For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి ఎందుకు బహిష్కరణకు గురయ్యారు? స్వామిజీ చేసిన వ్యాఖ్యలు ఏమిటి?

శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందపై హైదరాబాద్‌ పోలీసులు హైదరాబాద్ నగర బహిష్కరణ విధించారు. తాజాగా కత్తి మహేశ్ ను నగర బహిష్కరణ చేయించిన పోలీసులు మళ్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

|

శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందపై హైదరాబాద్‌ పోలీసులు హైదరాబాద్ నగర బహిష్కరణ విధించారు. తాజాగా కత్తి మహేశ్ ను నగర బహిష్కరణ చేయించిన పోలీసులు మళ్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలు పరిపూర్ణానంద స్వామి ఈ మధ్య వార్తల్లో నిలవడానికి, హైదరాబాద్ నుంచి బహిష్కరణ కావాడానికి కారణాలు, అందుకు సంబంధించిన విషయాలివే.

కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు

కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు

ఇటీవల ఓ ఛానల్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీరాముడి గురించి కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. చర్చా కార్యక్రమంలో కత్తి మహేష్ మాట్లాడుతూ.. 'రామాయణం అనేది నాకొక కథ.. రాముడనేవాడు ఎంత ఆదర్శవంతుడో అంత దగుల్బాజీ అని నేను నమ్ముతా. ఆ కథలో సీత బహుశా రావణుడితోనే ఉంటే బాగుండేదేమో.. న్యాయం జరిగి ఉండేదేమో ఆవిడకి అని నేననుకుంటా' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

యాత్రకు అనుమతి నిరాకరణ

యాత్రకు అనుమతి నిరాకరణ

కత్తి మహేశ్ మాటలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద

హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో కత్తిమహేశ్ ను కడిగిపారేశాడు. అలాగే హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు స్వామి పరిపూర్ణానంద స్వామిపూనుకున్నారు. కాగా, ఈ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మూడు రోజులుగా ఆయన గృహ నిర్బంధంలోనే ఉన్నారు.

పెట్రోల్ పోసుకొని

పెట్రోల్ పోసుకొని

దీంతో పరిపుర్ణానందకు మద్దుతుగా పలు హిందూ సంస్థల ప్రతినిధులు నిరసన తెలిపారు. జుబ్లీహిల్స్‌లోని పరిపూర్ణానంద స్వామి నివాసం వద్ద ఉద్రిక్తత కూడా నెలకొంది. హిందూత్వవాదులు, ఆయన అనుచరులు పెద్దసంఖ్యలో ఇంటివద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్వామి పరిపూర్ణనంద ఇంటి వద్ద ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

నిరసనకారులందరీ అరెస్ట్

నిరసనకారులందరీ అరెస్ట్

పెట్రోల్‌ డబ్బాతో వచ్చిన అతను.. స్వామిజీ మద్దతుగా ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్‌ చేశాడు. అతను ఒంటిపై పెట్రోల్‌ పోసుకుంటుండగా అడ్డుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. తర్వాత పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అలాగే నిరసనకారులందరినీ అరెస్ట్ చేశారు.

వెంటనే విడుదల చేయాలి

వెంటనే విడుదల చేయాలి

తర్వాత పరిపూర్ణానంద స్వామి మాట్లాడారు. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దేవాలయానికి కూడా వెళ్లనివ్వడం లేదని, మంచిపై దాడి చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వారి విచక్షణకే వదిలేస్తామని తెలిపారు. రామ భక్తులంతా జైల్లో ఉన్నారని, బేషరతుగా విడిచిపెట్టాలన్నారు.

పోలీసులు మాత్రం యాత్ర జరగనివ్వలేదు

పోలీసులు మాత్రం యాత్ర జరగనివ్వలేదు

తన ఒక్కడికైనా పాదయాత్ర అనుమతి ఇవ్వాలని ఆయన డీజీపీకి విజ్ఞప్తి చేశారు. తాము ఏవరిపైనా విమర్శలు చేయమని అనుమతివ్వాలన్నారు. దాడి చేయొచ్చని అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారని.. అమరనాథ్‌ యాత్రికులపై దాడులు జరుగుతున్నాయని భక్తులను అడ్డుకుంటారా ప్రశ్నించారు. అయినా పోలీసులు మాత్రం యాత్ర జరగనివ్వలేదు.

ఆరు నెలల పాటు నగరంలోకి ప్రవేశించకూడదు

ఆరు నెలల పాటు నగరంలోకి ప్రవేశించకూడదు

అయితే గతేడాది నవంబర్‌లో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన సమావేశంలో పరిపూర్ణానంద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే బహిష్కరణ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్‌ నగరం నుంచి తరలించారు. ఆయన ఆరు నెలల పాటు నగరంలోకి ప్రవేశించకూడదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత బహిష్కరణకు గురైన రెండో వ్యక్తి

తెలంగాణ ఏర్పడిన తర్వాత బహిష్కరణకు గురైన రెండో వ్యక్తి

పోలీసుల చర్యను హిందూ ధార్మిక సంఘాలతో పాటు భాజపా తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో స్వామి పరిపూర్ణానందపై పోలీసులు నగర బహిష్కరణ విధించడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బహిష్కరణకు గురైన తొలి వ్యక్తి కత్తి మహేశ్‌ కాగా.. రెండో వ్యక్తి స్వామి పరిపూర్ణానంద.

పోలీసులు స్పష్టం చేయలేదు

పోలీసులు స్పష్టం చేయలేదు

పరిపూర్ణనంద స్వామిని మొదట ఎక్కడికి తరలించారనే విషయాన్ని మాత్రం పోలీసులు స్పష్టం చేయలేదు. మొదట తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి పరిపూర్ణనంద స్వామినితరలించారు. ఆయనను తరలించడంలో పోలీసులు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించినట్లు సమాచారం. కొన్ని వాహనాలను ఒకవైపు, మరికొన్ని వాహనాలను మరోవైపు పంపారు.

మొదట క్లారిటీ రాలేదు

మొదట క్లారిటీ రాలేదు

నాలుగు వాహనాల్లో బయలు దేరిన పోలీసులు రెండు వాహనాలను విజయవాడ వైపు, మరో రెండు వాహనాలను శ్రీశైలం వైపు పంపించారు. ఈ రెండు మార్గాల్లో ఆయన్ను ఎక్కడికి తరలించారనే విషయాన్నిపోలీసులు వెల్లడించలేదు. ఆయన స్వస్థలమైన కాకినాడకు తరలిస్తారో.. మరో చోటుకి తరలించారో అన్న విషయంపై మొదట క్లారిటీ రాలేదు.

కాకినాడలోని శ్రీపీఠానికి స్వామి పరిపూర్ణానందను తరలించారు

కాకినాడలోని శ్రీపీఠానికి స్వామి పరిపూర్ణానందను తరలించారు

అధికారిక ప్రకటన అనంతరం కాకినాడలోని శ్రీపీఠానికి స్వామి పరిపూర్ణానందను తరలించినట్లు పోలీసులు తెలిపారు.నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండడం వల్లే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిపూర్ణానంద స్వామికి నగర బహిష్కరణ నోటీసులు అందినట్లు న్యాయసలహాదారు పద్మారావు కూడా ధృవీకరించారు.

అసలు కారణం ఏమిటి?

అసలు కారణం ఏమిటి?

2017 నవంబర్ 1న మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్‌లో జరిగిన 'రాష్ట్రీయ హిందూ సేన' ఆవిర్భావ సభలో పరిపూర్ణానంద ఇతర మతాలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారని పోలీసులు తమ రిపోర్టులో తెలిపారు. 2017 డిసెంబర్ 2న రామేశ్వరపల్లి గ్రామం, కామారెడ్డి జిల్లాలో, 2018 మార్చి 11న కరీంనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలోనూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ-సోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ యాక్ట్-1980 కింద పరిపూర్ణానందకు 09-07-2018 రోజున బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.

నోటీసులూ ఇవ్వలేదట

నోటీసులూ ఇవ్వలేదట

ఆ నోటీసులు ఇచ్చిన 24 గంటల తర్వాత కూడా ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని, అందుకే 6 నెలలపాటు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించకుండా బంజారాహిల్స్ ఏసీపీ నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే పరిపూర్ణానందకు పోలీసులు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని ఆయన న్యాయ సలహాదారు అన్నారు.

పరిపూర్ణనంద స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు చేశారని పోలీసులు చెప్పారు

పరిపూర్ణనంద స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు చేశారని పోలీసులు చెప్పారు

#1. నవంబర్,1 2017లోమెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ లో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ సభలో పరిపూర్ణనందా స్వామి ప్రసంగిస్తూ ముస్లింలకు , క్రైస్తవులకు మక్కా, జెరూసలెం వెళ్లేందుకు పెద్దమొత్తం ప్రభుత్వాలు పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని సబ్సిడీలుగా ఇస్తున్నాయని ప్రశ్నించారని...అలాగే హిందువులు తమ పవిత్ర క్షేత్రాలకు వెళ్లాలంటే మాత్రం సర్ ఛార్జీల పేరుతో పన్నులు వసూలుచేస్తున్నారని వ్యాఖ్యానించారని పోలీసులు తెలిపారు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పోలీసులు తమ రిపోర్టులో తెలిపారు.

#2

#2

అలాగే 2 డిసెంబర్ 2017లో రామేశ్వరపల్లి గ్రామం, కామారెడ్డి జిల్లాలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు గుప్పించారు. ఈ సమావేశంలో మీకు నిజాం పాలన కావాలా? లేక ఛత్రపతి శివాజీ పాలన కావాలా అంటూ స్వామీజీ యువతను ప్రశ్నించడంపై పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మొగల్ పాలకులు బాబర్ , గజనీ మహమ్మద్ , ఖిల్జీ, హుమాయున్ వంటి వారు దేశంలో హిందువులపై ఎన్నో అరాచకాలు చేశారని..., అత్యాచారాలు, లూటీలు చేశారని ఎంతోమంది హిందువులను ముస్లిం పాలకులు చంపివేశారని స్వామీజీ తన ప్రసంగంలో పేర్కొన్నారని...ఇవి అభ్యంతరకరంగా ఉన్నాయని పోలీసులు అన్నారు.

#3

#3

అలాగే ఈ తెలంగాణ భూమిలోనూ రజాకర్లు ఎన్నో ఘోరాలు చేశారని...ప్రజలపై ముఖ్యంగా హిందూ మహిళలపై దమనకాండను కొనసాగించారని అన్నారన్నారని...ఇవి కూడా తమకు అభ్యంతరకరంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. తెలంగాణలోని ప్రాంతాలు పట్టణాల పేర్లను సైతం మార్చాల్సిన అవసరం ఉందని స్వామీజీ అన్నారని పోలీసులుఅభ్యంతరాలు వ్యక్తం చేశారు. నిజామాబాద్ , హైదరాబాద్ , సికింద్రాబాద్, ఆదిలాబాద్ , మహబూబ్ నగర్ , అలాగే నిజామాబాద్ పేరును దాని పూర్వనామం ఇందూరుగా పేరు మార్చాలని అన్నారని పోలీసులు చెప్పుకొచ్చారు.

#4

#4

అటు11 మార్చి 2018లో కరీంనగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో నూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. స్వామీజీ చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలంటూ తాము జూబ్లీ హిల్స్ పోలీసులు స్వామీజీకి 09-07-2018 రోజున స్వామీజీకి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే స్వామీజీకి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వారి లీగల్ అడ్వైజర్ తెలిపారు. నోటీసులు ఇచ్చిన 24 గంటల తర్వాత కూడా పరిపూర్ణనందా స్వామి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అందుకే వారిని ఆరు నెలలపాటు హైదరాబాద్ నగరంలో ప్రవేశించకుండా నిషేదాజ్ఞలు విధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

English summary

after kathi mahesh swami paripoornananda too gets externed from hyderabad

after kathi mahesh swami paripoornananda too gets externed from hyderabad
Desktop Bottom Promotion