తల్లిదండ్రులు ముద్దుపెట్టుకున్న ప్రతిసారి కేరింతలు కొడుతున్న చిన్నారి!

Subscribe to Boldsky

పసిపిల్లలకు తమ తల్లిదండ్రులు మరియు బంధువుల విషయంలో వారు తమకే స్వంతమని భావిస్తారు. ఒక్కోసారి ఇది మనను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రత్యేకంగా వారు తమలో తాము ప్రేమను ఒకరికొకరు వ్యక్తం చేసుకుంటున్నప్పుడు వారు మరీంత ఉద్వేగ పడతారు.

పిల్లలు ఇలా ఎందుకు చేస్తారో మనకు అర్ధం కాకపోయినప్పటికి, వారు తమ తల్లిదండ్రులు ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకుంటున్నప్పుడు, వారు స్పందించే తీరును చూస్తూ నవ్వకుండా ఉండలేము. వారు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం, వారి తల్లితండ్రుల ధ్యాస మరియు ప్రేమ కేవలం తమకు మాత్రమే చెందాలనే తాపత్రయం వల్లనే! వారిపై కురిపించాల్సిన ప్రేమను, మనం ఇంకొకరితో పంచుకోవడాన్ని వారు ఇష్టపడరు.

Baby’s Cute Giggle Will Make You Go Aww!

ఇక్కడ ఒక చిన్న పిల్లవాని సమక్షంలో, అతని తల్లిదండ్రులు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటున్నారు. అది చూసి ఆనందిస్తున్న ఆ చిన్నారి హావభావాలను చూస్తుంటే మన మనసు, ఆ బోసినవ్వుల ఆనంద డోలికల్లో మునకలేస్తుంది.

ఇక్కడ ఒక అందమైన వీడియోలో, ఒక చిన్నారి తన తల్లిదండ్రులు ముద్దు పెట్టుకున్నట్టు కనిపించే ప్రతిసారీ, దానిని ఆస్వాదిస్తున్నట్లుగా కనపడతాడు. వీడియో మొదలయినప్పుడు, ఒక స్త్రీ తన చేతులలో ఒక పసి పిల్లాడిని పట్టుకొని ఉండటం చూడవచ్చు. ఆమె భాగస్వామి కూడా ఆ దృశ్యంలో దర్శనమిస్తారు. ప్రతిసారీ ఆమె తన భర్త ముద్దు పెట్టుకోవడానికి అనువుగా వంగినపుడు, ఆ పిల్లవాడు ఉత్సాహంతో, తన తల్లిదండ్రుల ముద్దులాటను చూసి సంపూర్ణ ఆనందంతో నవ్వులు చిందిస్తుంటాడు.

ప్రతిసారీ అతని తల్లిదండ్రులు వీడియోలో ముద్దు పెట్టుకుంటూ ఉన్నప్పుడు, ఈ చిన్న బాలుడు ముగ్ధమనోహరంగా తుళ్ళుతూ, నవ్వులలో మునిగిపోతాడు! మీరు ఈ రోజు అంతర్జాలంలో వీక్షించిన వీడియోలన్నింటిలోకి, అందమైన వీడియోగా ఇది నిలిచిపోతుంది.

మీరు కూడా ఆ చిన్నారి, అతని కుటుంబంతో పాటుగా, ఆ నవ్వులలో తప్పక శృతి కలుపుతారు.

ఎంత ప్రయత్నించినా, నవ్వు ఆపుకోలేరు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమమైన వీడియోలను మీ కోసం మా ఇంసింక్ విభాగం ద్వారా అందిస్తాము. ఇలాంటి ఉత్తేజకరమైన మరియు ప్రత్యేకమైన వీడియోల కోసం, తప్పకుండా మా ఈ విభాగాన్ని తరచుగా సందర్శించండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Baby’s Cute Giggle Will Make You Go Aww!

    In a viral video, a woman is seen holding her baby boy and in her arms. Every time the woman tends to lean and kiss her husband, the baby boy seems to get incredibly excited. In the video, it is seen that every time his parents kiss, this little cutie pie starts giggling in the most adorable manner! This is one of the best videos you would see online today
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more