For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పార్థి గ్యాంగ్ పోయింది.. చెడ్డీ గ్యాంగ్ వచ్చింది.. ఈ దాహోద్ ముఠాలు చాలా డేంజర్

గుజరాత్‌కు చెందిన దాహోద్ దొంగల ముఠా అలియాస్ చెడ్డీ గ్యాంగ్ స్థావరంపై కన్నేశారు. కొన్ని నెలల కిందట హైదరాబాద్ మీర్‌పేట్ లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మూడు ఫ్లాట్లలో చెడ్డీగ్యాం గ్ చోరీలు చేసింది.

|

మొన్న గడ్డం గ్యాంగ్, నిన్న దండుపాళ్యం, స్నేక్ గ్యాంగ్. కొన్నాళ్ల క్రితం వరకు పార్థి గ్యాంగ్... ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ ఈ గ్యాంగ్ లతో తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. ఇక కరుడుగట్టిన దొంగల ముఠా చెడ్డీగ్యాంగ్‌ను పట్టుకునేందుకు రాచకొండ పోలీసులు సాహోపేతమైన ఆపరేషన్ ప్రారంభించారు.

గుజరాత్‌కు చెందిన దాహోద్ దొంగల ముఠా అలియాస్ చెడ్డీ గ్యాంగ్ స్థావరంపై కన్నేశారు. కొన్ని నెలల కిందట హైదరాబాద్ మీర్‌పేట్ లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మూడు ఫ్లాట్లలో చెడ్డీగ్యాం గ్ చోరీలు చేసింది. ఈ కేసులో ఒకరు అరెస్ట్ కాగా మిగతావారు పరారీలో ఉన్నారు. దీంతో ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు పోలీస్ ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు.

కొండల్లోనే చెడ్డీగ్యాంగ్ మకాం

కొండల్లోనే చెడ్డీగ్యాంగ్ మకాం

చెడ్డీగ్యాంగ్ సభ్యులు గుజరాత్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లోని దట్టమైన అడవిలో ఉండే దాహోద్‌తోపాటు చుట్టు పక్కల తండాల్లో నివాసం ఉంటారు. అక్కడికి సరైన రవాణ సౌకర్యం ఉండదు. కాలినడకన వెళ్లాల్సిందే. ఈ ప్రాంతంలోని ప్రజల జీవన శైలి, వేషధారణ, ఆహార అలవాట్లు భిన్నంగా ఉంటాయి. బయటి వ్యక్తులను సులభంగా గుర్తు పడుతారు. అనుమానం వస్తే దాడిచేస్తారు. దీంతో ఆయా రాష్ట్రాల స్థానిక పోలీసులు సైతం వీరి ఇలాకాలోకి వెళ్లాలంటే భయపడుతారు.

నేర వృత్తిపైనే ఆధారపడతారు

నేర వృత్తిపైనే ఆధారపడతారు

అయితే చెడ్డీగ్యాంగ్ సభ్యులు స్థానికంగా ఏలాంటి నేరాలకు పాల్పడరు. దీంతో పోలీసులు వారిని పట్టించుకోరు. ఇతర రాష్ట్రాల నుంచి పోలీసు లు వెళ్తే తోడుగా వస్తారు. ఈ తండాల్లో ఉండేవారిలో అత్యధికులు నేర వృత్తిపైనే ఆధారపడతారు. ఐదుగురు చొప్పున బృందాలుగా ఏర్పడి వేర్వేరు రాష్ట్రాలను ఎంపిక చేసుకొని బయలుదేరుతారు. వరుస చోరీలకు పాల్పడి తిరిగి తండాలకు వెళ్లిపోతారు. మరో ఆరు నెలలు నేరాలకు దూరంగా ఉంటారు.

దాహోద్ ముఠాలు

దాహోద్ ముఠాలు

ఈ విధంగా దాహోద్ ముఠాలు దేశవ్యాప్తంగా అనేక దోపీడీలకు పాల్పడి మోస్ట్ వాంటెడ్‌గా మారాయి. పోలీసులు తండాలవైపు వస్తున్నారని తెలిస్తే దాడికి ప్రయత్నిస్తారు లేదా తండాల్లోని పురుషులంతా కొండల్లోకి పారిపోతారు. రెండు నెలలు అక్కడే మకాం వేసి పోలీసులు వెళ్లిపోయారని తెలుసుకున్నాకే బయటికి వస్తారు. నేటికీ దాహోద్‌లో సెల్‌ఫోన్ సిగ్నల్స్ సరిగా ఉండవు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసుల ప్రత్యే క బృందం సహనంతో ఎదురుచూసి నేరస్థులను పట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నది.

చెడ్డీగ్యాంగ్‌గా పేరు వచ్చింది ఇలా

చెడ్డీగ్యాంగ్‌గా పేరు వచ్చింది ఇలా

ఈ ముఠా సభ్యులు బనియన్‌లు, చెడ్డీ ధరించిన దృశ్యాలు బయటపడటంతో వీరికి చెడ్డీ గ్యాంగ్‌గా ముద్రపడింది. బయటి నుంచి గొళ్లెం ఉన్న ఇండ్లనే టార్గెట్ చేస్తారు. ఓ అపార్ట్‌మెంట్‌ను టార్గెట్ చేస్తే తాళాలు వేసి ఉన్న ఫ్లాట్‌కు పక్కన, పైన, కింద ఉన్న ఫ్లాట్లకు బయటి నుంచి గొళ్లాలు పెట్టి చోరీ చేస్తారు. దొంగతనం చేసేటప్పుడు లుంగీని నడుముకు చుట్టుకొని అందులో రాళ్లు నింపుకొంటారు. ఎవరైనా అడ్డువచ్చినా, పోలీసులు వచ్చినా రాళ్లతో దాడి చేసి తప్పించుకుంటారు.

చెడ్డీ గ్యాంగ్‌ మూలాల గురించి

చెడ్డీ గ్యాంగ్‌ మూలాల గురించి

మీర్‌పేట అగ్రికల్చర్‌ కాలనీలో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన దోపిడీ ఘటనపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో చెడ్డీ గ్యాంగ్‌ మూలాల గురించి ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. అపార్ట్‌మెంట్‌లోని మిగతా ఫ్లాట్లకు తాళాలేసి.. కాపలాదారును రాళ్లతో కొట్టి.. ఓ ఫ్లాట్‌లో పది తులాల బంగారం దోచుకెళ్లిన ముఠా గుజరాత్‌ రాష్ట్రంలోని దాహోడ్‌ ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు.

మెట్రో నగరాలకు రైళ్లలో వస్తారు

మెట్రో నగరాలకు రైళ్లలో వస్తారు

ఇక చెడ్డీ గ్యాంగ్ ముఠాల సభ్యులు తాము లక్ష్యంగా ఎంచుకున్న మెట్రో నగరాలకు రైళ్లలో వస్తారు. చోరీలకు వచ్చిన క్రమంలో ఆయా నగరాల శివారు ప్రాంతాల్లో కొన్ని రోజులపాటు మకాం వేస్తారు. నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న చెట్లు, తుప్పల్లోనే పగటి పూట తలదాచుకుంటారు. ఆ సమయంలో అవసరమైతే కొందరు సభ్యులు వెళ్లి తాళాలు వేసి ఉన్న ఇళ్ల గురించి ఆరా తీసి రెక్కీ నిర్వహిస్తారు. చీకటి పడిన తర్వాత తిరిగి అక్కడికి వెళ్లి తాళాలు పగలగొట్టి చోరీలు చేస్తారు.

20 గ్రామాల్లో దొంగల ముఠాలున్నాయి

20 గ్రామాల్లో దొంగల ముఠాలున్నాయి

దాహోడ్‌ ప్రాంతంలోని దాదాపు 20 గ్రామాల్లో దొంగల ముఠాలున్నాయి. ఈ ప్రాంతంలో పేదరికం ఆనవాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ కారణంగా రెండు జతల దుస్తులతో ఏడాదంతా గడిపేస్తుంటారు. ఉపాధి అవకాశాలు సరిగా లేకపోవడంతో అనాదిగా చోరీలనే ఆలవాలంగా మార్చుకున్నాయి అక్కడి కొన్ని గిరిజన తెగలు. విజయదశమి, సంక్రాంతిలాంటి ప్రత్యేక పర్వదినాలను ఎంచుకొని నగరాలపైబడి చోరీలు చేయడమే వీరి పని.

సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి

సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి

ఇక సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని జీడిమెట్ల పోలీసుస్టేషన్‌ పరిధి గాజులరామారం గ్రామం బాలాజీ లే-అవుట్‌ ఎమ్మార్‌ రెసిడెన్సీలో చడ్డీగ్యాంగ్‌ వచ్చిపోయిన దృశ్యాలు అపార్టుమెంట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అదేరోజు కొద్ది సమయం తేడాలో దుండిగల్‌ పోలీసుస్టేషన్‌ పరిధి శ్రీరాంనగర్‌లోని ఓ అపార్టు మెంట్లో చడ్డీ గ్యాంగ్‌ దూరారు. అయితే అదే అపార్టుమెంట్‌లో కానిస్టేబుల్‌ నివసిస్తుండటం, దైర్యసహాసాలు చేసి వారి పై పూలకుండీలతో దాడిచేశాడు. ఈ ఘటన విషయమై దుండిగల్‌ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విషయమై ఇప్పటివరకు పురోగతి లేదు.

బాచుపల్లి శ్రీరామ నిలయంలో

బాచుపల్లి శ్రీరామ నిలయంలో

ఇదిలా ఉండగా బాచుపల్లి పీఎస్‌ పరిధి నిజాంపేట్‌ గ్రామం బండారి లే-అవుట్‌లోని రోడ్‌నెంబర్‌ఒ 5సిలోని శ్రీరామ నిలయంలో సోమవారం తెల్లవారుజామున తిరిగి ఇద్దరు నిందితులు చడ్డీ గ్యాంగ్‌ తరహాలోనే వేషదారణ ధరించి అపార్టుమెంట్‌లోకి చొరబడి తచ్చాడటం సీసీ టీవీ పుటేజీల్లో నమోదైంది.

సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు

సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు

నిందితులు తొలుత అపార్టుమెంట్‌ కారిడార్‌లోకి వచ్చి నేరుగా మెట్ల వద్దకు వెళ్లారు. అయితే మెట్ల వద్ద సీసీ కెమెరాను పరిశీలించిన దొంగలు పలాయనం చిత్తగించారు. నిజాంపేట్‌ గ్రామం బండారి లే-అవుట్‌లోని రోడ్‌నెంబర్‌ 5సిలోని శ్రీరామ నిలయంలో అపార్టుమెంట్‌ వాసులు సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. ఆశ్చర్యపోయే రీతిలో ఇద్దరు చడ్డీ గ్యాంగు తచ్చాడటం నిందితులు పుటేజీలో నమోదైంది. సీసీ కెమెరాలను చూసి పారిపోవడం లాంటి దృశ్యాలు నమోదుకావడంతో వెంటనే అపార్టుమెంట్‌ వాసులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు.

సంగారెడ్డి జిల్లాలో చెడ్డీగ్యాంగ్

సంగారెడ్డి జిల్లాలో చెడ్డీగ్యాంగ్

ఇక సంగారెడ్డి జిల్లాలో చెడ్డీగ్యాంగ్ హల్‌చల్ చేసింది. పోతిరెడ్డిపల్లిలోని మూడు అపార్ట్‌మెంట్లలో చోరీకి చెడ్డీ గ్యాంగ్ విఫలయత్నం చేసింది. కాగా ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండటంతో దొంగలు వెనుదిరిగారు. చెడ్డీ గ్యాంగ్ చోరీకి యత్నిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో అంతటా అపార్ట్‌మెంట్‌వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

English summary

cheddi gang creates panic again in telugu states

cheddi gang creates panic again in telugu states
Story first published:Monday, June 18, 2018, 11:09 [IST]
Desktop Bottom Promotion