మీరు మరణించిన తర్వాత మీ శరీరానికి ఏమవుతుందో తెలుసా ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మనలో చాలా మంది మన జీవితం గురించే ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు, ఆలోచిస్తుంటారు. కానీ, మరణం తర్వాత అంతకు మించిన ఎన్నో విషయాలు జరుగుతాయి. ఇది వినడానికి కొద్దిగా వింతగా ఉండవచ్చు కానీ ఖచ్చితంగా చాలా మనోహరమైనది. మరణించిన తర్వాత జరిగే గగుర్పాటు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మన లోపలి అవయవాలు ద్రవీకరించబడతాయి (కరిగిపోతాయి ) మరియు అంగస్తంభన కూడా జరుగుతుంది. వినడానికి చాలా చిత్రంగా ఉంది కదా!

మీరు మరణించబోతున్నరని తెలిపే లక్షణాలు

ఒకసారి మన గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది మన శరీరంలో వచ్చే మార్పులు ఏమిటి ? మరణించిన తర్వాత మన శరీరం స్థితి ఏమిటి ? ఇళ్ల ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. మరణించిన శరీరం బాధతో మూలుగుతుంది :

1. మరణించిన శరీరం బాధతో మూలుగుతుంది :

ఇది వినడానికి చాలా గగుర్పాటు కలిగిస్తోంది కదా ? కానీ అలా జరిగే అవకాశం ఉంది. మరణించిన తర్వాత వచ్చే శబ్దాలు ఏవైతే ఉన్నాయో, ఈ సంఘటనలు ఫోరెన్సిక్ నిపుణులను కూడా బయపెడతాయి. చనిపోయినవారి స్వర పేటిక బాగా బిగుతు అయిపోవడం మరియు పొట్టలో ఉండే సూక్ష్మ జీవులు విడుదల చేసే వాయువు ఈ రెండిటి కలయిక వల్ల మరణించిన శరీరాలు కీచుమని అరుస్తాయి, మరి కొన్నిసార్లు బాధ తో మూలుగుతాయి.

2. శరీరం రంగు మారిపోవడం మొదలవుతుంది :

2. శరీరం రంగు మారిపోవడం మొదలవుతుంది :

రక్తప్రసరణ అనూహ్యంగా ఆగిపోవడంతో మరణించిన శరీరాల రంగు మారడం మొదలవుతుంది. శరీరం కొద్దిగా ఊదా-ఎరుపు కలయికలో గల రంగు లేదా నీలంతో కూడిన ఊదా రంగును సంతరించుకుంటాయి. ఎందుకంటే, గురుత్వాకర్షణ శక్తి వల్ల శరీరంలో ఉన్న రక్తం అంతా శరీర అడుగు భాగాలకు చేరిపోతుంది. దీంతో శరీరంలోని మిగతా అవయవాల రంగు పాలిపోయినట్లు తయారవుతుంది. ఎందుచేతనంటే రక్తం ఆయా ప్రదేశంలో తక్కువగా ఉండొచ్చు లేదా అస్సలు లేకపోవచ్చు. వీటి ఆధారంగానే ఫోరెన్సిక్ నిపుణులు మరణం ఎప్పుడు సంభవించింది, ఎప్పుడు ఆ వ్యక్తి మరణించాడు అనే విషయాన్ని కనుగొంటారు.

3. శరీరం బిగుతుగా తయారవుతుంది :

3. శరీరం బిగుతుగా తయారవుతుంది :

కను రెప్పలు మరియు మెడ దగ్గర ఉండే కండరాల నుండి ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఇలా మొదలైన ఈ ప్రక్రియ శరీరం అంత వ్యాప్తి చెందడంతో మరణించిన శరీరం బిగుతుగా తయారైపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, మాములుగా మన శరీరంలోని కండరాలు బిగుతుగా మారిన తర్వాత అవి మళ్ళీ సాధారణ స్థితికి చేరుకోవడానికి అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ అనే రసాయనం ఎంతగానో తోడ్పడుతుంది. కానీ, మరణించిన వారిలో ఈ రసాయన ఉత్పత్తి ఆగిపోవడంతో క్రమంగా ఆ రసాయన శాతం తగ్గిపోతుంది, అందువల్ల శరీరం బిగుతుగా మారిపోతుంది.

4. మరణించిన పురుషుల శరీరాల్లో అంగస్తంభన కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి :

4. మరణించిన పురుషుల శరీరాల్లో అంగస్తంభన కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి :

మరణించిన తర్వాత శరీరంలో రక్తం అడుగుభాగాలకు చేరడం ప్రారంభమవుతుంది మరియు కండరాలు ముడుచుకుపోతాయి మరియు వొంగిపోతాయి. ఈ రకరకాల ప్రక్రియలు మరణించిన శరీరంలో చోటు చేసుకుంటున్న క్రమంలో అంగస్తంభన కూడా జరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా శరీరంలో ఎప్పుడైతే కండరాలన్నీ ముడుచుకుపోతాయో అటువంటి సమయంలో మరణించిన శరీరం అయినప్పటికీ స్కలించే అవకాశమా ఉంది.

5. మరణించిన శరీరాల్లో కండరాలు హఠాత్తుగా లాగుతాయి :

5. మరణించిన శరీరాల్లో కండరాలు హఠాత్తుగా లాగుతాయి :

ఎప్పుడైతే కండరాల కణజాలాలు మరణిస్తాయో, ఇక అప్పటి నుండి కండరాలు ముడుచుకోవడం మొదలవుతుంది. సాధ్యమైనంతవరకు కండరాలు ముడుచుకున్న తర్వాత, ఆ సమయంలో కండరాలు లాగుతున్నాయి లేదా వంగిపోయాయి అనే విషయం చూసేవారికి స్పష్టంగా కనపడుతుంది. అటువంటి సమయంలో మరణించిన శవం మళ్ళీ మెళుకువలోకి రావడానికి ప్రయత్నిస్తుందా అనిపిస్తుంది. ఈ సంఘటన చూడటానికి భయం గొలిపే విధంగా ఉంటుంది.

6. మరణించిన శరీరం మూత్ర మరియు మల విసర్జన చేస్తుంది :

6. మరణించిన శరీరం మూత్ర మరియు మల విసర్జన చేస్తుంది :

మరణించక ముందు మన మెదడు అన్ని విషయాలను తన అధీనంలో ఉంచుకుంటుంది. ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అనే విజ్ఞతను మన శరీరం ప్రదర్శించేలా చేస్తుంది. ఎప్పుడైతే మరణం సంభవిస్తుందో ఆ సమయంలో మెదడు పని తీరు ఆగిపోతుంది. అప్పుడు మన శరీరంలోని నవ రంద్రాళ్ళు ఒక్కసారిగా విచ్చుకుంటాయి. మెదడు అధీనం నుండి శరీరం ఒక్కసారిగా బయటపడుతుంది. ఈ సమయంలో మరణించిన శరీరాలు మూత్ర మరియు మల విసర్జన చేస్తాయి. ఇలాంటి విషయాలను చూసి మాములుగా అందరూ కొద్దిగా ఆందోళన లేదా ఒక విధమైన భావనకు లోనవుతారు. కానీ, ఇవన్నీ సహజంగా మరణించిన శరీరంలో జరిగే ప్రక్రియలు అని గుర్తుపెట్టుకోండి.

7. కళ్ళు విపరీతంగా ఉబ్బుతాయి మరియు నాలుక వాచిపోతుంది :

7. కళ్ళు విపరీతంగా ఉబ్బుతాయి మరియు నాలుక వాచిపోతుంది :

మరణించిన శరీరంలో ప్రేగుల నుండి ఒక రకమైన వాయువు విడుదలవుతుంది మరియు శరీర అవయవాలు కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది. ఇందువల్ల కూడా శరీరంలో వాయువులు విడుదలవుతాయి. ఈ రెండు ప్రక్రియల వల్ల కళ్ళు ఉబ్బిపోయి బయటకు వచ్చేస్తాయి మరియు నాలుక విపరీతంగా వాచిపోయి సాగి లోపల నుండి బయటకు వచ్చేస్తుంది.

8. అవయవాలు కరిగిపోవడం మొదలవుతుంది :

8. అవయవాలు కరిగిపోవడం మొదలవుతుంది :

ఎప్పుడైతే మరణించిన తర్వాత శరీరంలో ప్రక్రియలన్నీ ఆగిపోతాయో, అటువంటి సమయంలో ప్రోటీన్లు కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది. ఇందువల్ల కణాల యొక్క గోడలు మెల్లగా అంతరించిపోవడం ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ వల్ల శరీరం లోపల ఉన్న చాలా అవయవాలు కరిగిపోతాయి. దీంతో శరీరమంతా ఎదో ద్రవంతో నింపినట్లు, లోపల ఎదో వాయువు ఉన్నట్లు తయారవుతుంది. అంతే కాకుండా మరణించిన శరీరాలను చూసేవారికి అవి ఉబ్బిపోయి అనే భావన కలుగుతుంది.

9. మరణించిన శరీరం పేలిపోయే అవకాశం ఉంది :

9. మరణించిన శరీరం పేలిపోయే అవకాశం ఉంది :

మరణించిన శరీరం లోపల ఉండే ప్రేగుల నుండి వాయువులు అలా విడుదలవుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ వాయువులకు ఎటూ వెళ్ళడానికి అవకాశమా దొరకదో, ఇక అప్పటి నుండి మరణించిన శరీరంలో ఉబ్బరం మొదలవుతుంది. ఇది క్రమంగా పేలుడికి దారితీస్తుంది. మనమందరం ఆ దేవుడికి కృతఙ్ఞతలు చెప్పాలి ఎందుకంటే మనలో చాలా మంది ఫోరెన్సిక్ డాక్టర్స్ కాదు కాబట్టి.

10. తనంతట తానుగా చర్మం కండరాల నుండి వీడిపోతుంది:

10. తనంతట తానుగా చర్మం కండరాల నుండి వీడిపోతుంది:

ఎప్పుడైతే శరీరంలో వివిధరకాల వాయువులు ఒకదాని తర్వాత ఒకటి విడుదలవ్వడం మొదలవుతుందో అటువంటి సమయంలో చర్మం వదులుగా తయారవుతుంది. కండరాలు మరియు ఎముకల నుండి తనంతట తానుగా చర్మం వీడిపోతుంది. కానీ, చర్మపు కణాలు మాత్రం బ్రతికే ఉంటాయి. ఎందుచేతనంటే, అవి బాహ్య ప్రపంచంతో పరిచయం ఏర్పరుచుకున్నాయి, అవి బయట ప్రపంచం పై ఆధార పది జీవిస్తాయి కాబట్టి. ఇందువల్ల శరీరం మరణించినా కూడా చాలా రోజుల వరకు చర్మపు కణాలు బ్రతికే ఉంటాయి.

పైన చెప్పబడిన సంగతులన్నీ మిమ్మల్ని అంతగా గగుర్పాటుకు గురిచేయలేదు అని మీరు గనుక భావిస్తే శవపేటిక జన్మ అనే విషయం ఒకటి ఉంది. ఇందులో, గర్భవతి అయిన మహిళ ఒక వేళ మరణిస్తే, అటువంటి సమయంలో పొట్టలోపల వాయువులు విడుదలవ్వడం వల్ల యోని దగ్గర ఉన్న కండరాలు ఒక్క సారిగా విశ్రాంతి తీసుకోవడంతో గర్భంలోని పిండం బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ విన్న తర్వాత చాలా మందికి రాత్రి నిద్రపట్టకపోవచ్చు.

English summary

What Happens To Your Body After You Die

While most of us are only concerned about life, there is more that happens after death. It might be a bit grotesque, but definitely fascinating. Here are some of the creepiest things that happen to our bodies after we die, including liquefaction of our internal organs and even erection! Say what?
Story first published: Saturday, September 16, 2017, 20:00 [IST]
Subscribe Newsletter