For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేను వర్జిన్, సమంత నా మరదలు, రామ్ గోపాల్ వర్మ ఎవరికీ తండ్రో మీకే తెలియాలి : విజయ్ దేవరకొండ ట్వీట్స్

|

రెండు సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ స్టార్ స్టాటస్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు వరుసగా సినిమాల్ని ట్రాక్‌లో పెట్టాడు. అయితే హీరోగానే కాకుండా ఇతనిలో ఇంకా చాలా క్వాలీటీస్ ఉన్నాయి. సోషల్ ఈవెంట్స్ లోనూ విజయ్ దేవరకొండ చాలా చురుగ్గా పాల్గొంటాడు. కాలేజీల్లో ఇన్ స్పిరేషన్ స్పీచ్ లు ఇచ్చి అందరినీ మైమరిపిస్తాడు. ఇక సినిమా ఫంక్షన్ న్లలో డేర్ అండ్ డ్యాష్ గా తన గుండెల్లోని మాటలను బయపెట్టే రియల్ స్టార్ విజయ్ దేవరకొండ.

ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి

ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి

ఏదైనా సరే ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిలా కనిపిస్తాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఏది చేసినా సంచలనమే అయిపోతోంది. ఆ మధ్య ఉత్తమనటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న ఈ యువ హీరో అర్జున్ రెడ్డి సినిమాలో ఇరగదీశాడు. పెళ్లి చూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ అగ్రహీరోలతో పోటీపడి ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని సొంతం చేసుకుని సినీ ఫీల్డ్ లో తన సత్తాను చాటుకున్నాడు.

ఫిల్మ్‌ఫేర్ అవార్డు

‘పెళ్లి చూపులు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు విజయ్‌ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి' సినిమాతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. అగ్ర హీరోలతో పోటీ పడి మరీ ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు.

అవార్డును వేలంలో అమ్మదలచుకున్నా

దీంతో విజయ్‌ దేవరకొండ తన ట్విట్టర్లో సంచలన ప్రకటచేశాడు. తన తొలి అవార్డును వేలంలో అమ్మదలచుకున్నానని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతే కాదు...వచ్చిన ఆ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తానని అన్నారు. ఎవరైనా సాయం కోరితే మంత్రి కేటీఆర్.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేస్తుండడాన్ని తాను రోజూ ట్విట్టర్ లో చూస్తున్నానని తెలిపాడు.

డబ్బును ఫండ్ కు ఇస్తా

అందుకే వేలం ద్వారా వచ్చిన డబ్బును ఆ ఫండ్ కు ఇస్తానని చెప్పి సంచలనమౌతున్నాడు. . ఆ అవార్డు తన ఇంట్లో ఉండడం కంటే తాను పుట్టిన నగరానికి ఉపయోగపడితే బాగుంటుందని ట్విటర్లో పేర్కొన్నాడు.

ఇక విజయ్ దేవరకొండ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ హర్షం చేశారు.

తేడా పోస్టర్‌నే వదిలారు

ఇక విజయ్‌దేవరకొండ తాజాగా చేసిన ఒక ట్వీట్ కూడా బాగా ఆసక్తికరంగా ఉంది. కన్నడ క్యూటీ రష్మిక మందనతో కలిసి కాస్త వెరైటీగా గీత గోవిందం చిత్ర ప్రమోషన్‌లో మనోడు పాల్గొంటున్నాడు. వారిద్దరి సరదా సంభాషణలతో ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తూ కాస్త తేడా పోస్టర్‌నే వదిలారు.

ఐ యామ్‌ 25.. స్టిల్‌ వర్జిన్‌

‘మీరు ఏమైనా అనుకోండి. నా అఫీసియల్‌ స్టేటస్‌ మాత్రం ఇదే మేడమ్‌' అంటూ పోస్టర్‌ను ఉంచాడు. పోస్టర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘ఐ యామ్‌ 25.. స్టిల్‌ వర్జిన్‌ మేడమ్‌.. అంటూ గోవిందం(విజయ్‌).. గీత(రష్మిక)ను ఓరగా చూస్తున్నాడు. పరుశురామ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న గీత గోవిందం ఆగష్టు 15న విడుదల కానుంది. వీటితోపాటే విజయ్‌ నటించిన టాక్సీవాలా, నోటా చిత్రాలు శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుని రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.

డియర్ భరత్

విజయ్ దేవరకొండ కొన్ని రోజుల క్రితం ఒక కొత్త చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. కొత్త దర్శకుడు భరత్ కమ్మ రూపకల్పనలో డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ బ్యానర్‌లో డియర్‌ కామ్రెడ్‌ అనే సినిమాను విజయ్ దేవరకొండ చేయబోతున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు.

ఎంత కష్టపడ్డావో నీ కళ్లలో నీళ్లు చేస్తే తెలిసింది

డియర్ భరత్.. నీ జీవితంలో ఈ క్షణం కోసం ఎంతగా ఎదురుచూశావో నాకు తెలుసు. ఈ కలను సాకారం చేసుకోవడం ఎంత కష్టపడ్డావో నీ కళ్లలో నీళ్లు చేస్తే తెలిసింది. నీలాంటి డైరెక్టర్‌ రూపొందించే సినిమాలో నటించడం గర్వంగా ఉంది. నీ టాలెంట్‌పై పూర్తిగా నమ్మకం ఉంది. మైండ్ బ్లోయింగ్ అని ప్రేక్షకులు అనే విధంగా నీవు సినిమా తీయడం ఖాయం అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

ఈ నగరానికి ఏమైంది?

ఈ అర్జున్ రెడ్డి తన సినిమాలనే కాదు పక్కవారి సినిమాలను కూడా మెచ్చుకుంటారు. అవి విజయవంతం కావాలని మనసారా కోరుకుంటాడు. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్... విష్వక్సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమానులతో తెరకెక్కించిన సినిమా ఈ నగరానికి ఏమైంది? ఈ సినిమా ఈ మధ్యే విడుదలైంది. ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. తను ఈ సినిమాలో ఎందుకు లేనో తన బ్రెయిన్‌కి అర్థం కావడం లేదంటూ ట్వీట్ చేశాడు.

నెర్వస్‌గా నిద్ర లేచాను

‘ఈ నగరానికి ఏమైంది' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన కలతో నెర్వస్‌గా నిద్ర లేచాను. నా బ్రెయిన్ నేను ఆ సినిమాలో లేనన్న విషయాన్ని అర్థం చేసుకోవడం లేదని నేను అనుకుంటున్నాను. నాకు ఎందుకు భాయ్ ఈ బటర్‌ఫ్లైస్? ఓహ్.. ఆగండి... నేను ఆ సినిమాలో ఉన్నానా? ఏదిఏమైనా నేను మిగిలిన రోజంతా ప్రేక్షకుల రివ్యూలు చూడాలనుకుంటున్నాను. గుడ్ లక్ బాయ్స్. ఎగ్జాట్లీ కొంత సేపటి క్రితం నీవు ఎక్కడున్నావు దీన్నే డెజావు(మిద్యాభావన) అంటారేమో అని నాకు అనిపిస్తుంది. ఈ సినిమా పెళ్లి చూపులును బీట్ చేస్తుందని నేను భావిస్తున్నాను. అంటూ ఆ మధ్య ట్వీట్ చేశాడు.

చిక్ అనే ప‌దంతో

విజయ్ దేవరకొండ అందాల న‌టి మ‌హాన‌టి చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో సావిత్రి సినిమాకి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ వాట్ ఏ కూల్ చిక్ అని కామెంట్ పెట్టాడు. దీనిపై వివాదం నెల‌కొంది. గ‌తంలో అర్జున్ రెడ్డి చిత్ర స‌మ‌యంలో చిల్ అనే ప‌దంతో హాట్ టాపిక్‌గా నిలిచిన విజ‌య్ దేవ‌ర‌కొండ తర్వాత చిక్ అనే ప‌దంతో వార్త‌ల‌లో నిలిచాడు. మ‌హాన‌టి సావిత్రి పోస్ట‌ర్‌పై చిక్ అనే కామెంట్ పెట్ట‌డంతో నెటిజ‌న్స్ విజ‌య్ దేవ‌ర‌కొండపై ఫుల్ ఫైర్ అయ్యారు.

క్షమాపణ కోరుకునే వాళ్లంతా చెన్నై లీలా ప్యాలెస్‌కి రండి

అప్పుడు త‌న‌పై కామెంట్స్ చేస్తున్న నెటిజ‌న్స్‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస పోస్టుల ద్వారా క్లారిటీ ఇచ్చాడు. సావిత్రి ఎంత అందంగా ఉండేవారు. ఆమెకి కార్లంటే చాలా ఇష్టం. చెన్నైలో ఉన్న‌ప్పుడు ఆమె నివాసంలో ఎన్నో వింటేజ్‌ కార్లు ఉండేవట. ఆమె ఎప్పుడు ఎవరికి భ‌య‌ప‌డేవారుకాదు. స‌మాజానికి చాలా మంచి చేశారు. త‌న‌ని అంద‌రు ప్రేమించాల‌నుకున్నారు, ప్రేమ‌ని పొందాల‌నుకున్నారు ఆ త‌ర్వాత సూప‌ర్ స్టార్‌గా అవ్వాల‌ని క‌లలు క‌న్నారు. సావిత్రి విష‌యంలో క్షమాపణ కోరుకునే వాళ్లంతా చెన్నై లీలా ప్యాలెస్‌కి వ‌చ్చేయంటూ అప్పట్లో సంచలన ట్వీట్ చేశాడు.

సావిత్రి చాలా సంతోషించి ఉంటారు

మీ లాంటి నైతిక విలువలు ఉన్నవాళ్లూ.. నీతిమంతుల బ్యాచ్ అంతా సంసారం నాశనం చేసుకుంద‌ని.. తాగుబోతు అని పిలిచారు. మీరు చేసిన కామెంట్లతో పోలిస్తే నేను ‘వాట్ ఏ కూల్ చిక్' అన్నందుకు ఆమె చాలా సంతోషించి ఉంటారు'' అని విజయ్ త‌న ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అలా ఏ ట్వీట్ చేసిన ఒక సంచలనమే.

వీహెచ్ కామెంట్స్ పై

ఇక అర్జున్ రెడ్డి చిత్రం రిలీజ్ అయిన సందర్భంలో కూడా విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ హైలెలట్ అయ్యింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సినిమాపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కూడా సినిమా బాగుందని అన్నారు. దీనిపై వీహెచ్.. కేటీఆర్కి విజయ్ బంధువు అవడం వలననే ఈ సినిమాని అభినందించారని అన్నాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తన ఫేస్ బుక్ పేజ్ లో వీహెచ్ కామెంట్స్ పై ఘాటుగానే స్పందించాడు.

సమంతా , అనూ ఇమ్మానుయేల్ నా మరదళ్లు

డియర్ తాతయ్యా..! మీ లాజిక్ చాలా బాగుంది.. అర్జున్ రెడ్డి' సినిమా బాగుందని కేటీఆర్ అనడంతోనే ఆయన నాకు బంధువైతే.. అప్పుడు, ఎస్ఎస్ రాజమౌళి గారు నాకు నాన్న అవుతారు. ఆ తర్వాత.. రానా దగ్గుబాటి, నాని, శర్వానంద్, వరుణ్ తేజ్ నా సోదరులు అవుతారు. నాకు సిస్టర్స్ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి, సమంతా రూత్ ప్రభు, అనూ ఇమ్మానుయేల్, మెహ్రీన్ పిర్జాదా నాకు మరదళ్లు అవుతారు.

ఆర్జీవి సార్ అయితే మన ఇద్దరిలో ఎవరి తండ్రో

ఆర్జీవి సార్ అయితే మన ఇద్దరిలో ఎవరి తండ్రో

ఇక ఐదు రోజుల్లో 5000కి పైగా ప్రదర్శనలను చూసిన నా స్టూడెంట్స్, పురుషులు, మహిళలు అందరూ నా కవలలు. ముఖ్యంగా ఆర్జీవి సార్ అయితే మన ఇద్దరిలో ఎవరి తండ్రో ఇంకా క్లారిటీ లేదు... తాతయ్యా చిల్' అంటూ తన పోస్ట్ లో విజయ్ దేవరకొండ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

బ్యాక్ లాగ్స్

ఆ మధ్య విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ట్విట్ట‌ర్‌లో నాకు కూడా బ్యాక్ లాగ్స్ ఉన్నాయబ్బా.. అంటూ ట్వీట్ చేశాడు.‘ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేద్దామని అనుకున్నా.. కానీ, ఐదేళ్ల తర్వాత ‘యూట్యూబ్'లో ట్రెండ్ అవుతోంది' అని పేర్కొన్నాడు.

విజ‌య్ దేవ‌ర‌కొండ చెప్పే ‘బ్యాక్ లాగ్స్' చ‌దువుకి సంబంధించి కాదు. ఐదేళ్ళ క్రితం ప్రారంభ‌మైన త‌న సినిమా ఏ మంత్రం వేసావే గురించి. ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇది ‘యూ ట్యూబ్' ట్రెండింగ్ లో నాల్గో స్థానంలో ఉంది. అందుకే, ‘ఐదేళ్ల తర్వాత ‘యూ ట్యూబ్'లో ట్రెండ్ అవుతోంది' అని తన ట్వీట్ లో సరదాగా వ్యాఖ్యానించాడు విజ‌య్‌.

ఓవర్సీస్ రైట్స్‌

హీరోగా ఘన విజయం సాధించి వరుసగా మంచి ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతున్న విజయ్ దేవరకొండ... కేవలం ముఖానికి మేకప్ వేసుకోవడానికే తన కెరీర్‌ను పరిమితం చేయటం లేదు. మరో లాభదాయకమైన రంగంలో రాణించాలని భావిస్తున్నాడట. మనోడు ఇప్పుడు కొత్తగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.‘టాక్సీవాలా' చిత్ర కథ విజయ్‌ను ఎంతలా ఆకట్టుకుందో ఏమోగానీ, ఇప్పుడు దీని ఓవర్సీస్ రైట్స్‌ను విజయ్ దక్కించుకున్నాడట. 80లక్షలకు ఈ సినిమా రైట్స్ తీసుకొని ఓవర్సీస్‌లో భారీగా రిలీజ్ చేయాలని విజయ్ ప్లాన్ చేస్తున్నాడట.

English summary

arjun reddy fame vijay devarakonda tweets highlights

arjun reddy fame vijay devarakonda tweets highlights
Story first published: Tuesday, July 3, 2018, 12:44 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more