స్విట్జర్లాండ్ లో సెట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే అక్కడి ప్రభుత్వం బంఫర్ ఆఫర్ ఇస్తోంది!

Posted By: Bharath
Subscribe to Boldsky

పచ్చిక మైదానాలు.. ఎత్తైన కొండలు.. అంతకన్నా పెద్దగా ఉండే లోతైన లోయలు.. అందమైన మేఘాలు అందుతాయో అన్నట్లుగా ఉండే ప్రాంతాలు.. స్విట్జర్లాండ్‌లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొత్తగా పెళ్లయిన వారు హనీమూన్ కు వెళ్లాలంటే మనందేశంలో అయితే కొన్ని ప్రాంతాలను ఎంచుకుంటారు. ఇక విదేశాల్లో అయితే దాదాపు స్విట్జర్లాండ్ ను ఎంచుకుంటారు. చాలామందికి ఈ దేశం అంటే చాలా ఇష్టం. అందరూ అంతగా ఇష్టపడే స్విట్జర్లాండ్ కు ఎవరికి మాత్రం వెళ్లాలని ఉండదు చెప్పండి. ఛాన్స్ రావాలే గానీ ఇప్పుడే బ్యాగ్ సర్దుకుని వెళ్లడానికి కూడా చాలామంది రెడీగా ఉంటారు.

కానీ అక్కడి వెళ్లాలంటే అంత ఈజీకాదు కదా. కాస్త డబ్బుతో కూడుకున్న వ్యవహారం. అయితే అక్కడి ప్రభుత్వం ఒక పట్టణం లో నివసించడానికి £ 53,000 ఆఫర్ చేస్తోంది. మరి ఇలా ఊరికే ఎవ్వరూ ఆఫర్ చేయరు కదా.. ఇలా చెయ్యడానికి కూడా కారణాలుంటాయి. మరి ఆ విషయాలు ఏమిటో మీరూ తెలుసుకోండి.

అల్బినేన్ పట్టణంలో నివసించేందుకు ఆఫర్

అల్బినేన్ పట్టణంలో నివసించేందుకు ఆఫర్

ఆ ప్రాంతలో రోజురోజుకు జనాభా తగ్గిపోతుంది. అందుకే అక్కడికి వెళ్లి ఎవరైనా నివసిస్తే వారికి ఇలాంటి ఆఫర్ ఇస్తోంది అక్కడి ప్రభుత్వం. స్విట్జార్లాండ్ లో అల్బినేన్ అనే పట్టణం ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 4265 అడుగుల ఎత్తులో ఉంది. అందమైన లోయలు.. మనస్సును దోచేసేలా ఉంటుంది ఆ ప్రాంతం. అయితే ఇది మొత్తం కూడా కొండప్రాంతమే. ఎక్కువగా లోయలుంటాయి. అలాగే ఇక్కడ ఒక పెద్ద చర్చి, సంప్రదాయకమైన వాలైస్ నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయి.

టౌన్ ప్రెసిడెంట్ ప్రకారం ...

టౌన్ ప్రెసిడెంట్ ప్రకారం ...

ఇక్కడ చాలా ప్రశాంతగా ఉంటుంది. అలాగే అద్భుతమైన వాతావరణం ఉటుంది. స్వచ్ఛమైన గాలి ఉటుంది. ఇక్కడ ఏడాది పొడవునా సూర్యరశ్మి ఉంటుంది. ప్రజలు నివసించడానికి ఎలాంటి సమస్యలుండవు. అయితే దురదృష్టవశాత్తూ చాలామంది ఈ అందమైన పట్టణాన్ని విడిచి వెళ్తున్నారు. చాలామంది పెద్ద సిటీలకు వెళ్తుండడంతో ఇంత పెద్ద పట్టణం మొత్తం ఖాళీ అయిపోయింది.

ప్రస్తుతం 240 మంది మాత్రమే ఉన్నారు

ప్రస్తుతం 240 మంది మాత్రమే ఉన్నారు

ఇంత పెద్ద పట్టణంలో ప్రస్తుతం 240 మంది మాత్రమే నివసిస్తున్నారు. వీరికి సంబంధించిన ఏడుగురు పిల్లలు రోజూ పక్కనే సిటీలకు చదువుకోవడానికి వెళ్తుంటారు. వీరంతా బస్సుల్లో పక్క సిటీలకు వెళ్తారు.

ఇక్కడ ఉన్న వారంతా పెద్ద నగరాలకు తరలివెళ్లడంతో ఈ పట్టణంలోని పాఠశాలను మూసివేశారు.

ఆఫర్ వీరికే

ఆఫర్ వీరికే

అయితే స్విస్ గవర్నమెంట్ ఈ ప్రాంతంలో జనం నివసించేలా చేసేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న దంపతులను ఇక్కడికి వచ్చేలా చేస్తోంది. ఇద్దరు పిల్లలున్న దంపతులకు ప్రాముఖ్యం ఇస్తోంది. వారు ఇక్కడికి వచ్చాక సొంత స్థలం, ఇళ్లు వంటివి కోనుగోలు చేసేందుకు వీలుగా £53,000 ఆఫర్ ప్రకటించింది.

చిన్న ట్విస్ట్ ఉంది

చిన్న ట్విస్ట్ ఉంది

ఈ ప్రాంతంలోకి వచ్చే ముందు డబ్బు తీసుకున్న వారు తమ ఇష్టానుసారంగా మళ్లీ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి వీల్లేందు. వారు తీసుకున్న సొమ్మునంతా ప్రభుత్వానికి చెల్లించాకే అక్కడి నుంచి వెళ్లాలి. మరి మీరు ఏమి ఆలోచిస్తున్నారు? స్విట్జర్లాండ్ లోని ఈ అందమైన ప్రదేశాకి వెళ్లి అక్కడే సెట్ అవ్వాలనుకుంటున్నారా? లేదంటే మా ఊరికంటే ఈ ప్రపంచంలో గొప్పది లేదని భావిస్తున్నారా. ఏదైతైనేం ఆఫర్ ఉంది. అవసరమున్న వాళ్లకు ఇది బాగా పని చేస్తుంది.

English summary

town in switzerland is offering money to stay here

Now the Government in Switzerland is offering people £53,000 to live in a town!
Subscribe Newsletter