వీళ్ల‌ల్లో య‌వ్వ‌నంగా ఎవ‌రు క‌నిపిస్తున్నారు? మీ ఎంపిక చాలా కీల‌కం!

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

కొత్త ర‌క‌మైన ప‌ర్స‌నాలిటీ టెస్ట్‌ను ప్ర‌యోగానికి సిద్ధ‌మా? మీ గురించి మీరు తెలుసుకోవ‌డానికి ఇదే స‌దావ‌కాశం. చాలా మందికి ప‌ర్స‌నాలిటీ టెస్ట్‌లంటే శ్ర‌ద్ధ చూపిస్తారు. త‌మ‌ గురించి స్వ‌యంగా తెలుసుకోవ‌డానికి ఇదే మంచి అవ‌కాశం.

ఇక్క‌డ క‌నిపించే చిత్రాల్లో ఉన్న మూడు బొమ్మ‌ల‌ను చూసి ఏది య‌వ్వ‌నంగా క‌నిపిస్తుందో చెప్పండి! మీ అభిప్రాయాన్ని త‌ర్వాత మార్చుకోవ‌ద్దు.

personality tests

ఇప్పుడు మీరు అనుకున్న అభిప్రాయం ప్ర‌కారం మీ మ‌న‌సులో ప్ర‌తిఫ‌లించే వాటిని తెలుసుకుందాం. మీలో దాగి ఉన్న అంత‌ర్గ‌త శ‌క్తుల గురించి తెలుసుకోవ‌చ్చు.

తొలి బొమ్మ‌ను ఎంచుకుంటే ...

తొలి బొమ్మ‌ను ఎంచుకుంటే ...

ఈ బొమ్మ‌ను ఎంచుకున్న 35శాతం మందిలో మీరు ఉంటారు. మీరు ఊహ‌జ‌నిత ఆలోచ‌నాప‌రులు. అంటే మీ య‌ధాలాప ఆలోచ‌న‌లే మీ గుణాల‌ను విశ్లేషిస్తాయి. సాధార‌ణంగా మీరు త‌ప్పు చేయ‌రు. మీరు ఏ ప‌నిచేసినా విజ‌య‌వంత‌మ‌వుతారు. మ‌రో వైపు జీవితాన్ని ఎలా ఉంటే అలా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ప్ర‌తి స‌న్నివేశంలో బుర్ర ఉప‌యోగించ‌రు. ఇది మీకు చిక్కుల‌ను తెచ్చిపెట్ట‌గ‌ల‌దు.

రెండో బొమ్మ‌ను ఎంచుకుంటే...

రెండో బొమ్మ‌ను ఎంచుకుంటే...

ప్ర‌తి 10 మందిలో 4గురు ఈ బొమ్మ‌ను ఎంచుకున్న‌వాళ్ల‌లో ఉంటారు. క్లిష్టంగా ఆలోచించే మ‌న‌స్త‌త్వం మీది. ఏ విష‌యానికి సంబంధించైనా మంచి చెడులు మీకు బాగా తెలుస్తాయి.

ఒక ముఖ్య‌మైన నిర్ణ‌యం తీసుకోవ‌డానికి మీరు చాలా స‌మ‌యం తీసుకుంటారు. మిగ‌తావాళ్ల‌కు మీరు అంత స్నేహ‌పూర్వ‌క వ్య‌క్తిగా క‌నిపించ‌కపోయినా మిమ్మ‌ల్ని ఇష్ట‌ప‌డేవారిని మాత్రం ప్రాణంగా చూసుకుంటారు.

మూడో బొమ్మ‌ను ఎంచుకున్న‌ట్ట‌యితే...

మూడో బొమ్మ‌ను ఎంచుకున్న‌ట్ట‌యితే...

ఈ బొమ్మ‌ను ఎంచుకున్న 25శాతం మందిలో మీరు ఒకరు. ఇది ఎంచుకున్నందుకు మీరు లాజిక‌ల్ గా ఆలోచించే వ్య‌క్తి అయి ఉండాలి. జీవితంలో ఏమైనా సమ‌స్య‌లు ఎదురైతే మీ విశ్లేష‌ణా శ‌క్తితో వాటిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తారు. మీకు ప్రాణ‌ప్ర‌దంగా ఉండే స్నేహితులు ప్ర‌తి సంద‌ర్భంలోనూ మిమ్మ‌ల్ని తేజోవంతులుగా చూస్తారు!

ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన న‌మ్మ‌కాల గురించి మ‌రింత చ‌ద‌వాల‌నుందా?

ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన న‌మ్మ‌కాల గురించి మ‌రింత చ‌ద‌వాల‌నుందా?

ఐతే మా సెక్ష‌న్ ను అప్పుడ‌ప్పుడు ద‌ర్శించండి. ఆస‌క్తిక‌ర‌మైన క్విజ్‌లు, ఇలాంటి వ్య‌క్తిత్వ ప‌రీక్ష‌లు బోలెడు రానున్నాయి.

English summary

Which Figure Do You Think Is The Youngest

There are several tests that help us analyse about our personality. Many of these tests help people to better know about their inner world and the hidden skills that they are unaware of.
Story first published: Saturday, December 16, 2017, 20:00 [IST]