మంత్రగాడి సలహా మేరకు మొబైల్ మింగిన మనిషి

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మంత్రగాడి సలహా మేరకు మొబైల్ మరియు ఇతర లోహపు వస్తువులను మింగిన మనిషి

ఇలాంటి కొన్ని సంఘటనలు చూస్తుంటే, దేశం ఎటువైపుకి వెళ్తుందా అని అనిపించక మానదు. ఒక మంత్రగాడి మాటలను పూర్తిగా నమ్మిన వ్యక్తి చేసిన పని చూస్తే నివ్వెరపోక మానరు.

ఉత్తరప్రదేశ్ లో పెళ్లికాని ఒక వ్యక్తి, తన పెళ్లి కోసం చేయని ప్రయత్నమే లేదు. ఆ క్రమంలో భాగంగానే ఈ లోహపు వస్తువులను మింగడం ద్వారా అదృష్టం వరిస్తుంది అని ఒక మాంత్రికుడు చెప్పగానే నమ్మి ఈ పనికి పూనుకున్నాడు.

అసలు మొబైల్, మరియు ఇతర లోహపు వస్తువులను ఎలా మింగాడు :

Desperate To Get Married, He Swallowed Mobile And Other Metal Objects!

పెళ్ళంటే తగని మక్కువ :

ఇతను 42 యేళ్ళ వ్యక్తి, ఒక మాంత్రికుని మాటలకు లోబడి, లోహపు వస్తువులను మింగడం

ద్వారా, పెళ్లి యోగం కలుగుతుంది అని ప్రఘాడoగా నమ్మాడు.

కానీ చివరికి ఆసుపత్రి పాలయ్యాడు :

ఇలాంటి మూడనమ్మకాలు చివరికి ఎటువంటి గతిని తీసుకుని వస్తాయో చూపడానికి ఒక ఉదాహరణ గా మారాడు. చివరికి పరిస్తితి విషమించి ఆసుపత్రి పాలయ్యాడు. నివేదికల ప్రకారం, ఇతను మొబైల్, తాళం, వైర్లు చివరికి గ్లాస్ వంటి వాటిని కూడా మింగాడు. ఇవన్నీ మాంత్రికుని సలహా మేరకే చేశానని బదులిచ్చాడు.

ఇతను చెప్పిన మాటల ప్రకారం :

ఈ పేరు తెలీని వ్యక్తి, చేతికి దొరికిన లోహాలన్నింటిని మింగడం ద్వారా, తన పెళ్ళికి ఇక ఎటువంటి అడ్డంకి ఉండదని ఆశాభావం వ్యక్తం చేశాడు. మూడనమ్మకాలు, నిజాలకన్నా శక్తి వంతమైనవి అని చెప్పకనే చెప్తుంది ఈ ఉదాహరణ. ఎందరు మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నా కూడా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయనే బలంగా నమ్మే వారు ఎక్కువ ఈ లోకంలో. ఇలాంటి మానసిక బలహీనతలే, కొందరి జేబులు నిండుటకు ప్రధాన పెట్టుబడిగా మారుతుంది.

ఈ విషయం బయట ప్రపంచానికి ఎప్పుడు తెలిసింది అంటే ?

ఒక రోజు ఈ వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో వైద్యులను సంప్రదించగా, వైద్యులు ఎక్స్-రే కి సూచించారు. ఈ ఎక్స్- రే నివేదిక వైద్యులను నిర్ఘాంతపోయేలా చేసింది.

కడుపులో అన్ని లోహపు వస్తువులా .. దేవుడా .. !

ఎక్స్- రే నివేదిక లో వచ్చిన లోహపు వస్తువులను చూసి నిర్ఘాంతపోయిన వైద్యులు, ఆ లోహపు వస్తువులలో మొబైల్ కూడా ఉండడం వలన తీవ్రమైన చర్యగా భావించి వెంటనే ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. లేనిచో ప్రాణాలకే ప్రమాదం వచ్చేది. అసలు లోహపు వస్తువులను ఎలా మింగ గలిగాడు అన్నది అర్ధం కాక తలలు పట్టుకున్నారు.

ఏది ఏమైనా వైద్యుల నమ్మకం ఇలా :

ఆ వ్యక్తి చెప్పినట్లు, మాంత్రికుడి మాటల వలన ఈ లోహపు వస్తువులను మింగాడు అని అనడం నిజం కాదని, అతను ఏదైనా ఒక మానసిక సమస్యతో భాధపడుతున్నట్లు నివేదించారు. ముఖ్యంగా డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో భాధపడుతున్నవారు, ఇలాంటి పరిస్థితులను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారని చెప్తున్నారు. తద్వారా మానసిక ప్రశాంతతకై ఆత్మహత్యలకు కూడా ప్రేరేపించబడుతారని, ఆ క్రమంగానే ఇలా లోహపు వస్తువులు మింగే అవకాశం కూడా ఉన్నదని చెప్తున్నారు.

ఒకవేళ మంత్రగాడి మాటలే నిజమని భావించిన ఎడల, ఇది అత్యంత హేయమైన చర్యే అవుతుంది. మనిషి యొక్క మానసిక బలహీనతలను సొమ్ము చేసుకునే క్రమంలో ప్రాణాలతోనే ఆడుకునే ఇలాంటి మంత్రగాళ్ల వలన ఇంకెందరి జీవితాలు బలిదానాలు కోరుకుంటున్నాయో ఊహకు కూడా అందని విషయముగా ఉన్నది. మీ పరిసరాలలో ఇలాంటి మంత్రగాళ్ల వంటి వ్యక్తుల వలలో ఎవరైనా పడుతున్నట్లు మీకనిపిస్తే, వారిని చైతన్య పరచే క్రమంగా ప్రయత్నాలు చేయండి. ఇలాంటి వారిని నమ్మి తెలిసి జీవితాలను నాశనం చేసుకోకండి.

ఏది ఏమైనా అది మానసిక సమస్య అయినా, మంత్రగాడి సలహా అయినా, ఒక మొబైల్ ను మనిషి మనిషి మింగాడు అన్నది నిజంగా నమ్మగలమా? మీరేమంటారు.

ఇలాంటి అనూహ్య సంఘటనల వివరాలకై , తరచూ ఈ పేజీని సందర్శిస్తూ ఉండండి.

English summary

Desperate To Get Married, He Swallowed Mobile And Other Metal Objects!

In a village of Uttar Pradesh, India, doctors got a weird case where a man was hospitalised for consuming a mobile phone and other metallic items which included keys as well. The man was apparently advised by one of the tantrik babas and we guess, the man learnt his lesson of having blind faith!This is a case that will make you wonder on how dumb an individual can be!
Story first published: Wednesday, April 18, 2018, 7:00 [IST]