For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమె పార్ట్స్ మొత్తం మగాడిలాగానే ఉన్నాయంటా! అందుకే అలాగే మారుతానంటున్న మహిళా కానిస్టేబుల్ లలిత

ముంబై నగరంలో లలిత (29) అనే మహిళ కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. 2010వ సంవత్సరం నుంచి విధులు నిర్వర్తిస్తోంది. కొంతకాలంగా ఆమె తరచూ పత్రికల పతాక శీర్షికలకెక్కుతున్నారు. కానిస్టేబుల్ లలిత,లలితా సాల్వే.

|

ఆమెకు మహిళగా జీవించడం బోర్ కొట్టేసినట్లు ఉంది. దీంతో పురుషుడిగా మారాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం సెక్స్ మార్పిడి చేయించుకోవాలని భావించింది. ఆమె ఓ మహిళా కానిస్టేబుల్. అయితే ఆమె శరీర అవయవాలు చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయిల్లా కాకుండా కాస్త అబ్బాయిల మాదిరిగా ఉండేది.

పురుషుడిగా మారితే

పురుషుడిగా మారితే

దీంతో ఆమెలో కూడా తాను పురుషుడిగా మారితే ఎలా ఉంటుందని అనిపించింది. ఆమె అనుకున్నదే తడువుగా ప్రభుత్వ అనుమతి కోరింది. ఆ మహిళా కానిస్టేబుల్ కోర్కె మేరకు అవయవ మార్పిడికి మహారాష్ట్ర సర్కారు అనుమతి ఇచ్చింది. ఆ స్టోరీ ఏమిటో మీరూ చదవండి.

మహిళా కానిస్టేబుల్‌గా పని చేస్తోంది

మహిళా కానిస్టేబుల్‌గా పని చేస్తోంది

ముంబై నగరంలో లలిత (29) అనే మహిళ కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. 2010వ సంవత్సరం నుంచి విధులు నిర్వర్తిస్తోంది. కొంతకాలంగా ఆమె తరచూ పత్రికల పతాక శీర్షికలకెక్కుతున్నారు. అందుకు కారణం.. లింగమార్పిడి చేసుకుని మగాడిగా మారాలనుకునే బలమైన నిర్ణయమే. ఒక మహిళ.. తాను మగాడిగా మారాలనుకుంటున్నానని బహిరంగంగా ప్రకటించడం ఆమెను వార్తల్లో వ్యక్తిగా నిలిపింది.

ఆమెనా.. అతడా?

ఆమెనా.. అతడా?

అయితే చిన్నప్పటినుంచీ లలితా సాల్వే.. ఆమెనా.. అతడా అన్నది పెద్ద కన్‌ఫ్యూజన్‌. శరీరమేకాదు.. హావభావాలు, ప్రవర్తన, అంతా డిఫరెంట్‌. డాక్టర్లకు కూడా పెద్ద పజిల్‌. చివరికి ఎన్నో టెస్ట్‌ల తర్వాత వైద్యులు అసలు విషయం తేల్చేశారు. లలితా సాల్వేలో స్త్రీ లక్షణాల కంటే పురుష లక్షణాలే ఎక్కువ ఉన్నాయని వెల్లడించారు.

పురుషులకు ఉండాల్సిన అంగాలు

పురుషులకు ఉండాల్సిన అంగాలు

పురుషులకు ఉండాల్సిన అంగాలు వున్నప్పటికీ.. అవి సంపూర్ణం కావాలంటే 'సెక్స్‌ రీ-అసైన్‌మెంట్‌ సర్జరీ (ఎస్‌ఆర్‌ఎస్‌)' చేయాలని తేల్చారు. నిజానికి స్త్రీగా కంటే పురుషుడిగా వుండాలనే కోరిక లలితా సాల్వేలో మొదటినుంచీ బలంగా వుండేది. డాక్టర్లు కూడా సర్జరీ చేయించుకుంటే పురుషుడిగా మారిపోవచ్చని గ్యారంటీ ఇచ్చారు.

నెల రోజులు సెలవు

నెల రోజులు సెలవు

సర్జరీ చేయించుకోవడానికి ఒక నెల రోజులు సెలవు కావాలంటూ మహారాష్ట్ర పోలీసు అధికారులకు ఓ దరఖాస్తు పెట్టుకుంది. అప్పటిదాకా తమ కానిస్టేబుల్‌ మహిళ అనుకున్న పోలీసులకు ఒక్కసారి షాక్‌ తగిలింది. అధికారులు కూడా ఏం చేయాలిరా బాబూ అని తలపట్టుకున్నారు. కుదరదంటూ ఆమెకు తేల్చిచెప్పారు.

ముంబై హైకోర్టు ఆశ్రయించింది

ముంబై హైకోర్టు ఆశ్రయించింది

ఇక లాభం లేదనుకున్న లలిత ఏకంగా ముంబై హైకోర్టు మెట్లు ఎక్కింది. తాము తేల్చలేమని నేరుగా రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని హైకోర్టు సలహా ఇచ్చింది. విషయం కాస్తా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ దాకా వెళ్లింది.

చివరికి ఓకే

చివరికి ఓకే

ఒకవైపు లలితకు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఒత్తిడి పెరగడంతో ఆయన చివరికి ఓకే చెప్పేశారు. లలిత విషయంలో పాజిటివ్‌గా స్పందించాలంటూ హోంశాఖను ఆదేశించారు. దీంతో ముంబై పోలీసు ఎస్పీ జి. శ్రీధర్ లలిత సెక్స్ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునేందుకు అనుమతి ఇచ్చారు. అలా..అలా చివరికి పురుషుడిగా మారేందుకు లలితకు లైన్‌ క్లియర్‌ అయింది.

ఆమె నుంచి అతడిలా

ఆమె నుంచి అతడిలా

సెలవు మంజూరైంది. ఇప్పుడు లలిత ఎంతో హ్యాపీ. లలిత తన మామయ్యతో కలిసి జేజే ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకునేందుకు చేరింది. ఆమెకు సర్జరీ పూర్తికానుంది. ఆమె నుంచి అతడిలా ఈ కథ ఇలా సుఖాంతమవుతోంది. కాగా ఇక ఇప్పటిదాకా తమ కానిస్టేబుల్ మహిళ అనుకున్న పోలీసులకు ఒక్కసారి షాక్ తగిలింది. లలితా మహిళా కోటాలోనే జాబ్ దక్కించుకుంది.

కొన్ని రకాల పరీక్షలు

కొన్ని రకాల పరీక్షలు

ఇక ఈమెకు మే 23 కొన్ని రకాల పరీక్షలు కూడా నిర్వహించారు. సెక్స్ రీసైన్మెంట్ శస్త్రచికిత్సను ఆమెకు చేయనున్నారు. ఆసుపత్రిలోని వైద్య నిపుణులు ఈమెకు చేయాల్సిన శస్త్ర చికిత్స కోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు.

కాస్త ప్రత్యేకంగానే

కాస్త ప్రత్యేకంగానే

ఇక సాల్వే కేసు కాస్త ప్రత్యేకంగానే సెయింట్ జార్జ్ హాస్పిటల్ వైద్యులు తీసుకున్నారు. లలిత మామయ్య అర్జున్ ఉజ్గేర్ మాట్లాడుతూ " ఇప్పటి వరకు లలితకు కొన్ని పరీక్షలు నిర్వహించారు. ECG, బ్లడ్ పరీక్ష, ఎక్స్-రే వంటి వాటన్నింటినీ పూర్తి చేశారని పేర్కొన్నారు.

ఖర్చులు భరించలేకపోతున్నారట

ఖర్చులు భరించలేకపోతున్నారట

ఇక లలిత శస్త్రచికిత్స కోసం అయ్యే ఖర్చు మొత్తం తాము భరించలేకపోతున్నామని ఇందుకోసం కొంత మంది దాతల ద్వారా విరాళాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఉదార స్వభావం ఉన్న దాతలు "15 వేల నుంచి 20 వేలదాకా కొందరు విరాళాలుగా ఇచ్చారన్నారు. శస్త్రచికిత్స చేయించుకోవడానికి కావాల్సిన డబ్బు విషయంలో లలితకు ఆమె కోలిగ్స్ బాగా సహాయం చేస్తున్నారని చెప్పారు.

ఈ వారంలో శస్త్రచికిత్స

ఈ వారంలో శస్త్రచికిత్స

మొత్తానికి ఈ వారంలో శస్త్రచికిత్స అయిపోతుందని డాక్టర్లు చెప్పారని లలిత మామ చెప్పారు. ఇక ఆసుపత్రిలో ఉన్న వైద్య అధికారులలో ఒకరు మాట్లాడుతూ "ఇది ఒక ప్రత్యేక కేసు అయినందున, మేము DMER నుంచి అనుమతులు తీసుకుంటున్నాము అన్నారు.

అన్ని రకాల ప్రయత్నాలు

అన్ని రకాల ప్రయత్నాలు

లలిత వైద్యులు సమ్మెలో ఉన్న సమయంలో రావడం వల్ల అప్పుడు ఏమీ చేయలేకపోయామన్నారు. ప్రస్తుతం లలితకు శస్త్ర చికిత్స పూర్తి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నిస్తున్నామన్నారు. .

English summary

constable lalita salve born with gender dysphoria finally gets government nod for gender change surgery

constable lalita salve born with gender dysphoria finally gets government nod for gender change surgery
Story first published:Thursday, May 24, 2018, 12:31 [IST]
Desktop Bottom Promotion