For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కడ చాలా తక్కువ రేటుకే పెట్రోల్ లభిస్తుందని మనోళ్లంతా బైక్ లపై క్యూ కడుతున్నారు

భారత్‌తో పోలిస్తే నేపాల్‌లో పెట్రోల్‌ రూ 15, డీజిల్‌ రూ 18 తక్కువ కావడం గమనార్హం. మరోవైపు మన కరెన్సీ రూ 100 నేపాలీ రూపీ 160.15తో సమానం. తక్కువ ధరకే పెట్రోలు, పెట్రోలు రేట్లు

|

పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముందు ముందు ధరలు మరింత పెరగొచ్చని వినియోగదారులు భయపడుతున్నారు. ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గిందేమీ లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ఎక్సైజ్ డ్యూటీ

ఎక్సైజ్ డ్యూటీ

2014 నుంచి 2016 వరకు మొత్తం 9 సార్లు కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్‌పై అదనంగా రూ.11.70పైసలు, డీజిల్‌పై రూ.13.47పైసలు అదనపు భారం పడింది. దీంతో సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ధరలు క్రమంగా ఎగబాకుతున్నాయి

ధరలు క్రమంగా ఎగబాకుతున్నాయి

అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు క్రమంగా ఎగబాకుతున్నాయి. సరఫరాలు తగ్గడంతో ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 84 డాలర్లు దాటింది. 2014 నవంబర్ తర్వాత ఈ ధర ఇంత గరిష్ఠ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీంతో ఈ చమురు ధరల సెగ భారత ఆర్థిక వ్యవస్థను తాకుతోంది.

చైనా తర్వాత మూడో స్థానంలో

చైనా తర్వాత మూడో స్థానంలో

ప్రపంచంలో అత్యధికంగా చమురును వినియోగిస్తున్న దేశాల జాబితాలో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానంలో ఉన్నది మన దేశమే. ఇక్కడ అవసరాల కోసం 80 శాతానికిపైగా దిగుమతులపైనే ఆధారపడటమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ప్రస్తుతం పెరుగుతున్న ముడి చమురు ధరలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనున్నాయి.

ఎలాంటి తగ్గింపులు ఇవ్వలేదు

ఎలాంటి తగ్గింపులు ఇవ్వలేదు

పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం... రోజువారీ ప్రాతిపదికన పెంచుతోంది. దానికి అంతర్జాతీయంగా పెరుగురుతున్న క్రూడాయిల్ ధరలను సాకుగా చూపుతోంది. కానీ అంతర్జాతీయంగా తగ్గినప్పుడు కేంద్రం ఎలాంటి తగ్గింపులు ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. కానీ కేంద్రం మాత్రం ..చూద్దాం అంటూ తప్పించుకుంటోంది.

బిహారల్ లోని నేపాల్ సరిహద్దు ప్రాంతాల వారు

బిహారల్ లోని నేపాల్ సరిహద్దు ప్రాంతాల వారు

ఇక దేశంలో పెట్రోల్‌ ధరలు భగ్గుమంటుంటే బిహార్‌లోని నేపాల్‌ సరిహద్దు ప్రాంతాల ప్రజలు పెట్రో సెగలను తప్పించుకునేందుకు సరికొత్త దారులు వెతికారు. రక్సల్‌, సీతామర్హి ప్రాంతాల్లోని ప్రజలు తమ వాహనాల్లో పెట్రోల్‌ నింపుకునేందుకు పక్కనే ఉన్న పొరుగు దేశానికి వెళుతున్నారు.

పెట్రోల్‌ రూ 15, డీజిల్‌ రూ 18 తక్కువ

పెట్రోల్‌ రూ 15, డీజిల్‌ రూ 18 తక్కువ

భారత్‌తో పోలిస్తే నేపాల్‌లో పెట్రోల్‌ రూ 15, డీజిల్‌ రూ 18 తక్కువ కావడం గమనార్హం. మరోవైపు మన కరెన్సీ రూ 100 నేపాలీ రూపీ 160.15తో సమానం. దీంతో నేపాల్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉండటంతో సరిహద్దు ప్రాంత ప్రజలు పెట్రోల్‌ కోసం సరిహద్దులు దాటుతున్నారు.

సీతామర్హి కి...

సీతామర్హి కి...

నేపాల్‌ సరిహద్దుకు సీతామర్హి కేవలం 30-40 కిమీ దూరంలో ఉంది. మరోవైపు కొందరు వ్యాపారులు నేపాల్‌లో తక్కువ ధరకు పెట్రోల్‌, డీజిల్‌ కొని వాటిని భారత్‌లో విక్రయిస్తున్నారు. భారత్‌ సరిహద్దుల్లో గత కొద్దిరోజులుగా పెట్రోల్‌ విక్రయాలు 15 నుంచి 20 శాతం పెరిగాయని నేపాల్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అధికారి పేర్కొన్నారు.

సంబరపడుతున్నారు

సంబరపడుతున్నారు

నేపాల్‌లో పెట్రో విక్రయాలు పెరగడంతో నేపాల్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంబరపడుతుంటే బిహార్‌ సరిహద్దుల్లోని పెట్రో పంపులు వినియోగదారులు లేక కళతప్పాయి.ఇక నేపాల్‌కు సైతం పెట్రోలియం ఉత్పత్తులను భారత్‌ సరఫరా చేస్తోంది. పొరుగు దేశానికి భారత్‌ నుంచి రోజూ 250 ట్యాంకర్ల ఆయిల్‌ నేపాల్‌ సరఫరా అవుతోంది. భారత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులతో పెట్రోల్‌ ధరలు భారమవుతుండగా, నేపాల్‌లో ఏకపన్ను వ్యవస్థ అమల్లో ఉంది.

ఒక్క పైసా

ఒక్క పైసా

కాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గింది ఒక్క పైసా మాత్రమేనని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వెల్లడించాయి. క్లరికల్‌ పొరపాటు వల్ల మే 30న ఉదయం లీటరు పెట్రోల్‌ ధర 60పైసలు, డీజిల్‌ లీటరుకు 56పైసలు తగ్గిందని వార్తలు వచ్చినట్లు చమురు సంస్థలు స్పష్టం చేశాయి. గత 16 రోజులుగా చుక్కలు చూపిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయని వినియోగదారులు సంబరపడే లోపే చమురు సంస్థలు.. పొరపాటు జరిగిందని తగ్గింది ఒక్క పైసాయేనని వెల్లడించాయి.

పెట్రోల్‌ ధర రూ.3.8 పైసలు పెరగగా

పెట్రోల్‌ ధర రూ.3.8 పైసలు పెరగగా

దిల్లీలో ఈరోజు పెట్రోల్‌ ధర లీటరుకు ఒక్క పైసా తగ్గి రూ.78.42గా ఉంది. డీజిల్‌ ధర కూడా ఒక్క పైసా తగ్గి రూ.69.30గా ఉంది.ఈ పక్షం రోజుల్లో మొత్తంగా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.3.8 పైసలు పెరగగా, లీటరు డీజిల్‌ ధర రూ.3.38 పైసలు పెరిగింది.

English summary

bihar people getting rs 15 cheaper petrol heres how

bihar people getting rs 15 cheaper petrol heres how
Story first published:Wednesday, May 30, 2018, 12:49 [IST]
Desktop Bottom Promotion