For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆశారాం బాపు కూతురిని అలా చేస్తాడని అనుకోలేదు.. మమ్మల్ని చంపిచాలనుకున్నారు.. హత్యలు చేయించారు

ఆశారాం బాపు అమ్మాయిలను కీలుబొమ్మలుగా మార్చుకుని అనుభవిస్తాడు. ఆయనకు అమ్మాయిను వేధించడం కొత్త కాదు. ఆశ్రమాల్లో ఆశారాం బాలికలను అనుభవించాడు. ఆశారాం బాపు గురించి నిజాలు, ఆశారాం బాపు రేప్ కేసు, అత్యాచారం

|

మేము ఆధ్యాత్మిక గురువులం.. మమ్మల్ని నమ్మితే మీకు ఎలాంటి కష్టాలుండవని చెప్పుకుంటూ మోసాలు చేసే దొంగ బాబాలు మనదేశంలో చాలా మందే ఉన్నారు. మనవారికి మూఢనమ్మకాలు ఎక్కువ. అందుకే ఈ బాబాల ఆగడాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఒళ్లుగగూర్పాటు

ఒళ్లుగగూర్పాటు

వీరి వికృత చేష్టలు గురించి తెలిస్తే ఒళ్లుగగూర్పాటు కలుగుతుంది. ఆశ్రమాల మాటున అమాయకులను మభ్యపెడుతూ అమ్మాయిలను అనుభవించే బాబాల్లో ఆశారాం బాపు కూడా ఒకడు. మైనర్ బాలిక అత్యాచారం కేసులో రాజస్థాన్ కోర్టు ఆశారాంను దోషిగా నిర్ధారించి.. జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.

రాహుల్ సచార్

రాహుల్ సచార్

అతని గురించి ఒకప్పుడు ఆశారాంకు సన్నిహిత అనుచరుడిగా ఉన్న రాహుల్ సచార్ కొన్నాళ్లు క్రితం కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పారు.

కళ్లారా చూశాను

కళ్లారా చూశాను

"ఆశారాం బాపు అమ్మాయిలను కీలుబొమ్మలుగా మార్చుకుని అనుభవిస్తాడు. ఆయనకు అమ్మాయిను వేధించడం కొత్త కాదు. 2003లో రాజస్థాన్‌లోని పుష్కర్, హర్యానాలోని బివాన, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఆశ్రమాల్లో ఆశారాం బాలికలను వేధించేవాడు. ఇదంతా నేను కళ్లారా చూశాను" అని రాహుల్ సచార్ చెప్పారు.

బ్రహ్మజ్ఞాని

బ్రహ్మజ్ఞాని

"తనలాంటి ‘బ్రహ్మజ్ఞాని'కి అత్యాచార పాపం అంటుకోదని ఆయన సమర్ధించుకునేవాడు ఆశారాం బాపు. లైగింక సామర్థ్యం కోసం ఆయన ఔషదాలు తీసుకునేవారు. ఆయనకు నల్లమందు అలవాటు కూడా ఉంది." అని రాహుల్ సచార్ కొన్నాళ్ల క్రితం వివరించారు.

నచ్చిన బాలికను ఎంచుకుని

నచ్చిన బాలికను ఎంచుకుని

"ఆశారాంకు ముగ్గురు మహిళా సహాయకులు ఉండేవారు.వారితో కలిసి ఆయన ఆశ్రమాల్లో తిరుగుతూ తనకు నచ్చిన బాలికను ఎంచుకునేవారు. ఆశారం టార్చి వేసి చూపించిన బాలికలను.. సహచరులు ఆయన వద్దకు తీసుకెళ్లేవారు. ఆయన వల్ల గర్భం దాల్చిన బాలికలకు అబార్షన్లు కూడా చేయించేవారు." అని రాహుల్ కొన్నాళ్ల క్రితం వివరించారు.

అసలు ఆశారాం బాపు ఎవరు?

అసలు ఆశారాం బాపు ఎవరు?

అసలు ఆశారాం బాపు ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఆయనకూ ఇక్కడి రాజకీయ నేతలకు సంబంధం ఏమిటి అనే విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

బేరానీ గ్రామంలో

బేరానీ గ్రామంలో

1941 ఏప్రిల్‌లో ప్రస్తుత పాకిస్తాన్‌ సింధ్ జిల్లాలోని బేరానీ గ్రామంలో ఆశారాం పుట్టారు. ఆయన అసలు పేరు అసుమల్ హర్పలానీ. ఆయనది సింధీ వ్యాపార కుటుంబం. దేశ విభజన అనంతరం 1947లో ఆయన కుటుంబం అహ్మదాబాద్‌కు వచ్చేసింది.

సబర్మతీ తీరంలో కుటీరం

సబర్మతీ తీరంలో కుటీరం

1960 ప్రాంతంలో ఆయన లీలాషాహ్‌ను ఆధ్యాత్మిక గురువుగా చేసుకున్నారు. ఆయనే తర్వాత అసుమల్ పేరును ఆశారాంగా మార్చారు. 1972లో ఆశారాం బాపు మొదటిసారిగా అహ్మదాబాద్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబర్మతీ తీరంలో కుటీరాన్ని నిర్మించుకున్నారు.

ఆధ్యాత్మిక ప్రాజెక్టు

ఆధ్యాత్మిక ప్రాజెక్టు

అలా ఆశారాం ఆధ్యాత్మిక ప్రాజెక్టు ప్రారంభమైంది. అక్కడి నుంచి అది గుజరాత్‌లోని ఇతర నగరాలకు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించారు.క్రమక్రమంగా ఆశారాం బాపు ఆశ్రమాలు ప్రపంచవ్యాప్తంగా 400 వరకు విస్తరించాయి.

సగం కాలిన మృతదేహాలు

సగం కాలిన మృతదేహాలు

2008, జులై 5న 10 ఏళ్ల అభిషేక్ వాఘేలా, 11 ఏళ్ల దీపేశ్ వాఘేలాల సగం కాలిన మృతదేహాలు ఆశారాం బాపు ఆశ్రమం బైట కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి.అహ్మదాబాద్‌కు చెందిన వీరిద్దరూ చనిపోవానికి కొద్ది రోజుల ముందే ఆశారాం బాపు 'గురుకుల' పాఠశాలలో చేరారు.

దీనిపై విచారణకు గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది కానీ ఆ కమిటీ నివేదికను నేటి వరకు బహిర్గతం చేయలేదు.

సాక్షులపై కూడా ఆశారాం బాపు దాడులు

సాక్షులపై కూడా ఆశారాం బాపు దాడులు

మరోవైపు 2012లో ముఠేరా ఆశ్రమంలో 7 మంది ఉద్యోగుల మృతిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.ప్రస్తుతం ఈ కేసు అహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో నడుస్తోంది. చాలా మంది సాక్షులపై కూడా ఆశారాం బాపు దాడులు చేయించారు. ఇక 2013 ఆగస్టులో ఆశారాం బాపుపై అత్యాచార ఆరోపణలు చేసిన షాజహాన్‌పూర్‌కు చెందిన బాధితురాలి కుటుంబం మొత్తం మొదట్లో ఆయన భక్తులే.

కూతురిని అలా చేస్తాడని

కూతురిని అలా చేస్తాడని

మంచి విద్య లభిస్తుందనే నమ్మకంతో ఇద్దరు పిల్లలను ఆయన చింద్వాడా ఆశ్రమానికి పంపారు. కానీ తమ కూతురిని ఆశారాం బాపు అలా చేస్తాడని వారు అనుకోలేదు. ప్రస్తుతం బాధితుల తల్లిదండ్రులు ఆశారాం బాపుకు శిక్ష పడ్డందకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా హర్షం వ్యక్తం చేశారు

తాజాగా హర్షం వ్యక్తం చేశారు

తమ బిడ్డ జీవితాన్ని నాశనం చేసిన నిందితుడికి సరైన శిక్ష పడిందంటూ బాధితురాలి తల్లిదండ్రులు తాజాగా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆశారాం తమకు దేవుడు లాంటివారని అలాంటి దేవుడే తన బిడ్డపై అత్యాచారం చేశాడంటే భరించలేకపోయామంది బాధితురాలి తల్లి. ఆమె బాధ మొత్తం ఆమె మాటల్లోనే..

మా దేవుడు అనుకున్నాం

మా దేవుడు అనుకున్నాం

ఆశారాం మా దేవుడు అనుకున్నాం. కానీ 16 ఏళ్ల నా కూతురిపై అత్యాచారం చేశాడనే విషయం తెలిశాక మేము కుమిలిపోయాం. నా భర్తకు ఈ విషయం తెలిశాక ఆయన కుప్పకూలిపోయాడు. మేము దైవంగా భావించే ఆశారాం మాబిడ్డపై అత్యాచారం చేశాడు. ఓ దేవుడు మా జీవితాలు నాశనం చేశాడని ఎలా ఆరోపించగలం? ఒక దేవుడితో ఏ విధంగా పోరాడగలం.

కేసు వాపసు తీసుకోవాలన్నారు

కేసు వాపసు తీసుకోవాలన్నారు

కానీ నా భర్త మరుసటి రోజు ఆశారాంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు.నా భర్త వెంటనే ఆశారాంను నిలదీయాలని అనుకున్నారు. కానీ ఆశారాం భక్తులు లోపలికి రానివ్వలేదు. ఆశారాంపై కేసు పెట్టాక అందరూ కేసు వాపసు తీసుకోవాలని సలహాలు ఇచ్చారు. కానీ మేం ఒప్పుకోలేదు.

విరాళం ఇచ్చేవాళ్లం

విరాళం ఇచ్చేవాళ్లం

మొదట మేము ఆశారాం గురించి తప్పుగా ఆరోపణలు చేసేవారితో మేం మాట్లాడేవాళ్లం కాదు. మధ్య తరగతి కుటుంబమే అయినా మా వారు నెలకు సంపాదించే సొమ్ములో కొంత ఆశ్రమానికి విరాళంగా ఇచ్చేవారు. ఆశారాం పేరిట చిన్న ఆశ్రమం కూడా కట్టించాం. అంతగా మేము నమ్మిన ఆశారాం మా జీవితాలను కుదిపేస్తారని ఊహించలేకపోయాం.

చంపిచాలనుకున్నారు.. హత్య చేయించారు

చంపిచాలనుకున్నారు.. హత్య చేయించారు

ఆశారాంకు వ్యతిరేకంగా పోరాడాలని అనుకున్నందుకు మమ్మల్ని చంపించాలనుకున్నారు. మేము ఆశారాం సహచరుల నుంచి వచ్చిన బెదిరింపులను తట్టుకోలేకపోయేవాళ్లం. మా కేసులో సాక్ష్యులుగా ఉన్న కొందరిని హత్య చేయించారు కూడా.

సివిల్స్ కు సన్నద్ధం

సివిల్స్ కు సన్నద్ధం

నా కూతురు ఇప్పుడు అన్నీ మర్చిపోయి చదువుకుంటోంది.సివిల్స్‌కు సన్నద్ధమవుతోంది. ఎందరో జీవితాలను నాశానం చేసిన ఆశారాంకు శిక్ష పడ్డందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పింది బాధితురాలి తల్లి.

English summary

asaram bapu and his unholy crimes why is the godman behind bars

asaram bapu and his unholy crimes why is the godman behind bars
Story first published:Wednesday, May 30, 2018, 9:19 [IST]
Desktop Bottom Promotion