. ఈ సంవత్సరం చదువు అయిపోయిందనుకో చాలు. నీకు ఏ ఇబ్బందులుండవు. ట్యూషన్లుండవు. ఏమీ ఉండవు. ఇక నీవు హ్యాపీగా ఉండొచ్చు...అని మీకు చెబుతుంది. ఆ సంవత్సరం అయిపోయాక మళ్లీ యథామాములే. మళ్లీ మీరు స్కూల్ లేదా కాలేజీకి వెళ్లాలంటే మారాం చేస్తూనే ఉంటారు. ఆమె మాత్రం ఆ డైలాగ్ చెబుతూనే ఉంటుంది. ఇలా మీరు మీ జీవితం మొత్తం ఏ విషయంలోనైనా సరే మీ అమ్మ నుంచి ఈ డైలాగ్ వింటూనే ఉంటారు.

English summary

10 Things All Indian Mothers Say| 10 Besat Indian Mom Lines| 10 Hilarious Indian Mom Sayings| 10 Funny Things All Indian Moms say

10 Things All Indian Mothers Say| 10 Besat Indian Mom Lines| 10 Hilarious Indian Mom Sayings| 10 Funny Things All Indian Moms say.,Mothers are our heart but at times they are the source for what tickles out laughter buds with the most funny things they can come up with.
Story first published: Wednesday, November 1, 2017, 8:00 [IST]
Subscribe Newsletter