For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ చెయ్యి కేరళ వరదల నుంచి మున్నార్ ని కాపాడింది, అది దేవుని చెయ్యి

కేరళలో ఇటీవల సంభవించిన జల ప్రళయం గురించి అందరికీ తెలిసిందే. వందలాది మంది ప్రాణాలు కోల్పొయారు. అయితే కొన్ని మానవ తప్పిదాల వల్లే ప్రకృతి ఇలా ప్రకోపం చూపించింది. ఇప్పుడిప్పుడే కేరళ మళ్లీ కోలుకుంటుంది.

|

కేరళలో ఇటీవల సంభవించిన జల ప్రళయం గురించి అందరికీ తెలిసిందే. వందలాది మంది ప్రాణాలు కోల్పొయారు. అయితే కొన్ని మానవ తప్పిదాల వల్లే ప్రకృతి ఇలా ప్రకోపం చూపించింది. ఇప్పుడిప్పుడే కేరళ మళ్లీ కోలుకుంటుంది. గత శతాబ్ద కాలంలో ఎప్పుడూ లేని విధంగా కేరళలో వరదలు సంబశించాయి.

ఆసక్తికర ఘటనలు

ఆసక్తికర ఘటనలు

కేరళ వరదలప్పుడు చాలా ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి కాస్త ప్రత్యేకంగా ఉంది. వరదనీటిలో మునిగిన పెద్ద బండరాయి ఆసక్తికరంగా కనిపించింది.

మనిషి చేయి ఆకారంలో

మనిషి చేయి ఆకారంలో

ఆ పెద్ద బండరాయి మనిషి చేయి ఆకారంలో కనిపించిది. మనిషి మొత్తం మునిగి కేవలం చెయ్యి ఒక్కటే పైకి ఎత్తినట్లుగా ఆ శిల కనిపించింది.

మున్నార్ ప్రాంతంలో

మున్నార్ ప్రాంతంలో

కేరళలోని మున్నార్ ప్రాంతంలో ముతిరాపుజ్హ నదిలో ఇలాంటి రాయి కనపించింది. చాలా మంది దాన్ని దూరం నుంచి మనిషి చేయి అనుకున్నారు. కొందరు ఫొటోగ్రాఫర్లు దాన్ని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది.

దేవుని చేయి

దేవుని చేయి

అయితే స్థానికులు చేతి ఆకారంలో ఆ పెద్ద బండను దేవుడిలా చూస్తున్నారు. అది మున్నార్ ను రక్షించిన "దేవుని చేయి" అంటూ ప్రజలు కొలుస్తున్నారు. జల ప్రవాహాన్ని అడ్డుకుంటూ మీకు నేనున్నానంటూ అభయమిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఆ పెద్ద కొండరాయి. గత కొన్ని రోజులుగా ఆ నదిలో ఇది అలాగే కనిపిస్తూ ఉంది. మీరు ప్రస్తుతం మున్నార్ వెళ్తే కొచ్చి-డాన్షుకోడి బైపాస్ బ్రిడ్జ్ పై నుంచి దీన్ని చూడొచ్చు.

English summary

A Hand like Structure Appeared In Munnar After The Kerala Floods

A Hand like Structure Appeared In Munnar After The Kerala Floods
Story first published:Saturday, September 1, 2018, 15:54 [IST]
Desktop Bottom Promotion