క్యాష్ గిప్ట్ గా ఇచ్చేటప్పుడు రూ.100కి + రూ.1 చేర్చి ఇస్తుంటారు ఎందుకో తెలుసా..?

Posted By:
Subscribe to Boldsky

ప్రపంచంలో ఏ మూలనైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు బహుమతులు ఇవ్వడం ఎప్పటి నుంచో వస్తున్న అలవాటే. పెళ్లిళ్లు, జ‌న్మ‌దినోత్స‌వాలు, రిసెప్ష‌న్లు... అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వేడుకలు జరుపుకుంటారు.

While gifting cash why do we add that extra Rs. 1..?

బహుమతులు ఇవ్వడం కుదరకపోతే కొందరు డబ్బుని బహుమతిగా ఇస్తారు. అలాగే మన దేశంలో... అది కూడా హిందువులలో ఓ వింత అలవాటు ఉంది. బహుమతిగా ఎంత డబ్బు ఇచ్చినా.. ఆ మొత్తానికి ఓ రూపాయి జోడించి ఇస్తారు. అంటే రూ.51, రూ.101, రూ.201, రూ.501, రూ.1001 ఇలా ఇస్తారు.

While gifting cash why do we add that extra Rs. 1..?

కొంద‌రైతే శుభకార్యాలు కాక‌పోయినా త‌మ‌కు రావ‌ల్సిన డ‌బ్బుల‌ను కూడా ఇదే రీతిలో ఒక రూపాయి క‌లిపి మ‌రీ తీసుకుంటారు. ఇంత‌కీ... అస‌లు ఇలా డ‌బ్బుకు రూ.1 క‌లిపి ఎందుకు ఇస్తారో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం....

సున్నా వ‌చ్చేలా డ‌బ్బు రౌండ్ ఫిగ‌ర్‌ తో ఇస్తే..

సున్నా వ‌చ్చేలా డ‌బ్బు రౌండ్ ఫిగ‌ర్‌ తో ఇస్తే..

రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.1000 ఈ మొత్తాల్లో అంకెల చివ‌రికి సున్నాలు ఉంటాయి కాబట్టి... సున్నా వ‌చ్చేలా డ‌బ్బు రౌండ్ ఫిగ‌ర్‌ తో ఇస్తే దాంతో ఆ డ‌బ్బును తీసుకున్న వారికి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌.

ఆరోగ్య ప‌రంగా, ఆర్థికంగా స‌మ‌స్య‌లు

ఆరోగ్య ప‌రంగా, ఆర్థికంగా స‌మ‌స్య‌లు

ఆరోగ్య ప‌రంగా, ఆర్థికంగా స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ట‌.

నూతన వ‌ధూ వ‌రుల‌కు అలా రౌండ్ ఫిగ‌ర్‌ లో డ‌బ్బును చ‌దివిస్తే

నూతన వ‌ధూ వ‌రుల‌కు అలా రౌండ్ ఫిగ‌ర్‌ లో డ‌బ్బును చ‌దివిస్తే

అదే నూతన వ‌ధూ వ‌రుల‌కు అలా రౌండ్ ఫిగ‌ర్‌ లో డ‌బ్బును చ‌దివిస్తే దాంతో వారి వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ట‌.

డబ్బు ఇచ్చిన వారికి, తీసుకున్నవారికి మధ్య సంబంధాలు

డబ్బు ఇచ్చిన వారికి, తీసుకున్నవారికి మధ్య సంబంధాలు

అందుకే రౌండ్ ఫిగ‌ర్‌ లో కాకుండా రూ.51, రూ.101 అలా డ‌బ్బును ఇస్తే దాన్ని విభ‌జించేందుకు వీలుండ‌దు కాబట్టి... డబ్బు ఇచ్చిన వారికి, తీసుకున్నవారికి మధ్య సంబంధాలు కూడా విభ‌జించ లేని విధంగా బలంగా ఉంటాయని నమ్ముతారు.

వ‌ధూవ‌రులు ఒకే మ‌న‌స్సుతో క‌లిసి మెల‌సి ఉంటార‌ట‌

వ‌ధూవ‌రులు ఒకే మ‌న‌స్సుతో క‌లిసి మెల‌సి ఉంటార‌ట‌

అలాగే వ‌ధూవ‌రులు ఒకే మ‌న‌స్సుతో క‌లిసి మెల‌సి ఉంటార‌ట‌. వారి దాంప‌త్య జీవితం అన్యోన్యంగా ఉంటుంద‌ట‌.

పెద్ద వారి ఆశీస్సులు ల‌భిస్తాయ‌ని

పెద్ద వారి ఆశీస్సులు ల‌భిస్తాయ‌ని

కొంద‌రైతే అలా డ‌బ్బు ఇవ్వ‌డం వ‌ల్ల పెద్ద వారి ఆశీస్సులు ల‌భిస్తాయ‌ని న‌మ్ముతారు. అందుకే మ‌న పెద్ద‌లు రౌండ్ ఫిగ‌ర్‌ లో, సున్నా వ‌చ్చేలా డ‌బ్బును బ‌హుమ‌తిగా ఇవ్వ‌కూడ‌ద‌ని చెబుతారు..!

దేవుడికి కూడా ..

దేవుడికి కూడా ..

అంతే కాదు, గుళ్లకు వెళ్లినప్పుడు కూడా దేవాలయాల్లో కూడా ఇలానే దేవుడికి కూడా కానుకలు సమర్పించేటప్పుడు కూడా ఇలా రూ.1 జోడించి ఇవ్వడం ఒక ఆచారంగా వస్తోంది. ఇలా ఇస్తే మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం.

 కొసరుగా చెప్పుకుంటారు.

కొసరుగా చెప్పుకుంటారు.

తమిళనాడులో సాంప్రదాయంలో అయితే అది ఒక కొసరుగా చెప్పుకుంటారు.

 లక్ష్మీ దేవి వెళ్లిపోకుండా..

లక్ష్మీ దేవి వెళ్లిపోకుండా..

కొంత మంది ఇలా క్యాష్ ను గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు వారి వద్ద నుండి లక్ష్మీ దేవి వెళ్లిపోకుండా, ఆ ఎక్స్ ట్రాగా ఇచ్చిన ఒక రూపాయిని తిరిగి తీసుకోవడం కోసం అలా జోడించి ఇస్తారని మరికొందరి నమ్మకం.

అలా ఎక్స్ ట్రా ఒక రూపాయి ఇవ్వడం

అలా ఎక్స్ ట్రా ఒక రూపాయి ఇవ్వడం

అలా ఎక్స్ ట్రా ఒక రూపాయి ఇవ్వడం వల్ల ఇచ్చిన వారికి, మరియు తీసుకున్న వారికి మంచి జరుగుతుందని,ఆశీర్వాదం పొందుతారని కొందరి నమ్మకం.

English summary

While gifting cash why do we add that extra Rs. 1..?

Many people feel that gift amount must not end with zero. So, they add one rupee coin. Nowadays we see gift envelopes already containing a coin of denomination of Re. 1/.
Story first published: Tuesday, March 7, 2017, 15:28 [IST]
Subscribe Newsletter