For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాకు ఎయిడ్స్ ఉంది, నన్ను కౌగిలించుకుంటే మీకు ఎయిడ్స్ రాదండీ, కన్నీళ్లు తెప్పించే గాథ

వీడియోలో ఉన్న ఒక అమ్మాయి అందరినీ ఆలోచింపజేస్తుంది. ఆమె పేరు అజ్మా. వయస్సు పదహారు సంవత్సరాలు. ఆమెది ఉజ్బెకిస్తాన్‌. ఆమె పదేళ్లుగా హెచ్ ఐవీతో బాధపడుతోంది. తాను చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తుంది

|

ఎయిడ్స్, హెచ్ ఐవీ ఉన్న వాళ్లంటే అందరూ చిన్న చూపు చూస్తారు. వాళ్లతో మాట్లాడడానికే జంకుతారు. ఇక వారిని తాకడం అనేది అసాధ్యం. కనీసం కుటుంబ సభ్యులు కూడా అలా చేయడానికి సాహసం చెయ్యరు. అలా చేస్తే తమకు ఎక్కడ ఎయిడ్స్ వస్తుందేమోమని భయపడే వాళ్లు చాలా మందే ఉంటారు. ఈ విషయంపై చాలా మంది చాలా రకాలుగా ప్రచారం కల్పించినా కూడా పెద్దగా ఉపయోగం లేదు.

అసహ్యించుకుంటారు

ఎయిడ్స్‌ వచ్చిన వాళ్లను అందరూ అసహ్యించుకుంటారు. కొందరు వారు చేయని తప్పుకు కూడా ఎయిడ్స్ బారిన పడుతుంటారు. వారిని కూడా ఈ సమాజం చీత్కరిస్తుంది. అలాంటి వారి గుండెల్లో ఉండే బాధ ఎవరికీ తెలియదు. ఆ రోగం వచ్చిందనే బాధ కన్నా సమాజం చిన్నచూపు చూస్తుందనే బాధతోనే కుంగిపోతుంటారు.

ఏ తప్పు చేయకున్నా

ఏ తప్పు చేయకున్నా

కొందరు చిన్నారులు వారు ఏ తప్పు చేయకున్నా కూడా ఎయిడ్స్ బారిన పడుతుంటారు. వారు అందరి ప్రేమకు దూరమై పడే వేదన వర్ణనాతీతం. ఈ వ్యాధి విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడింది. ఎయిడ్స్ ను అందరూ అంటు వ్యాధిలా చూస్తున్నారు. ఎయిడ్స్ సోకిన వారిని చూసిన కూడా తమకు ఆ వ్యాధి వస్తుందేమోనని భయపడుతుంటారు. అయితే ఈ విషయంపై యునిసెఫ్‌ ఒక అవగాహన కార్యక్రమం కల్పించాలనుకుంది. దాంతో ఒక వీడియో రూపొందించింది.

ఆమె పేరు అజ్మా

ఆమె పేరు అజ్మా

ఆ వీడియోలో ఉన్న ఒక అమ్మాయి అందరినీ ఆలోచింపజేస్తుంది. ఆమె పేరు అజ్మా. వయస్సు పదహారు సంవత్సరాలు. ఆమెది ఉజ్బెకిస్తాన్‌. ఆమె పదేళ్లుగా హెచ్ ఐవీతో బాధపడుతోంది. తాను చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తూనే, మరో పక్క తన జీవితంలో ప్రతి క్షణాన్ని ఆమె ఆస్వాదిస్తోంది.

కౌగిలించుకున్నారు

ఇక ఆ వీడియోలో అజ్మా తన చేతిలో ఒక ప్ల కార్డ్ ను పట్టుకుని రోడ్డు పక్కన నిలబడి ఉంది. ప్ల క్లార్డ్ పై ఉన్న మెసేజ్ ని చూసి అందరూ ఆమెను దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నారు. ప్ల క్లార్డ్ పై తనకు హెచ్ ఐవీ ఉన్నట్లు తెలిపింది అజ్మా. తనను హగ్ చేసుకోండని అభ్యర్థించింది ప్రేమగా.

అక్రమ సంబంధాల వల్ల ఎయిడ్స్

అక్రమ సంబంధాల వల్ల ఎయిడ్స్

తర్వాత అజ్మా తన గురించి ఇలా చెప్పింది. " నాకు పదేళ్ల క్రితమే హెచ్ ఐవీ ఉందని తెలిసింది. దేవుడి దయ వల్ల నేను ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. ఎయిడ్స్ రక్త మార్పిడి వల్ల వస్తుంది. అలాగే తల్లి నుంచి బిడ్డకు కూడా వ్యాప్తిస్తుంది. అక్రమ సంబంధాల వల్ల ఎయిడ్స్ వస్తుంది.

అంతేగానీ ఎయిడ్స్ ఉన్న వారిని ముట్టుకుంటే రాదు. వారితో మాట్లాడినంత మాత్రానా ఎయిడ్స్ రాదు. వారితో పాటు కలిసి తిన్నంత మాత్రాన ఎయిడ్స్ రాదు. " అని ఒక మెసేజ్ ఇచ్చింది.

కనికరం చూపండి

కనికరం చూపండి

ఇప్పటికైనా జనాలు అవగాహన తెచ్చుకుని ఎయిడ్స్ రోగులను ఆదరించండి. వారి పట్ల కనికరం చూపండి. ఇక యునిసెఫ్‌ ఈ వీడియో ను పోస్ట్ చేయడంతో కొన్ని లక్షల మంది నుంచి దీనికి స్పందన లభించింది.

English summary

16 year old hiv positive girl requesting hugs from strangers watch what happens next

16 year old hiv positive girl requesting hugs from strangers watch what happens next
Desktop Bottom Promotion