For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాణక్య నీతి - ఈ 9 మందిని అవమానపరచడం దేవుణ్ణి అగౌరవపరచడంతో సమానం

|

అర్ధశాస్త్ర పితామహుడు ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి భౌతిక సంపద ద్వారా పూర్తి ఉత్తముడు కాలేడని, మరియు కేవలం సంపద, హోదా అతని ఖ్యాతిని పెంచలేవని వివరిస్తాడు. ఈ సంపద కన్నా, ఎన్ని చేతులు ఆ వ్యక్తిని ఆశీర్వదించాయి అన్న దాని మీదే ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం బయటపడుతుంది అని తన అర్ధశాస్త్రంలో చెప్తాడు. దేవుడు భూమ్మీద అన్నిచోట్లా లేడు కాబట్టి అతను తల్లిదండ్రులను సృష్టించాడు. మీరు ఎంతగా ఎవరిని ప్రేమించినా, తల్లిదండ్రుల ప్రేమను మాత్రం భర్తీ చేయలేదు అని చెప్తాడు.

ఈ వ్యక్తులు మీ చుట్టూ ఉండడమే ఒక వరం

ఈ తొమ్మిది మంది వ్యక్తులలో తల్లిదండ్రులతో పాటు, ప్రతి వ్యక్తి జీవితంలో మారువేషంలో తమ చుట్టూతానే 7 మంది ప్రభావవంతులైన వ్యక్తులు కూడా ఉంటారు. వీరు ప్రతి విషయంలోనూ ఏదో ఒక రీతిలో మనకు వెన్నుదండగా ఉంటారు, కావున వారిని కించపరచడం లేదా అవమానపరచడం అనేది ఒక హీనమైన చర్య మరియు దేవుడినే అవమానించినంతటి పాపం. మీ జీవితంలోని ఈ 7మంది ముఖ్యుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

చాణక్యనీతి ప్రకారం ఈ 9 మందిని అవమానపరచడం దేవుణ్ణి అగౌరవపరచడంతో సమానం, కావున జీవితంలో ఎన్నడూ వీరిని కించపరచవద్దు

Chanakya Niti- Humiliating these 9 people is equivalent to disrespecting God

అమ్మ:

ఆమె 9 నెలలు మిమ్మల్ని తమ కడుపులో భద్రంగా దాచుకుంది, కడుపులో మరియు బాహ్య ప్రపంచంలో మీ క్షేమం కోసం నిరంతరం పాకులాడే నిస్వార్ధ జీవి అమ్మ. ఈ ప్రపంచంలో తల్లి కోసం ఎన్ని త్యాగాలు చేసినా ఋణం మాత్రం తీరదు అన్నది నిజం. చావు అంచుల దాకా వెళ్లి, చావుతో సైతం పోరాడి ఒక బిడ్డకు జన్మనిచ్చే తల్లి ఋణం తీర్చుకోవడం ఎన్నటికీ అసాధ్యమే. అమ్మ ప్రేమకు బదులు అనేదే లేదు ఈ విశ్వంలో.

తండ్రి:

చాణక్యుని ప్రకారం, బిడ్డ పుట్టక ముందు నుండే భాద్యతలను కలిగి ఉంటాడు తండ్రి. పిల్లల కోరికలు తీర్చడంలో, వారిని పెంచి పెద్ద చేయడంలో అహర్నిశలూ కష్టించి పనిచేయడం వంటివి తండ్రి గొప్పదనానికి నిదర్శనం. దేవుడు అందరి బాగోగులు చూడలేక తమ భాద్యతను తల్లిదండ్రులకు ఇచ్చాడు. వారిని అవమానపరచడం కన్నా పాపం మరొకటి లేదు.

మీలో నైతిక విలువలను అనుక్షణం కాపాడేవాడు:

చాణక్యుని ప్రకారం, మీ తల్లిదండ్రులే కాకుండా జీవితంలో విలువలను నేర్పించిన వ్యక్తికి గౌరవంతో కట్టుబడి ఉండాలి. వారు మీ తాతలు, గురువు, పొరుగువారు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మొదలైన వారు ఎవరైనా కావచ్చు.

నీకు విద్యను భోదించిన వ్యక్తి:

చాణక్యుని ప్రకారం, విద్య సమాజ ఉద్ధరణకు ఆయుధం వంటిది. మరియు ఒక వ్యక్తికి ఆహారం ఎంత విలువైనదో విద్య కూడా అంతే విలువైనది. కావున మిమ్మల్ని విద్యావంతునిగా మార్చి మీ భవిష్యత్తును నిర్మించే వ్యక్తి ఎవరైనా అతను మీ జీవితంలో ఒక భాగమని గుర్తించాలి. అతను గురువే కావలసిన అవసరం లేదు. మీ అస్తవ్యస్త మార్గాన్ని సక్రమంగా మార్చగలిగే ఎవరైనా గురువే.

మీకు భోజనం పెట్టిన వ్యక్తి:

ఈ ప్రపంచంలో మనిషి నిరంతరం డబ్బు, భూమి, ఆయుధం, బంగారం, ఆహారం, ప్రతిష్ఠ, ఉనిక వంటి మొదలైన అంశాల నడుమ కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అనేకమంది మిత్రులతో పాటు శత్రువులను కూడా జీవితంలో భాగంగా చేసుకుంటూ ఉంటాడు. ఏది ఏమైనా మీరు ఆకలి గొన్న సమయంలో మీ కడుపు నింపడానికి ప్రయత్నించే ఎవరైనా, దేవునితో సమానం. ఎట్టి పరిస్థితుల్లో వారిని విస్మరించకూడదు.

స్నేహితుడు:

ఎటువంటి ఇబ్బందుల్లో అయినా కష్టకాలంలో మీ వెన్నంటి నడిచే తండ్రి లాంటి వ్యక్తి స్నేహితుడు. అటువంటి వ్యక్తే నిజమైన స్నేహితుడు కూడా.

మీ గురువు:

తల్లిదండ్రుల తరువాత జీవితంలో ఒక గురువే ముఖ్యమైన స్థానాన్ని పొందుతాడు. అని ప్రాచీన వ్యాఖ్యల సారాంశం. నిస్వార్థంగా మీ జీవితంలో మీ విజయానికి మార్గనిర్దేశకులుగా ఉంటారు కాబట్టి.

భార్య తల్లిదండ్రులు:

చాలామంది వివాహితులు తమ భాగస్వామి యొక్క తల్లిదండ్రులకు సరైన గౌరవం ఇవ్వరు. కానీ ఆచార్య చాణక్యుడు మీ భాగస్వామి యొక్క తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులతో పాటు సమాన గౌరవాన్ని పొందగలిగే అర్హత కలిగిన వారిగా భావించారు. మీ భాగస్వామి మీద మీకు ప్రేమ ఉంటే, అంత గొప్ప భాగస్వామిని మీకు ప్రసాదించిన మీ అత్తామామలు కూడా గొప్పవారే కదా.

తల్లి వంటి సంరక్షణ ఇస్తున్న వ్యక్తి:

తల్లితో సమానంగా కొందరు తమ జీవితంలో తల్లి వంటి ప్రేమ, సంరక్షణను చూపుతుంటారు. భార్య, స్నేహితుడు, మీ ప్రియమైన వారు, ఎవరైనా సరే. వీరిపట్ల ఎప్పటికీ విధేయతను కలిగి ఉండాలి.

పైన చెప్పిన ఈ తొమ్మిది మంది వ్యక్తులు సాక్షాత్తూ దేవుళ్ళతో సమానం, వీరిపట్ల నిర్లక్ష్యం, అవిధేయత, శత్రుత్వం, అవమానించడం, కించపరచడం, అశ్రద్ద చూపడం, హేయభావం ప్రదర్శించడం వంటి చర్యలకు పూనుకోవడమంటే క్షమించరాని నేరం మరియు పాపం అని చాణక్యుడు వివరించాడు.

English summary

Chanakya Niti- Humiliating these 9 people is equivalent to disrespecting God

Hypertension, commonly known as high blood pressure, is a dangerous condition that can damage your heart. High blood pressure is known to affect 1 billion people worldwide. In this article, we will be writing about how to lower blood pressure instantly.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more