చెట్టంత మనిషి.. చెట్టులా మారిపోతున్నాడు

Written By:
Subscribe to Boldsky

శరీరంపై ఏదైనా చిన్న గుల్లలాంటిది వస్తేనే మనం దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. దాన్ని నయం చేసుకునేందుకు వెంటనే డాక్టర్ దగ్గరకు కూడా వెళ్తాం. చిన్నపాటి కురుపు తగ్గించుకునేందుకు మనం ఇంతగా ఇబ్బందిపడతాం అయితే ఒక మనిషి చేతులు వికృతంగా మారితే ఆయన ఎంత ఇబ్బందిపడతాడో ఒకసారి ఆలోచించండి.

చెట్టు బెరడు మాదిరిగా

చెట్టు బెరడు మాదిరిగా

చెట్టు బెరడు, వేళ్లు ఆకారంలో అతని చేతులు మారిపోయాయి. అరచేతులు మొత్తం అందవికారంగా మారాయి. బంగ్లాదేశ్ లోని అబుల్ బజందర్ అనే యువకుడు ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నాడు.

ట్రీ మన్

ట్రీ మన్

ఇతన్ని స్థానికులు ట్రీ మ్యాన్ అని అంటుంటారు. చెట్టు బెరడు లాంటి ఆకృతులతో అతడి రెండు చేతులు, కాళ్లు మారిపోయాయి. అతడి చేతికి, కాళ్లకు అలా రావడానికి కారణం ఓ చర్మ వ్యాధి. దానిని 'ఎపిడర్మోడిస్ప్లాషియా వెర్రసిఫార్మిస్' అని అంటారు.

పదేళ్లకు పైగా

పదేళ్లకు పైగా

దాదాపు పదేళ్లకు పైగా ఈ వ్యాధితో అబుల్ బజందర్ బాధపడుతున్నాడు. మాములు మనిషిగా మారేందుకు ఈ చెట్టు మనిషి అబుల్ బజందర్ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా విజయవంతం కాలేదు.

సర్జరీలు ఫలించలేదు

సర్జరీలు ఫలించలేదు

వైద్యులు గతంలో సర్జరీలు చేశారు. అయినా ఫలించలేదు. ఇప్పుడు మళ్లీ అతని చేతిపై పుట్ట గొడుగుల్లాంటి ఆకారాలు మొలవటం ప్రారంభమైంది.

నిత్యం నరకం

నిత్యం నరకం

ఎపిడర్మోడిస్ప్లాషియా వెర్రసిఫార్మిస్ అనే చర్మ వ్యాధి ముదరటంతో చెట్టు బెరడు లాంటి ఆకృతులుగా అతడి రెండు చేతులు, కాళ్లు మారిపోయాయి. ఆ బాధతో అతను నరకం అనుభవించాడు.

2016 మొదటి సారిగా

2016 మొదటి సారిగా

2016లో ఇతని గురించి మొదటిసారి కొన్ని వార్తలు వచ్చాయి. బంగ్లా ట్రీ మ్యాన్‌(చెట్టు మనిషిగా) అతని పేరు పాపులర్‌ అయిపోయింది. అప్పుడు ఢాకాలోని మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి అతనికి ఉచితంగా చికిత్స చేసేందుకు ముందుకొచ్చింది. శస్త్రచికిత్స ద్వారా వింత వ్యాధి నుంచి విముక్తి కలిగిస్తామని అతనికి ధైర్యం ఇచ్చారు.

24 సర్జరీలు

24 సర్జరీలు

ఏడాదికాలంగా ఇతనికి 24 సర్జరీలు చేసి చేతిపై, కాళ్లపై ఉన్న చెట్టు బెరడులాంటి వాటిని తొలగించారు. ఇక మాములు మనిషిని అయిపోయానని అతను సంతోషించాడు. చాలా రోజులుగా అతన్ని ఆస్పత్రిలోనే ఉంచారు. అయితే ఇప్పుడు సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

ఇంకాస్త సమయం

ఇంకాస్త సమయం

అబుల్ బజందర్ కు వ్యాధి మెరుగవటానికి ఇంకా కాస్త సమయం పట్టొచ్చని మరిన్ని ఆపరేషన్లు అవసరమని వైద్యులు అంటున్నారు. కానీ, బజందర్‌ మాత్రం తనకు లాంటి శస్త్ర చికిత్సలు వద్దని అంటున్నాడు. తన కాళ్లు చేతులు బాగుపడతాయనే నమ్మకం తనకు లేదంటున్నాడు.

చనిపోయినా ఫర్వాలేదు

చనిపోయినా ఫర్వాలేదు

తాను చనిపోయినా ఫర్వాలేదని అబుల్ బజందర్ అంటున్నాడు. తనను బయటికి పంపించేయండని కోరుకుంటున్నాడు. తన కుటుంబాన్ని పోషించుకోవాలని, తన కూతురిని చదివించుకోవాలని, తనను ఇక్కడి నుంచి పంపండని వైద్యులను అతను వేడుకుంటున్నాడు.

25వ సర్జరీ చేసి చూస్తాం

25వ సర్జరీ చేసి చూస్తాం

అయినప్పటికీ 25వ సర్జరీ చేసి చూస్తామని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలో ఇతనికి ముందు ముగ్గురు ఇలాంటి సమస్యను ఎదుర్కున్నారు. అయితే వారి విషయంలో కూడా శస్త్రచికిత్సలు ఫలించలేదని తెలుస్తోంది. అబుల్ బజందర్ త్వరంగా కోలుకోవాలని అందరం కోరుకుందాం.

Image Credit (all photos) :https://www.thesun.co.uk/news/5453632/bangladesh-tree-man-bark-like-warts-grow-hand-surgery-remove/

English summary

bangladesh tree man bark like warts grow hand surgery remove

bangladesh tree man bark like warts grow hand surgery remove
Story first published: Saturday, February 24, 2018, 13:30 [IST]