నానా పటేకర్ మీద అపార గౌరవాన్ని పెంచే 10 నమ్మలేని నిజాలు

Subscribe to Boldsky

నానా పటేకర్ ఒక బాలీవుడ్ నటుడిగా మనకు తెలుసు. అతను తన నటనా నైపుణ్యాలతో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. మీలో చాలామందికి నానా పటేకర్ మరో కోణం గురించి తెలియదు, రోడ్ల మీద "జీబ్రా క్రాసింగ్" పెయింటింగ్ వంటి ఉద్యోగాలు సైతం చేశాడoటే నమ్మగలరా..! రహదారులపై పెయింటింగులు మాత్రమే కాదు, సినిమా పోస్టర్లు కూడా అంటించేవారు బ్రతుకుబండిని లాగడానికి.

కడు పేదరికం దగ్గర నుండి పేదలకు ఉదారదాతగా మారిన నానా కథనం మీకోసం.

nana patekar military career

నెలకు 35రూపాయలు సంపాదించిన స్థాయి నుండి రైతులకు అత్యంత ఉదారదాతగా విరాళాలిచ్చే స్థాయికి చేరిన నానా పటేకర్ జీవితం అందరికీ ఒక ఆదర్శప్రాయం అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. నానా పటేకర్ ఇంత సంపాదిస్తున్నా కూడా, లగ్జరీ అనే పదాన్నే పక్కన పెట్టి సాదా జీవితానికే మొగ్గు చూపే వ్యక్తిగా అందరికీ తెలుసు.

1. నానా పటేకర్ అతని తల్లితో

1. నానా పటేకర్ అతని తల్లితో

ఒక విలాసవంతమైన జీవితాన్ని నడపగలిగే శక్తి ఉన్నప్పటికీ, నానా పటేకర్ అతని తల్లితో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు.

2. విరాళం

2. విరాళం

నానా పటేకర్, ప్రతి కుటుంబానికి 15000 రూపాయలు విరాళంగా ఇచ్చాడు. మరాత్వాడ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో దాదాపు 62 కుటుంబాలకు కుటుంబానికి రూ .15,000 విరాళంగా ఇచ్చిన వ్యక్తి నానా పటేకర్.

3. 7000 మందిని అనుసంధానం చేసి

3. 7000 మందిని అనుసంధానం చేసి

నాగపూర్, లాతూర్, హింగోలి, పర్బని, నాందేడ్, ఔరంగాబాద్, తదితర ప్రాంతాల్లో 700 మందిని అనుసంధానం చేసే దిశగా నానా పటేకర్ స్వచ్చంద సంస్థ సిద్దమైంది.

4. 22 కోట్లు రూపాయలు

4. 22 కోట్లు రూపాయలు

నానా పటేకర్ ఫౌండేషన్ రైతు సంక్షేమం కోసం ప్రజల నుండి 22 కోట్ల రూపాయలను సేకరించే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. తద్వారా రైతుల కుటుంబాలకి త్రాగునీటిని అందించడానికి మరియు ఎండిన సరస్సులను నీటితో పూరించడానికి సన్నాహాలు చేస్తుంది. సరస్సులలో నీటిని పునరుద్ధరించే దిశగా నానా పటేకర్ ఫౌండేషన్ ఉంది.

5. ఆర్మీకి సేవలు

5. ఆర్మీకి సేవలు

.ప్రహార్ సినిమాలో తన పాత్రకు న్యాయం చేయాలన్న కసితో, నానా పటేకర్ మూడు సంవత్సరాలపాటు కఠినమైన సైనిక శిక్షణలో పాల్గొన్నాడు. అతనికి కెప్టెన్ గౌరవ హోదా కూడా ఇవ్వబడింది. ఆ చిత్రం యొక్క చివరి షాట్ పూర్తైనప్పటికీ, అతను కార్గిల్ యుద్ధ సమయంలో ఆర్మీకి తన సేవలను అందించాడు.

6. ప్రాహార్లో నానా పటేకర్

6. ప్రాహార్లో నానా పటేకర్

నానా పటేకర్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం మొదటి రోజునే రూ. 80 లక్షలు సేకరించగలిగింది అంటే ప్రజల నుండి వచ్చిన స్పందన అర్ధమవుతుంది.

7. నానా పటేకర్ ఫౌండేషన్

7. నానా పటేకర్ ఫౌండేషన్

నానా పటేకర్ వ్యక్తిగతంగా లాతూర్, మరాఠ్వాడలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యలకు ఒక చిన్న హాల్లో రూ .15,000 చెక్కులను పంపిణీ చేసాడు. పంపిణీ సమయంలో, 5 నిమిషాలు విద్యుత్ కోత అంతరాయం కలిగించగా, ప్రజలు వారి ఫోన్లలో టార్చ్ వేసి కార్యక్రమాన్ని కొనసాగించారు.

8. ఆత్మహత్య చేసుకున్న రైతుల భార్యలతో, నానా పటేకర్

8. ఆత్మహత్య చేసుకున్న రైతుల భార్యలతో, నానా పటేకర్

నానా పటేకర్ ఒకసారి మీడియాతో ఇలా అన్నాడు: "మార్టే డ్యామ్ తక్ జీనే కి వాజా మిల్ గాయి హే ముజే." (నేను చనిపోయేవరకు జీవించడానికి ఒక కారణాన్ని కనుగొన్నాను అని.)

9. నానా తనకోసమే కాకుండా తన స్నేహితుల కోసం వంట

9. నానా తనకోసమే కాకుండా తన స్నేహితుల కోసం వంట

చేయడాన్ని ఇష్టపడుతాడు , స్నేహితులను ఆత్మీయులను ఎప్పుడూ విస్మరించడు. అతను రుచికరంగా వంట చేయడమే కాదు, అతను తన సొంత చేతులతో వారికి భోజనం పెట్టడం చేసేవాడంటే అతిశయోక్తి కాదు.

అగ్నిసాక్షి మరియు ఖామోషి సినిమా షూటింగ్ సందర్భంలో నానాకు మనీషా కొయిరాలాతో దెబ్బతిన్న సంబంధం కూడా ఉంది. కానీ ఆసక్తికరంగా వారు తరువాతి కాలంలో తండ్రి మరియు కుమార్తె పాత్రలను సైతం ఒక సినిమాలో పోషించారు. ఒక సినిమాలో క్రూరమైన భర్త పాత్రను కూడా పోషించాడు. కొంతమంది కథనం ప్రకారం, ఆఫ్ కెమరాలో కూడా నానా పటేకర్ మనీషాతో అలాంటి స్వభావాన్నే ప్రదర్సించేవారని చెప్పుకొచ్చారు.

10. రాణా మూవీ

10. రాణా మూవీ

నానా పటేకర్ బొమ్మలాట్టం సినిమా తమిళంలో ఒక సెన్సేషన్. తెలుగులో రాణాగా వచ్చిన ఈ సినిమాలో ఒక దర్శకునిగా తన భాద్యతను నెరవేర్చే క్రమంలో, హీరోయిన్ పాత్రను కాపాడే క్రమంలో తీసుకున్న నిర్ణయాల మీద నడిచే ఈ సినిమా నటుడిగా నానా పటేకర్ కు తమిళ, తెలుగు సినిమాల్లో అభిమానుల్ని సంపాదించి పెట్టింది. అదేవిధంగా కృష్ణవంశీ తీసిన అంతఃపురం సినిమాను హిందీలో శక్తి పేరు తో తీయగా ప్రకాష్ రాజ్ గారికి ఏమాత్రం తీసిపోని రీతిలో పాత్రను పండించి, నానా పటేకర్ తన ఘనతను చాటుకున్నాడు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాల గురించిన విషయాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం మీద మీ అభిప్రాయాలని క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    10 facts about nana patekar

    Nana Patekar’s story of becoming one of the most generous donors to the farmers from a person earning Rs 35 per month will inspire you beyond the words and expectations. Here are some of the facts about Nana Patekar, a kind man who still prefers living a simple life over several luxuries of life that he can easily afford.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more