For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విచిత్రమైన వివాహాలు.. వధువును అందరూ ముద్దుపెట్టుకుంటారు

పెళ్లి చేసుకునే సంప్రదాయం ఒక్కోచోట ఒక్కోరకంగా ఉంటుంది. కొన్ని సంప్రదాయాల్లో పెళ్లి కూతురిపై ఉమ్మివేస్తారు. మరికొన్ని సంప్రదాయాల్లో పెళ్లి కూతుర్ని అందరూ ముద్దు పెట్టుకుంటారు.

By Bharath
|

పెళ్లి చేసుకునే సంప్రదాయం ఒక్కోచోట ఒక్కోరకంగా ఉంటుంది. కొన్ని సంప్రదాయాల్లో పెళ్లి కూతురిపై ఉమ్మివేస్తారు. మరికొన్ని సంప్రదాయాల్లో పెళ్లి కూతుర్ని అందరూ ముద్దు పెట్టుకుంటారు. ఇలా ఒక్కో కల్చర్ లో ఒక్కో ట్రెడిషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా పెళ్లి చేసుకున్న వారు హ్యాపీగా ఉండాలని పాటించే సంప్రదాయాలే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని సంప్రదాయాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.

కుంబ్ వివాహం

కుంబ్ వివాహం

మన భారతదేశంలో పెళ్లిళ్లలో ఎన్నో సంప్రదాయాలున్నాయి. అందులో భాగంగానే కుంబ్ వివాహం నిర్వహిస్తారు. ఇది ఎక్కువగా ఉత్తరాధిన ఉంటుంది. మంగళిక్ అంటే ఆమె మొదటి భర్త మరణం శాపం కలిగి ఉంటుంది. అందువల్ల, ఆమెకు ఆ శాపం యొక్క చెడు ప్రభావాలను తొలగించడానికి ఒక పీపల్ చెట్టు లేదా కుక్కను వివాహం చేసుకోవడం ఒక ఆచారం.

మంగలిక్ శాపం

మంగలిక్ శాపం

మంగలిక్ శాపం ఉన్న మహిళను చేసుకుంటే పెళ్లయ్యాక ఇద్దరిలో ఒకరు అకాల మరణం చెందుతారని నమ్ముతారు. అందువల్ల మంగాలిక్ కు ముందుగా విష్ణు విగ్రహం లేదా ఒక మట్టి కుండ లేదా పెపాల్ లేదా అరటి చెట్టులతో వివాహం చేస్తారు. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ లు పెళ్లి చేసుకునే ముందు ఈ పద్ధతి పాటించారు.

MOST READ:సెక్స్ కు ముందు వీటిని తాగండి.. స్వర్గం చూస్తారు MOST READ:సెక్స్ కు ముందు వీటిని తాగండి.. స్వర్గం చూస్తారు

పెళ్లి కూతురిపై ఉమ్మివేయడం

పెళ్లి కూతురిపై ఉమ్మివేయడం

కెన్యాలో ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది. మస్సాయ్ అనే తెగ వారి పెళ్లితంతు కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. వధువు తండ్రి తన కుమార్తె తలపై, రొమ్ములపైన ఉమ్మి వేస్తాడు. ఇలా చేయడం వల్ల తన కూతురికి మంచి జరుగుతుందని వారు భావిస్తారు. అక్కడి వాళ్లు కూతుర్లను ఈ విధంగానే ఆశీర్వదిస్తారు.

చారివారి పద్ధతిలో పెళ్లి

చారివారి పద్ధతిలో పెళ్లి

ఈ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న వాళ్లు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. పెళ్లి అయిపోయకా దంపతులకు బంధువులు చుక్కలు చూపిస్తారు. పెళ్లికి వచ్చిన స్నేహితులు, బంధువులంతా కలిసి పెళ్లి జరిగిన ఇంటి ముందు మకాం వేస్తారు. ఎవరూ భరించలేనంత శబ్దాలు చేస్తూ ఉంటారు. కొత్తగా పెళ్లి అయిన జంట వెళ్లి వాళ్లందరికీ స్నాక్స్, పానీయాలు స్వయంగా ఇవ్వాలి. అప్పడు ఆ శబ్దాలు ఆపుతారు. ఇది ఒక ఫ్రెంచ్ జానపద ఆచారం.

వంటపాత్రల్ని పగలగొట్టడం

వంటపాత్రల్ని పగలగొట్టడం

జర్మనీలో ఈ సంప్రదాయం ఉంది. పెళ్లికి చేసిన వంటల్ని మొత్తం పెళ్లికి వచ్చిన కొందరు పాడు చేస్తారు. వంట సామగ్రి మొత్తాన్ని పగలగొడుతారు. దీంతో అక్కడ రకరకాల శబ్దాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల వధూవరులిద్దరూ కలకాలం బాగుంటారని వారి నమ్మకం. అయితే పెళ్లికి వచ్చినవారు తినడం కోసం పెళ్లివారు ప్రత్యేకంగా వంటలు రెడీ చేసి ఉంటారు.

పెళ్లికొడుకుని చితక్కొడుతారు

పెళ్లికొడుకుని చితక్కొడుతారు

దక్షిణ కొరియాలో ఈ ఆచారం ఉంది. పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లికొడుకుని అతని స్నేహితుల కొడతారు. వరుని కాళ్లపై అదేపనిగా తంతారు. అందుకోసం ఒక్కోసారి కట్టెలను కూడా ఉపయోగిస్తారు. పెళ్లికొడుకు ఎంత గట్టివాడో తెలుసుకునేందుకే వారు ఇలా చేస్తారు.

కిడ్నాపింగ్

కిడ్నాపింగ్

పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొస్తేనే పెళ్లి అవుతుంది అక్కడ. రోమానీ లేదా జిప్సీలు ఇలాంటి సంప్రదాయాన్ని ఎక్కువగా పాటిస్తారు. చేసుకోబోయే అమ్మాయిని బలవంతంగా కిడ్నాప్ చేయగలిగితేనే ఆమె అతని భార్య అవుతుంది.

పెళ్లి కూతురు ఏడుస్తూనే ఉంటుంది

పెళ్లి కూతురు ఏడుస్తూనే ఉంటుంది

చైనాలో జరిగే పెళ్లి తంతులో ఈ విధానాన్ని పాటిస్తారు. పెళ్లికి ఒక నెల ముందు నుంచి వధువు రోజూ ఒక గంట పాటు ఏడుస్తూ ఉంటుంది. 10 రోజుల ముందు ఆమె తల్లి కూడా పెళ్లికూతురితో పాటు ఏడుస్తూ ఉంటుంది. ర్వాత, ఆమె అమ్మమ్మ, సోదరీమణులు కూడా ఆమెకు తోడుగా ఉండి ఏడుస్తూ ఉంటారు. మొత్తం అందరూ కలిసి ఏడుస్తుంటే అది కూడా కాస్త వినుసొంపుగానే ఉంటుంది. ఆ ఏడుపులో వాళ్లు చాలా హావాభావాలు పలికిస్తారు.

బాత్రూమ్ కు వెళ్లకూడదు

బాత్రూమ్ కు వెళ్లకూడదు

ఉత్తర బోర్న్యోలో కొత్తగా వివాహం చేసుకున్న జంటలు ఇంట్లోనే ఉండాలి.

టిడోంగ్ కమ్యూనిటీకి చెందిన గిరిజనుల్లో ఈ సంప్రదాయం ఉంది. పెళ్లయిన మూడు రోజుల వరకు పెళ్లికూతురు, పెళ్లికొడుకు మూత్రవిసర్జన చేయకూడదు.

MOST READ:నేను సెక్స్ మాత్రమే ఆశించట్లేదు.. నాకు ఇంకా చాలా కావాలిMOST READ:నేను సెక్స్ మాత్రమే ఆశించట్లేదు.. నాకు ఇంకా చాలా కావాలి

పెళ్లి కూతుర్ని అందరూ ముద్దు పెట్టుకుంటారు

పెళ్లి కూతుర్ని అందరూ ముద్దు పెట్టుకుంటారు

స్వీడన్లో ఈ సంప్రదాయం ఉంది. వధువు లేదా వరుడుని పెళ్లికి వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు ఇష్టమొచ్చినట్లు ముద్దుపెట్టుకోవచ్చు. అయితే దీనికి ఒక కండీషన్ ఉంది. వధువు, వరుడుని వదిలి బాత్రూమ్ కు వెళ్తే.. వరుడిని అక్కడ ఉండే అమ్మాయిలు ముద్దుపెట్టుకోవొచ్చు. అలాగే వరుడు వధువుని విడిచి వెళ్తే కూడా అబ్బాయిలు ముద్దుపెట్టుకోవొచ్చు.

బాణంతో పెళ్లి కూతుర్ని గురిపెట్టి కొడతారు

బాణంతో పెళ్లి కూతుర్ని గురిపెట్టి కొడతారు

యుగూర్ సంస్కృతిలో (చైనాలోని ఒకజాతి) ఇలా చేస్తారు. వరుడు పెళ్లికి ముందు ఒక విల్లు తీసుకుని బాణంతో ఎక్కుపెట్టి పెళ్లి కూతురిపైకి బాణం విసురుతారు. ఇప్పటికీ ఆ తెగలో ఇలాంటి ఆచారం కొనసాగుతూనే ఉంది. అయితే బాణాలకు బదులుగా రబ్బరు బుల్లెట్లతో పెళ్తి కూతుర్ని కాల్చుతుంంటారు. ఇలా చేయడం వల్ల తమ జీవితం సాఫీగా సాగుతుందని వారి నమ్మకం.

చాలా సీరియస్ గా ఉండాలి

చాలా సీరియస్ గా ఉండాలి

కాంగోలో వినూత్న సంప్రదాయం ఉంది. పెళ్లి చేసుకోబోయో వాళ్లు అస్సలు నవ్వకూడదు. చాలా సీరియస్ గా ఉండాలి.

టాయ్ లెట్ లోని పానీయం తాగాలి

టాయ్ లెట్ లోని పానీయం తాగాలి

కొత్తగా పెళ్లయిన వారితో టాయిలెట్ లో ఉండే ఒక పానీయాన్ని తాగించే సంప్రదాయం ఫ్రాన్స్ లో ఉండేది. అయితే ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు పాటించడం లేదు. చాక్లెట్, ఛాంపాగ్నే వంటి వాటిని టాయ్ లెట్ లో పోసి తాగిస్తారు.

English summary

weird marriage rituals from around the world

Weird marriage rituals from around the world!
Desktop Bottom Promotion