మీరు ఇష్టపడే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ మీ గురించి ఏం చెబుతుంది?

Posted By:
Subscribe to Boldsky

జీవితంలో ఏదో ఒక సమయంలో మనిషి తప్పకుండా జాతకాన్ని నమ్ముతాడు. తాను ఎలా ఉండబోతున్నాను. తన జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతున్నది. తన భవిష్యత్తు బాగుంటుందా లేక ఎలా ఉంటుంది. బాగుంటే ఎలా ఉండబోతున్నది. బాగాలేకపొతే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి మొదలైన వాటి తెలుసుకోవాలని మనిషి కుతూహలపడుతుంటాడు. మనిషికున్న కుతూహలాన్ని అడ్డంపెట్టుకొని జాతకాలు చెప్పేవారు పెరిగిపోయారు. దీంతో ఇప్పుడు వీధికొక్క జ్యోతిష్యాలయం ఏర్పడింది.

ఐస్ క్రీమ్

మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించేందుకు ఇన్నాళ్లు జాతకాలు, పంచాంగాలు చూసేవారు. అయితే, ఇష్టమైన ఐస్‌ క్రీం ఫ్లేవర్‌ ఏమిటో చెబితే వారు ఎలాంటివారో తెలిసిపోతుందట. చేయి చూసో, ముఖం చూసో కాకుండా, మనిషి తన ఇష్టమైన అలవాట్లను బట్టి కూడా అతని భవిష్యత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్నది. మరి మీరు ఇష్టపడే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ను బట్టి మీరు ఎలాంటి వారో చూద్దాం.

చాక్లెట్ ఫ్లేవర్ :

చాక్లెట్ ఫ్లేవర్ :

ఈ ఫ్లేవర్ ను ఇష్టపడే వారు తనకు మించిన వారు లేరు అనే విధంగా భావిస్తారు. ఎప్పుడు అందంగా, స్మార్ట్ గా ఉండేందుకు ఇష్టపడతారు.

వెనీలా ఫ్లేవర్ :

వెనీలా ఫ్లేవర్ :

కొత్త ప్రయోగాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. జీవితంలో ఇంకేదో సాధించాలనే తాపత్రయంతో ఉంటారు.

స్ట్రాబెర్రీ ఫ్లేవర్ :

స్ట్రాబెర్రీ ఫ్లేవర్ :

ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. ప్రపంచంతో సంబంధం లేకుండా, తనపని తాను చేసుకుంటూ, తనకు ఇష్టమైన నేతను అనుసరిస్తూ ఉంటారట.

కాఫీ ఫ్లేవర్ :

కాఫీ ఫ్లేవర్ :

ఈ ఫ్లేవర్ ను ఇష్టపడే వారు కొత్త పనులను మొదలుపెట్టేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే, పనులను పూర్తిచేయడంలో మాత్రం అలసత్యం చూపిస్తారు.

బటర్ స్కాచ్ :

బటర్ స్కాచ్ :

బటర్ స్కాచ్ ఇష్టపడుతున్నట్లయితే, తోటివారందరితో పోలిస్తే, కనీసం ఒక్కసారన్నా బెస్ట్ అనిపించుకుంటారట. హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారట.

మింట్ చాక్లెట్ చిప్

మింట్ చాక్లెట్ చిప్

మింట్ చాక్లెట్ ఫ్లేవర్ ను ఇష్టపడే వారు ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటారు. నమ్మకస్తులుగా ఉంటారు. అంతే కాదు, ఆర్థక వ్యవహారాలను చాలా అద్భుతంగా చక్కదిద్దుతారు .

కాస్టా ఫ్లేవర్

కాస్టా ఫ్లేవర్

ఈ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ను ఇష్టపడే వారు చాలా చాలా చురుకుగా ఉంటారు. ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగి ఉండి, చాలెంజింగ్ గా ఉంటారు. ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

చాక్లెట్ చిప్ :

చాక్లెట్ చిప్ :

ఈ చాక్లెట్ ఫ్లేవర్ ను ఇష్టపడే వారు చాలా ఉదార స్వభావం కలిగి ఉంటారు. అన్ని విషయాల్లో సమర్థవంతంగా ఉంటారు

English summary

What Your Favourite Ice Cream Says About You?

Your favourite ice cream colour says a lot about you. There are various ice cream flavours available in the market these days. But here we will discuss only about the most popular ones.
Subscribe Newsletter