For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్లకు గంతలు,చేతులు, నోరు కట్టేసుకుని చనిపోతే మోక్షం వస్తుందా? బురారీలో 11 మంది అందుకే చనిపోయారా?

కళ్లకు గంతలు,చేతులు, నోరు కట్టేసుకుని చనిపోతే మోక్షం వస్తుందా? బురారీలో 11 మంది అందుకే చనిపోయారా? బురారీ ఆత్మహత్యలు, బురారీ సంఘటన, 11 మంది ఆత్మహత్య, ఢిల్లీ బురారీ, బురారీ హత్యలు

|

ఢిల్లీ నగరంలోని బురారి ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చనిపోయిన వారి బంధువులు చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ వాళ్లంతా చదువుకున్న వాళ్లని, వాళ్లు మూఢ నమ్మకాలను నమ్మరని చెప్తున్నారు. తమ కుటుంబసభ్యుల మృతిపై చనిపోయిన వృద్ధురాలి మనవడు కేతన్‌ నాగ్‌పాల్‌ కొన్ని విషయాలు చెప్పాడు.

కట్టేసుకునే వారు కాదు కదా

కట్టేసుకునే వారు కాదు కదా

తమ కుటుంబానికి ఆర్థికపరమైన ఇబ్బందులేమీ లేవని.. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారన్నారు. ఇవి కచ్చితంగా హత్యలు అయ్యి ఉంటాయని అనుమానం వ్యక్తంచేశారు. ఒకవేళ ఆత్మహత్యలు చేసుకుంటే ముఖాన్ని, నోర్లను, చేతులను కట్టేసుకునే వారు కాదు కదా అని నాగ్ పాల్ అన్నారు. చనిపోయిన వారికి దేవుడిపై నమ్మకం ఉంది కానీ.. మూఢనమ్మకాలు నమ్మేవారు కాదని, అంతా చదువుకున్న వాళ్లని మరో బంధువు చెప్పారు.

మోక్షం కోసం ఆత్మహత్యలు చేసుకున్నారా?

మోక్షం కోసం ఆత్మహత్యలు చేసుకున్నారా?

అయితే వారి ఇంట్లో లభ్యమైన డైరీ, పలు పత్రాల ప్రకారం.. మతపరమైన కారణాలు, మూఢ విశ్వాసాలతో మోక్షం కోసం ఆత్మహత్యలు చేసుకున్నారా? అని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఒకేసారి ఒకే విధంగా చనిపోతే వారంతా దేవుని దగ్గరికి వెళ్తారని డైరీలో రాసి ఉందని పోలీసులు తెలిపారు. మృతుల కళ్లకు గంతలు.. చేతులు, నోరు కట్టేసి ఉన్నాయి. వీరి మృతదేహాలు ఇంటి పైకప్పుకు వేలాడుతూ కనిపించగా.. నారాయణ్‌ దేవి అనే 77ఏళ్ల వృద్ధురాలి మృతదేహం మాత్రం నేలపై ఉంది.

మృతదేహాలు ఇంటి పైకప్పుకు వేలాడాయి

మృతదేహాలు ఇంటి పైకప్పుకు వేలాడాయి

నారాయణ్‌ దేవి కుమార్తె ప్రతిభ(57), కుమారులు భవ్నేశ్‌(50), లలిత్‌ భాటియా(45), భవ్నేశ్‌ భార్య సవిత(48), వారి ముగ్గురు పిల్లలు మీను(23), నిధి(25), ధ్రువ్‌(15), లలిత్‌ భాటియా భార్య టీనా(42), వారి కుమారుడు శివమ్‌(15), ప్రతిభ కుమార్తె ప్రియాంక (33)ల మృతదేహాలు ఇంటి పైకప్పుకు వేలాడుతూ కనిపించాయి. ప్రియాంక నిశ్చితార్థం గత నెలలోనే జరిగింది. ఈ ఏడాది చివరికి పెళ్లి జరగాల్సి ఉండగా.. ఈ దారుణం జరిగింది.

మోక్షం కోసం వీరు చనిపోయినట్లు తెలుస్తోంది

మోక్షం కోసం వీరు చనిపోయినట్లు తెలుస్తోంది

పోస్ట్‌ మార్టం నివేదిక ప్రకారం చనిపోయిన వారిలో ఆరుగురు ఉరి వల్లే మరణించారని వెల్లడైంది. అందరూ సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేదంటే ఎవరైనా అందరినీ చంపేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వారి ఇంట్లో కొన్ని కీలక పత్రాలు లభ్యమయ్యాయి. మూఢ విశ్వాసాలతో మోక్షం కోసం వీరు చనిపోయినట్లు తెలుస్తోందని ఆ పత్రాలను పరిశీలించిన పోలీసులు వెల్లడించారు. పత్రాల్లో రాసి ఉన్నట్లుగా మృతదేహాల కళ్లకు గంతలు.. నోర్లు, చేతులు కట్టేసి ఉన్నాయని తెలిపారు. మానవ దేహం తాత్కాలికమని, కళ్లు, నోరు మూసుకోవడం ద్వారా భయాన్ని జయించవచ్చని ఓ ప్రతిలో రాసి ఉంది.

తాంత్రిక పూజలు చేసే ముగ్గురి వల్లే

తాంత్రిక పూజలు చేసే ముగ్గురి వల్లే

దేవుడు తమను కాపాడతాడని వారు నమ్మినట్లుగా ఆ పత్రాల్లో ఉంది. చనిపోయిన వారంతా దేవుడిని బాగా నమ్మేవారు. రోజుకు మూడు సార్లు పూజలు చేసేవారు. అయితే తాంత్రిక పూజలు చేసే ముగ్గురు కుటుంబసభ్యులు తాము ఆత్మహత్య చేసుకోవాలని తొలుత నిర్ణయం తీసుకున్నారని, ఇంటిల్లిపాదినీ చంపేసేందుకు ఆ తర్వాత ప్రణాళిక రూపొందించారని, ఆహారంలో మత్తు మందు కలిపి దారుణం చేతులు కట్టి.. నోటికి వస్త్రాలు చుట్టి ఏడుగురికి ఉరి మరో మహిళ గొంతు కోసి చంపారని బలంగా వినిపిస్తున్నాయి.

కిరాణ దుకాణం నిర్వహించేవారు

కిరాణ దుకాణం నిర్వహించేవారు

రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌కు చెందిన నారాయణ్‌ దేవి (75), ప్రతిభ (60) ఇరవై రెండేళ్ల క్రితం ఉత్తర ఢిల్లీ బురారీ ప్రాంతంలో ఉన్న సంత్‌నగర్‌కువచ్చి స్థిరపడ్డారు. అక్కడ వారు ఒక కిరాణా దుకాణాన్ని నడుపుతూ ప్లైవుడ్‌ వ్యాపారం కూడా చేస్తున్నారు. నారాయణ్‌ దేవికి.. పెద్ద కుమారుడు భవనేశ్‌ భాటియా (46), కోడలు సవిత (42), మనవలు నీతు (24), మీను (22), ధీరు (12), చిన్న కుమారుడు లలిత్‌ భాటియా (42), చిన్న కోడలు టీనా (38), వారి కుమారుడు శివమ్‌ (15) ఉన్నారు. ఇక, ప్రతిభా దేవికి ప్రియాంక (33) అనే కుమార్తె ఉన్నది. వీరంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు.

ఇంటి కింది భాగంలో కిరాణా దుకాణం ఉండగా.. మొదటి అంతస్తులో వీరు నివాసం ఉంటున్నారు. రోజూలాగానే శనివారం రాత్రి 11.45 గంటలకు కిరాణా దుకాణాన్ని మూసేసి పైకి వెళ్లారు. ఆదివారం ఉదయం 6 గంటలకు దుకాణం తెరవాల్సి ఉండగా తెరవలేదు. తీరా చూస్తే అందరూ శవాలై ఉన్నారు.

ఆహారంలో మత్తు మందు కలిపి చంపి ఉంటారు

ఆహారంలో మత్తు మందు కలిపి చంపి ఉంటారు

పోలీసుల కథనం ప్రకారం... ఇంటి సభ్యుల్లోనే తాంత్రిక పూజలు చేస్తున్న ముగ్గురు.. ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిశ్చయించుకున్నారు. అంతలోనే ఏమైందో ఏమో.. ఇంటిల్లిపాదినీ చంపేయాలనే నిర్ణయానికి వచ్చారు. రాత్రి ఆహారంలో మత్తు మందు కలిపి.. అందరూ మత్తులోకి జారుకున్నాక వారిని చంపేసి ఉంటారని, మధ్యలో నారాయణ దేవికి మెలకువ రావడంతో ఆమె గొంతు కోసి చంపి ఉంటారని పోలీసులు విశ్లేషిస్తున్నారు.

పని మనిషి చెప్పిన ప్రకారం..

పని మనిషి చెప్పిన ప్రకారం..

ఇక మరణించిన కుటుంబసభ్యులు తమ కళ్లను దానం చేశారు. అయితే ఆ ఇంట్లో గతంలో పని చేసిన మానేసిన ఓ మహిళ మాత్రం ఆసక్తికర విషయాలను మీడియాకు వివరించారు. ఆరేళ్ల క్రితం తాను ఆ ఇంట్లో పని చేశానని, ఆ కుటుంబం అంతా చాలా సందర్భాల్లో చాలా విచిత్రంగా ప్రవర్తించేందని.. ముఖ్యంగా ఆ ఇంట్లోని మహిళలు ఆలయాలకు వెళ్లినప్పుడు పూనకంతో ఊగిపోయేవారని... సదరు మహిళ తెలిపారు. ఇంట్లో కూడా అప్పుడప్పుడు పూజలు నిర్వహించి, స్వామీజీలను ఆహ్వానించేవారని, స్వామీజీలు చెప్పే విషయాలను బాగా నమ్మి తూచా తప్పకుండా పాటించేవారని ఆమె వివరించారు.

11 పైపులతో సంబంధం

11 పైపులతో సంబంధం

ఇక ఇంటి ప్రవేశద్వారం వద్ద 11 పైపులు, అసాధారణ పద్ధతిలో అమర్చి ఉండటంతోపాటు ఆ పైపులు అమర్చిన తీరు, మృతదేహాలు వేలాడిన వైనం ఒకేలా ఉండటం మరిన్ని అనుమానాలను రేకెత్తించింది. ఈ పైపులకు, భాటియా కుటుంబం మరణాలకు కచ్చితంగా సంబంధముందని భాటియా స్నేహితుడు నితిన్‌ ఆరోపించారు.

పోయిన మాట మళ్లీ వచ్చింది

పోయిన మాట మళ్లీ వచ్చింది

అయితే వృత్తిరీత్యా ఈ కుటుంబం కలప వ్యాపారం నిర్వహించేది. పదిహేనేళ్ల కిందట ఆ ఇంటి పెద్దకు ప్రమాదవశాత్తు చెక్క మీదపడటంతో ఆయన తన మాటను కోల్పోయాడు. అయితే కొద్దిరోజులకు ఎవరో చెబితే పూజలు చేశారు. దీంతో అతనికి తిరిగి మాట వచ్చిందట. అలా వారి ఇంట్లో భక్తిభావం ఎక్కువైంది. ఈ క్రమంలోనే కొందరు మంత్రగాళ్లతో కలిసి తాంత్రికపూజలు చేసేవారు. పైగా పునర్జన్మలను బలంగా నమ్మేవారని స్థానికులు చెబుతున్నారు.

లేఖలోని 10 అంశాలు

లేఖలోని 10 అంశాలు

ఇక వీరు చనిపోయే ముందు చేతులు, కాళ్లు ఎలా కట్టుకోవాలన్న అంశాన్ని కూడా లేఖలో రాసినట్లు పోలీసులు గుర్తించారు. చేతితో రాసిన లేఖలో ఉన్న కొన్ని అంశాలు ఇవి..

1. చావు కోసం గురువారం లేదా ఆదివారాన్ని ఎంపిక చేసుకోవాలని రాశారు..

2. కండ్లను బట్టతో కట్టుకోవాలని, ఏమాత్రం కనిపించవద్దు. తాడుతో పాటు చీర, దుపట్టాను కూడా వాడాలి..

3. చావు కంటే ఏడు రోజుల ముందు పూజలు చేయాలి. చాలా కఠినంగా వాటిని నిర్వహించాలి. ఒకవేళ ఆ సమయంలో ఆత్మ ప్రవేశిస్తే.. మరుసటి రోజే పనిని పూర్తి చేయాలి.

4. ఒకవేళ వయసు మీరిన వాళ్లు నిలబడలేని పక్షంలో, పక్క రూమ్‌లో వాళ్లను నిద్రపోయేలా చూడాలి.

5. చాలా మసక మసక వెలుతురులో పని పూర్తి చేయాలి..

ఉపయుక్తంగా ఉంటుంది

ఉపయుక్తంగా ఉంటుంది

6. చేతులు కట్టుకున్న తర్వాత.. ఒకవేళ ఏదైనా బట్ట మిగిలినట్లు అనిపిస్తే, దానితో కండ్లు మూయాలి.

7. నోటిని కట్టేందుకు వాడిన బట్టను గట్టిగా కట్టాలి.

8. ఎవరు ఎంత కఠోర దీక్షతో ఈ పని చేస్తారో.. వాళ్లకు ఉత్తమ ఫలితాలు అందుతాయి..

9.రాత్రి 12 నుంచి ఒకటి మధ్య ఈ తంతు నిర్వహించాలి. హవనం-పూజను అంతకముందే చేయాలి.

10. అందరిలోనూ ఒకేరకమైన ఆలోచనలు ఉండాలి. ఒకవేళ

మీరు ఇలా చేస్తే..అది మీకు ఉపయుక్తంగా ఉంటుంది.

మూర్ఖత్వం

మూర్ఖత్వం

ఇంకా లేఖలో రాసి ఉన్న అనేక అంశాలను విపులీకరించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. లేఖను డీకోడ్ చేసిన తర్వాత మరికొన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. అయితే నిజంగా కళ్లకు గంతలు.. చేతులు, నోరు కట్టేసుకుని చనిపోతే మోక్షం వస్తుందా? అంటే అస్సలు రాదనేది అందరి సమాధానం. ఇలాంటి తిక్క తిక్క ఆలోచనలు చేసి జీవితాలను నాశనం చేసుకోకండి. బురారీలో 11 మంది అలా చనిపోవడానికి కారణం అదే అయితే వాళ్లంతా మూర్ఖులు ఇంకెవ్వరూ ఉండరు.

English summary

delhi burari death mystery 10 instructions bhatia family followed just before carrying out death pact

delhi burari death mystery 10 instructions bhatia family followed just before carrying out death pact
Desktop Bottom Promotion