పెన్ పట్టుకునే స్టైల్ ను బట్టి ఎదుటివారు ఎలాంటి వారు, వారి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు!

Posted By:
Subscribe to Boldsky

సాధరణంగా చదువు విషయంలో పెన్నులు, పెన్సిళ్లు, స్కెచ్ పెన్నులు... ఇలా చెప్పుకుంటూ పోతే ఆ విభాగంలో చాలా ర‌కాలే మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఎవ‌రి అవ‌స‌రానికి, ఇష్టానికి త‌గిన‌ట్టుగా వారు వాటిని వాడుతుంటారు. ఈ క్ర‌మంలో పెన్ను లేదా పెన్సిల్ దేన్న‌యినా ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా ప‌ట్టుకుని రాస్తారు.పెన్ పట్టుకునే మీ స్టైల్ మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని అంటున్నారు నిపుణులు.

కొంద‌రు చేతి బొట‌న వేలు, చూపుడు వేలితో ప‌ట్టుకుని రాస్తే, కొంద‌రు మ‌ధ్య వేలును కూడా వాడుతారు. సౌకర్య‌వంతంగా ఉండేందుకు గాను ప్ర‌తి ఒక్క‌రు అలా వివిధ ర‌కాలుగా పెన్నులు, పెన్సిళ్ల‌తో రాస్తారు. అయితే అలా వారు రాసే విధానాల‌ను అనుస‌రించి వారి వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చ‌ట‌. అయితే అదెలాగో తెలుసుకుందాం...

ఫోటోలో చూపిన విధంగా పెన్నుపై చూపుడు వేలు, మ‌ధ్య వేలును ఉంచి

ఫోటోలో చూపిన విధంగా పెన్నుపై చూపుడు వేలు, మ‌ధ్య వేలును ఉంచి

ఫోటోలో చూపిన విధంగా పెన్నుపై చూపుడు వేలు, మ‌ధ్య వేలును ఉంచి వాటిపై బొట‌న వేలిని పెట్టి రాస్తే అప్పుడు వారు కళాత్మ‌క దృష్టి క‌లిగి ఉంటార‌ట‌. అలాంటి వారు ఊహా ప్ర‌పంచంలో ఎక్కువ‌గా విహ‌రిస్తార‌ట. జీవితంలో గొప్ప సంఘ‌ట‌నలు జ‌ర‌గాల‌ని ఆశిస్తార‌ట‌. వారు త‌మ చుట్టూ ఉన్న‌వారు సంతోషంగా, సుర‌క్షితంగా ఉండాల‌ని కోరుకుంటార‌ట‌. వీరు బాగా ఆలోచిస్తార‌ట‌.

చూపుడు వేలు, మ‌ధ్య‌వేలుకు మ‌ధ్య‌లో పెన్ను లేదా పెన్సిల్ పట్టుకుని రాస్తే

చూపుడు వేలు, మ‌ధ్య‌వేలుకు మ‌ధ్య‌లో పెన్ను లేదా పెన్సిల్ పట్టుకుని రాస్తే

చూపుడు వేలు, మ‌ధ్య‌వేలుకు మ‌ధ్య‌లో పెన్ను లేదా పెన్సిల్ పట్టుకుని రాస్తే వారు సామాజిక వేత్త‌లుగా ఉంటార‌ట‌. స‌మాజ స‌మ‌స్య‌ల ప‌ట్ల స్పందిస్తార‌ట‌. వీరు ఎక్కువ‌గా క్షమించే గుణం క‌లిగిన వారై ఉంటార‌ట‌. ఏ విష‌యాన్నయినా గోప్యంగా ఉంచుతూ నాట‌కం ఆడేవారు అంటే వీరికి ఇష్టం ఉండ‌ద‌ట‌.

బొట‌న వేలు, చూపుడు వేలి మ‌ధ్య పెన్నును ప‌ట్టుకుని రాస్తే

బొట‌న వేలు, చూపుడు వేలి మ‌ధ్య పెన్నును ప‌ట్టుకుని రాస్తే

బొట‌న వేలు, చూపుడు వేలి మ‌ధ్య పెన్నును ప‌ట్టుకుని రాస్తే వారు ఎక్కువగా నిజాయితీ ప‌రులై ఉంటార‌ట‌. ప్ర‌తి విష‌యం ప‌ట్ల జాగ్రత్త‌గా ఉంటార‌ట‌. వీరు ప్రేమ విషయంలో సిగ్గుగా ప్ర‌వ‌ర్తిస్తార‌ట‌.

బొటన వేలుని ఇతర వేళ్ళు ఓవర్ లాప్ చేసినప్పుడు

బొటన వేలుని ఇతర వేళ్ళు ఓవర్ లాప్ చేసినప్పుడు

మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో దానికంటే మీరు ధైర్యంగా ఉన్నారు. మీ వినయం మరియు చురుకుదనం మీరు అన్ని చర్చల లో కేంద్రంగా చేస్తుంది. మీ అసలు భావాలను కమ్యూనికేట్ చేయడం గురించి మీరు ఎన్నటికీ భయపడరు. మీ త్యాగపూరితమైన స్వభావం, తరచుగా ప్రయోజనాన్ని పొందుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇతరులకు మీ సంతృప్తిని ఇవ్వటానికి మీరు సిద్ధంగా ఉన్నారు.

పిడికిలి మూసే విధానాన్ని బ‌ట్టి కూడా వ్య‌క్తుల స్వ‌భావాలు ఎలా ఉంటాయో చెప్ప‌వ‌చ్చు. అదెలాగంటే…

పిడికిలి మూసే విధానాన్ని బ‌ట్టి కూడా వ్య‌క్తుల స్వ‌భావాలు ఎలా ఉంటాయో చెప్ప‌వ‌చ్చు. అదెలాగంటే…

బొట‌న వేలిని దాస్తూ పిడికిలిని మూస్తే వారు త‌మ మ‌న‌స్సులో ఉన్న భావాల‌ను ఎదుటి వారికి క్లియ‌ర్‌గా చెబుతార‌ట‌. అంతేకానీ ఏ విష‌యాన్ని దాచుకోర‌ట‌. వీరికి హాస్యం పాళ్లు కొద్దిగా ఎక్కువ‌గానే ఉంటాయ‌ట‌. అంద‌రినీ న‌వ్విస్తూ ఉంటార‌ట‌. ఎదుటి వారి సంతోషం కోసం వీరు తమ సంతోషాన్ని చంపుకుంటార‌ట‌.

బొట‌న‌వేలిని పైకి తెస్తూ పిడికిలిని మూస్తే

బొట‌న‌వేలిని పైకి తెస్తూ పిడికిలిని మూస్తే

బొట‌న‌వేలిని పైకి తెస్తూ పిడికిలిని మూస్తే వారు ఎక్కువ‌గా ప్ర‌తిభావంతులు అయి ఉంటార‌ట‌. వీరికి న‌లుగురిలో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంటుంద‌ట‌. వీరు ఎక్కువ‌గా సెన్సిటివ్ త‌రహా మ‌న‌స్త‌త్వం క‌లిగి ఉంటార‌ట‌. ఇత‌రుల నుంచి వీరు ఎక్కువ‌గా ఆశిస్తార‌ట‌.

బొట‌న‌వేలిని మిగిలిన వేళ్లకు ప‌క్క‌గా తెస్తూ

బొట‌న‌వేలిని మిగిలిన వేళ్లకు ప‌క్క‌గా తెస్తూ

బొట‌న‌వేలిని మిగిలిన వేళ్లకు ప‌క్క‌గా తెస్తూ అప్పుడు పిడికిలిని మూస్తే వారు సెన్సిటివ్ మ‌నస్త‌త్వం క‌లిగి ఉంటార‌ట‌. ఊహాశ‌క్తి ఎక్కువ‌గా క‌లిగి ఉంటార‌ట‌. వీరికి అభ‌ద్ర‌తా భావం ఎక్కువ‌. వీరు ఇత‌రుల పట్ల సిన్సియ‌ర్‌గా ఉంటార‌ట‌. ఏదైనా ఎక్స్ ప్రెస్ చేయాలనుకున్నప్పుడు, ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేని విధంగా ఉంటారు.

కేవలం పెన్ను పట్టుకొనే విధానం మాత్రమే కాదు..

కేవలం పెన్ను పట్టుకొనే విధానం మాత్రమే కాదు..

కేవలం పెన్ను పట్టుకొనే విధానం మాత్రమే కాదు, పెన్నుతో పెట్టే సిగ్నేచర్ ను బట్టి కూడా వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు.

సిగ్నేచర్ అప్ గా ఉన్నట్లైతే

సిగ్నేచర్ అప్ గా ఉన్నట్లైతే

మీరు పెట్టే సిగ్నేచర్ స్టైల్ మీ బిజనెస్ స్టైల్ ను తెలుపుతుంది. సిగ్నేచర్ అప్ గా ఉన్నట్లైతే హ్యాండ్ రైటింగ్ అనలిటిక్స్ ద్వారా వీరి చాలా ధైర్యవంతులుగా ఉంటారు.

సంతకం పెట్టి కింద గీత గీసే వాళ్ళు

సంతకం పెట్టి కింద గీత గీసే వాళ్ళు

సాధారణంగా వీరికి కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వీరు కొన్నింటిని గుడ్డిగా నమ్ముతుంటారు. వాళ్ళకు తెలిసిందే వేదం అనే టైపు. మనుషులను త్వరగా నమ్మరు, నమ్మితే మాత్రం వారి కోసం ప్రాణం ఇచ్చే టైపు.

సిగ్నేచర్ హ్యాండ్ రైటింగ్ కంటే పెద్ద సైజ్ లో ఉంటే

సిగ్నేచర్ హ్యాండ్ రైటింగ్ కంటే పెద్ద సైజ్ లో ఉంటే

సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కాన్సిడెన్స్ శాతం ఎక్కువ, దేనికైనా ముందుంటారు. ధైర్యవంతులు.

సంతకం పెట్టేటప్పుడు అక్షరాలు పై వైపుకు వెళుతుంటే,

సంతకం పెట్టేటప్పుడు అక్షరాలు పై వైపుకు వెళుతుంటే,

వీరు చాలా షార్ఫ్ , పాజిటివ్ ఆటిట్యూడ్ ఉన్నవారు. ఏదైనా విషయాన్ని త్వరగా ఆకలింపు చేసుకుంటారు, అభివృధ్ది పదం వైపు తర్వగా పయనిస్తారు.

సంతకంలో మొదటి అక్షరం సైజ్ పెద్దగా ఉంటే,

సంతకంలో మొదటి అక్షరం సైజ్ పెద్దగా ఉంటే,

నాయకత్వ లక్షణాలెక్కువ ( మహాత్మగాంధీ సంతకంలో మొదటి అక్షరం సైజు పెద్దదిగా ఉంటుంది)

మొదటి అక్షరాన్ని రౌండ్ చేస్తూ సంతకం చేస్తే,

మొదటి అక్షరాన్ని రౌండ్ చేస్తూ సంతకం చేస్తే,

సక్సెస్ కంటిన్యూ గా ఉండదట.

సంతకం చేసి చివరి అక్షరం నుండి గీతను వెనుకకు లాగడం

సంతకం చేసి చివరి అక్షరం నుండి గీతను వెనుకకు లాగడం

గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం మీద ఎక్కువగా దృష్టి పెట్టరు.

సిగ్నేచర్ లో డాట్స్ ఉపయోగించడం

సిగ్నేచర్ లో డాట్స్ ఉపయోగించడం

నేను చాలా బిజీ అనుకునే రకం. నా కేంటీ..? అనే టైపు.

సిగ్నేచర్ లో గ్యాప్ ఎక్కువగా ఉంటే

సిగ్నేచర్ లో గ్యాప్ ఎక్కువగా ఉంటే

ఆరంభ శూరత్వం ఎక్కువ… మంచి మంచి ఐడియాలు చాలనే ఉంటాయ్ కానీ వాటిని కార్యచరణలో పెట్టడంలో మాత్రం విఫలమవుతుంటారు.

English summary

Your style of holding Pen/Pencil reveals your personality!

You may have generally seen that individuals hold pens, pencils in various styles. But, did it ever occur to you that your grip while writing is a mirror to your personality. The moment a kid picks up a color stick, we tend to know their way of handling similar objects. Your style of holding Pen/Pencil reveals your personality traits!, So let's have a look at what they think with these examples.
Subscribe Newsletter