For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేఘన్‌ మెర్కెల్‌ యువరాణి అయినా.. తినాలన్నా పడుకోవాలన్నా సెల్ఫీ దిగాలన్నా డ్రెస్ వేసుకోవాలన్నా రూల్స్

బ్రిటన్ యువరాజు హ్యారీతో మేఘన్‌ ప్రేమలో ఉన్నప్పుడు బాగా ఫేమస్ అయ్యింది 2016 ఏడాదికి గానూ మోస్ట్ సెర్చ్‌డ్‌ నటిగా మేఘన్ రికార్డు సృష్టించింది. మేఘన్‌ మెర్కెల్‌, బ్రిటన్ యువరాణి, ప్రిన్స్ హ్యారీ

|

ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ-నటి మేఘన్ మెర్కెల్‌ల వివాహం ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగింది. 600 మంది విశిష్ట అతిథుల సమక్షంలో హ్యారీ-మేఘన్‌లు ఒక్కటయ్యారు.

ప్రిన్స్‌ హ్యారీ భార్య అయిన మేఘన్‌ మెర్కెల్‌ గురించి తెలియన విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఈమె
ఎలా ప్రేమలో పడిందీ, పెళ్లి ఎప్పుడు నిశ్చయం అయిందీ అనే విశేషాలన్నీ కాస్త ఆసక్తికరమే. ఆమెకున్న కాలిగ్రఫీ (సొగసైన చేతిరాతలో నైపుణ్యం) హాబీ వరకు మెర్కెల్‌ గురించి ప్రతిదీ ప్రధానంగా ఆకర్షించే అంశమే.

ఒకరిద్దరికి మాత్రమే పిలుపు

ఒకరిద్దరికి మాత్రమే పిలుపు

మెర్కెల్, హ్యారీల వివాహానికి మన దేశం నుంచి ఒకరిద్దరికి మాత్రమే పిలుపు అందింది. ఆ ఒకరిద్దరి లో ముంబై మురికివాడల్లో ఉన్న మైనా అనే స్వచ్ఛంద మహిళా సంస్థ ప్రతినిధులు కూడా ఉండడం విశేషం. ఇక విశిష్ట అతిథుల కేటగిరీలో ప్రియాంక చోప్రా పెళ్లికి వెళ్లొచ్చారు.

అందుకే ఆహ్వానం

అందుకే ఆహ్వానం

ఇక మైనా వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా ఇన్విటేషన్‌ అందుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. గత ఏడాది జనవరిలో మేఘన్‌ మెర్కెల్‌ ముంబయికి వచ్చి ధారవీ బస్తీ మహిళలతో, మైనా ప్రతినిధులతో కలివిడిగా కూర్చుని కబుర్లాడి వెళ్లారు. స్త్రీ సాధికారత దిశగా పనిచేస్తున్న ఈ మహిళల నుంచి మెర్కెల్ స్ఫూర్తి పొందారు. అందుకే వీరికి ఆహ్వానం అందింది.

మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం

మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం

బ్రిటన్ యువరాజు హ్యారీతో మేఘన్‌ ప్రేమలో ఉన్నప్పుడు బాగా ఫేమస్ అయ్యింది 2016 ఏడాదికి గానూ మోస్ట్ సెర్చ్‌డ్‌ నటిగా మేఘన్ రికార్డు సృష్టించింది. తనకంటే వయసులో మూడేళ్లు పెద్దదైన నటి మేఘన్‌ తో డేటింగ్ చేస్తున్నట్లు హ్యారీ కూడా అప్పట్లో బహిరంగంగానే తెలిపాడు. ప్రేమించుకుంటున్నాం.. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.. ఎంతో సంతోషంగా ఉన్నామంటూ అప్పట్లో మేఘన్ కూడా తన ప్రేమను బహిరంగంగానే చెప్పింది.

విడాకులు తీసుకున్న మేఘన్

విడాకులు తీసుకున్న మేఘన్

‘సూట్స్' షూటింగ్ సమయంలో టోరంటోలో తొలిసారి వీరిద్దరి పరిచయం జరిగింది. అక్కడే వీరి తొలి చూపులు కలిశాయి. అప్పటినుంచి వీరు తరచుగా కలుసుకోవడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోయింది. నిర్మాత ట్రెవర్ ఇంగెల్సన్‌తో మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న మేఘన్ మార్కెల్ ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో యువరాజు హ్యారీతో పరిచయం.. ప్రేమగా మారి.. తర్వాత పెళ్లి చేసుకున్నారు.

చాలా రూల్స్

చాలా రూల్స్

ఇక మేఘన్ మార్కెల్ యువరాణి అయినప్పటికీ ఆ స్థాయిలోనే రూల్స్ వుంటాయి. మునుపటిలా ఆమె జీవితాన్ని గడపలేరు. యువరాణిగా ఆమెకు సకల సౌకర్యాలు లభించటంతో పాటు రాజ వంశీకులుగా కొన్ని ఆంక్షలు కూడా వర్తిస్తాయి. ఆ రూల్స్ ప్రకారం సెల్ఫీలు తీసుకోవడం, ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం చేయకూడదు.

మహారాణి కంటే ముందే నిద్రపోకూడదు

మహారాణి కంటే ముందే నిద్రపోకూడదు

సోషల్‌ మీడియాలో అకౌంట్‌లు ఉండకూడదు. మినీ స్కర్ట్స్‌కు దూరంగా ఉండాలి. డిన్నర్‌ను రాత్రి 8.30 నుంచి 10లోపు ముగించేయాలి. మహారాణి కంటే ముందే నిద్రపోకూడదు. తన కంటే పై స్థాయిలోని వారిని మర్యాదపూర్వకంగా గౌరవించాలి. యువరాణి అయినా మేఘన్‌‌కు నిబంధనలు పాటించక తప్పదట.

ఆసక్తికర అంశాలు

ఆసక్తికర అంశాలు

అయితే మేఘన్‌ మెర్కెల్‌ వంశ వృక్షంలో ఆసక్తికర అంశాలు

వర్ణాలన్నీ వివర్ణమయ్యాయి. రాకుమారుడు హ్యారీ, అమెరికా నటి మేఘన్‌ మెర్కెల్‌ వివాహంతో బ్రిటీష్‌ రాజ వంశంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఓ సాధారణ కుటుంబంలో ఒంటరి అమ్మ చాటున పెరిగిన మేఘన్‌.. ‘డచెస్‌ ఆఫ్‌ ససెక్స్‌'గా రాజ ప్రాసాదంలో రాణివాసం చేస్తోంది. అయితే మేఘన్‌ కుటుంబానికి సంబంధించి ప్రపంచానికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి.

బానిస కష్టాలు

బానిస కష్టాలు

వంశ వృక్ష నిపుణురాలు లెస్లే అండర్సన్‌ మాటల ప్రకారం..మేఘన్‌ మెర్కెల్‌ కుటుంబంలో బానిస కష్టాలతోబాటు రాచరిక మూలాలు కూడా ఉన్నాయి. ‘మేఘన్‌ తల్లి తరఫున నాలుగు తరాల ముందు అంతా బానిసలు. ఆమె ముత్తమ్మకు అమ్మ అయిన నాన్సీ బొవర్స్‌ 1820లో జార్జియాలో పుట్టారు.' అని అండర్సన్‌ చెబుతున్నారు.

బానిసలా పనిచేశారు

బానిసలా పనిచేశారు

1900 నాటి జనాభా లెక్కల ఆధారంగా మేఘన్‌ తల్లివైపు సమాచారాన్ని సేకరించినట్లు తెలిపారు. 80 ఏళ్లు జీవించిన నాన్సీ.. జార్జియాలోని జోన్ ‌సబోరో తోటల్లో బానిసలా పనిచేశారు. 1860 నుంచి నాన్సీ సంతానం జార్జియాను విడిచి అమెరికా వైపు కదిలారు. మెర్కెల్‌ ముత్తాత తండ్రి జోసెఫ్‌ బెట్‌ అమెరికా సివిల్‌ వార్‌లో కూడా పాల్గొన్నారు.

మేకప్‌ ఆర్టిస్ట్ గా

మేకప్‌ ఆర్టిస్ట్ గా

మెర్కెల్‌ ముత్తాత స్టీవ్‌..లాస్‌ ఏంజెలిస్‌ చేరుకున్నారు. 1930లో మెర్కెల్‌ తాతగారైన అన్విన్‌ పుట్టారు. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు మెర్కెల్‌ తల్లి డోరియా పుట్టింది. మేకప్‌ ఆర్టిస్ట్ గా పనిచేసిన డోరియాకు 23వ ఏట టీవీ లైటింగ్‌ డైరెక్టర్‌ థామస్‌ మెర్కెల్‌తో పెళ్లయింది. 1981, ఆగస్టు 4న మేఘన్‌ మెర్కెల్‌ పుట్టింది. మెర్కెల్‌కు 2వ ఏట వారిద్దరూ విడిపోయారు.

మేఘన్‌ రాచరిక మూలాలు

మేఘన్‌ రాచరిక మూలాలు

మేఘన్‌ తండ్రి థామస్‌ తరఫు వంశవృక్షాన్ని పరిశీలిస్తే.. 14వ శతాబ్దంలో ఇంగ్లండ్‌ రాజుగా, లార్డ్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌గా వ్యవహరించిన ఎడ్వర్డ్‌-3 నుంచి మొదలుపెట్టి..1509తో ఇంగ్లండ్‌ను పాలంచిన హెన్రీ-8 మూడో భార్య జేన్‌ సేమోర్‌ వరకూ రాచరిక మూలాలు కనిపిస్తాయి. సేమోర్‌ కొన్నేళ్లపాటు ఇంగ్లండ్‌ రాణిగా చక్రం తిప్పారు. మెర్కెల్‌ తండ్రి తరఫు పూర్వీకులు ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ల నుంచి అమెరికాకు వలస వెళ్లారు.

బాల్యంలో పేదరికం

బాల్యంలో పేదరికం

ఇలా విభిన్న జాతులు, నేపథ్యాల్లో పెరిగిన మెర్కెల్‌ బాల్యంలో పేదరికం అనుభవించారు. మంచి నటిగా ఎదిగిన మెర్కెల్‌ తన సంపాదనను సమాజ సేవకు ఖర్చుచేశారు. ఆ సేవా భావమే ప్రిన్స్‌ హ్యారీని ఆకర్షించింది. విడాకులు తీసుకున్న మెర్కెల్‌ను తన జీవితంలోకి ఆహ్వానించేలా చేసింది. బ్రిటీష్‌ రాజవంశంలో అడుగు పెట్టిన తొలి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా మేఘన్‌ మెర్కెల్‌ సంచలనం సృష్టిస్తున్నారు.

English summary

20 interesting things to know about meghan markle

20 interesting things to know about meghan markle
Story first published:Wednesday, May 30, 2018, 12:44 [IST]
Desktop Bottom Promotion