For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చివరి నిజాంకు వందల సంఖ్యలో ఉంపుడు గత్తెలు? భార్యలు!

నిజాం కి భార్యలు, ఉంపుడు గత్తె (కీప్)ల విషయంలో చరిత్ర కారులలో స్పష్టత లేదు. అప్పట్లో ఆయనకు ఎంత మంది ఉంపుడు గత్తెలు ఉండేవారో నిజాంకి కూడా స్పష్టంగా తెలియదట.

By Bharath
|

ఉస్మాన్ ఆలీ ఖాన్.. మహబూబ్ ఆలీ ఖాన్ రెండవ కుమారుడు. 1911లో నిజాం మరణించడంతో ఇతడు ఏడో అసఫ్ జా బిరుదుతో నైజాం పదవిని అలంకరించాడు. ఈయనే అసఫ్ జాహీ పాలకులలో చివరివాడు. ఈయన హైదరాబాదులోని పురానీ హవేలీలో జన్మించాడు.

1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాదును స్వతంత్ర రాజ్యం చేయడానికి నిజాం ప్రయత్నించాడు. నిజాంతో అనేక సంప్రదింపులు జరిపిన భారత ప్రభుత్వం చివరకు సెప్టెంబరు 13, 1948న ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య జరిపి హైదరాబాదు సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసింది.

1956లో జరిగిన భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వలన నిజాం రాజ ప్రముఖ్ పదవి కోల్పోయాడు. ఈయన 1957, 1962 సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం, కర్నూలు నియోజకవర్గాల నుంచి భారత పార్లమెంటుకు రెండు సార్లు ఎన్నికయ్యారు. చివరి నిజాం పాలన లో రజాకార్ల అరాచకాల గురించి మనకు తెలిసిందే. అయితే అతని గురించి ఇంకా చాలా విషయాలు మీకోసం..

ప్రపంచంలో ధనికుడు

ప్రపంచంలో ధనికుడు

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పట్లో ప్రపంచంలోనే ధనికుడు. 1930 నుంచి 1940 వరకు ఇతన్ని మించిన ధనవంతుడు ప్రపంచంలోనే ఎవరూ ఉండేవారు కాదు. ఈయన ఆదాయం $2 బిలియన్లు. అప్పట్లో ఇదొక రికార్డ్.

చాలా పెద్ద కుటుంబం

చాలా పెద్ద కుటుంబం

అప్పట్లోనే దేశ నగరాల్లో హైదరాబాదు ఐదో స్థానం లో ఉండేది. హైదరాబాద్ లో కమాల్ ఖాన్ అనే వ్యాపారి కట్టుకున్న భవంతి కింగ్ కోటి లో తన వందలాది మంది కుటుంబ సభ్యులతో నిజాం నివసించే వాడు. అయితే మిగిలిన తెలంగాణా ప్రాంతమంతా అధమ స్థానంలో ఉండేది.

చాలా పెద్ద ప్రాంతానికి రాజు

చాలా పెద్ద ప్రాంతానికి రాజు

నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చాలా పెద్ద ప్రాంతానికి రాజుగా ఉండేవాడు. ఇతను స్కాట్లాండ్, ఇంగ్లాడ్ రెండింటిని కలిపితే ఉండేంత ప్రాంతానికి రాజుగా వ్యవహరించాడు.

పేపర్ వెయిట్ కోసం డైమండ్

పేపర్ వెయిట్ కోసం డైమండ్

మనం పేపర్ వెయిట్ కోసం ఏదో ఒక చిన్న బరువున్న దాన్ని ఉపయోగిస్తుంటాం. కానీ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేపర్ వెయిట్ కోసం వజ్రాన్ని ఉపయోగించేవాడు. అది కూడా చాలా ఎక్కువ బరువు ఉండేది.

టైమ్ పత్రికపై

టైమ్ పత్రికపై

టైమ్ పత్రిక 1937 సంవత్సరంలో నిజాంను ప్రపంచంలోని అత్యంత ధనవంతునిగా ప్రచురించింది. కశ్మీర్, జోద్ పూర్, బికనీర్, ఇండోర్, భోపాల్ ప్రాంతాల రాజులతో పోల్చుకుంటే అప్పట్లో ఈయనే బాగా రిచ్ పర్సన్.

£200 మిలియన్ల విలువ చేసే జ్యువెలరీ

£200 మిలియన్ల విలువ చేసే జ్యువెలరీ

నిజాం దగ్గర 173 రకాల జ్యువెలరీస్ ఉండేవి. వీటి ఖరీదు అప్పట్లోనే సుమారు £200 మిలియన్లు. అయితే 1995లో అప్పటి ప్రభువ్త £33 మిలియన్లకు వీటిని కొనుగోలు చేసింది.

యాభై మంది భార్యలు... వందలాది మంది కీప్ లు

యాభై మంది భార్యలు... వందలాది మంది కీప్ లు

నిజాం కి దాదాపు 50 మంది భార్యలు, వందల్లో ఉంపుడు గత్తె (కీప్) లు ఉండేవారు. వీరి సంఖ్య కరెక్ట్ గా ఎంత ఉంది అనే విషయంలో చరిత్ర కారులలో స్పష్టత లేదు. అప్పట్లో ఆయనకు ఎంత మంది ఉంపుడు గత్తెలు ఉండేవారో నిజాంకి కూడా స్పష్టంగా తెలియదట.

దారుణంగా పన్నులు

దారుణంగా పన్నులు

ప్రజల తలసరి తలసరి ఆదాయం, ప్రజలకు అందే విద్య, వైద్య సౌకర్యాలు, శాంతిభద్రతలు, ప్రజల హక్కులు, అధికారుల దాష్టీకంపై నియంత్రణ... ఇలాంటి వన్నీ అత్యంత అధ్వానంగా ఉండేవి. పన్నులను దారుణంగా విధించేవారు.

చదివితే ఎదురుతిరుగుతారని భయం

చదివితే ఎదురుతిరుగుతారని భయం

నిజాం రాజ్యంలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉండేది. చదువుకున్నవాళ్లు తనకు ఎదురు తిరుగుతారన్న భయం కొద్దీ నగరంలో తప్ప వేరెక్కడా కాలేజీలు, హైస్కూళ్లు లేకుండా చేశాడు. గ్రామాలో బళ్లు వుండేవి కావు. పట్టణాలలో ఉన్న వాటిలో కూడా ఉర్దూ మీడియంలోనే నిర్వహించేవారు.

దేవదాసీ వ్యవస్థకు చెక్

దేవదాసీ వ్యవస్థకు చెక్

పదవి చేపట్టగానే ఉస్మాన్‌ వెట్టి చాకిరీని, దేవదాసీ వ్యవస్థను నిషేధించాడు. సంపన్నులు ఆడే కోడిపందాలు, ఎడ్లపోటీలను కట్టడి చేశాడు. ప్రభుత్వోద్యోగుల కోసం జమీందారులు ఏర్పరచే గానాబజానాలను నిషేధించాడు.

అజంతా, ఎల్లోరా

అజంతా, ఎల్లోరా

అజంతా, ఎల్లోరా గుహల్లోని చిత్రాలు కాపాడడానికి చర్యలు తీసుకున్నాడు. హైదరాబాదులో హైకోర్టు కట్టించాడు. మూసీనది పొడవునా కరకట్టలు పటిష్టపరిచాడు. మూసీపై డ్యామ్‌ను నిర్మించాడు. ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ తవ్వించాడు. వీధులు విస్తరించాడు. సిమెంటు రోడ్లు వేశాడు. 1000 కెవి థర్మల్‌ స్టేషన్‌ నెలకొల్పారు. నగర అభివృద్ధికోసం ట్రస్టును ఏర్పరచాడు. తన రాజ్యాన్ని సముద్రం అవతలికి విస్తరించాలంటే సముద్రతీరానికి మార్గం వుండాలని యోచించిన నిజాం మడగావ్‌ రేవుకు చేరడానికై హైదరాబాదు నుంచి గదగ్‌కు రైల్వే లైను వేయించాడు.

చాలా ప్రాజెక్ట్ లు

చాలా ప్రాజెక్ట్ లు

తెలంగాణా లోని మొత్తం భూమి లో సారవంతమైనది 40% ఉండేది ఈ భూమి అంతటికి యజమాని నిజామే.. మిగిలిన 60% భూమిలో సింహ భాగం జాగిర్దార్ ల ఆధిపత్యం కింద ఉండేది. వీరు నిజాం కి తరుచుగా భారీ నజరానా లు సమర్పిస్తుండే వారు. 1935 నాటికి నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఈయన చాలా ప్రాజెక్ట్ లు కట్టించారు.

అవినీతిపరులకూ పదవులు

అవినీతిపరులకూ పదవులు

పన్నుల రూపం లో వసూలు చేసిన సొమ్ము నుండి పెద్ద మొత్తం రాజభరణం గా స్వీకరించేవాడు. అంతేకాదు, నజరానాల రూపంలో పదవులు ఆశించే జమీందార్ల నుంచి, ఉద్యోగార్థుల నుంచి చాలా డబ్బు, కానుకలు వసూలు చేసేవాడు. నజరానా చెల్లించినవారు అసమర్థులైనా, అవినీతిపరులైనా సరే పదవులు యిచ్చేసేవాడు. రాజ్య పరిస్థతి తెలుసుకోవడానికి తొలినాళ్లలో రాజ్యంలో పర్యటనలు చేసిన నిజాం తర్వాతి రోజుల్లో కానుకలు వసూలు చేసుకోవడానికి మాత్రం వెళ్లేవాడు.

సిద్దిక్‌ దీన్‌దార్‌

సిద్దిక్‌ దీన్‌దార్‌

సిద్దిక్‌ దీన్‌దార్‌ అనే వ్యక్తి మతమార్పిడులను ప్రోత్సహిస్తూ ఉద్యమం నడిపాడు. సిద్దిక్‌ చర్యలకు తమకు సంబంధం లేదని ప్రభుత్వం ప్రకటించింది కానీ హిందువులు నమ్మలేదు. ఈ వివక్షతకు, మతమార్పిడికి వ్యతిరేకంగా ఆర్యసమాజ్‌ 1937 నుండి పోరాడసాగింది.

జైల్లో పెట్టాడు

జైల్లో పెట్టాడు

ఎలాంటి ఉద్యమకారులైనా సరే అంతిమంగా తన అధికారానికి ముప్పుగా తయారవుతారని అతని భయం. వీళ్లని జైల్లో పెట్టాడు. పత్రికలు పెట్టనిచ్చేవాడు కాడు. సభలు జరపనిచ్చేవాడు కాడు. జమీందార్ల ద్వారా ప్రజలను అణచివేసేవాడు. వారి స్వేచ్ఛను హరించాడు. రాజ్యంలో మూడోవంతు జాగీర్ల రూపంలో వుంది. రాజ్యం యొక్క మొత్తం ఆదాయం 8 కోట్ల రూపాయలుంటే దానిలో 70% ఆదాయం 19 మంది జాగీర్దార్లకు వచ్చేది. జాగీర్దార్లు తమ సొంత ప్రాంతాలలో ప్రభుత్వ ప్రాంతాలతో పోలిస్తే పది రెట్ల పన్నులు వసూలు చేసేవాళ్లు, ప్రజలను పీడించేవారు. వెట్టి చాకిరీ మళ్లీ వచ్చేసింది. నజరానాలు ముడుతున్నందున నిజాం నోరెత్తేవాడు కాడు.

బ్రిటన్‌కు విపరీతంగా సహాయం

బ్రిటన్‌కు విపరీతంగా సహాయం

1940 తరువాత నల్లమందుకి అలవాటు పడ్డాడు. ఏ దివాన్‌ను సవ్యంగా పాలించనివ్వలేదు. ఇంతలో రెండవ ప్రపంచయుద్ధం వచ్చింది. బ్రిటన్‌కు విపరీతంగా సహాయం చేసి వాళ్ల ఆదరాన్ని మరింతగా పొందాడు. భారతదేశం నుండి విడిచిపెట్టే రోజు వస్తే తన రాజ్యం తనకు అప్పగించి వెళతారని నమ్మాడు.

కీలుబొమ్మగా

కీలుబొమ్మగా

ఖాశీం రజ్వీ నాయకత్వాన రజాకార్లు చేసిన దోపిడీలు, ఘాతుకాలు అన్నీ యిన్నీ కావు. (ఎన్ని అరాచకాలు చేస్తున్నా నిజాం వాళ్లను ఏమీ అనలేదు). రజ్వీ బంగాళాఖాతం దాకా తన రాజ్యాన్ని విస్తరింపచేస్తాడని ఆశ పెట్టుకుని నిజాం అతని చేతిలో కీలుబొమ్మగా మారాడు. జాగీర్దార్లకు, రజాకార్లకు, కాంగ్రెసువారికి, కమ్యూనిస్టులకు మధ్య తన రాజ్యంలో అంతర్యుద్ధం జరిగినా పట్టించుకోలేదు.

రాచరికం నుంచి విముక్తి

రాచరికం నుంచి విముక్తి

తను స్వతంత్ర రాజుగా వెలగాలి. కుదరకపోతే పాకిస్తాన్‌లో విలీనమవ్వాలి. తన రాష్ట్రంలో 85% మంది హిందువులు ఎలా వున్నా తనకు అనవసరం. 1948లో పోలీసు చర్యతో సర్దార్‌ పటేల్‌ నిజాం ఆశలు అడుగంటించాడు. సెప్టెంబర్ 17 నాడు తెలంగాణా ప్రజలకు రాచరికం నుంచి విముక్తి దొరికింది.

Image Source :http://www.southreport.com/

English summary

25 facts might not known last nizam hyderabad

25 facts might not known last nizam hyderabad
Story first published:Monday, January 22, 2018, 16:28 [IST]
Desktop Bottom Promotion