For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్ ప్రైజ్: మీ పేరులో ఏ లెటర్స్ ఎక్కువ సార్లు రిపీట్ అయితే ఏం జరుగుతుంది..?

|

న్యూమ‌రాల‌జీ గురించి తెలుసు క‌దా..! పేరులో చిన్న మార్పు చేసుకోవ‌డం ద్వారా జీవితంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని న్యూమ‌రాలజిస్టులు చెబుతారు. అందుకు అనుగుణంగానే పేర్ల‌కు అక్ష‌రాలు క‌ల‌ప‌డ‌మో లేదా తీసేయ‌డ‌మో చేస్తారు.

మీ జాతకం ప్రకారం మీ పేరులో అదృష్టం తెలుసుకోవడం ఎలా

అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా దీనికి ద‌గ్గ‌ర‌గానే ఉంటుంది. ఇది కూడా న్యూమ‌రాల‌జీలో ఒక భాగ‌మే. అదేమిటంటే... ఆయా వ్య‌క్తుల పేర్ల‌లో ఉండే ఆంగ్ల అక్ష‌రాలు కొన్ని ఒక్కోసారి రిపీట్ అవుతుంటాయి క‌దా.

What are the effects of repeating alphabets in your name?

ఉదాహ‌ర‌ణ‌కు RAMA అనే పేరు తీసుకుంటే అందులో A అక్ష‌రం రెండు సార్లు రిపీట్ అయింది క‌దా. అయితే అలా ఏ అక్ష‌ర‌మైనా ఒక‌టి క‌న్నా ఎక్కువ సార్లు రిపీట్ అయ్యేలా ఎవ‌రైనా పేరు క‌లిగి ఉంటే అప్పుడు ఆయా అక్ష‌రాల‌ను బ‌ట్టి ఎవ‌రెవ‌రికి ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

A, I, J, Q, Y

A, I, J, Q, Y

ఈ అక్షరాల్లో ఏదైనా ఒక అక్ష‌రం వ్యక్తి పేరులో రెండుసార్ల క‌న్నా ఎక్కువగా రిపీట్ అయితే వాళ్లు చాలా ధైర్యవంతులు, చాలా శక్తిమంతులుగా ఉంటారు. అలాగే డామినేట్ చేసే స్వభావం కలిగి ఉంటారు. డబ్బు, పవర్ అంటే వీళ్లకు చాలా క్రేజ్ ఉంటుంది. స్వతంత్రత, ఫ్రీడమ్, ఉన్నత స్థానం కోసం ఆరాటపడుతుంటారు.

B,K,R

B,K,R

ఎవరైనా తమ పేరులో B,K,R అనే అక్షరాలు ఒకసారి కంటే ఎక్కువసార్లు కలిగి ఉంటే వాళ్లు చాలా సున్నిత మనస్తత్వం క‌లిగి ఉంటారు. వీరు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. పిరికితనం, కళాత్మక నైపుణ్యం కలిగి ఉంటారు. అలాగే వీరికి చాలా ఓర్పు ఉంటుంది.

C, G, L, S

C, G, L, S

ఈ అక్షరాల ఎవరి పేరులోనైనా పునరావృతం అయితే వాళ్లు చాలా ఇమాజినేటివ్ పవర్ కలిగి ఉంటారు. అలాగే తెలివైనవాళ్లు కూడా. వీళ్లకు మ్యూజిక్, ఆర్ట్, బిజినెస్ వంటి రకరకాల వాటిల్లో టాలెంట్ ఉంటుంది. అలాగే కాస్త స్వార్థం, ఏకాగ్రత తగ్గడం, క్రమశిక్షణ కోల్పోవడం వంటి లక్షణాలుంటాయి.

U, V, W

U, V, W

ఈ అక్షరాలు పేరులో రిపీట్ అయి ఉండే వాళ్లు చాలా టాలెంట్ కలిగి ఉంటారు. వీళ్లలో మానవతాసిద్ధాంతం, బాధ్యత, సహాయ గుణం ఉంటుంది. అలాగే ఔటింగ్స్, ట్రావెల్స్, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే ఆసక్తి ఉంటుంది.

D, M, T

D, M, T

ఈ అక్షరాలు ఒక‌టి అంత‌కన్నా ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే పేరు క‌ల వారు చాలా కష్టపడి పనిచేసే తత్వం క‌లిగి ఉంటారు. వ్యాపారాలను మరింత విస్తరిస్తారు. ఆర్థికస్థితిగతులు, ఆస్థుల బాధ్యతలను బంధువులకు అప్పగిస్తారు.

O, Z

O, Z

పేరులో O, Z అక్షరాలు రెండు అంతకంటే ఎక్కువగా సార్లు వ‌స్తే వారు జాగ్రత్తగా ఆలోచించి, పరిశీలించే, అధ్యయనాలు చేసే తత్వం కలిగి ఉంటారు. సమస్యలకు, బంధువులకు దూరంగా ఉంటారు.

P, F

P, F

పేరులో P, F అక్షరాలు రిపీట్ అయితే వారు వ్యాపారంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పవర్ పెరుగుతుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే బిజినెస్ పరంగా ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

E, H, N, X

E, H, N, X

ఎవరి పేరులోనైనా E, H, N, X అక్షరాలు ఒకటికంటే ఎక్కువ సార్లు రిపీట్ అయితే వారు లీగల్, పబ్లిక్ వర్క్స్ లేదా సేల్స్ లో సక్సెస్ అవుతారు. ప్రమోషన్స్ సాధిస్తారు. ఒకవేళ ఈ అక్షరాలు ఏడుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు పునరావృతం అయితే వారి లైఫ్ యావరేజ్ గా ఉంటుంది. డ్రింక్స్, ఫుడ్స్, సెక్స్ కి బానిసలవుతారు. సమస్యలు, కుటుంబం పట్ల బాధ్యత లేకుండా వ్యహరిస్తారు.

English summary

What are the effects of repeating alphabets in your name?

Every alphabet carries a different vibration related to its corresponding number and the placement of each alphabet in a name determines the kind of influence it has on anyone's name. Similarly, the repetition of specific letters in a name creates positive and negative characteristics of the person having the name.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more