For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఎల్లో సఫైర్ స్టోన్ ని ధరించడం వలన కలిగే లాభాలు

  |

  జూపిటర్ కి సంబంధించిన ఎల్లో సఫైర్ స్టోన్ ని అనేక పేర్లతో గుర్తిస్తారు. పక్రాజ్, గురురత్న, పుష్పరాగం, పీత్మని, పుష్ప్రాగ్, గురుప్రియ, గురువల్లభః, వాచస్పతి వల్లభ్ మరియు పీత్మన్ అని దీనిని పిలుస్తారు.

  కోరండం కుటుంబానికి చెందిన ఈ ఎల్లో సఫైర్ అనేది బ్ల్యూ సఫైర్ అలాగే రూబీకి చెందిన జాతిది. ఎల్లో, గోల్డెన్ అలాగే ఆరెంజ్ కలర్స్ లో ఇది లభ్యమవుతుంది. లెమన్ యెల్లో కలర్ అనేది అత్యంత నాణ్యత కలిగినది. ఐరన్ అలాగే టైటానియం రంగులలో ఎల్లో సఫైర్ కనిపిస్తుంది.

  జీవితంలోని అద్భుతాలను మీరు గమనించవచ్చు

  జీవితంలోని అద్భుతాలను మీరు గమనించవచ్చు

  వీటిని సరైన విధంగా ధరిస్తే మీ జీవితంలోని అద్భుతాలను మీరు గమనించవచ్చు. ఈ రత్నాన్ని ధరించిన వారిని సకల సంపదలు వరిస్తాయి. అందువలన, నవరత్నాలలో ఈ రత్నానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆర్థిక స్థితిని మెరుగుపరిచే స్థితి ఈ రత్నానికి కలదు. ఈ రత్నాన్ని ధరించిన వారిని కీర్తి, సంపద, గౌరవం అలాగే విజయం వరిస్తాయి.

  వంశాభివృద్ధి జరుగుతుంది.

  వంశాభివృద్ధి జరుగుతుంది.

  భారతీయులు ఎల్లో సఫైర్ ను శుభకరమైన రత్నంగా భావిస్తారు. దీనిని ధరించడం వలన వంశాభివృద్ధి జరుగుతుంది. ప్రశాంతత అలాగే సంపద లభిస్తుంది. శక్తిని అలాగే అధికారాన్ని ఎల్లో సఫైర్ అందిస్తుంది. అందుకే, ఇది అభివృద్ధిని కలిగించే రత్నంగా ప్రసిద్ధి. ఈ రత్నాన్ని ధరించడం వలన జ్ఞానం పెరుగుతుంది. అలాగే, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ధరించిన వారికి ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి.

  వివాహిత మహిళలు ఈ రత్నాన్ని ధరించాలి

  వివాహిత మహిళలు ఈ రత్నాన్ని ధరించాలి

  బంగారంలో కలిపి గురువారంనాడు ధరిస్తే ఈ రత్నం అద్భుత ఫలితాలను అందిస్తుంది. పవిత్ర గ్రంధాల ప్రకారం వైవాహిక జీవితం సంతోషంగా గడవాలంటే వివాహిత మహిళలు ఈ రత్నాన్ని ధరించాలి. తద్వారా, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

  ఈ రత్నాన్ని ధరించిన వారిని మంచి ఆరోగ్యం, జ్ఞానం, సంపద, దీర్ఘాయుష్షు, కీర్తిప్రతిష్టలు వరిస్తాయి

  ఈ రత్నాన్ని ధరించిన వారిని మంచి ఆరోగ్యం, జ్ఞానం, సంపద, దీర్ఘాయుష్షు, కీర్తిప్రతిష్టలు వరిస్తాయి

  ఈ రత్నాన్ని ధరించిన వారిని మంచి ఆరోగ్యం, జ్ఞానం, సంపద, దీర్ఘాయుష్షు, కీర్తిప్రతిష్టలు వరిస్తాయి. ఆలాగే, దుష్టశక్తులు వీరి నుంచి దూరంగా ఉంటాయి. ఇది నవరత్నాలలోనే ఉత్తమమైన రత్నం. విద్యార్థులు ఈ రత్నాన్ని ధరిస్తే వారు బాగా చదువుతారని నమ్మకం. మహిళా అభ్యున్నతికి ఈ రత్నం ఉపయోగపడుతుంది. కన్యలు ఈ రత్నాన్ని ధరిస్తే వివాహం త్వరగా జరుగుతుంది. సరైన వరుడు లభిస్తాడు. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. పండండి బిడ్డను కంటారు.

  వైవాహిక జీవితంలోని ఇబ్బందులను తొలగిస్తుంది

  వైవాహిక జీవితంలోని ఇబ్బందులను తొలగిస్తుంది

  వైవాహిక జీవితంలోని ఇబ్బందులను తొలగించడంతో పాటు ఈ రత్నం అనేది సంబంధ బాంధవ్యాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అందుకే, నిశ్చితార్థ వేడుకలలో ఈ రత్నాన్ని కూడా వాడతారు. వివాహానికి సంబంధించిన అన్ని అంశాలు అనుకూలంగా జరుగుతాయి. మహిళలకు అన్ని విధాలా మంచి చేకూరుస్తుంది ఈ రత్నం.

   ప్రేమికులను కలుపుతుంది

  ప్రేమికులను కలుపుతుంది

  విడిపోయిన ప్రేమికులను కలుపుతుంది ఈ రత్నం. ఈ రత్నాన్ని ధరించిన వారికి చట్టంపై అలాగే విలువలపై అవగాహన ఏర్పడుతుంది. అలాగే, వీరు చాతుర్యం కలిగి ఉంటారు. మంచి ఆరోగ్యంతో, మానసిక ప్రశాంతతతో మనుగడ సాగిస్తారు. మంచి ప్రవర్తనంతో దీర్ఘ జీవితాన్ని గడుపుతారు.

  ఈ రత్నాన్ని ధరిస్తే ఆరోగ్య సమస్యలుండవు

  ఈ రత్నాన్ని ధరిస్తే ఆరోగ్య సమస్యలుండవు

  ఈ రత్నాన్ని ధరిస్తే జాండిస్, గొంతు ఇన్ఫెక్షన్, లివర్ సమస్యలు, లంగ్స్, చెవులు అలాగే రక్త ప్రసరణ సమస్యలు, డ్రాప్సీ, కడుపుబ్బరం, డిస్పెప్సియా, అబ్సెస్, ట్యూమర్లు, స్కిన్ ట్రబుల్స్, సెరిబ్రల్ కంజెషన్, ఆర్టెరీస్ లో రక్తప్రసరణ, శరీరంలోని కొవ్వు వంటి సమస్యలు వేధించవని ఆస్ట్రాలజర్స్ నమ్మకం.

  సహజమైన, వేడిచేయబడని, దోషాలు లేని ఎల్లో సఫైర్ నే ధరించాలి.

  సహజమైన, వేడిచేయబడని, దోషాలు లేని ఎల్లో సఫైర్ నే ధరించాలి.

  సహజమైన, వేడిచేయబడని, దోషాలు లేని ఎల్లో సఫైర్ నే ధరించాలి. అప్పుడే, అద్భుత ఫలితాలను పొందగలుగుతారు.

  English summary

  Benefits of Yellow Sapphire Stone

  Benefits of Yellow Sapphire Stone,According to Vedic astrology, this gemstone helps you to get over your financial problems. It provides peace and prosperity to one and all. It is ruled by the planet Jupiter.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more