ఒక అహంకారి లోపలి ఆలోచనల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు :

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఒక అహంకారిని ఎన్నో రకాలుగా విశ్లేషించవచ్చు. ఏ వ్యక్తికి అయితే ' అహంకారి ' అనే పదాన్ని అర్ధం చేసుకోలేరో, అటువంటి వ్యక్తులు వారిని వారే ఆచరణాత్మకంగా ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని అర్ధం. సాధారణం గా ప్రతిఒక్క అహంకారి మెదడులో కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఇలాంటి ఆలోచనలన్నింటిని విశ్లేషించడం ద్వారా మీరు గాని లేదా మీ స్నేహితుడు గాని అహంకారి అవునా కదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

ఒక అహంకారి వ్యక్తిలో ఉండే అతి ముఖ్యమైన ఆలోచనల గురించి, తన మెదడుని తొలిచే విషయాల గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం....

" నేను ఎలా కనిపిస్తున్నాను ? "

ఒక అహంకారి తన యొక్క బాహ్య సౌందర్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు తరచుగా తాము ఎలా కనపడుతున్నాం ? తమని ఎలా ఎదుటి వ్యక్తులు చూస్తున్నారు అనే విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వారి యొక్క సౌందర్యం గురించి మెదడులో ఎప్పుడూ ఎదో ఒక ఆలోచన మెదులుతూనే ఉంటుంది. వీరి యొక్క ఈ స్వభావము వల్ల వారి స్నేహితులు మరియు కుటుంబసభ్యులు చిరాకు పడే అవకాశం ఉంది. ఎందుచేతనంటే వీరు గంటల తరబడి అద్దం ముందే గడిపేస్తుంటారు.

" ఎందుకు ప్రతి ఒక్కరు చాలా చెడ్డగా కనిపిస్తుంటారు ? "

వీరు వారి గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. స్వతహాగా వారి గురించి ఇంతలా ఆలోచించే ఇలాంటి వ్యక్తులు వారి చుట్టూ ఉన్న ఎదుటి వ్యక్తుల గురించి చెడ్డగా ఆలోచిస్తుంటారు. తాము పెట్టే కృషిలో పదో వంతు కృషి ఎదుటి వ్యక్తులు పెట్టినా వారు కూడా బాగా కనపడతారు కదా అని ఎప్పుడు ఆలోచిస్తుంటారు. తమ దృష్టిలో ఏ వ్యక్తి అయితే ఖచ్చితత్వంతో కూడిన వ్యక్తిగా వారు భావిస్తారో అటువంటి వ్యక్తులతోనే సంబంధ బాంధవ్యాలను నెరపడానికి ఒక అహంకారి ప్రయత్నిస్తారు.

" వేరే వ్యక్తులు కూడా బాగానే చేసే అవకాశం ఉంది ! "

అహంకారం కలిగిన వ్యక్తి సహాయం చేయలేడు గాని, ఎదుటి వ్యక్తులకు సలహా ఇవ్వడం తన వ్యక్తిగత బాధ్యతగా భావిస్తాడు. ఎందుచేతనంటే, వారి యొక్క మెదడు ఎదుటి వ్యక్తిలను పూర్తిగా విమర్శించే ఆలోచనలతోనే నిండిపోయి ఉంటుంది లేదా ఎదుటి వ్యక్తులు తప్పుచేసి ఆ ఒక్క అవకాశం కోసం వీరు ఎదురు చూస్తూ ఉంటారు.

" ఎందుకు ఇంత సమయం పడుతుంది కారణం ఏమిటి ? "

ఇటువంటి వ్యక్తులు విపరీతమైన అహం ఉంటుంది. వీరు చేసే దైనందిక రోజువారీ వ్యవహారాల్లో వీరి యొక్క అహం ప్రస్ఫుటంగా కనపడుతూనే ఉంటుంది. వీరు ఒక వరుసలో కూడా నిల్చోలేరు. అందుకు కారణం వీరికి వీరు అతిముఖ్యమైన వ్యక్తులుగా భావిస్తుంటారు. ఆలా గనుక వరుసలో నిలుచుంటే, తమ గౌరవం ఎక్కడ దెబ్బతింటోందో అని అనుకుంటారు.

" తమ చుట్టూ ఉన్న వ్యక్తులను వివిధరకాలుగా అవమానించడానికే ఆలోచిస్తుంటారు "

ఒక అహంకారి చాలా సమయాన్ని ఎదుటి వ్యక్తుల్లో ఉన్న వ్యతిరేక విషయాల గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తుంటారు. వీరు సహాయం చేయలేరు కానీ, ఎదుటి వ్యక్తులను నిలువరించడానికి వివిధరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వీరే ఎదుటి వ్యక్తులతో అవమానించబడతారు మరియు ప్రతి ఒక్క సందర్భంలో వాటి గురించే ఆలోచించడానికి ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు.

" తరచూ కొత్త కొత్త ఆలోచనలు విపరీతంగా చేయడం "

ఎవరైనా వ్యక్తులకు అహంకారి వ్యక్తులు ఎదురైతే, వీరిని చూసి పగటికలలు కనే వారిలో ఉన్నారు అని అనుకునే అవకాశం ఉంది. కానీ, అది నిజం కాదు. వీరు ఎప్పుడూ తమ మెదడుకి పదును పెడుతూనే ఉంటారు మరియు కొత్త కొత్త విషయాల గురించి ఆలోచనలు చేస్తూనే ఉంటారు. క్లుప్తంగా చెప్పాలంటే కొత్త వ్యూహాలను రచిస్తునే ఉంటారు.

దాదాపు చాలా సమయాన్ని వారి గురించి ఆలోచించడానికే వెచ్చిస్తుంటారు. ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించడానికి అస్సలు సమయం కేటాయించారు. ఎప్పుడైనా సమయాన్ని కేటాయిస్తే అది విమర్శలు చేయడానికే ఉంటుంది.

మీకు ఎవరైనా అహంకారి తెలుసా ? అటువంటి వాటి గురించి మీరు మాతో పంచుకోవాలనుకుంటే క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మరచిపోకండి.

English summary

Traits Of A Narcissist

A narcissist is practically in love with himself and a certain thoughts, which are as listed in the article, reinforce the belief. There are certain thoughts that go on in every narcissist's mind. Analysing these thoughts can help you to find out if you or a friend of yours is a narcissist.
Story first published: Thursday, December 7, 2017, 12:26 [IST]
Subscribe Newsletter