Latest Updates
-
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.!
లేడీ కూలీ నెం 1: 90km ప్రయాణించి కూలీ చేస్తూ, పిల్లలను గొప్ప ఆఫీసర్లను చేస్తానంటోంది!
ఆడవాళ్ళకి భూదేవంత సహనం ఉండాలి అని అంటారు. అందుకు ఈమెను చూస్తే అర్థం అవుతుంది. జీవితమంటే అంతే. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఒక్కోసారి అనుకోని అదృష్టాన్ని ఇచ్చి అందలం ఎక్కిస్తే... ఒక్కోసారి అథః పాతాళానికి తొక్కేస్తుంది. దీంతో అలాంటి స్థితిలో ఉన్నవారికి కోలుకునేందుకు సమయం పడుతుంది. ఎంతో కఠోర శ్రమ చేయాల్సి వస్తుంది.

ఒక్కోసారి రెక్కాడితే గానీ డొక్కాడదు. అలాంటి దీన స్థితికి కొందరు చేరుకుంటారు. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా సరిగ్గా ఇలాంటి కోవకు చెందిన ఓ మహిళ గురించే. ఆమె గురించి మరింత వివరంగా తెలుసుకుందాం..

మధ్య తరగతి ప్రజల్లాగే బ్రతికారు
భర్త ఉన్నప్పుడు ఆమె కుటుంబం అందరు మధ్య తరగతి ప్రజల్లాగే బాగానే బతికారు. కానీ... అనుకోకుండా పాడు అనారోగ్యం భర్తను మింగేసింది. దీంతో గత్యంతరం లేక కుటుంబ పోషణను ఆమె నెత్తిన వేసుకుంది.

కట్ని రైల్వే స్టేషన్‌లో ఆమె కూలీగా
ఆమె పేరు సంధ్య మరవి. వయస్సు 30 సంవత్సరాలు. ఉంటున్నది మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సమీపంలో ఉన్న కుందుమ్ అనే గ్రామం. అక్కడికి సుమారుగా 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కట్ని రైల్వే స్టేషన్‌లో ఆమె కూలీగా పనిచేస్తోంది.

ఇరుగు పొరుగు వారి సలహాతో
గతేడాది అక్టోబర్ 22న సంధ్య భర్త అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. దీంతో ముగ్గురు పిల్లలు, అత్త భారం ఆమెపై పడింది. ఈ క్రమంలోనే ఇరుగు పొరుగు వారి సలహాతో ఆమె రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిచేయాలని నిర్ణయించుకుంది.

వెంటనే అందుకు దరఖాస్తు చేసుకుంది
వెంటనే అందుకు దరఖాస్తు చేసుకోగా, ఆమెకు 36వ నంబర్ బ్యాడ్జి లభించింది. దీంతో ఆ స్టేషన్‌లో పనిచేస్తున్న 45 మంది మగ కూలీల్లో ఈమె ఒక్కతే ఆడ కూలీగా చేరింది.

రోజూ 45+45= 90 కిలో మీటర్ల దూరం వెళ్లి ఆ స్టేషన్ లో కూలీగా
అప్పటి నుంచి అలా ఆమె ఇంటి నుంచి రోజూ 45+45= 90 కిలో మీటర్ల దూరం వెళ్లి ఆ స్టేషన్ లో కూలీగా పనిచేసి తిరిగి ఇంటికి వచ్చి పిల్లల పోషణ చూస్తోంది. మరోవైపు మంచాన పడిన అత్తను కూడా పోషిస్తోంది.

సహాయం చేస్తామన్నా ఆమె స్వీకరించదు.
అయితే ఆమె దీన గాథ గురించి తెలిసిన వారు సహాయం చేస్తామన్నా ఆమె స్వీకరించదు.

తాను కష్టపడి సంపాదించి ఆ డబ్బుతోనే
తాను కష్టపడి సంపాదించి ఆ డబ్బుతోనే పిల్లలను చదివిస్తానని, వారిని గొప్ప ఆఫీసర్లను చేస్తానని ఆమె చెబుతోంది. ఆమె ఆశయం నెరవేరాలని మనమూ కోరుకుందాం..!



Click it and Unblock the Notifications
