For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఇష్టపడే చాయ్ రకం మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుందని తెలుసా ?

|

మీరొక చాయ్ ప్రేమికుడై ఉంటే, మీ వ్యక్తిత్వాన్ని నిర్వచించగల అత్యుత్తమ మార్గాన్ని కనుగొనడం ఆసక్తికరంగా ఉంటుంది.

ఇక్కడ, ఈ వ్యాసంలో, మనం చాయ్ యొక్క విభిన్న రుచులు మరియు వ్యక్తుల వ్యక్తిత్వపు రకాన్ని వారికిష్టమైన కప్ ఆధారంగా తెలుసుకుందాం.

All About The Chai Personality

మీరు ఒక చాయ్ ప్రేమికుడైతే, చాయ్ యొక్క విభిన్న రుచులను ఇష్టపడే వ్యక్తుల యొక్క విభిన్న వ్యక్తిత్వాల గురించి తెలుసుకోవడానికి ముందుకు సాగండి.

సాధారణ చాయ్ :

సాధారణ చాయ్ :

ఇది మీ సాధారణ చాయ్ ఎంపిక అయితే, మిమ్ములను ప్రేమించే మరియు అభిమానించే వ్యక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఒక వ్యక్తిగా, ఇతరులతో మీ ప్రేమను ఎలాగైతే పంచుకుంటారో, అదేవిధంగా చాయ్ పంచుకునే స్వభావాన్ని ప్రదర్శిస్తుంటారు. ఒంటరిగా చాయ్ సేవించడం మీకు నచ్చదు. ఎల్లప్పుడూ ఒక చాయ్ భాగస్వామి ఉండాలని కోరుకునే తత్వాన్ని కలిగి ఉంటారు. మీరు ఒక భిన్న వైఖరిని కలిగి ఉంటారు, మరియు సోషల్ మీడియాలలో మీ సంబంధాన్ని గురించి గొప్పలు చెప్పుకోడానికి సుముఖత కలిగి ఉండరు. వ్యక్తిగత స్వేచ్చలకు, అభిప్రాయాలకు విలువిస్తారు.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

గ్రీన్ టీ కప్ మీ ఎంపికగా ఉంటే, మీరు సానుకూల దృక్పధం కలిగిన వ్యక్తిగా ఉంటారు. ఒక వ్యక్తిగా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మరియు తరచుగా హానికరమైన వివాదాలు లేదా విషయాల నుండి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. మీరు ఫిట్నెస్ పట్ల ఔత్సాహికతను చూపే వ్యక్తిగా ఉంటారు. వ్యాయామం లేదా యోగ సెషన్ తర్వాత గ్రీన్ టీ తీసుకోడానికి ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటారు. మరియు గ్రీన్ టీ లలోని రకాలు, ఫ్లేవర్లు తరచుగా తెలుసుకుంటూ కొత్త రుచులను ఆస్వాదించాలనే మక్కువని ప్రదర్శిస్తుంటారు. ముఖ్యమైన ఏ విషయంలో అయినా ఖర్చుకు వెనుకాడని మనస్థితి మీది. ఫలితం సరిగ్గా వచ్చేలా ప్రణాళికలు చేస్తుంటారు.

బ్లూ చాయ్ :

బ్లూ చాయ్ :

ఈ టీ గురించి అనేకమందికి తెలియదు అయినప్పటికీ, ఇది నెమ్మదిగా జనాదరణ పొందింది. ఇది మీకు ఇష్టమైన చాయ్ అయితే, మీరు మంచి దృష్టికోణం కలిగిన వ్యక్తిగా ఉంటారు. మీరు మంచి ఆత్మ విశ్వాసాన్ని కలిగిఉంటుంది. కానీ మీశరీరంలో ఏమాత్రం మచ్చలు కనిపించినా మీ ఆత్మవిశ్వాస స్థాయిలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంటాయి.తెలీకుండానే మీరు బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేవ్యక్తిగా ఉంటారు. ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండేలా ప్రణాళికలు చేస్తుంటారు. ఈ బ్లూ చాయ్ ఇష్టపడే వారు, ప్రపంచంలోని భిన్న చాయ్ రుచుల గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు, మరియు అన్నిరకాల రుచులను ఆస్వాదించాలన్న మనస్థితి వీరిది.

స్పైసీ చాయ్ :

స్పైసీ చాయ్ :

ముఖ్యంగా శ్రోతలు లేదా తమ తమ కళలతో మనోరంజకులుగా ఉండేవారు ఎక్కువగా

సుగంధ ద్రవ్యాలు కలిగిన, లేదా స్పైసీ మసాలా చాయ్ ఇష్టపడుతుంటారు. ఈ వ్యక్తులు ఎటువంటి పార్టీ అయినా, తమ వ్యక్తిగత సహజ లక్షణాల దృష్ట్యా, కూసింత మసాలాని జోడించడానికి ఇష్టపడతారు. ప్రతి చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించే డ్రామా క్వీన్స్ వలె ప్రవర్తిస్తుంటారు. మరోవైపు, వీరి నిరుత్సాహానికి సరైన మందుగా ఇటువంటి టీ ఎంచుకుంటూ ఉంటారు. ఎటువంటి మానసిక సమస్యనైనా టీ తో దూరం చేయవచ్చన్న అభిప్రాయం వీరిది. ఈ స్పైసీ చాయ్ ఇష్టపడే వారు, రోజులో కనీసం మూడు లేదా అంతకన్నా ఎక్కువగా చాయ్ తీసుకోడానికి ఇష్టపడుతుంటారు.

పెప్పర్మింట్ చాయ్ :

పెప్పర్మింట్ చాయ్ :

ఈ ప్రత్యేకమైన చాయ్ ఇష్టపడే వ్యక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా ప్రయత్నిస్తుంటారు. క్లాసీగా మరియు మనశ్శాంతితో కూడుకుని ఉంటారు. ఎల్లప్పుడూ వారి వ్యక్తిగత ప్రపంచానికి విలువనిస్తుంటారు. వారి చుట్టూ ఏమి జరుగుతుందో అన్నది వారికి అనవసరమైన విషయంగా ఉంటుంది. కొంచం స్వార్ధ చింతన కలిగి, తాము, తమ కుటుంబం అన్న భావనని కలిగి ఉంటారు. మరోవైపు, వారు జీవితంలో ఎటువంటి ఒత్తిడులనైనా ఎదుర్కోగలిగే మానసిక ప్రశాంతతను మరియు భరోసాని కలిగి ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆందోళన అనే పదానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటారు.

లిటిల్ స్వీట్ చాయ్ :

లిటిల్ స్వీట్ చాయ్ :

ఎక్కువ తీపి కలిగిన చాయ్ కాకుండా, తీపిని మితంగా ఇష్టపడుతున్నవారైతే, ఏ విషయంలో అయినా సంపూర్ణతను ఇష్టపడే వారిగా ఉంటారు. మీరు మధ్యవర్తిగా ఉన్న ఏ సమస్యలో అయినా, ఇరు పక్షాలు చివరకు రాజీ పడతాయి. కానీ వ్యక్తిగతంగా మీ నిర్ణయాల పట్ల రాజీలేని వైఖరిని కలిగి ఉంటారు. ఆరోగ్యం ప్రకారం దీర్ఘాలోచనలు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.

షుగర్ లేని చాయ్ :

షుగర్ లేని చాయ్ :

మీరు ఎటువంటి మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేకుండానే పంచదార లేని చాయ్ కోరుకుంటున్న వారైతే, విధి అనేది మీ చేతుల్లో ఉండదు అని బలంగా నమ్మే వ్యక్తిగా ఉంటారు. మానసిక స్థైర్యం కలిగి, ప్రపంచాన్ని భిన్న కోణంలో చూసే వ్యక్తిగా ఉంటారు. మీరు మీ జీవితం పట్ల సానుకూల దృక్పధాన్ని కలిగి ఉంటారు అనేకన్నా ఆశావహ దృక్పధాన్ని కలిగి ఉంటారు అని చెప్పడం సరైనది. ఎందుకైనా ఒక మంచి జ్యోతిష్య శాస్త్ర పండితుని సంప్రదించి మీ గ్రహాలూ, నక్షత్రాల గురించిన వివరాలు తెలుసుకోవడం మంచిది.

బ్లాక్ టీ :

బ్లాక్ టీ :

చురుకైన స్వభావాన్ని కలిగి ఉండడం, మరియు వ్యక్తి కదలికలలో ఎల్లప్పుడూ ఒక తేజం ఉట్టిపడడం వంటివి బ్లాక్ టీ ఇష్టపడే వ్యక్తుల వ్యక్తిత్వంగా ఉంటుంది. ఈ వ్యక్తులు ఒకచోట స్థిరంగా ఉండరు. వీరి వ్యక్తిత్వం సహజంగానే ఆసక్తికరంగా ఉంటుంది.

మీకు ఏ రకమైన చాయ్ తీసుకోవడం ఇష్టం? క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

మీకు ఏ రకమైన చాయ్ తీసుకోవడం ఇష్టం? క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

All About The Chai Personality

With every one of the flavours to fill your mug, chai lovers are perceived based on what they like and don't care for. The reality of the situation is the thing that you search for in a chai can say a great deal about you. So be picky with your chai. You can find out what kind of personality you have based on your choice of chai.
Story first published: Monday, August 20, 2018, 16:15 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more