For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  బిల్‌గేట్స్ కు అమ్మాయిలంటే చాలా భయం అంట! బిల్‌గేట్స్ గురించి మరికొన్ని నిజాలు!

  By Bharath
  |

  బిల్ గేట్స్ ప్రపంచంలో అందరికీ ఈ పేరు తెలిసి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఈయన ఒకరు. ఈయనకు ముందు చూపు ఎక్కువ. ఇతనికి ఉన్న క్రియేటివిటీ నాలెడ్జ్ ఐటీ పరిశ్రమలో చాలా కొద్ది మందికే మాత్రమే ఉంది. ఇప్పడు ప్రపంచం మొత్తం కంప్యూటర్ లేకుంటే అస్సలు ముందుకెళ్లే పరిస్థితిలో లేదు. దీనికంతటికీ కారణం బిల్ గేట్స్ లాంటి మహానుభావులే. ప్రపంచాన్ని మొత్తం కంప్యూటరీకణ చేయించిన గొప్ప మేధావి ఈయన.

  ఐ ఫోన్ అంటే ఇష్టం

  ఐ ఫోన్ అంటే ఇష్టం

  బిల్‌గేట్స్ కు ఐ ఫోన్ అంటే చాలా ఇష్టం. ఆయనకు తనకు సంబంధించిన మైక్రోసాఫ్ట్ ఫోన్స్ కంటే ఐ ఫోన్ ఉపయోగించడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఐ ఫోన్ లో ఉన్న ఫీచర్లు అంటే తనకెంతో ఇష్టమని బిల్‌గేట్స్ పలు ఇంటర్య్వూల్లో చెప్పారు. తన మైక్రోసాఫ్ట్ ఫోన్స్ కన్నా ఐ ఫోన్స్ బెస్ట్ అని కితాబిచ్చారు బిల్‌గేట్స్.

  తన ప్లేట్ తనే కడుక్కుంటాడు

  తన ప్లేట్ తనే కడుక్కుంటాడు

  బిల్‌గేట్స్ ఇంట్లో ఎప్పుడైనా ఖాళీగా ఉంటే వంటలు వండుతారు. అలాగే తన ప్లేట్ తాను కడుక్కుంటుంటారు. రాత్రి పూట ఇంట్లో అన్నం తిన్న తర్వాత ఆయన ప్లేట్ ఆయనే కడుగుతారు. ఇలా చేయడమంటే ఆయనకు చాలా ఇష్టమట.

  కార్లంటే బాగా ఇష్టం

  కార్లంటే బాగా ఇష్టం

  బిల్‌గేట్స్ కు కార్లంటే బాగా ఇష్టం. ఆయన గ్యారేజీలో చాలా కార్లుంటాయి. ఆయన పోర్స్కి ఫ్యాన్. వాటికి సంబంధించిన చాలా కార్లు ఆయన దగ్గరున్నాయి. అలాగే 23 రకాల ఖరీదైన కార్లు ఆయన దగ్గరున్నాయి.

  విదేశీ భాషల పై పట్టు లేదు

  విదేశీ భాషల పై పట్టు లేదు

  బిల్ గేట్స్‌కు విదేశీ భాషల పై ఏమాత్రం అవగాహన లేదు. అయినప్పటికి ఆయన సేవాతత్పురత ముందు ప్రపంచం దాసోహమనకు తప్పదు. తరగని సంపద ఉన్నప్పటికి.. బిల్ గేట్స్ వద్ద తరగని సంపద ఉన్నప్పటికి తమ పిల్లలకు వారసత్వంగా 10 మిలియన్‌లు మాత్రమే ఇచ్చారు. పిల్లల వద్ద డబ్బులు ఎక్కువ ఉండకూడదన్నది బిల్ గేట్స్ అభిప్రాయం.

  అరెస్టు

  అరెస్టు

  బిల్‌గేట్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారును నడపటం వల్ల గేట్స్ న్యూ మెక్సికోలో 1977లో అరెస్ట్ అయ్యారు. బిల్ గేట్స్ కూడా కాలేజీ డ్రాప్ అవుటే. మైక్రోసాఫ్ట్ పై తన దృష్టిని పూర్తిస్థాయిలో కేటాయించేందుకు గేట్స్ 1975లో హార్వర్డ్ యూనివర్శిటీని విడిచారు.

  ఆస్తి తరగడానికి వందల ఏళ్లు పడుతుంది

  ఆస్తి తరగడానికి వందల ఏళ్లు పడుతుంది

  బిల్‌గేట్స్ కు సంబంధించిన ఆస్తిని రోజుకు 60 కోట్లు చొప్పున ఖర్చుచేసినట్లయితే ఏకంగా ఆ ఆస్తి తరగటానికి 220 సంవత్సరాలు పడుతుంది. బిల్ గేట్స్ సంపాదన సెకనుకు $250 యూఎస్ డాలర్లు, రోజుకు $20 మిలియన్. సంవత్సరానికి $7.2 బిలియన్. బిల్ గేట్స్ ఓ వెయ్యి డాలర్ల‌ను నేలపై జారవిడిచినట్లయితే వాటిని తిరిగి తీసుకోనవసరం లేదు. ఎందుకంటే గేట్స్ ఆ జార విడిచిన మొత్తాన్ని నాలుగు సెకన్లలో సంపాదించగలరు.

  అతని ఆలోచన తీరు అమోఘం

  అతని ఆలోచన తీరు అమోఘం

  బిల్‌గేట్స్ ను ఒక ఇంటర్వ్యూ లో అతన్ని మీ దగ్గర 100 రూపాయలుంటే ఎందులో పెట్టుబడి పెడతారు. ఎంత లాభాన్నిసాధిస్తారు అని అడిగారు. దానికి అతను ఇలా సమాధానం ఇచ్చాడు. నా దగ్గర 100 రూపాయలు ఉంటే, మొదటగా ఓ మంచి కోడిపెట్టను కొంటాను. 3 నెలల్లో ఆ కోడిపెట్ట 8-10 పిల్లలకు జన్మనిస్తుంది. ఇంకో రెండున్నర నెలలు తరవాత, కోడి పిల్లలు కూడా పెద్దవై పిల్లల్ని పెట్టడం స్టార్ట్ అవుతుంది. అలా 6 నెలల తర్వాత ఫస్ట్ ఇన్ కమ్ లెక్కేసుకుంటే ఒక్క కోడి రెండు కిలోల బరువుగా, కిలో ధర 300 గా వేసుకుంటే, మొత్తం 6000 రూపాయలు వస్తాయి.

  ఆ డబ్బులతోనే ఇంకొన్ని లేయర్ ( గుడ్లు పెట్టే కోళ్ల) ను కూడా కొంటాను. ఇప్పుడు ప్రతిరోజు కోడి పెట్టే గుడ్లను అమ్మడం తో డబ్బులు వస్తుంటాయి...దానికి తోడు నా దగ్గరున్న కోళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంటాయి. ఇలా ఓ 100 కోళ్లను ఓ ఏడాది పాటు మెంయింటేన్ చేసుకుంటూ వెళ్తే నాలుగు సార్లలో, 3 సార్లు 100*600*3= 1.8 లక్షలు సంపాదించొచ్చు, పైగా కోడిగుడ్ల నుండి సంపాధించే డబ్బులు అధనం. పూర్తిగా కోళ్లనే చూసుకోకుండా నేను వేరే పని చేసుకునే అవకాశం కూడా ఉంది కనుక, మరొక ఆదాయం కూడా నేనే సంపాదించే అవకాశం ఉంటుంది. అని సమాధానం ఇచ్చారు

  విరాళం ఇస్తూనే ఉంటారు

  విరాళం ఇస్తూనే ఉంటారు

  బిల్‌గేట్స్ తన వ్యక్తిగత చారిటీ సంస్థ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌కు 460 కోట్ల డాలర్ల (దాదాపు రూ.29,500 కోట్లు) విలువైన 6.4 కోట్ల మైక్రోసాఫ్ట్ షేర్లను ఇటీవల దానం చేశారు. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ ఫైలింగ్‌ల ద్వారా ఈ విషయం వెల్లడైంది. 1999లో బిల్‌గేట్స్ ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. అప్పుడు 1,600 కోట్ల డాలర్లు విరాళంగా ఇచ్చారు. తర్వాత ఏడాదిలో (2000 సంవత్సరంలో) మరో 510 కోట్ల డాలర్లు దానం చేశారు. ఆ తర్వాత బిల్ అండ్ మిలిండా గేట్స్‌కు ఇచ్చిన అతిపెద్ద విరాళం ఇదే. ఇప్పటివరకు బిల్‌గేట్స్ 5వేల కోట్ల డాలర్లకు పైగా విరాళాలు ఇచ్చారు. తాజా విరాళం తర్వాత మైక్రోసాఫ్ట్‌లో బిల్‌గేట్స్ వాటా 2.3 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గింది.

  చిన్నప్పటి నుంచే మేధావి

  చిన్నప్పటి నుంచే మేధావి

  బిల్ గేట్స్ అక్టోబర్ 28 1955 న వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్‌లో జన్మించాడు. చిన్నతనం నుంచే కంప్యూటర్ లాంగ్వేజి బేసిక్ నేర్చుకొని అందులో ప్రోగ్రాములు రాసి డబ్బులు సంపాదించేవారు. బిల్ గేట్స్ భార్య పేరు మెలిండా. వారికి ముగ్గురు పిల్లలు. వాషింగ్టన్ లో 5.15 ఎకరాల విశాలమయిన ఎస్టేట్‌లో దాదాపు 50,000 చదరపు అడుగులు విస్తీర్ణంగల ఇంటిలో వీరు నివాసం ఉంటారు.

  అమ్మాయిలతో మాట్లాడాలంటే సిగ్గు

  అమ్మాయిలతో మాట్లాడాలంటే సిగ్గు

  బిల్ గేట్స్ కు అసలు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదంట. తనకు అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా సిగ్గని ఒం ఇంటర్యూలో చెప్పారు. అలాగే కంపెనీ పెట్టిన కొత్తలో చాలా స్ట్రిక్టుగా ఉండేవాడంట. ఉద్యోగుల పనిగంటలను వారి లైసెన్స్ ప్లేట్లను గుర్తుపెట్టుకుని మరీ పర్యవేక్షించేవాడంట. ఆయనకు సెలవులు అంటే ఇష్టం ఉండేది కాదంట. ఇక తాను చదువుకునే రోజు్లోల క్లాసు మొత్తంలో మిగతా అబ్బాయిలెవరూ లేకుండా మొత్తం అమ్మాయిల మధ్యలో తానొక్కడే ఉండేలా మైక్రోసాఫ్ట్ మరో వ్యవస్థాపకుడు పాల్ అలెన్‌తో కలసి షెడ్యూలింగ్ సాఫ్ట్‌వేర్‌ను మార్చేసేవాడంట. అయితే అమ్మాయిలతో మాట్లాడటంలో ఆయన చాలా వీక్ అంట. దీంతో అంతమంది చుట్టూ ఉన్నా వారితో పెద్దగా మాట్లాడేవాడుకాడంట.

  మంచి రొమాంటిక్ ఫెలో

  మంచి రొమాంటిక్ ఫెలో

  బిల్ గేట్స్ తన ప్రేయసి మిలిండా ఫ్రెంచ్‌తో అప్పట్లో లవ్ బాగానే నడిపారు. తనదైన రీతిలో ఆమెను ఇంప్రెస్ చేసేవాడు. ఓ ప్రయివేటు విమానంలో బిల్ గేట్స్ ఆమెను ఒమాహకు తీసుకువెళ్లి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ నగదు దుకాణంలో స్పెషల్ రింగ్‌ను బహుకరించి సప్రైజ్ చేశాడం. అంతేకాదు, బిల్ గేట్స్ తన పెళ్లి నిమిత్తం హవాయి ద్వీపంలోని అతి ఖరీదైన మనీలీ బే హోటల్ మొత్తాన్ని అద్దెకు తీసుకున్నారు. తన ప్రేమ విషయంలో మాత్రం బిల్ గేట్స్ మంంచి రొమాంటిక్ ఫెలోనే.

  English summary

  Things You Did Not Know About Bill Gate's Lifestyle

  Things That You Need To Know About Bill Gate's Lifestyle. He success of Bill Gates is years of sheer hard work, dedication and entrepreneurship qualities.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more