2017 పూర్తి అయ్యేలోపు ఈ రాశుల వారు ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన పనులు:

By: Mallikarjuna
Subscribe to Boldsky

2017 దాదాపు పూర్తి కావస్తోంది. చాలామంది ఎన్నో పనులు ఈ సంవత్సరం చేయాలని కలలు కని ఉంటారు, ఎన్నో చేయాలని నిశ్చయించుకొని ఉంటారు. కొంతమంది సాధించి ఉండవచ్చు, మరికొంత మంది ఇంకా ఆ లక్ష్యాలను చేరుకోకపోయి ఉండొచ్చు.

కొన్నింటిని చూసి చూసినట్లు వదిలివేయడం ఒక కళ. మీరు ఎంతో గట్టిగా అనుకుంటేనే మీరు కొన్ని విషయాలను సులభంగా వదిలివేయగలరు. మీ రాశి ప్రకారం వదిలివేయవల్సిన విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం :

మేషం :

మేషరాశి వారు దాదాపు అన్నింటిలో ఉత్తమంగా ఉంటారు. అది వారి యొక్క గుణం. అయితే కొన్ని సందర్భాల్లో చతికిల పడే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో వాటిని మరీ ఎక్కువగా మనస్సుకు తీసుకోకుండా వదిలివేయాలి. ప్రతిసారి మీరే మొదటి స్థానం లో ఉండాలి అనే భావనను మీ మనస్సు నుండి తీసివేయండి. మీరు కూడా మనుష్యులే అని గుర్తించండి. కాబట్టి పరాజయాలు మరియు పరాభవాలు తప్పవు అని గుర్తెరగండి. ఈ అపజయాలు మీ విజయాలకు పునాదులుగా నిలుస్తాయని గుర్తుపెట్టుకోండి.

వృషభం :

వృషభం :

వృషభరాశి వారు చాలా పద్దతిగా వ్యవహరిస్తారు. కానీ భూమి లక్షణం ప్రకారం, వారు ఇతరుల పై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అయితే వాళ్ళు అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అన్ని సందర్భాల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి లేదా ఉంటాయి అని అనుకోకండి. దీనికి తోడు అప్పుడప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మీరు ఎప్పుడూ సరైన మార్గంలోనే పయనిస్తున్నారు అని అనుకోకండి లేదా ఎప్పుడూ మీదే పై చేయాలి కావాలని భావించకండి. మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా మరీ ఎక్కువగా ఒత్తిడికి గురిచేసుకోకుండా సాధారణంగా వ్యవహరించండి.

మిథునం :

మిథునం :

ఎదో చాలా అతిముఖ్యమైన దానిని కోల్పోతున్నాం అనే భావన మిథునరాశి వారిలో ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఈ రాశి వారు మొట్టమొదట చేయవల్సిన పని ఏమిటంటే ఆ భయాన్ని విడనాడాలి. వీళ్ళు అన్ని చోట్ల తాము ఉండాలని భావిస్తారు కానీ అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో అక్కడ ఉండటం అనేది జరగని పని. అందుచేత ఇలాంటి ఆలోచనలు తగ్గించి కొన్ని అవకాశాలు చేజారినా లేదా మంచి సందర్భాలు లేకపోయినా వాటిని స్వీకరించడం నేర్చుకోండి. మరొక అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

కర్కాటకం :

కర్కాటకం :

2017 ప్రకారం కర్కాటక రాసి వారు సంబంధ బాంధవ్యాలను సంరక్షించుకొనే విషయంలో చివరి క్షణం వరకు ఎదురు చూస్తారు. కానీ, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, జీవితంలో కొన్ని సంబంధ బాంధవ్యాలను పోగొట్టుకున్నప్పుడు వాటిని అక్కడే విడిచి జీవితాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. చాల కొద్దిమందితో మరియు తక్కువ సందర్భాల్లో మాత్రమే సౌకర్యవంతంగా ఉన్నట్లు మీరు భావిస్తారు. కానీ, ఎప్పుడైతే ఆలా జరుగుతుందో వారి కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడతారు. అయితే అన్ని సంబంధ భాందవ్యాలు చివరి వరకు నిలుస్తాయి అని అనుకోకండి. ఒకవేళ మధ్యలోనే వెళ్ళిపోయినా ఆ విషయాన్ని అంగీకరించి అందులో నుండి ఎదో ఒకటి నేర్చుకొని జీవితాన్ని ముందుకు సాగించండి.

సింహం :

సింహం :

ఏ విషయంలోనైనా అందరి దృష్టి తమ పైనే ఉండాలని సింహరాశి వారు భావిస్తారు. అంతేకాకుండా చుట్టూ ఉన్న వ్యక్తులను ఆకట్టుకొనే శక్తి వీళ్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కొంతమంది వ్యక్తులు ఈ విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకొనే అవకాశం ఉంది. కాబట్టి, దీనిని అర్ధం చేసుకొని ముందుకు నడవాలి. కొన్ని సార్లు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. ప్రతిసారి ప్రతి ఒక్కరిని ఆనందపరచడం సాధ్యమయ్యే విషయం కాదని మీరు గుర్తుపెట్టుకోండి.

కన్య :

కన్య :

అప్పుడప్పుడు మీరు పెట్టే శక్తి సామర్ధ్యాల కంటే కూడా ఫలితాలు కొద్దిగా తక్కువ రావొచ్చు. ప్రతిదీ ఖచ్చితత్వంతోనే చేయాలి అనే విషయాన్ని మీ మెదడు నుండి పక్కన పెట్టండి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఖచ్చితత్వంతో ఉండరు అని గుర్తుపెట్టుకోండి. అసంపూర్ణంగా పూర్తయిన పనులు మీరు ఎదగడానికి అవకాశాన్ని ఇస్తాయి. కాబట్టి ప్రతి విషయంలో ఖచ్చితత్వంతో వ్యవహరించాలి అనే ఆలోచనను పక్కనపెట్టండి.

తుల :

తుల :

మీ ఆనందం వ్యక్తుల పై ఆధారపడి ఉండదు. కాబట్టి మీరు ఏకాంతంగా ఉన్నారు అనే భయాన్ని విడిచిపెట్టండి. మీరు ఆనందంగా ఉండాలంటే వ్యక్తులే అవసరం లేదు. మీరు ఏకాంతంగా అప్పుడప్పుడు గడిపినా ఎటువంటి నష్టం లేదని, అది మంచి చేస్తుందని గుర్తించండి. అలా చేయడం ద్వారా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడమో లేదా ఎదో కోల్పోతాను అనే భావనను పక్కన పెట్టండి. తులారాశి వారు వ్యక్తిగతంగా తమకు తాము సమయాన్ని కేటాయించుకొని ఏకాంతంగా గడపటానికి ప్రయత్నించండి. మీకు నచ్చినట్లు వ్యవహరించండి.

వృశ్చికం :

వృశ్చికం :

మీరు మీ మనస్సు చెప్పినట్లే నడుచుకుంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో వ్యక్తులు మీ మాటలను జవదాటి వెళ్లిపోతుంటారు. మీరు ఎంతో అలోచించి మంచి వ్యక్తులను ఎంపిక చేసుకోవడం లో నేర్పరులు అయినప్పటికీ, వారు కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా వ్యవహరిస్తుంటారు. వ్యక్తులను ఎంచుకొనే విషయంలో మీరు తప్పుచేసినా బాధపడకండి. అటువంటి వాటిని విడిచి పెట్టి జీవితాన్ని ముందుకు సాగించండి.

ధనస్సు :

ధనస్సు :

మీరు వ్యక్తిగతంగా ఎంతో సాహసోపేతమైన వ్యక్తులు. ఈ గుణం వల్లనే మీ జీవితం ఎంతో ఆనందంగా మరియు విలువతో కూడిన జీవితాన్ని అనుభవిస్తారు. మీరు దూరంగా ఉన్నప్పుడు వేటినైతే కోల్పోయారో వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లండి. మీరు సాహసోపేతమైన యాత్రలో ఉన్నప్పుడు కొన్నింటిని కోల్పోయి ఉండవచ్చు. కానీ, అందుకు చింతించకండి. ఎందుకంటే, ఈ రెండు విభిన్న ప్రపంచాలలో ఉత్తమమైనవి అన్నీ ఒకేసారి మీకే సొంతం అవ్వాలంటే అది కుదరదు అనే విషయాన్ని గుర్తించండి.

మకరం :

మకరం :

మకరరాశి వారు మౌనంగా మరియు కూర్చిన వైఖరి గల వ్యక్తులు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే వీరు వారి యొక్క భావోద్వేగాల బయటపెడుతుంటారు. అయితే మిమ్మల్ని నియంత్రిస్తున్న లోపల వ్యక్తిని వదిలివేయాలి మరియు అప్పుడున్న సందర్భాన్ని బట్టి వ్యవరించే విధంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా పెంపొందించుకోవచ్చు.

కుంభం:

కుంభం:

వీరు వాగ్థానాలు బాగా చేస్తారు, కానీ అన్ని బ్రేక్ చేస్తుంటారు. కాబట్టి, వీరు ఈ సంవత్సరంలో ఏఏ కోరికలు, వాగ్థానాలు తీర్చుకోవాలని కోరుకుంటున్నారో, వాటిని తప్పనిసరిగా తీర్చుకోవాలి. అంతే అందరికీ కాదు, మీకు నచ్చిన వారి కోరికలు తీర్చడం, మీ కోరికలు తీర్చుకోవడం ఉత్తమం.

మీనం :

మీనం :

వ్యక్తులు చాలా సందర్భాల్లో వాగ్దానాలు చేస్తుంటారు. కానీ, వాటిని నిలబెట్టుకునే విధంగా పనులు చేయరు. ఇలా తరచూ ఆయా వ్యక్తులు చేసిన వాగ్దానాలను మరచి ప్రవర్తించినా, అటువంటి వాటి గురించి మరీ ఎక్కువగా ఆలోచించకండి. ప్రతి ఒక్క వ్యక్తి తాను చేసిన వాగ్దానం పై నిలబడాలని, వారు చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలని, అందరూ నిబద్దత కలవారు ఉంటారని అనుకోకండి. ఇటువంటి వ్యక్తులు ఎదురైనప్పుడు వాటిని అధిగమించి మనం ముందుకు సాగవల్సిన అవసరం ఉంది.

English summary

What you need to do before the end of 2017 based on your Zodiac Sign

What you need to do before the end of 2017 based on your Zodiac Sign. Read to know more about..
Story first published: Wednesday, December 13, 2017, 9:00 [IST]
Subscribe Newsletter