For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  దళితులంటే అంత చులకనా? దొంగకు బతుకుదెరువుకు వచ్చే వాడికి తేడా తెలియదా?అమాయకుడి ప్రాణాలను ఎలాతీస్తారు?

  |

  దళితులపై ఈ సమాజంలో ఒకప్పుడు దారుణమైన చిన్నచూపు ఉండేది. రాను రాను అది తగ్గుతూ వచ్చింది. కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల దళితులపై అరాచకాలు సాగుతున్నాయి. ఏ కులానికి చెందిన వ్యక్తి అనేది కాదు ఇక్కడ సమస్య.. ఒక అమాయకున్ని దొంగంగా భావించి చంపేయడమే అసలు సమస్య. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ దళితుణ్ని కొందరు క్రూరంగా కొట్టి అతని చావుకు కారణ మయ్యారు.

  దొంగగా భావించి కొట్టి చంపి

  దొంగగా భావించి కొట్టి చంపి

  ఓ దళితుడ్ని దొంగగా భావించి కొట్టి చంపిన అమానవీయ సంఘటన ఇటీవల అంతటా వైరల్ గా మారింది. ఈ ఘటన గురించి తెలిస్తే మానవత్వం మంటగలిసి పోతుందని అనిపిస్తూ ఉంటుంది. దళిత వ్యక్తితో పాటు అతన్ని కొట్టకుండా అడ్డుకోబోయిన ఆమె భార్యనూ తీవ్రంగా కొట్టడంతో ఆమె కూడా తీవ్ర గాయాలపాలైంది.

  షాపూర్‌ పట్టణానికి సమీపాన

  షాపూర్‌ పట్టణానికి సమీపాన

  గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లా షాపూర్‌ పట్టణానికి సమీపాన ఈ అమానవీయ సంఘటన తాజాగా చోటు చేసుకుంది. రాజ్‌కోట్‌లో చెత్త ఏరుకొని జీవనం సాగించే ముఖేష్‌ వనియా (30 ఏళ్లు) అనే వ్యక్తి తన భార్యతో కలిసి స్థానికంగా నివాసం ఉండేవాడు. మే 20న ఉదయం అతడు ఓ ఆటో పార్ట్స్ ఫ్యాక్టరీ వైపు వెళ్లాడు.

  రాదాదియా ఇండస్ట్రీస్‌ ఆవరణలో

  రాదాదియా ఇండస్ట్రీస్‌ ఆవరణలో

  రాదాదియా ఇండస్ట్రీస్‌ ఆవరణలో కాగితాలు, చెత్త ఏరుకుంటున్న ముఖేష్‌ వనియా, అతని భార్య జయాబెన్‌ను కర్మాగారం యజమాని స్నేహితులు నలుగురు పట్టుకున్నారు. దొంగ అంటూ అవమానించడంతో పాటు తాడుతో కట్టేశారు. యజమాని ఆదేశానుసారం నిందితులు ముఖేశ్‌ను ఇనుప రాడ్లు, కర్రలతో తీవ్రంగా చితకబాదారు.

  నా భర్త అమాయకుడు

  నా భర్త అమాయకుడు

  తన భర్త అమాయకుడని అతన్ని కొట్టవొద్దని ముఖేష్ భార్య అడ్డుపడింది. ఆమెను కూడా కొట్టడంతో ఆమె విలపిస్తూ ఉండిపోయింది. తన శాయశక్తులా భర్తను కాపాడుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది.

  మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు

  మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు

  దెబ్బలకు తాళలేని ముఖేష్‌ స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు రాజ్‌కోట్‌ ఏఎస్పీ శృతి ఎస్‌.మెహతా తెలిపారు. దాడిచేసిన ఐదుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు నిందితులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు గుజరాత్‌ హోంశాఖ సహాయమంత్రి ప్రదీప్‌సిన్హ్‌ జడేజా తెలిపారు. మృతుని కుటుంబానికి రూ.8.25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.

  ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ సోషల్ మీడియాలో పోస్ట్‌

  ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ సోషల్ మీడియాలో పోస్ట్‌

  మరోవైపు ముఖేష్‌ను కొడుతున్న వీడియోను గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘ముఖేష్‌ ఎస్సీ సామాజికవర్గానికి చెందినవాడు. కర్మాగారం డోరుకు కట్టి, కొట్టి చంపేశారు. గుజరాత్‌లో దళితులకు రక్షణ లేదు. ఇది ఉనా కంటే దారుణమైన సంఘటన. ఉనాలో దళితులను కొట్టి, అగౌరపరిచి వదిలేశారు. ఇక్కడ ఏకంగా ప్రాణాలు తీసేశారు. ముకేష్‌ను కార్ఖానా యజమానే చిత్రవధ చేసి చంపాడు. అతని భార్యపై కూడా దాడి చేశాడు. ' అని వ్యాఖ్యానించారు. 2016లో గుజరాత్‌లోని ఉనాలో దళిత యువకులను వాహనం గొలుసుకు కట్టి ఇనుపరాడ్డులతో కొట్టిన సంగతి తెలిసిందే.

  వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్

  వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్

  ప్రస్తుత ఈ దుర్ఘటనకు సంబంధించిన ఒక వీడియో సామా జిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి వనియా నడుమును తాడుతో కట్టేయగా, మరో వ్యక్తి కర్రతో అతనిని కొట్టడం అందులో నీట్ గా కనిపిస్తుంది. ఈ వీడియో ఆధారంగా ఐదుగురు నిందితుతలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై ఐపిసి సెక్షన్‌ 302, 308 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

  గుజరాత్‌ ప్రభుత్వం చోద్యం చూస్తోంది

  గుజరాత్‌ ప్రభుత్వం చోద్యం చూస్తోంది

  ఘటనపై దళిత వర్గాలు, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కుల ఘర్షణలతో అమాయకులు బలవుతున్నా.. గుజరాత్‌ ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ జిగ్నేశ్‌ మేవాని విమర్శించారు. దళితులకు గుజరాత్‌ ఎంతమాత్రం సురక్షితం కాదంటూ పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

  క్రూరంగా దాడి చేయడం అమానుషం

  క్రూరంగా దాడి చేయడం అమానుషం

  కాగా ముఖేష్‌ పాత వస్తువుల నుంచి రాగి సేకరించేవాడు. భార్యతో కలిసి కార్ఖానాలో వ్యర్థ పదార్థాలను తీసుకుంటూ జీవనం సాగించేవారు. అలాంటి అమాయకుడిపై క్రూరంగా దాడి చేయడం నిజంగా అమానుషం.దళితులంటే అంత చులకనా? దొంగకు బతుకుదెరువుకు వచ్చే వాడికి తేడా తెలియదా? అమాయకుడి ప్రాణాలను ఎలా తీస్తారు ? అంటూ సోషల్ మీడియాలో జనాలు ప్రశ్నిస్తున్నారు.

  'Mr. Mukesh Vaniya belonging to a scheduled caste was miserably thrashed and murdered by factory owners in Rajkot and his wife was brutally beaten up'.#GujaratIsNotSafe4Dalit pic.twitter.com/ffJfn7rNSc - Jignesh Mevani (@jigneshmevani80) 20 May 2018

  English summary

  dalit ragpicker mukesh vaniya beaten to death in gujarat story

  dalit ragpicker mukesh vaniya beaten to death in gujarat story
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more