ఎనిమిదేళ్ల వయస్సులో మూడు హత్యలు.. ప్రపంచంలోనే ఇంత వరకు ఎవరూ ఇలా చేయలేదు

Written By:
Subscribe to Boldsky

అతిచిన్న వయస్సులో వరుసగా హత్యలు చేసి రికార్డుకు ఎక్కాడు ఇతను. ఎనిమిదేళ్ల వయస్సులో వరుసగా మూడు హత్యలు చేశాడు. ప్రపంచంలోనే ఇంత చిన్న వయస్సులో ఎవరూ ఇన్ని హత్యలు చేయలేదు. ఇతని గురించి ఇంతకు ముందు చాలా వార్తలు వచ్చాయి.

చూడడానికి చిన్న పిల్లాడే

చూడడానికి చిన్న పిల్లాడే

అప్పుడు చూడడానికి చిన్న పిల్లాడే కానీ చేసిన హత్యల్ని చూస్తే అందరూ విస్తుపోయారు. ఎంతో కర్కశంగా వ్యవహరించాడు. అసలు ఎవరు ఇతను.. ఇతని కథ ఏమిటో ఒక్కసారి చూద్దామా. ప్రపంచంలోనే తన హత్యలతో రికార్డుకెక్కిన ఇతను మనదేశానికి చెందిన వాడే.

అమర్జీత్ సదా

అమర్జీత్ సదా

అతని పేరు అమర్జీత్ సదా. బిహార్ లోని బెగుసారేలో ఇతను1998 లో పుట్టాడు. అతని కుటుంబం ఇప్పుడు బిహార్ లోని ముసాహ్రీ ఉంటోంది. రోజూ పనికి వెళ్తేగానీ పూటగడవని కుటుంబం ఇతనిది. తండ్రి రోజూ కూలీ పనికి వెళ్తుంటాడు.

చిన్నపిల్లల్నే చంపాడు

చిన్నపిల్లల్నే చంపాడు

అమర్జీత్ సదా చంపింది అంతా కూడా చిన్నపిల్లల్నే. అసలు ఇతను చంపడానికి కూడా పెద్ద కారణాలు లేవు. కర్కశంగా ముగ్గురు పిల్లల్ని చంపేశాడు. మొదటి సారి ఒక చిన్న నెలలు నిండని పాపను చంపాడు. ఇతను రెండోసారి చంపింది సొంత చెల్లెలినే. కానీ ఆ విషయాన్ని ఇతని తల్లిదండ్రులు ఎవరికీ తెలియకుండా దాచారు. ఇతను మూడోసారి మర్డర్ చేసినప్పుడు మూడు హత్యల గురించి వెలుగులోకి వచ్చింది.

ఇటుకతో తలపై కొట్టి

ఇటుకతో తలపై కొట్టి

ఒక ఆరు నెలల పాపను అమర్ జీత్ సదా మూడో సారి హత్య చేశాడు. అమర్జీత్ సదా ఇంటి పక్కనే ఉండే ఒక కుటుంబానికి చెందిన పాపను ఇతను అత్యంత దారుణంగా చంపాడు. స్కూల్ వెళ్తూ వెళ్తూ పక్కింట్లో ఉన్న చిన్న పాపను ఎత్తుకెళ్లాడు. తర్వాత ఇటుకతో పాప తలపై కొట్టి చంపాడు. చనిపోయిన పాపను ముళ్లపొదల్లో పడేశాడు.

ముళ్లపొదల్లో మృతదేహం

ముళ్లపొదల్లో మృతదేహం

తర్వాత ఆ పాప తల్లిదండ్రులు పాప మిస్ అయ్యిందని పోలీసులకు కంప్లైట్ చేశారు. రెండు రోజులకు పాప మృతదేహం ముళ్లపొదల్లో లభించింది. విగతజీవిగా పడి ఉన్న పాపను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అలాంటి దురాగతానికి ఎవరు పాల్పడ్డారో అర్థం కాక విలవిలలాడిపోయారు.

రోదనలు చూస్తూ ఉన్నాడు

రోదనలు చూస్తూ ఉన్నాడు

తమపై అంత కక్ష ఎవరికీ లేదని పోలీసుల ఎదుట ఆవేదన చెందారు. కాకపోతే ఎవరో స్థానికులు ఈ దురాగతానికి పాల్పడి ఉంటారన్నారు. ఆ సమయంలో వారితో పాటు అమర్జీత్ సదా కూడా ఉన్నాడు. వారి రోదనలు చూస్తూ ఉండిపోయాడు.

అంతా విస్తుపోయారు

అంతా విస్తుపోయారు

అయితే అమర్జీత్ సదా పోలీసుల దగ్గరకు వెళ్లి ఆ పాపను నేనే చంపాను అని చెప్పాడు. ఎలా ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చాడో.. ఎలా చంపాడో అంతా పూసగుచ్చినట్లుగా అమర్జీత్ సదా పోలీసులు చెప్పాడు. పోలీసులతో పాటు పాప తల్లిదండ్రులు విస్తుపోయారు.

బిస్కెట్లు ఇస్తే..

బిస్కెట్లు ఇస్తే..

వెంటనే పోలీసులు అమర్జీత్ సదాను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. ఎందుకు చంపావు అని ఆరా తీశారు. కానీ అందుకు అమర్జీత్ సదా ఒక్కటి కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. పైగా పోలీసులతో తినడానికి బిస్కెట్లు ఇస్తే నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతాను అని అన్నాడు.

ఆ వ్యాధితో బాధపడుతున్నాడు

ఆ వ్యాధితో బాధపడుతున్నాడు

తర్వాత పోలీసులు కోర్టు ఆదేశం మేరకు అమర్జీత్ సదాకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సైకాలజిస్ట్స్ వచ్చి అమర్జీత్ సదా ప్రవర్తనను పరిశీలించారు. అమర్జీత్ సదా కాండాక్ట్ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు.

శాడిస్ట్ లక్షణాలు

శాడిస్ట్ లక్షణాలు

అంతేకాకుండా అతనితో శాడిస్ట్ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు సైకాలజిస్ట్ లు వివరించారు. అతనికి ఏది తప్పు.. ఏది కరెక్ట్ విషయంపై కూడా పెద్దగా అవగాహన లేదని.. అతని పెంపకం అలా సాగిందని చెప్పారు.

రోజూ జైలు లో అవగాహన

రోజూ జైలు లో అవగాహన

పిల్లలకు తల్లిదండ్రులు చిన్నతనం నుంచే భయంభక్తి నేర్పాలి. వారిని విచ్చలవిడిగా వదిలిస్తే ఇలా సమాజనాశానానికి కారణం అవుతారు. శత్రువుపై పోరాడడం వేరు.. అమాయకులను బలికొనడం వేరు. ప్రతి విషయంపై పిల్లలకు చిన్నతనం నుంచే అవగాహన కల్పించాలి. అయితే అమర్జీత్ సదా వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను మార్చడానికి సైకాలజిస్ట్ ల ఆధ్వర్యంలో రోజూ జైలు లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

IMAGE COURTESY:https://www.youtube.com/watch?v=HZqOwplUgpk

English summary

amarjeet sada is the worlds youngest serial killer

amarjeet sada is the worlds youngest serial killer
Story first published: Tuesday, January 16, 2018, 13:30 [IST]
Subscribe Newsletter