For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజును ఉత్సాహంగా ప్రారంభించేందుకు తోడ్పడే 5 మోటివేషనల్ కోట్స్

|

ప్రారంభం ఎంత గొప్పగా ఉంటే పనులు కూడా అంతే సజావుగా సాగుతాయి. ఇది ప్రతి విషయానికి వర్తిస్తుంది. ఏదైనా పనిని ఎంతో ఉత్సాహంగా ప్రారంభిస్తే ఆ పనిలో అలసట మన దరిచేరదు. ఆ పనిని అంతే దీక్షతో ఉత్సాహంగా పూర్తిచేయగలుగుతాము. మీ శక్తి సామర్థ్యాల పట్ల మీకున్న నమ్మకం మీకు ఎనలేని అవకాశాలను కల్పిస్తుంది. అయితే, దేనినైనా నెగటివ్ గా ప్రారంభిస్తే మీరు ఆ పనిని పూర్తిచేయలేరు. ఇదే అంశం రోజు ప్రారంభానికి కూడా వర్తిస్తుంది. మనం ఎంత ఉత్సాహంగా రోజును ప్రారంభిస్తామో అదే ఉత్సాహం రోజంతా కొనసాగి మనల్ని ఉత్తేజంగా ఉంచుతుంది.

జీవితమనేది కొన్ని ప్రత్యేకమైన ఛాలెంజెస్ ను ఎదురుగా ఉంచుతుంది. ఈ ఛాలెంజెస్ ను తప్పించుకోవడం ఎవరి వలనా కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదో ఒక విధమైన ఛాలెంజ్ కచ్చితంగా ఉంటుంది. ఛాలెంజెస్ ని ఎదుర్కోవడంలోనే మన నేర్పు కనిపిస్తుంది. కాబట్టి, రోజును ఉత్సాహపూరితంగా ప్రారంభించడం వలన మీకు ఆయా ఛాలెంజెస్ ను ఎదుర్కొనే మనోబలం లభిస్తుంది.

Best Motivational Quotes To Start Your Day

అయితే, ఇందుకు ఆసక్తితో పాటు ఉత్సాహం కూడా అవసరం. నిన్నటి రోజున ఏవైనా పనులు నచ్చనివి కొన్ని జరిగినా, నచ్చని విధంగా కొన్ని టాస్క్స్ అనేవి షెడ్యూల్ చేయబడిన ఏదైనా విషయంలో మీ మూడ్ అప్సెట్ అయినా ఆ ఇంపాక్ట్ మరుసటి రోజుపై ఉండకూడదు. ఏ రోజు కారోజును ఫ్రెష్ గా స్టార్ట్ చేయడంలోని లైఫ్ సక్సెస్ అనేది దాగుంది.

కారణమేదైనా, మనసు ఇబ్బందిపడే విషయాలను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ పాజిటివ్ నోట్ తో ముందుకు వెళ్లడం వలన జీవితంలోని సక్సెస్ ను ఎంజాయ్ చేసే అవకాశం లభిస్తుంది. పాజిటివిటీను పొందడానికి సులభమైన మార్గాన్ని ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. రోజును పాజిటివ్ గా ప్రారంభించేందుకు ఈ ఐదు మోటివేషనల్ కోట్స్ ను ప్రతి రోజూ ఉదయాన్నే చదివితే పాజిటివిటీను మీరు గమనించగలుగుతారు.

అటువంటి మోటివేషనల్ కోట్స్ ను మీ ముందుంచుతున్నాము.

1. మీ పాదాల్ని నేలపై ఉంచి ఆకాశంలోని చుక్కలపై దృష్టి పెట్టండి:

1. మీ పాదాల్ని నేలపై ఉంచి ఆకాశంలోని చుక్కలపై దృష్టి పెట్టండి:

ఈ గజిబిజి జీవితంలో ఎన్నో బాధ్యతలతో అలాగే పనులతో సతమతమవుతూ జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను కూడా ఆస్వాదించలేకపోతున్నారు చాలా మంది. అలాగే, ఇతరులను అణగదొక్కాలని చూసి తమ విలువలనను కోల్పోవడానికి కూడా కొందరు వెనుకాడరు. బంధుమిత్రులను అలాగే తమకై కష్టసమయంలో నిలుచున్నవారిని సైతం వారికేమీ లేనప్పుడు వారిని కూడా మరచిపోవడానికి సిద్ధపడతారు.

అటువంటి పరిస్థితి ఎదురవకూడదంటే, ప్రతి ఉదయం మీరొక్క విషయాన్ని గుర్తుంచుకుని తీరాలి. పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకోవడంలో తప్పులేదు. అయితే, మీరు మాత్రం భూమిపైనే ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకుని మీకు దగ్గరైన వారికి సమయాన్ని కేటాయించగలగాలి.

2. మాట్లాడటం తగ్గించి పనిచేయడం ప్రారంభించండి:

2. మాట్లాడటం తగ్గించి పనిచేయడం ప్రారంభించండి:

తరచూ, మనం ఎన్నో రకాల మనుషులను గమనిస్తూ ఉంటాము. వారిలో, కొందరు ఎప్పుడూ ఎదో ఒకటి చేయాలన్న ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. చివరికి, వారేమీ సాధించరు. అటువంటి వారి కోవలోకి మీరు రాకుండా ఉండేందుకు మీరు పని మీద ధ్యాస పెట్టాలి. అనవసరమైన ప్రగల్భాలను తగ్గించి చేయాల్సిన విషయంపై దృష్టి పెట్టాలి.

3. మీరు కిందపడిపోయారన్నది ప్రశ్న కాదు, మళ్ళీ పైకెప్పుడు ఎదుగుతారన్నది ప్రశ్న

3. మీరు కిందపడిపోయారన్నది ప్రశ్న కాదు, మళ్ళీ పైకెప్పుడు ఎదుగుతారన్నది ప్రశ్న

విజయాన్ని సాధించాలన్న ప్రయత్నంలో ఎన్నో సార్లు ఓటమిని ఎదుర్కోవలసి రావచ్చు. అయితే, అటువంటి ఫెయిల్యూర్ మూమెంట్స్ మీ జర్నీని నిర్వచించకూడదు. వాటిలోంచి మీరు తప్పులను దిద్దుకొని తిరిగి పైకెదగడానికి కృషి చేయాలి. కాలం అనేది అన్నిటికంటే బలమైనది.

4. మీరు ద్వేషించే దానిలో విజయం సాధించడం కంటే మీరు ఇష్టపడే విషయంలో ఓటమిపాలవడం ఉత్తమం

4. మీరు ద్వేషించే దానిలో విజయం సాధించడం కంటే మీరు ఇష్టపడే విషయంలో ఓటమిపాలవడం ఉత్తమం

మీరు ప్రేమించే విషయంలో మీరు పడే కష్టము మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఆనందాన్ని లోకంలో లభించే ఏ ఇతర అంశమూ రీప్లేస్ చేయలేదు. ఒకవేళ మీరు ప్రావీణ్యత సాధించలేకపోయినా మీరు తగినంత శ్రమను పెడుతున్నారన్న సంగతి మీకు సంతృప్తిని ఇస్తుంది. భవిష్యత్తులో ఎప్పటికైనా మీరు ప్రావీణ్యం సాధించే అవకాశాలు లభిస్తాయి కూడా.

5. మీరు సాధించగలరనుకున్నా లేదా సాధించలేరనుకున్నా మీ అభిప్రాయం సరైనదే

5. మీరు సాధించగలరనుకున్నా లేదా సాధించలేరనుకున్నా మీ అభిప్రాయం సరైనదే

ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం గురించి ఆ వ్యక్తి కంటే బాగా ఎవరికీ తెలియదు అనడంలో అతిశయోక్తి లేదు. అందువలన , ఏదైనా టాస్క్ ను నేను కంప్లీట్ చేయలేను అని మీకు అనిపిస్తే అది సరైన అభిప్రాయమే అయి ఉండవచ్చు. మరోవైపు, మీరు సాధించగలరు అని మీరనుకుంటే ఈ ప్రపంచంలోనున్నదేదీ మిమ్మల్ని ఆపలేదు.

ఈ ఐదు మోటివేషనల్ కోట్స్ మీ రోజును పాజిటివ్ నోట్ తో ప్రారంభించడానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.

English summary

Best Motivational Quotes To Start Your Day

Motivation is the reason for people to react on their actions, desires, and their needs. Reading on some of the best motivational quotes caxn bring in the best of our moods. We need to understand that an individual is not motivated by another individual while motivation comes from within the individuals.
Desktop Bottom Promotion