For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాస్టింగ్ కౌచ్ : గెస్ట్ హౌస్ కు రమ్మనేవారు, భర్త వద్దకు భార్యనే పంపేది, నైటీలో చూస్తా, పడుకుంటావా

|

క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఇప్పుడు అన్ని సినిమా ఇండస్ట్రీలను కుదేపిస్తున్న పదం. టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ ఇప్పుడు ఈ పదం మారుమోగిపోతుంది. క్యాస్టింగ్ కౌచ్ పై ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు స్పందిస్తూనే ఉన్నారు. సినీ రంగంలో కాస్టింగ్‌ కౌచ్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో పలువురు నటీమణులు ఈ విషయంపై స్పందిస్తున్నారు. గతంలో మీటు అంటూ సోషల్‌ మీడియాలో ఓ క్యాంపెయిన్‌ కూడా నడిచింది. అయితే తాజాగా క్యాస్టింగ్‌ కౌచ్‌పై బాలీవుడ్‌ హాట్‌​ బ్యూటీ మల్లికా శెరావత్‌ టాలీవుడ్ నటి ఆమని షాకింగ్‌ నిజాలు బయలపెట్టారు.

మీ టూ

మీ టూ

హాలీవుడ్‌లో మీ టూ, బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాది, ఉత్తరాది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్‌పై తమకు ఎదురైన అనుభవాలను బహిర్గతం చేస్తున్నారు. తాజాగా ఐటమ్ గార్ల్‌గా, బోల్డ్ నటిగా ముద్రపడ్డ మల్లికాషెరావత్ కాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

సిగ్గు వదిలేసిన మహిళ

సిగ్గు వదిలేసిన మహిళ

తెరపై పొట్టి దుస్తులు వేసుకుని, ముద్దు సన్నివేశాల్లో నటించిన తనను సిగ్గు వదిలేసిన మహిళంటూ నిందలు వేశారని మల్లికా షెరావత్ అన్నారు. హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు తనతో చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవారన్నారు. నేను చేసే రోల్స్‌ను బట్టి నా క్యారెక్టర్‌ను అంచనా వేసేవారని బాధపడింది. ‘తెరపై నటిస్తావు కదా.? మరి బయట చనువుగా ఉండటానికి ఇబ్బంది ఏంటి.?' అని ప్రశ్నించేవారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమనిని గెస్ట్ హౌస్ కు రమ్మనేవారట

ఆమనిని గెస్ట్ హౌస్ కు రమ్మనేవారట

తాజాగా సీనియర్‌ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్‌ ఆమని కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు.ఇటీవల క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన ఆమని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాల గురించి వివరించారు. స్వయంగా తాను కూడా ఇబ్బందులకు గురయ్యానన్నారు. సినిమా గురించి మాట్లాడేందుకు సంప్రదించిన కొందరు అంతా ఓకె అనుకున్న తరువాత గెస్ట్‌హౌస్‌కు రమ్మనే వారని తెలిపారు.

మీ అమ్మను వెంట తీసుకురాకు

మీ అమ్మను వెంట తీసుకురాకు

అంతేకాదు ప్రత్యేకంగా మీ అమ్మను వెంట తీసుకురాకు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. వాళ్ల మాటలను బట్టే అంతా అర్ధమయ్యేదని అందుకే అలాంటి వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించానని తెలిపారు. పెద్ద నిర్మాణ సంస్థల్లో ఇంలాంటి ఇబ్బందులు ఉండేవి కావన్న ఆమని, చిన్నకంపెనీల నుంచి ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యేవని తెలిపారు.

చెవిపై ముద్దుపెట్టాలనుకున్నాడు

చెవిపై ముద్దుపెట్టాలనుకున్నాడు

అలాగే బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌పై స్పందిస్తూ.. ‘నాకు ఇలాంటి ఒక అనుభవమే ఎదురైంది. నేను అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో ఓ నిర్మాత దగ్గర పనిచేసే మేనేజర్‌ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా చెవిపై ముద్దుపెట్టడానికి ప్రయత్నించాడు. అంతే కాకుండా ఆమె వెనుక నిల్చొని ‘ఐ లవ్‌ యు బేబీ' అని కూడా చెప్పాడని' తనకు ఎదురైన ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు. మీడియా ముందు బోల్డ్‌గా మాట్లాడటంతో అప్పట్లో వార్తల్లో కెక్కారు స్వర భాస్కర్‌. ‘వీరే ది వెడ్డింగ్‌'లో తాను చేసిన బోల్డ్‌ క్యారెక్టర్‌పై వచ్చిన విమర్శలను ఆమె ఘాటుగానే తిప్పికొట్టారు.

పురుషులే కాదు.. మహిళలూ ఉన్నారు

పురుషులే కాదు.. మహిళలూ ఉన్నారు

పెళ్లి చూపులు, అర్జున రెడ్డి సినిమాలకు పాటలు రాసిన శ్రేష్ట ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. శ్రేష్ఠ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్టు చెప్పుకొచ్చారు. చిత్రపరిశ్రమలో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాల వల్ల ఇండస్ట్రీలోకి రావడాన్ని పలుమార్లు వాయిదా వేసుకున్నట్టు చెప్పారు. ‘‘కేవలం రైటర్‌గా పరిశ్రమలో పేరు సంపాదించుకోవడం కష్టమని చాలామంది చెప్పారు. సంవత్సరాలుగా ఇండస్ట్రీలో నుంచి నేర్చుకున్నది ఒక్కటే. అటువంటి కార్యకలాపాలకు పాల్పడేవారిలో పురుషులే కాదు.. మహిళలూ ఉన్నారు'' అని పేర్కొన్నారు.

నిర్మాత భార్య తన భర్త వద్దకు వెళ్లమని డిమాండ్ చేసింది

నిర్మాత భార్య తన భర్త వద్దకు వెళ్లమని డిమాండ్ చేసింది

ఓ నిర్మాత భార్య అయితే తనను ఏకంగా తన భర్త వద్దకు వెళ్లమని డిమాండ్ చేసిందని శ్రేష్ట పేర్కొంది. ఓ వ్యక్తి తనపై మనసు పారేసుకున్నాడని, గోవాలో పార్టీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఓ మహిళా దర్శకురాలు తనకు చెప్పిందని శ్రేష్ఠ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ పార్టీకి తాను వెళ్లకపోవడంతో ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి చెడామడా తిట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. మధురం మధురం, యుద్ధం శరణం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి సినిమాలో పాటలు రాసి శ్రేష్ఠ తనను తాను నిరూపించుకున్నారు.

పరస్పర అంగీకారంతోనే క్యాస్టింగ్ కౌచ్

పరస్పర అంగీకారంతోనే క్యాస్టింగ్ కౌచ్

క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలపై బాలీవుడ్ బ్యూటీ, వివాదాస్పద నటి రాఖీ సావంత్ కూడా స్పందించారు. తానుకూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలిననే చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో యువతులు అవకాశాల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండడం వల్లే క్యాస్టింగ్ కౌచ్ పెరిగిపోతుందన్నారు. చిత్ర పరిశ్రమలో ఎవ్వరూ అత్యాచారం చేయరనీ, స్వచ్ఛందంగా పరస్పర అంగీకారంతోనే క్యాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందన్నారు. అవకాశాలకోసం రాజీ పడకండి.. టాలెంట్‌ నమ్ముకోండి..ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగొద్దంటూ రాఖీ సావంత్ మంచి సందేశాన్ని ఇచ్చారు.

నువ్‌ నైటీలో ఎలా ఉంటావో

నువ్‌ నైటీలో ఎలా ఉంటావో

బాలీవుడ్‌లో తన తొలి సినిమా ‘దేవ్‌ డీ' తో మంచి మార్కులు కొట్టేసిన మహీ గిల్‌.. సినిమా రంగంలో దుమారం రేపుతున్న క్యాస్టింగ్‌ కౌచ్‌ పై స్పందించారు. సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లినప్పుడు నిర్మాతలు, దర్శకులు, హీరోలు... అమ్మాయిలతో వ్యవహరించే తీరును ఆమె ఎండగట్టారు. సినిమా ఛాన్సుల కోసం తిరిగే సమయంలో ఒక సినీ నిర్మాత తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరును మహీ గిల్ గుర్తు చేసుకున్నారు. కెరీర్‌ ప్రారంభంలో సినిమాలో అవకాశం కోసం ఒక దర్శకుని దగ్గరకు వెళ్లినప్పుడు ‘సల్వార్‌ కమీజ్‌ ధరించి ఇలా నిండుగా వస్తే ఎవరూ నీకు అవకాశాలు ఇవ్వర'ని అతను హేళనగా మాట్లాడిన సందర్భాన్ని వివరించారు. మరోసారి​ ఓ నిర్మాతను సంప్రదించడానికి వెళ్లినప్పుడు ‘నువ్‌ నైటీలో ఎలా ఉంటావో చూసిన తర్వాతే నీకు సినిమాలో అవకాశం ఇవ్వడం గురించి ఆలోచిస్తాన'ని వెకిలిగా, అసభ్యంగా మాట్లాడిన తీరును వెల్లడించారు.

బిగ్‌బాస్‌లో కూడా క్యాస్టింగ్ కౌచ్

బిగ్‌బాస్‌లో కూడా క్యాస్టింగ్ కౌచ్

ఇదిలా ఉండగా బిగ్‌బాస్‌లో కూడా క్యాస్టింగ్ కౌచ్ వుందని తెలుగు సినీ నటి మాధవీ లత ఆ మధ్య చెప్పింది. సినీ పరిశ్రమకు సంబంధించిన ఏ విషయంలో అయినా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని మాధవీలత తెలిపింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సెలక్షన్ కమిటీలో కీలక వ్యక్తి తనకు ఫోన్ చేశాడని మాధవీలత తెలిపింది. అతడు ఫోన్‌లో బిగ్ బాస్ అవకాశం వుందని తెలిపాడు. ఓకే అయితే మనం ఎంజాయ్ చేద్దామని అడిగినట్లు మాధవీలత చెప్పింది. అతని ఉద్దేశం తెలుసుకున్నాక బిగ్ బాస్‌‌కు వెళ్లలేదని తెలిపింది.

ఎక్స్ ఫోజింగ్ చేసేలా దుస్తులు వేసుకోవచ్చు

ఎక్స్ ఫోజింగ్ చేసేలా దుస్తులు వేసుకోవచ్చు

అతడు ఫోన్ చేసి దాదాపు 20 నిమిషాలు మాట్లాడాడని మాధవీలత తెలిపింది. ఈ సారి బిగ్ బాస్‌లో మంచి మసాలా యాడ్ చేస్తున్నాం. ఇష్టమైతే ఎక్స్ ఫోజింగ్ చేసేలా దుస్తులు వేసుకోవచ్చు అని ఫోన్‌లో చెప్పాడని.. తాను క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పటికీ.. తనవద్ద ఇలా అడుగుతున్నావే అంటే.. ఇది క్యాస్టింగ్ కౌచ్ కాదు మాధవి, కానీ సింగిల్‌గా వున్నావుగా.. ఫీలింగ్స్ వుంటాయని అడిగినట్లు చెప్పుకొచ్చింది. కాగా చాలామంది అమ్మాయిలే ఫోన్ చేసి తాము రెడీ అని చెప్తున్నట్లు తనకు తెలిసిందని.. అవకాశాల కోసం అమ్మాయిలు ఆశపడతారని కాబట్టి వారిని తాను తప్పుబట్టనని మాధవీలత వెల్లడించింది.

నో చెబితే... అవతలి వ్యక్తికి ఛాన్స్ ఎక్కడుంటుంది

నో చెబితే... అవతలి వ్యక్తికి ఛాన్స్ ఎక్కడుంటుంది

క్యాస్టింగ్ కౌచ్ పై సీనియర్ నటి పవిత్ర ఇలా మాట్లాడారు.

" క్యాస్టింగ్ కౌచ్ అనేది సెన్సిటివ్ పాయింట్. ప్రపంచంలో పురుషులు, స్త్రీలు వున్నారు. పురుషులు, స్త్రీల పట్ల అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, అలాగే మరికొందరు స్త్రీలు, పురుషుల పట్ల అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అవతలి వ్యక్తి తనకు ఏదో కావాలని అడిగినప్పుడు నేను నో చెబితే... అవతలి వ్యక్తికి ఛాన్స్ ఎక్కడుంటుంది? అని పవిత్ర అంది.

వాచీ నచ్చింది.. ఇవ్వమని అడిగితే ఇచ్చేస్తామా?

వాచీ నచ్చింది.. ఇవ్వమని అడిగితే ఇచ్చేస్తామా?

"మీ అందమైన వాచీ నాకు నచ్చింది.. ఇవ్వమని అడిగితే ఇచ్చేస్తామా? ఆ అందమైన వాచీ ఇవ్వాలో వద్దో మనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఏమీ చిన్నపిల్లలం కాదు. ఏదో ఆశించి లొంగిపోయి, దక్కకపోతే దక్కలేదని చెప్పడం ఎంతవరకు సమంజసం? క్యాస్టింగ్ కౌచ్ అనేది నా దృష్టిలో తప్పు పదం. ఎవరో ఒకరు అడ్వాంటేజ్ తీసుకున్నారని చిత్ర పరిశ్రమ మొత్తాన్ని దూషించడం తప్పు. 18 ఏళ్లు నిండిన తర్వాత మహిళలు ఏది తప్పో ఏదో ఒప్పో తెలుసుకునే తెలివి వుంటుంది. ఇండస్ట్రీకి వస్తున్న అమ్మాయిలు చాలా తెలివిగానే వుంటున్నారు. అనుకున్నంత తెలివితక్కువవారు ఎవరూ లేరు" అంటూ పవిత్రా లోకేష్ ఆ మధ్య చెప్పారు.

రామ్ గోపాల్ వర్మ ఇన్సిడెంట్‌ను వివరించారు

రామ్ గోపాల్ వర్మ ఇన్సిడెంట్‌ను వివరించారు

క్యాస్టింగ్ కౌచ్ పై ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రియల్‌గా జరిగిన ఓ ఇన్సిడెంట్‌ను వివరించారు. హైదరాబాద్‌లో చాలా ఫేమస్ ప్రొడ్యూసర్... నాకు కూడా బాగా తెలుసు... ఆయన దగ్గరకు ఓ అమ్మాయి వెళితే నేను నిన్ను హీరోయిన్‌ను చేస్తాను కానీ కాంప్రమైజ్ అవ్వాలి నువ్వు అన్నారు. ఆ అమ్మాయి వచ్చి నాకు ఈ విషయాన్ని చెప్పింది. నేను నిజంగా షాక్ అయ్యాను.

మీరు కాంప్రమైజ్ అవ్వాలి

మీరు కాంప్రమైజ్ అవ్వాలి

ఎందుకంటే ఆయన నాకు తెలుసు. ఆయన అలా మాట్లాడతారని నేనసలు ఊహించలేదు.. నమ్మలేదు. ఆయన రెప్యుటేషన్.. ఆయనకున్న ఇమేజ్‌ను బట్టి నేను నమ్మలేను అన్నాను ఆ అమ్మాయితో. అపుడు ఆ అమ్మాయి నా ఎదురుగా అతనికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి.. ‘సార్ నిన్న నేను మీ ఆఫీస్‌కి వచ్చినపుడు అంతా మాట్లాడి బయటకు వెళుతున్నప్పుడు నన్ను మీరు కాంప్రమైజ్ అవ్వాలి అన్నారు కదా.. నాకు అర్థం కాలేదు సార్.. ఏంటీ కాంప్రమైజ్' అని అడిగింది. ‘యూ నో ఎవ్రీథింగ్' అన్నారాయన. నేను వాయిస్ గుర్తు పట్టాను. ‘లేదు సార్ నాకు అర్థం కాలేదు ఏంటండి కాంప్రమైజ్' అని అడిగింది. ‘కాంప్రమైజ్ అంటే ఎవరికి తెలియదమ్మా.. అది అందరికీ తెలిసిన పదమే కదా' అన్నారాయన. ‘నిజంగా నాకు అర్థం కావడంలేదు. మీరు డబ్బులు తక్కువిస్తారా?' అని అడిగిందా అమ్మాయి.

కాంప్రమైజ్ అంటే మీతో పడుకోమనా

కాంప్రమైజ్ అంటే మీతో పడుకోమనా

‘నోనో చాలా డీసెంట్ అమౌంట్ ఇస్తాను నీకు. నువ్వే చెప్పు ఎంత కావాలో' అన్నారు. ‘అంటే ఇంకేంటండి కాంప్రమైజ్? నా రోల్ మంచిది కాదా అండి' అని అంది. ‘హీరోయిన్ రోల్ అంటే మంచిది కాదా అంటే ఏమనాలి?' అన్నారాయన. ‘కాంప్రమైజ్ అంటే మీతో పడుకోమనా?' అని అంది. ‘అప్పుడాయన యూ నో ఎవ్రీథింగ్. మళ్లీ నన్ను అడుగుతావేంటి?' అన్నారాయన. ‘మీ సినిమాలో ఫలానా హీరో.. ఫలానా డైరెక్టర్.. వాళ్లు తీసుకుంటారండి.. హీరోయిన్‌ని.. మీతో పడుకుంటే మీరెలా డెసిషన్ తీసుకుంటారు? నన్ను హీరోయిన్‌గా చేయడానికి అంత పెద్ద హీరో పక్కన.. అంత పెద్ద డైరెక్టర్ సినిమాలో' అని అడిగింది. ‘ఏయ్ హూ ఆర్‌దే.. వాళ్లను ఇండస్ట్రీ నుంచి తన్ని తరిమేస్తా నా గురించి నీకు తెలియదు' అని హీరో, డైరెక్టర్ పేర్లు చెప్పేశాడు.

ఆ ప్రొడ్యూసర్ వాయిస్ తెలుసు

ఆ ప్రొడ్యూసర్ వాయిస్ తెలుసు

ఇదంతా నేను స్పీకర్ ఫోన్‌లో వింటున్నా. తను ఫైనల్‌గా ‘సరే సార్ నేను మళ్లీ ఆలోచించుకుని రేపు చెబుతాను' అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇదంతా రికార్డ్ చేశానని చెప్పింది. ఇది నేను యూట్యూబ్‌లో పెడితే వైరల్ అయిపోతుంది. ఎందుకంటే ఆ హీరో పేరు, ఆ డైరెక్టర్ పేరు తెలుసు. అలాగే అందరికీ ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలుసు. ఆ ప్రొడ్యూసర్ వాయిస్ తెలుసు. ప్రతి అమ్మాయి ఫోన్‌లో అందరి సీక్రెట్లు ఉంటాయి. మీరు ఇమాజిన్ చేయలేరసలు అని వెల్లడించారు వర్మ.

మగవారికీ క్యాస్టింగ్ కౌచ్

మగవారికీ క్యాస్టింగ్ కౌచ్

అయితే, సినీ పరిశ్రమలో మహిళా నటులకే కాదు మగవారికీ క్యాస్టింగ్ కౌచ్ తప్పట్లేదంటూ ‘రేసు గుర్రం' సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాస్ట్‌ కౌచింగ్‌ ఆడవారికే కాదు, మగవారికీ ఎదురవుతోందని ఆయన సంచలన కామెంట్ చేశారు. మగవారిని లైంగికంగా వేధించే హీరోయిన్ల సంఖ్య సినీరంగంలో ఎక్కువగాఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సమస్య ప్రతీ చోట ఉంది

ఈ సమస్య ప్రతీ చోట ఉంది

క్యాస్టింగ్ కౌచ్‌పై నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చాలా రోజులకు స్పందించారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ‘ఈ సమస్య ప్రతీ చోట ఉంది. కేవలం టాలీవుడ్‌లోనే లేదు. కొన్ని సంఘటనలు టాలీవుడ్‌లో కూడా జరిగి ఉంటాయి. ఆ సంఘటనలనే పెద్దగా చూపుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది మానవుడు పరిష్కరించలేని పెద్ద సమస్య. ' అంటూ సురేష్ బాబు అభిప్రాయపడ్డారు. .

English summary

amani to madhavilatha 10 shocking celebrity casting couch stories

amani to madhavilatha 10 shocking celebrity casting couch stories
Story first published: Thursday, July 5, 2018, 15:31 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more