For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భర్తకు బహుమతిగా ఎన్క్రోమా గ్లాసెస్ ఇచ్చిన భార్య

|

పెళ్లి రోజున మీ భాగస్వామిని సర్ప్రైజ్ చేయడానికి ఇచ్చే అత్యుత్తమ బహుమతి ఏమిటి?

పెళ్లిరోజున భాగస్వామిని సర్ప్రైజ్ చేయాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. కొందరు భాగస్వామికి నచ్చిన అంశాలను, లేదా అవసరమైన వస్తువులను తెలుసుకుని బహుమతిగా ఇచ్చేవాళ్ళు ఉంటే, ట్రిప్స్ పార్టీల ద్వారా కొందరు సర్ప్రైజ్ ప్లాన్స్ చేస్తుంటారు. మరికొందరు ఊహకు అందని బహుమతులను ఇచ్చి మరపురాని రోజుగా మలిస్తే, కొందరు తమ బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి సమయం కేటాయించి, ఆరోజు ఇష్టమైన ఆహారపదార్ధాలు చేసిపెట్టడం వంటివి చేస్తుంటారు. వీటికి కారణం తమ భాగస్వామి మీద తమకున్న ప్రేమను వ్యక్తపరచడమే. క్రమంగా జీవితంలో మధురజ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి.

ఈ వీడియో ప్రకారం, ఒక వధువు, తన భర్తకు ఎన్క్రోమా గ్లాసెస్ జతను బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. ఇది నిజంగా హృద్యమైన సన్నివేశం, ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే అర్ధమైపోతుంది.

Couple Goals: Wife Gifts Husband EnChroma Glasses

అసలేమిటి ఈ ఎన్క్రోమా గ్లాసెస్, ఏమిటి దీనిలో స్పెషాలిటీ? వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ! కళ్ళలో రంగుల సమస్య ఉండి, సరిగ్గా చూడలేని ప్రత్యేకమైన వ్యక్తుల కోసం తయారు చేయబడిన గ్లాసెస్ ఇవి. కానీ ఈ గ్లాసెస్ ఖరీదు చాలా ఎక్కువగా ఉండడం వలన, అనేకులకు అందని ద్రాక్ష పండే అని చెప్పాలి. కానీ వీటి ఖరీదు ఎంత ఎక్కువో అంత పనితనాన్ని కూడా కలిగి ఉంటాయి.

బ్లైర్ అహ్లెర్స్ అనే 24 ఏళ్ల వధువు, తన భర్త గ్రిఫిన్ కోసం ఒక పరిపూర్ణమైన బహుమతిని ఇవ్వాలని కోరుకుంది. అన్నిటికన్నా ఉత్తమమైన బహుమతి ఏదైనా ఉంది అంటే, వారి జీవితానికి ఒక పరిపూర్ణతను ఇచ్చే అంశాన్ని కనుక్కుని, క్రమంగా ఆ కోరికను లేదా అవసరాన్ని తీర్చడం. ఆ ప్రకారంగా తన భర్త సమస్య మీద దృష్టి సారించింది ఈ నవ వధువు.

ఈ వైరల్ వీడియో ప్రకారం, తన పెళ్లి రోజునే, ఈ ప్రపంచాన్ని రంగుల మయంగా చూడడం, క్రమంగా ఆనందోత్సాహానికి లోనవడం వంటివి ఎంతో హృద్యంగా కనిపించింది. ఇప్పటి దాకా చీకటి చాయలు అలముకున్న నా ఈ జీవితాన్ని, ఈ ఎన్క్రోమా గ్లాసెస్ పూర్తిగా మార్చివేశాయి అని మురిసిపోతున్నాడు గ్రిఫిన్.

వరుడు, తన భార్య ఇచ్చిన ఈ 'మాజికల్' గ్లాసెస్ ధరించి కన్నీళ్ళతో ఇంటి బయటకు కదిలాడు. ఆ అద్దాలు ధరించగానే, ఇంతకాలం తాను చూడలేకపోయిన రంగుల ప్రపంచాన్ని చూడడంతో ఎంతో ఆనందానికి లోనయ్యాడు .

ఇటువంటి హృద్యమైన వీడియోలు మనుషుల మానసిక దృక్పధాన్ని కూడా మార్చివేయగలవు. గాడ్జెట్లలో ప్రపంచాన్ని వెతుక్కుంటున్న నేటితరానికి నిజమైన ప్రపంచం గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఇటువంటి వీడియోల ద్వారా అవగతమవుతుంది. కొందరు పెళ్లిరోజున తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తారు. కానీ, పుట్టినరోజు, పెళ్లి రోజు, ప్రేమికుల రోజు అనేవి తమ బావాలను మరింత హృద్యంగా భాగస్వాములతో పంచుకోడానికి, మీ దైనందిక బిజీ షెడ్యూల్లో వారికి కూడా భాగం ఉంది అని తెలియజేయడానికి అనుకూలమైన సమయాలుగా ఉన్నాయని మరువకండి. మీరిచ్చే బహుమతి మీ ప్రేమను చూపేలా ప్రయత్నించండి.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలకోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈవ్యాసంపై మీ విలువైన అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

Couple Goals: Wife Gifts Husband EnChroma Glasses

What is the best gift that you can gift your partner on the wedding day? The gifts that we often plan to gift our partners on this day are generally the ones that we wish them to remember for life.
Story first published: Saturday, August 4, 2018, 22:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more