TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
పాముతో వైన్ చేసుకుని తాగుదామనుకుంది, కానీ పాము కాటుకు గురై చనిపోయింది
మనం పామును చూసిన వాటి పేరు చెప్పినా భయపడతాం. పాములంటే మనలో చాలా మందికి భయం ఉంటుంది. కానీ కొందరికి పాములంటే అస్సలు భయం ఉండదు. ఇక చైనా వాళ్లు అయితే పాములను అస్సలు లెక్క చెయ్యరు. వారు పాములను చాలా ఇష్టంగా తింటారు. ఇంకొందరు పాము వైన్ ను కూడా బాగా ఇష్టపడతారు.
పాము వైన్ తాగాలని
ఇక ఇరవై ఏళ్ల యువతికి పాము వైన్ తాగాలని అనిపించింది. వెంటనే ఆన్ లైన్ లో ఒక మంచి పాముని ఆర్డర్ చేసింది. కానీ దాని వల్లే ఆమె చనిపోయింది. చైనా లోని షాంగ్జీకి చెందిన క్వికీ పాము వైన్ అంటే బాగా ఇష్టం. ఆమెకే కాదు ఆ ప్రాంతంలోని చాలా మందికి పాము వైన్ అంటే బాగా ఇష్టం. చాలా మంది స్నేక్ వైన్ అంటే బాగా ఇష్టపడతారు.
పాము ను బుక్ చేసుకుంది
జువాన్ జువాన్ అనే ఆన్ లైన్ షాపింగ్ ద్వారా ఆ అమ్మాయి ఒక పాము ను బుక్ చేసుకుంది. డెలివరీ బాయ్ పామును తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ అమ్మాయి చాలా ఆనందపడింది. ఈ రోజు స్నేక్ వైన్ తో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంది. వెంటనే వైన్ బాటిల్ తీసుకుని ఒక పాత్రలో పోసింది.
స్నేక్ వైన్ తయారు చేసుకుందామనుకుంది
వైన్ ఉన్న ఆ పాత్రలో పామును వేసి స్నేక్ వైన్ తయారు చేసుకుందామనుకుంది. ఇంతలో ఆ పాము ఆమెను కాటేసింది. తర్వాత ఆమె వెంటనే తన తల్లితో కలిసి హాస్పిటల్ కు వెళ్లింది. కానీ ఆ పాముకు విషం ఎక్కువగా ఉండడం వల్ల ఆమె మృతి చెందింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె ఇంటి వద్దకు ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చారు.
జాగ్రత్త
తర్వాత పామును పట్టుకుని వెళ్లారు. పాపం స్నేక్ వైన్ తాగాలని పరితపించిన ఆ అమ్మాయి అలా అనవసరంగా చనిపోవాల్సి వచ్చింది. ఎవరైనా సరే విష సర్పాలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. లేదంటే అనవసరంగా ప్రాణాలుపోగొట్టుకుంటారు.
అయితే గుహాంగ్ డాంగ్ అనే ప్రాంతం నుంచి ఆ పామును క్వికీ ఆర్డర్ చేసి తెప్పించుకుందట. అయితే ఇలా పాములను ఆన్ లైన్ లో అమ్మడం చైనాలో నిషేధమైనా కొందరు అక్రమంగా అమ్ముతున్నారు. కనీసం డెలివరీ చేసే సంస్థలకు తాము పామును డెలవరీ చేస్తున్నామని కూడా తెలియకుండా వాళ్లు మెయింటెన్ చేస్తున్నారు.