దెయ్యాలను ఇంట్లోకి ఆహ్వానించటానికి ఆస్కారమిచ్చే వింతైన పద్ధతులు

By: Deepti
Subscribe to Boldsky

ఎలాంటివారైనా ఎంత మనోధైర్యం ఉన్నా, ఆత్మలు, దెయ్యాలంటే కొంత బెరుకు భయంగానే ఉంటుంది. కానీ, కొంతమంది నమ్మనివారు కూడా ఉంటారనుకోండి.

నిరాశాజనకమైన వాతావరణం ఉన్నచోట మీ చుట్టూ దెయ్యాలు, ఆత్మల వంటివి ఆకర్షించబడతాయి.

దెయ్యాలు, ఆత్మలు మనచుట్టూనే ఉంటాయంటారు, తీరని కోరికలు తీర్చుకోడానికో లేదా పగలు తీర్చుకోడానికో మరి!

షాక్: మీ చుట్టూ దెయ్యం తిరుగుతోందని తెలిపే సంకేతాలివే.. !!

మనం తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల ఈ నెగటివ్ శక్తి ఉన్న ఆత్మలు, దెయ్యాలు మన ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తాయి. అలాంటి కొన్నిటిని చూడండి, మీరు షాక్ అవుతారు!

మరణం గూర్చి ఎక్కువ ఆత్రుత

మరణం గూర్చి ఎక్కువ ఆత్రుత

చావు అనే పదం మనల్ని ఎంతో భయపెడుతుంది. మనకి దీని గూర్చి ఆలోచించాలంటే కూడా నచ్చదు. ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ భయపెట్టే ఈ విషయం, నెగటివ్ శక్తిని ఎక్కువ ఆకర్షిస్తుంది. ఎవరైనా మరణం గూర్చి ఎక్కువ ఆలోచిస్తే, వారు ఇలాంటి చెడ్డ వాతావరణాన్ని తమ చుట్టూ ఏర్పర్చుకుంటారు.

నిరాశాజనక వాతావరణం

నిరాశాజనక వాతావరణం

మనం నిరాశ, డిప్రెషన్ లో ఉన్నట్లయితే, మన జీవితం నాశనమైందని, ఏం జరగట్లేదని భావిస్తాం. మనకి జీవించటానికి ప్రేరణ తగ్గి, శాంతి సంతోషాలు పోయి, మన చుట్టూ బలహీనత ఆవరించుకుంటుంది.

మనం ఎంతసేపు ఇదే స్థితిలో ఉంటే అంత నెగటివ్ శక్తి మనచుట్టూ పేరుకుంటుంది. అలానే చెడ్డశక్తులు కూడా. అందుకని నిరాశలో ఉన్నప్పుడు గుర్తుచేసుకోండి మీ అంతట మీరే దెయ్యాలను ఆహ్వానిస్తున్నారని.

డ్రగ్స్ దుర్వినియోగం

డ్రగ్స్ దుర్వినియోగం

డ్రగ్స్ ను వాడుతుండటం మీ జీవితాన్ని, ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది; కానీ దానికన్నా ఎక్కువ మీపై అధిక ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడూ సాధారణంగా డ్రగ్స్ ని వాడే వ్యక్తి చెడ్డ శక్తులతో సంబంధం ఏర్పర్చుకున్నట్టే.

డ్రగ్స్ మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను నాశనం చేసి, ఎంతో బలహీనంగా మార్చి చెడుశక్తులకు ఆలవాలంగా మారుస్తుంది.

మీరు దెయ్యాన్ని చూశారని నిర్ధారించుకోవటానికి 7 గుర్తులు

చేతబడులను చేయటం

చేతబడులను చేయటం

చేతబడులను చేయటం మీ మెదడును అనవసరంగా ఆ తాంత్రిక ప్రపంచంలో ఇరుక్కునేలా చేయటమే. అది అనేక చెడ్డశక్తులను మన ప్రపంచంలోకి వచ్చేట్లా చేస్తుంది. ఈ అభ్యాసం వల్ల, మనుషులు వారి బలహీనతలో ఆత్మలను తప్పకుండా తమ జీవితాలలోకి తెచ్చుకుంటారు.

తంత్ర విద్యలో వేలుపెట్టడం

తంత్ర విద్యలో వేలుపెట్టడం

ఇది స్నేహితులను ఆటపట్టించే, భయపెట్టే ఆటగా మొదలవుతుంది. ఊజా బోర్డు ఆట ఆత్మలను నిజంగానే మీ ప్రపంచంలోకి రప్పించవచ్చు. తాంత్రిక విద్యలలో అనవసరంగా చేతులుపెట్టి, రక్షణలేకుండా ఉండటం చెడ్డఆత్మలను సులువుగా ఆకర్షిస్తుంది. అందుకని, ఈ ఆటను ఆడవద్దు.

చెడ్డఆత్మలు మీ ఇంట్లోకి రాగలిగే ఇతర కారణాలు...

హత్య/ఆత్మహత్య

హత్య/ఆత్మహత్య

మీరు చాలా సినిమాల్లో చూసే వుంటారు, ఒకరు చనిపోయిన ఇల్లు వారి ఆత్మతో వెంటాడబడుతుంది. బలవ్మరణం కానీ, హింసాత్మక చావుకానీ ఒక ప్రదేశంలో నెగటివ్ శక్తిని పెంచివేస్తుంది.

అనేక మరణాలు

అనేక మరణాలు

ఒక ప్రదేశంలో అనేకచావులు జరిగి ఉంటే, అక్కడ అధికమొత్తంలో నెగటివ్ శక్తి ఉన్నట్లే. అలాంటి ప్రదేశం అనేక చెడుశక్తులను ఆహ్వానించే స్థలంగా, వాటికి నివాసంగా మారుతుంది.

చేతబడి

చేతబడి

చేతబడులు జరిగిన ప్రదేశాలలో అత్యంత నెగటివ్ శక్తి ఉంటుంది. దానివల్ల అక్కడకి చెడుశక్తులు వచ్చిచేరే అవకాశం ఉంటుంది. ఎవరైనా వ్యక్తులు ఈ పనులలో పాల్గొంటే, వారు చెడ్డశక్తులకు అయస్కాంతంలా పనిచేసి వాటిని తమతో పాటు, వారు ఉన్నచోట్లకి ఆకర్షిస్తూ పోతారు.

మరలా మరలా వచ్చే నిరాశ

మరలా మరలా వచ్చే నిరాశ

నిరాశ, బలహీనత ఉన్నచోట ఆత్మలు, దెయ్యాలు ఆకర్షింపబడతాయి. నెగటివ్ శక్తి అంత బలంగా ఉంటే, ఎక్కువకాలం ఉంటే, అది మరిన్ని చెడుశక్తులు, రూపాలను ఆకర్షిస్తుంది.

మీరు ఈ పాయింట్లను గుర్తుంచుకుని, ఇవేవీ చేయకుండా జాగ్రత్తపడి, ఎప్పుడూ ఆశాజనకంగా, శాంతి సంతోషాలతో హాయిగా జీవించండి.

English summary

Unknowing Ways Of How You Would Be Inviting Ghosts In Your Home!

Demons and spirits are attracted to certain places and people for certain reasons. Know what are the things that bring them into your house.
Subscribe Newsletter