శవాలను తేనెలో ముంచుకొని తినే వికారమైన అలవాటును చైనా ప్రజలు పాటిస్తారు

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

వికారమైన ఆకలికి చైనా ప్రజలు ప్రసిద్ధి గాంచారు. పాకే పురుగుల దగ్గర నుండి పెద్ద పెద్ద పురుగుల వరకు ఇలా దేనైనా తినడానికి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. ఆహారం ఏ రూపంలో ఉన్నా కానీ వాటిని తినడానికి వారు వెనకాడరు.

కానీ, తేనెలో ముంచి ఉన్న శవాలను చైనా ప్రజలు తినేవారు అనే విషయం మీకు తెలుసా ? వినడానికే చాలా అసహ్యం వేస్తోంది కదా ? కానీ ఇది ఒక నమ్మలేని నిజం. దీనిని కొన్ని వందల సంవత్సరాల ముందు చైనా ప్రజలు పాటించేవారు. ఆ సమయంలో వివిధ రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడి ఆరోగ్యవంతంగా జీవించడానికి అక్కడి ప్రజలు తేనెలో ముంచి ఉన్న శవాలను తినే వారు.

చనిపోయిన తర్వాత మనిషిని కొన్ని ప్రదేశాల్లో ఏం చేస్తారో తెలుసా..?

ఇలాంటి వికారమైన అలవాట్లను ఎందుకు అక్కడి ప్రజలు అలవరుచుకున్నారు ? తేనెలో ముంచి ఉన్న శవాలను తినే ఆచారాన్ని వందల సంవత్సరాల పాటు ఎందుకు కొనసాగించారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నరమాంస భక్షకులుగా వీరు మారటానికి ఒక వింత కారణం ఉంది :

నరమాంస భక్షకులుగా వీరు మారటానికి ఒక వింత కారణం ఉంది :

చైనా దేశం ప్రకారం, వివిధ ఔషధ ప్రయోజనాల్లో భాగంగా చనిపోయి ఉన్న మనుష్యుల యొక్క మాంసాన్ని తినటాన్ని ప్రారంభించారు. ఆ విధంగా నరమాంసాన్ని భక్షించటాన్ని ఆరంభించారు. ఏ వ్యక్తులైతే చావుకు దగ్గరగా ఉంటారో అటువంటి వ్యక్తులను ఇలా చేసేవారు. వివిధ శాస్త్ర ప్రయోగాల కోసం వయస్సు మీదపడి, చావుకు దగ్గరవుతున్న వ్యక్తుల యొక్క శరీరాలు దానం చేయవలసిందిగా వారిని కోరేవారు.

ఈ ఆలోచన ఒక అరబ్ వంటకం నుండి పుట్టింది :

ఈ ఆలోచన ఒక అరబ్ వంటకం నుండి పుట్టింది :

ఈ మరణించిన శవాలను తినటం అనే ఆలోచన ఒక అరబ్ వంటకం నుండి పుట్టింది. ఇందులో భాగంగా చనిపోయిన శరీరాలను శాస్త్రవేత్తలు ఒక ఔషధంగా మారుస్తారట. వీటిని సేవించడం ద్వారా వారి యొక్క వారసులకు అనేక ఆరోగ్య సమస్యలు తోలిగిపోతాయని, ముఖ్యంగా విరిగిన ఎముకలు లాంటి సమస్యల్ని చాలా త్వరగా నయం అవుతాయని చెబుతారు.

ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన 10 ప్రదేశాలు..

ఒక వ్యక్తి బ్రతికి ఉండగానే అతనిని తేనెలో ముంచే ప్రక్రియను మొదలు పెడతారు:

ఒక వ్యక్తి బ్రతికి ఉండగానే అతనిని తేనెలో ముంచే ప్రక్రియను మొదలు పెడతారు:

తేనెలో ముంచే ప్రక్రియలో అత్యంత వికారమైన అంశం ఏమిటంటే, ఈ ప్రక్రియలో భాగంగా బ్రతికి ఉన్న వ్యక్తినే ఇందులో వాడుతారు. ఆ వ్యక్తి తేనెను తప్ప మిగతా ఏ ఆహారాన్ని తినకూడదు. ఇలా చేయడం వల్ల అతడు చావు చాలా తొందరగా వస్తుంది. పోషకాహార లోపంతో ఆ వ్యక్తి చాలా త్వరగా మరణిస్తాడు.

తేనెలో ముంచే ప్రక్రియ ఎలా ఉంటుందంటే :

తేనెలో ముంచే ప్రక్రియ ఎలా ఉంటుందంటే :

ఎప్పుడైతే ఆ వ్యక్తి మరణిస్తాడో, ఆ వ్యక్తి యొక్క మరణించిన శరీరాన్ని రాయి తో చేసిన శవపేటికలో పెట్టి, ఆ పేటిక మొత్తంలో తేనెను వేస్తారు. అలా ఆ శవాన్ని అందులో భద్రపరుస్తారు. ఆ తర్వాత, ప్రకృతిసిద్ధంగా ఏమి జరుగుతుందో అది జరగని అని అలా వదిలేస్తారు. ఆ సేవపేటికను దాదాపు వంద సంవత్సరాల పాటు మూసి ఉంచుతారు.

శవాన్ని తేనె భద్రపరుస్తుంది :

శవాన్ని తేనె భద్రపరుస్తుంది :

తేనెలో ఏదైనా వస్తువుని భద్రపరిచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ యొక్క ప్రభావవంతమైన గుణాల కారణంగానే, మరణించిన శరీరాన్ని అన్ని సంవత్సరాల పాటు తేనె భద్రపరచగలదు. సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ శరీరం మొత్తం ఒక చెక్కర పదార్థంలా తయారవుతుంది మరియు తేనే ఒక రకమైన మిఠాయిలా తయారవుతుంది.

వివిధ రకాల వ్యాధులు నయం చేయడానికి వాడేవారు :

వివిధ రకాల వ్యాధులు నయం చేయడానికి వాడేవారు :

వంద సంవత్సరాలు తర్వాత శరీరాన్ని అందులో నుండి తీసేవారు. అలా తీసిన తర్వాత దానిని మార్కెట్లలో చాలా ఎక్కువ ధరలకు అమ్ముతారు. ముఖ్యంగా దెబ్బ తగిలినప్పుడు చికిత్స చేయడానికి మరియు ఎముకలు విరిగిన వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతారు. తేనెలో ముంచిన శవాలకు సంబంధించిన కొన్ని పదార్ధాలను నోటి ద్వారా కూడా తింటారు. ఇలా చేయడం ద్వారా శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని భావిస్తారు.మనం ఆనందించవల్సిన అంశం ఏమిటంటే, ఇప్పుడు అటువంటి వికారమైన పద్దతిని ఎవ్వరు గాని ఆచరించడం లేదు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మరచిపోకండి.

English summary

People In China Ate Corpses Dipped In Honey

In the 16th century, residents of China mellified the elderly people who were nearing the end of their lives to donate their body to science. Once they were dead, the bodies were stored in coffins made of stone and their bodies were entirely dipped in honey and stored for almost centuries!
Subscribe Newsletter