For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తన కొడుకు పట్ల టీచర్ చేసే హేళనను రికార్డ్ చేయడానికి, స్కూల్ బాగ్లో రికార్డర్ పెట్టిన తల్లి

|

సాధారణంగా ప్రజలు నిరుత్సాహపడడానికి కారణమయ్యే ప్రధాన కారకాల్లో ఒకటి వేధింపు. అది బెదిరింపు కావొచ్చు లేదా హేళన కావొచ్చు. ఈ పరిణామాలు ఆఖరికి విద్యా వ్యవస్థలో కూడా సర్వసాధారణంగా ఉటుంది. విద్యార్థులను సాటి విద్యార్ధులను వేధించడం వంటివి మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు, విద్యార్థులకు మద్య కూడా ఈ వేధింపులు నిత్యకృత్యాలుగా ఉంటున్నాయి.

ఈ వేధింపులు శారీరికంగా, లైంగికంగానే కాకుండా మానసికంగా కూడా ఉంటుంది. కుల,-మత, జాతివివక్షలు, రంగు-రూపు సారూప్యతలు, అసూయ, ఈర్ష్యాద్వేషాల వంటి అనేక అంశాలు ఇందులో ప్రధానపాత్రని పోషిస్తుంటాయి.

Mom Used A Recorder To Save Her Son From Being Bullied By Teacher

ఇక్కడ ఒక తల్లి, ఒక టీచర్ నుండి తన కుమారుని రక్షించే క్రమంలో రికార్డర్ను ఉపయోగించి బాగోతాన్ని బయటపెట్టింది.

కొందరు వేధింపులను సైతం సున్నితంగా స్వీకరిస్తే, కొందరు ఆత్మగౌరవంపై ప్రభావం పడడాన్ని అస్సలు సహించలేరు. అనేకమంది మద్యన తన కుమారుని వేధింపులకు గురిచేసిన టీచర్ భాగోతాన్ని బయటపెట్టే క్రమంలో ఒక తల్లి ఈ చర్యకు పూనుకోవలసి వచ్చింది.

ప్రతి టీచర్ లక్ష్యం ఉపాధ్యాయులకు మరియు విద్యార్ధులకు మద్య ఉత్తమమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం. క్రమంగా తర్వాతి దశల్లో పిల్లలకు నలుగురితో మెలిగే విధానం మీద సరైన అవగాహన కలుగుతుంది. కానీ ఉపాద్యాయులే పిల్లలను హేళన చేస్తుంటే? క్రమంగా ఆత్మన్యూనతకు లోనవడం జరుగుతుంది. భావి తరాలకు ఉత్తమ పౌరుల సంగతేమో కానీ, ఒత్తిళ్ళు, డిప్రెషన్లని క్వాలిఫికేషన్లుగా ఇచ్చి పంపిస్తున్న చందాన తయారవుతున్నాయి కొన్ని పరిస్థితులు.

ఈ వీడియోలో, కాండీ ఎస్కోట్టో అనే ఒక మహిళ తన ఐదు సంవత్సరాల కుమారుడు ఆరోన్ తన తరగతుల గ్రేడ్స్ మరియు ఆత్మ గౌరవం సంబంధిత విషయాలతో పోరాడుతున్నాడని గమనించి అతన్ని అడగగా, తన ఉపాధ్యాయులు అతనిని చెడ్డ పిల్లవానిగా అందరిలో పిలుస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఒక అమ్మగా, కుమారుని తరగతిలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకుంది; వెంటనే, కుమారుడి బాగ్లో ఒక రికార్డర్ ఏర్పాటు చేసి, నాలుగు రోజుల పాటు రికార్డ్ చేసింది.

బన్యన్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన ఈ ఘటనలో 32 గంటల ఆడియోని సేకరించినట్లు తెలిపింది. రికార్డింగ్లోని, ఈ ఆడియోటేప్లో ఉపాధ్యాయునిగా ఉన్న రోసాల్బా సువరేజ్ను, 33 సంవత్సరాలుగా అత్యుత్తమ ఉపాధ్యాయునిగా కీర్తింపబడుతున్నారు మరియు ఆమె ఆ సంవత్సరం వెస్ట్చెస్టర్ ఉత్తమ ఉపాధ్యాయునిగా కూడా సత్కరించబడింది. కానీ ఆ ఆడియో టేప్లో, అరోన్ మరియు మరొక బాలుని “లూసర్” అని పిలవడం నమోదైంది.

నివేదికల ప్రకారం, ఆరోన్ కొంతకాలంగా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు, పాఠశాలకు వెళ్ళటానికి ఇష్టపడడంలేదు. ప్రతిరోజూ ఉదయం బాలుడు స్కూల్ అంటేనే అసహ్యించుకోవడం, ఏడవడం వంటి చర్యలకు ఉపక్రమించేవాడని తెలిపింది.

క్రమంగా రికార్డర్ పెట్టడం ద్వారా, కాండీ తెలిపిన వివరాల ప్రకారం, అరోన్ మరియు మరొక పిల్లవాడిని మిగిలిన అందరి పిల్లల ముందు, ఆ టీచర్ అదేపనిగా లూసర్ అని పిలవడం చేసేది. క్రమంగా ఆత్మన్యూనతకు లోనైన అరోన్, స్కూల్ అంటేనే విముఖత పెంచుకున్నాడు.

ఈ విధంగా అదేపనిగా పిల్లవాడిని తిట్టడం, హేళనకు గురి చేయడం కారణంగా భావోద్వేగాలకు, క్రమంగా ఒత్తిడికి లోనవడం జరిగింది. కానీ ఇటువంటి విషయాలు బయటకు రావడం మూలంగా పసిపిల్లల మనసులపై జరుగుతున్న భావోద్వేగ దాడుల గురించిన అవగాహన ప్రపంచానికి తెలుస్తుంది అని వివరించింది కాండీ.

ఆడియో టేపులో, ఆ టీచర్ ఆరోన్ తల్లిని కూడా విమర్శించడం జరిగింది. మరియు తన కొడుకు సాధారణ అలవాట్లను మరియు పాఠశాల కార్యక్రమాలలో పాల్గొనే అంశాల మీద కూడా విమర్శలు చేసినట్లు వివరించింది.

ఇటువంటి సంఘటనలు బయటకు రావడం మూలంగా, తల్లిదండ్రులకు పిల్లల పరిస్థితుల గురించిన అవగాహన వచ్చేందుకు సహాయపడుతాయి. మరియు పిల్లలతో వ్యవహరించవలసిన తీరు కూడా కొందరు ఉపాద్యాయులు తెల్సుకోవలసిన అవసరం కూడా ఉంది.

ప్రతిరోజూ వార్తలలో పసిపిల్లలను శారీరికంగా, లైంగికంగా హింసలకు గురి చేస్తున్న ఉపాద్యాయులు అంటూ వార్తలు రావడం చూస్తూనే ఉంటాం, ఇటువంటి కలుపు మొక్కల కారణంగా ఉపాద్యాయ వృత్తికే తీరని కళంకం ఏర్పడుతుంది. ఇక్కడ మరొక అడుగు ముందుకు వేసి, మానసికంగా కూడా హింసకు గురిచేయవచ్చని చూపుతున్నారు కొందరు ఉపాద్యాయులు. ఏది ఏమైనా కాండీ చేసిన ఈ చర్య హర్షించనీయదగినది.

ఇటువంటి అనేక ఆసక్తికర అంశాల గురించిన వివరాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

English summary

Mom Used A Recorder To Save Her Son From Being Bullied By Teacher

A mother named 'Kandy Escotto' noticed last year that her five-year-old son Aaron was struggling with his grades and self-esteem. He had said his teacher had called him a bad boy and she wanted to find out what was happening in school and decided to put a recorder in his bag. She found out from the tape that the teacher was verbally abusive.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more