మీరు పుట్టిన తేదిని బట్టి, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు..

Posted By:
Subscribe to Boldsky

బర్త్ డే డేట్ ఆధారంగా కూడా వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని తాజా అధ్యయనాలు రివీల్ చేస్తున్నాయి. బర్త్ డేట్ ని బట్టి మీ వ్యక్తిత్వం, మీ అలవాట్లు, మీ ప్రవర్తన, మీ ఆలోచనలు, మీ టాలెంట్, మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారు అనేది తెలుసుకునే అద్భుతమైన ఛాన్స్. అయితే 12 నెలల్లో ఏ నెలలో అయినా.. ఏ డేట్ లో పుట్టిన వాళ్ల వ్యక్తిత్వం గురించి ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చించబోతున్నాం. అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒకటవ తారీఖు జన్మించిన వాళ్లు, అలాగే 2వ తేదీ అంటే.. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో అయినా 2వ తేదీ జన్మించిన వాళ్ల గురించి, ఇలా 31 డేట్లలో ఏ డేట్ లో జన్మిస్తే ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉంటారనేది డిసైడ్ అవుతుంది.

బర్త్ డే అనేది.. అనుకోకుండా జరిగేది కాదు. మీ కర్మ ఆధారంగా ఈ రోజు నిర్ణయించబడుతుందట. రోజు, సమయం, స్పష్టమైన క్షణం అనేది.. వివిధ రకాలుగా మీకు చెందినదై ఉంటుంది. కాబట్టి మీకు ఆ ఖచ్చితమైన డేట్ నే ఎలా నిర్ణయించబడుతుంది అనేది.. మీ కర్మను బట్టి ఉంటుంది. ఏ రోజు అంటే.. ఏ డేట్ లో జన్మించిన వ్యక్తి.. ఎంత విభిన్నంగా ఉంటారు, ఎలాంటి స్వభావం కలిగి ఉంటాడు అనేది తెలుసుకుందాం..

1 వ తేదీ

1 వ తేదీ

ఏ నెలలో అయినా 1వ తేదీ పుట్టిన వాళ్లు చాలా గొప్ప లక్ష్యం కలిగి ఉంటారు. మీరు చాలా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. ఇతరుల కింద పనిచేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. మీకు బిజినెస్ రన్ చేసే కెపాసిటీ ఉంటుంది. పెద్ద పెద్ద సంస్థలను నడపగలుగుతారు. మీ చేతుల్ల నాలెడ్జ్ అనే ఆయుధం ఉంటుంది.

2 వ తేదీ

2 వ తేదీ

2వ తేదీ పుట్టిన వాళ్లు చాలా సున్నితమనస్తత్వం కలిగి ఉంటారు. మీరు అందాన్ని, అటెన్షన్ ని ఇష్టపడతారు. మీ సున్నిత స్వభావం మిమ్మల్ని చాలా ఎమోషన్ కి గురిచేస్తుంది, హాని చేస్తుంది. ఇతరుల ఆలోచనలు ఎలా ఉన్నాయో గ్రహించి.. ప్రశాంతత కలగడానికి సహాయపడతారు. ఆర్టిస్టిక్, మ్యూజికల్ ఎబిలిటీ ఉంటుంది.

3వ తేదీ

3వ తేదీ

మీలో చాలా క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది. మనసులో చాలా కళలు ఉంటాయి. మీకు ఆర్ట్స్, పెయింటింగ్ లో మంచి టాలెంట్ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఫీల్డ్ లో లేకపోతే.. ఆర్ట్ ని హాబీగా పెట్టుకోవచ్చు. మీకు చాలా అత్యుత్సాహం ఉంటుంది. మిమ్మల్ని ఇతరులు ఇన్సిపిరేషన్ గా తీసుకుంటారు. మీరు వండర్ ఫుల్ సేల్స్ పర్సన్.

4 వ తేదీ

4 వ తేదీ

ఏ నెలలో అయినా 4వ తేదీ పుట్టిన వాళ్లు.. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. నీతినియమాలు కలిగి ఉంటారు. చాలా క్రమశిక్షణ కలిగిన, బాధ్యత కలిగినవాళ్లు. మీ బాధ్యతలను చాలా సీరియస్ గా తీసుకుంటారు. మీ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు. సహోద్యోగులు, రిలేటివ్స్ మీపై ఆధారపడుతారు.

5 వ తేదీ

5 వ తేదీ

అడ్వెంచర్, ట్రావెల్, మార్పుని చాలా ఇష్టపడతారు. చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఎక్సైట్ మెంట్ ని కోరుకుంటారు. ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం మీది. పబ్లిక్ రిలేషన్స్, రాయడంలో టాలెంట్ ఉంటుంది. మీరు చాలా త్వరగా బోర్ ఫీలవుతారు, అలసిపోతారు. అయితే మీరు కొంచెం బాధ్యతారహితంగా ఉంటారు. కాబట్టి.. క్రమశిక్షణ నేర్చుకోవాలి.

6 వ తేదీ

6 వ తేదీ

మీ ఫ్యామిలీ ఓరియెంటెడ్. వర్క్ ని బ్యాలెన్స్ గా మేనేజ్ చేస్తారు. ఇతరుల సంరక్షణ బాధ్యత తీసుకుంటారు. మీరు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. మీ ఫోకస్ ఎక్కువగా రిలేషన్ షిప్స్ పై ఉంటుంది. ఇతరులను సహాయం చేయాలని కోరుకుంటారు. మీరు చాలా నిజాయితీగా, జాలి కలిగి, అర్థం చేసుకునే తత్వం కలిగి ఉంటారు.

7 వ తేదీ

7 వ తేదీ

మీది చాలా డెవలప్డ్ మైండ్. ఆధ్యాత్మికంగా, తాత్వకంగా ఉంటారు. మీ ఎబిలిటీస్ అన్నీ ఉపయోగించుకుంటారు. మీరు చాలా ఎనలిటికల్ గా ఉంటారు. మీరు ఖచ్చితంగా ధ్యానం చేయాలి.

8వ తేదీ

8వ తేదీ

బిజినెస్ పై మంచి టాలెంట్ ఉంటుంది. వ్యాపారంలో మీ అడుగు చాలా ఒరిజినల్, క్రియేటివ్, డేరింగ్ గా ఉంటుంది. అయితే పార్ట్ నర్ షిప్ లకు దూరంగా ఉండటం మంచిది. లీడర్ షిప్ క్వాలిటీస్ మీకు ఎక్కువగా ఉంటాయి. లక్ష్యసాధన, ప్రాక్టికల్, సెల్ఫ్ డెవలప్ మెంట్ మీకు కలిసొచ్చే విషయాలు.

9 వ తేదీ

9 వ తేదీ

మీది చాలా బ్రాడ్ మైండ్. చాలా ఆదర్శవాదంగా ఉంటారు. చాలామంది గొప్ప ఆర్టిస్ట్ లు ఈ నెంబర్ లో పుట్టారు. ఒకవేళ పిల్లలు 9న పుట్టి ఉంటే.. వాళ్ల పొఫెషన్ నిర్ణయించడానికి కొంత సమయం కేటాయించండి. త్యాగం చేసే గుణం ఉంటుంది. అయితే క్షమించే గుణాన్ని అలవరచుకోవాల్సి ఉంటుంది.

10 వ తేదీ

10 వ తేదీ

చాలా లక్ష్యసాధన కలిగి ఉంటారు. స్వతంత్రత కోసం కష్టపడతారు. బలమైన లీడర్ షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. సక్సెస్ కోసం.. చాలా కష్టపడతారు. చాలా షార్ప్ మైండ్ కలిగి ఉంటారు. అనలిటికల్ స్కిల్స్ కలిగి ఉంటారు. చాలా పక్కాగా ప్లాన్ చేసి.. ఆర్గనైజ్ చేసే సత్తా ఉంటుంది.

11 వ తేదీ

11 వ తేదీ

ఆదర్శవాదంగా ఉంటారు. వాస్తవాన్ని తెలుసుకోవడానికి మంచి ఐడియా ఉంటుంది. ఎదుటివాళ్ల అంతర్గత ఆలోనచలను ముందుగానే తెలుసుకునే సత్తా ఉంటుంది. ఇతరులను చాలా మోటివేట్ చేస్తారు. మీరు చాలా సెన్సిటివ్, ఎమోషనల్ గా ఉంటారు.

12 వ తేదీ

12 వ తేదీ

మీకు కళాత్మక టాలెంట్ ఎక్కువగా ఉంటుంది. చాలా ఊహాత్మకంగా ఉంటారు. స్టోరీస్, జోక్స్ వంటి వాటితో.. అందరినీ బాగా ఎంటర్ టైన్ చేస్తారు. ఇతరులతో పోల్చితే.. మీ శరీరంలో ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చాలా త్వరగా ఉపశమనం పొందుతారు. మీరు వెర్బల్, వ్రైటింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఈ ఫీల్డ్స్ తో పాటు, యాక్టివంగ్ మీకు బాగా కలిసివస్తుంది.

13 వ తేదీ

13 వ తేదీ

ఫ్యామిలీ, ట్రెడిషన్, కమ్యునిటీపై చాలా ప్రేమ ఉంటుంది. మీరు నేచర్ ని ఇష్టపడతారు. ప్రతి విషయంలో డీటెయిల్స్ కోరుకుంటారు. మీరు హార్డ్ వర్క్ చేయగలుగుతారు. మీ గురించి మీరు కేర్ తీసుకుంటారు. అయితే మరీ ఎక్కువగా పనిచేసే తత్వం ఉంటుంది. ఈ విషయంలో కొంచెం అలర్ట్ అవ్వాలి.

14 వ తేదీ

14 వ తేదీ

మార్పు, అత్యుత్సాహం, ట్రావెల్ ని ఇష్టపడతారు. చాలా యోగ్యతగా ఉంటారు. వ్రైటర్, ఎడిటర్ గా రాణిస్తారు.

15 వ తేదీ

15 వ తేదీ

మీరు చాలా క్రియేటివ్, కళాత్మకమైనవాళ్లు. మీరు విజువల్ ఆర్ట్స్, పెయింటింగ్, కాలిగ్రాఫీ, స్కల్చర్ ని ఇష్టపడతారు. మీ జీవితంలో బెస్ట్ గా ఉండాలని కోరుకుంటారు. మీ జీవితంలో ఇల్లు, మ్యారేజ్ అనేది ప్రధాన సమస్య. మీ భాగస్వామికి మంచి ప్లేస్ ఇవ్వాలి.

16 వ తేదీ

16 వ తేదీ

ఆధ్మాత్మిక విలువలు కలిగి ఉంటారు. ఏకాగ్రత చాలా బాగుంటుంది.

17 వ తేదీ

17 వ తేదీ

చాలా ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు. బిజినెస్, ఫైనాన్స్ లో ఎక్సలెంట్ స్కిల్స్ ఉంటాయి. చాలా స్వతంత్ర భావం కలిగి ఉంటారు. మంచి జడ్జ్ మెంట్ టాలెంట్ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెంట్ కలిగి ఉంటారు.

18 వ తేదీ

18 వ తేదీ

లీడర్, మ్యానేజర్ క్వాలిటీస్ ఉండటం వల్ల.. బిజినెస్ లో రాణిస్తారు. ఇతరులకు ఇన్సిపిరేషన్ గా ఉంటారు. రాజకీయాలు, ఆర్ట్స్, న్యాయసేవల్లో టాలెంట్ ఉంటుంది. మనుషుల ఆలోచనలు ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటారు.

19వ తేదీ

19వ తేదీ

స్వతంత్ర కోసం కష్టపడతారు. స్వతంత్రత కోసం చాలా కష్టపడతారు. రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మార్పులను చాలా ఇష్టపడతారు.

20 వ తేదీ

20 వ తేదీ

చాలా సెన్సిటివ్ మనస్తత్వం కలిగి ఉంటారు. ఇతరుల ఫీలింగ్స్ ని ఇట్టే గుర్తుపట్టేస్తారు. చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఒకసారి టాస్క్ పూర్తి అయిందంటే.. మీరు జీవితాన్న బాగా మేనేజ్ చేయగలుగుతారు. లైఫ్ లో సమస్యలు తగ్గుతాయి. మీరు ముఖ్యంగా అందం, సామరస్యం, ప్రేమతో రాణిస్తారు.

21 వ తేదీ

21 వ తేదీ

మీరు చాలా క్రియేటివ్ గా ఉంటారు. సక్సెస్ అవడానికి చాలా కష్టపడతారు. పట్టుదల ఉంటుంది. ఇతరులతో బాగా కలిసిపోతారు. వ్రైటింగ్, వెర్బల్ స్కిల్స్ ఉంటారు. చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు.

22 వ తేదీ

22 వ తేదీ

లీడర్, ఆర్గనైజర్ గా రాణిస్తారు. వీటిల్లో సక్సెస్ అవ్వాలనే లక్ష్యం ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ పై ఆధారపడి ఉంటారు. చాలా ప్రాక్టికల్, ఆదర్శవాదంగా ఉంటారు.

23 వ తేదీ

23 వ తేదీ

జీవితం అడ్వెంచర్.. దాన్ని పూర్తీగా అనుభవించాలి అనుకుంటారు. మీ అనుభవాలు చెప్పి ఇతరుల చేతుల్లో మోసపోవడం ఇష్టముండదు. చాలా సర్దుకుపోయే తత్వం ఉంటుంది. రిలేషన్స్ ని చాలా తేలికగా కలుపుకుంటారు. దీనివల్ల చాలామంది మీ జీవితంలో కలుస్తారు.

24 వ తేదీ

24 వ తేదీ

మీరు ఫ్యామిలీ ఓరియెంటెడ్. సంబంధాల్లో సామరస్యం కలిగి ఉంటారు. చాలా ఎమోషన్, సెన్సిటివ్ నేచర్ కలిగి ఉంటారు. సంబంధాల్లో ముఖ్యమైన సామరస్యాన్ని మెయింటెయిన్ చేస్తారు. ఇతరులు ఇబ్బందుల్లో ఉంటే.. వాళ్లను ఓదార్చుతారు. చాలా ఓర్పు, జాగ్రత్త, ప్రణాళికాబద్ధంగా ఉండటం వల్ల వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు.

25 వ తేదీ

25 వ తేదీ

లైఫ్ ని చాలా లాజికల్ గా అనుభవిస్తారు. ఏదైనా ఒక విషయంపై పూర్తీగా పరిశీలించడం, రీసెర్చ్ చేసే సత్తా ఉంటుంది. సైన్స్, టీచింగ్, ఫిలాసఫీ, మెటాఫిజిక్స్, సైకాలజీలో బాగా సక్సెస్ అవుతారు.

26 వ తేదీ

26 వ తేదీ

బిజినెస్ లో మనీ, టాలెంట్ లో మంచి అభిప్రాయం ఉంటుంది. వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి క్రియేటివ్, డేరింగ్ గా ఉంటారు. మీరు ఏం చేసినా.. జడ్జ్ మెంట్ కోరుకుంటారు. మంచి మ్యానేజర్, ఆర్గనైజర్. ముందుచూపు కలిగి ఉంటారు. కానీ.. వివరాల విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేయగలుగుతారు.

27 వ తేదీ

27 వ తేదీ

మీరు పుట్టుకతోనే లీడర్ గా ఉంటారు. మ్యానేజ్, ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉంటారు. ఇతరులను బాగా ప్రోత్సహిస్తారు. రాజకీయాలు, న్యాయ రంగాల్లో రాణిస్తారు. మనుషులను బాగా అర్థం చేసుకుంటారు. చాలా కళాత్మకంగా ఉంటారు.

28 వ తేదీ

28 వ తేదీ

లీడర్ షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. కానీ.. ఉద్యోగుల కోపరేషన్ ఉంటేనే అవి పనిచేస్తాయి. అసాధారణ, ఆదర్శవాద, స్వతంత్ర భావం కలిగి ఉంటారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. కానీ ప్రోత్సాహం అవసరం.

29 వ తేదీ

29 వ తేదీ

చాలా కళాత్మకంగా ఉంటారు. మీ ఆలోచనలు.. అద్భుతంగా ఉంటారు.

30 వ తేదీ

30 వ తేదీ

చాలా క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది. వ్రైటింగ్, ఆర్ట్స్ చాలా మంచి టాలెంట్ ఉంటుంది. ఒకవేళ మీది ఈ ప్రొఫెషన్ కాకపోతే.. ఆర్ట్స్ ని హాబీగా తీసుకోవడం మంచిది. మీరు చాలా ఊహాత్మకంగా ఉంటారు.

31 వ తేదీ

31 వ తేదీ

కుటుంబం, సంప్రదాయం, కమ్యునిటీపై చాలా ప్రేమ ఉంటుంది. ఏ పనిచేసినా.. చాలా పట్టుదలతో చేస్తారు. మ్యానేజర్, ఆర్గనైజర్ గా.. ప్రతి విషయంలో వివరణ కోరుకుంటారు. కష్టపడి పనిచేస్తారు.

English summary

Your Birthday Date Reveals This About You!

Numerology is a way to predict what's to come in your life using numbers and it can definitely help reveal a lot about your personality based on the date you are born.